third marriage
-
68 ఏళ్ల హరీశ్ సాల్వేకు మూడో పెళ్లి
న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే మూడోసారి పెళ్లి కొడుకయ్యారు. 68 ఏళ్ల జనరల్ హరీశ్ సాల్వే లండన్‌లో త్రినా అనే మహిళను వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా ఈ పెళ్లి వేడుకకు నీతా అంబానీ, సునీల్ మిట్టల్, లలిత్ మోదీ తదితర ప్రముఖులు హాజరయ్యారు. హరీశ్ సాల్వేకు ఇది మూడో వివాహం. ఆయన మొదట మీనాక్షిని వివాహమాడారు. వారికి ఇద్దరు కుమార్తెలు సాక్షి, సానియా ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీనాక్షి నుంచి విడిపోయారు. 2020 జూన్‌లో విడాకులు తీసుకున్నారు. అదే సంవత్సరం కరోలిన్ బ్రోసార్డ్ను పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి ఆమె నుంచి దూరమయ్యారు. ఇప్పుడు మూడోసారి త్రినాను పెళ్లాడారు. హరీశ్ సాల్వే 1999 నవంబర్ నుంచి 2002 నవంబర్ వరకూ ఇండియా సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ గ్రూప్ వంటి ప్రఖ్యాత సంస్థల కేసులను వాదించారు. భారత ప్రభుత్వం 2015లో హరీశ్ సాల్వేకు ‘పద్మ భూషణ్’ పురస్కారం ప్రకటించింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై అధ్యయం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో హరీశ్ సాల్వే సభ్యుడిగా ఉన్నారు. -
సైలెంట్‌గా మూడో పెళ్లి, కానిస్టేబుల్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కట్టుకున్న భార్యను మానసిక, శారీరక వేధింపులకు గురిచేసి గుట్టుచప్పుడు కాకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సహరా ఎస్టేట్‌లోని గందార అపార్టుమెంటులో నివాసం ఉంటూ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎడ్ల శంకరయ్య (39) 2011లో ఒక మహిళను పెళ్లి చేసుకుని వదిలేశాడు. అనంతరం 2016లో మరో మహిళ శారద (38)ని పెళ్లి చేసుకున్నాడు. 2017లో వీరికి ఒక పాప కూడా జన్మించింది. అయితే, శంకరయ్య బదిలీ కావడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సహారా రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న మంజుల రాణి అనే మహిళను శంకరయ్య 2019 నవంబర్ 30న తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. మరో మహిళను పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న శారద వనస్థిలిపురం పోలీసులను ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు శంకరయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. (చదవండి: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య) -
1.25 కోట్ల నష్ట పరిహారంతో బెదిరింపు
సినిమా: నటి వనితా విజయకుమార్, నటి,దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ మధ్య వివాదం ఇప్పట్లో సమసేలా లేదు. ఇప్పుటికే అనుచిత వ్యాఖ్యలతో దూషించుకున్న వీరు ఇప్పుడు సమన్లు, బెదిరింపుల వరకూ వెళుతున్నారు. ఈ వివరాలు చూస్తే నటి వనిత ఇటీవల పీటర్‌పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ వివాదానికి తెరలేచింది. వనిత మూడో వివాహం చేసుకోవడాన్ని లక్ష్మీరామకృష్ణన్‌తో పాటు కస్తూరి తీవ్రంగా విమర్శించారు. దీంతో వనిత వారిపై ఎదురుదాడికి దిగింది. అలా లక్ష్మీరామకృష్ణన్ వ్యక్తిగత జీవితం గురించి విమర్శించింది. (వనితపై వరుస కేసులు) దీంతో లక్ష్మీరామకృష్ణన్ లాయర్ ద్వారా వనితకు నోటీసులు జారీ చేయించింది. దాని కాపీని స్థానిక వడపళని మహిళా పోలీస్‌స్టేషన్‌కు, వడపళని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌కు, చెన్నై మహిళా సంఘానికి పంపింది. ఈ నోటీస్‌పై వనిత స్పందిస్తూ లక్ష్మీరామకృష్ణన్ రూ.1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ బెదిరిస్తూ తనకు నోటీసులు పంపినట్లు వెటకారంగా పేర్కొంది. ఆమె పంపిన నోటీస్ కోర్టు ద్వారా వచ్చింది కాదని చెప్పింది. దానికి బదులుగా తానూ లక్ష్మీ రామకృష్ణన్‌కు నోటీస్ పంపినట్లు వనిత పేర్కొంది. లక్ష్మీరామకృష్ణన్ బెదిరింపులకు బెదిరిపోయేది లేదని, చట్టపరంగానే ఎదుర్కొంటానని వనిత పేర్కొంది. -
వనితపై వరుస కేసులు
పెరంబూరు: నటి వనిత విజయకుమార్‌పై కేసుల పరంపర కొనసాగుతోంది. వివాదాల నటిగా ముద్ర వేసుకున్న ఈమె ఎక్కడ ఉంటే అక్కడ చర్చే అనే పరిస్థితి నెలకొంది. ఆ మధ్య బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొని వివాదాలకు నిలయంగా మారారు. పీటర్‌పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుని మరోసారి చర్చకు తెరలేపారు. ఈమె మూడో పెళ్లి చేసుకోవడాన్ని పలువురు తీవ్రంగా విమర్శించారు. అందులో లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరీ, నిర్మాత రవీందర్, సూర్యదేవి ప్రధానంగా ఉన్నారు. కాగా వనితా, సూర్యదేవి ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకు న్నారు. (కరోనా వ్యాప్తి.. ఆమెపై రెండు కేసులు) తనను, తన భర్తను విమర్శించిందంటూ దర్శకురాలు లక్ష్మీరామకృష్టన్, వనితకు న్యాయవాది ద్వారా సమన్లు పంపింది. కరోనా కాలంలో అనుమతి లేకుండా వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించిందంటూ వనితపై స్థానిక అయ్యప్పన్ తంగల్‌కు చెందిన అపార్ట్మెంట్ల సంఘం కార్యదర్శి నిషా తోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించిన వనిత వాటన్నింటిని చట్టపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. మంగళవారం ఓ టీవీ ఛానల్ కార్యక్రమానికి జడ్జిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగు నెలల తరువాత ముఖానికి మేకప్ వేసుకుని షూటింగ్లో పాల్గొన్నానని అన్నారు. ఎప్పుడూ నెగిటివ్‌గా మాట్లాడే వారు అలాగే ఉంటారని వ్యాఖ్యానించారు. వాటిని పట్టించుకోకూడదని వనిత వ్యాఖ్యానించారు. -
కరోనా వ్యాప్తి.. ఆమెపై రెండు కేసులు
పెరంబూరు: సూర్యదేవిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నటి వనితా విజయకుమార్ మూడో పెళ్లి చేసుకోవడంపై వీడియోల ద్వారా సూర్యదేవి విమర్శల దాడి చేసి వార్తల్లో నిలిచారు. ఈ నెల 22న వనితా ఫిర్యాదుతో వడపళని మహిళా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తరువాత నటి కస్తూరీ తన న్యాయవాది ద్వారా సూర్యదేవికి బెయిల్ ఇప్పించారు. (నటి వనితతో గొడవ, ఆ మహిళ ఎక్కడ?) కాగా అంతకు ముందు సూర్యదేవిని విచారించిన పోలీస్ అధికారికి కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీస్ అధికారి చెన్నై ఐఐటీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సూర్యదేవి మాత్రం పరీక్షలు చేసుకోకుండా పరారీలో ఉన్నట్లు పోలీసులు ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని సూర్యదేవి యూట్యూబ్‌లో వీడియో విడుదల చేశారు. కరోనా వ్యాప్తికి పాల్పడుతోందంటూ చేసిన ఫిర్యాదుపై విరుగంబాక్కమ్ పోలీసులు సూర్యదేవిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె కోసం గాలిస్తున్నారు. -
ఈమె మూడో పెళ్లి కూడా..
తమిళ సినిమా(చెన్నై): తాను సివంగిని అని అంటోంది నటి వనితా విజయకుమార్. మొదట్లో చంద్రలేఖ వంటి కొన్ని చిత్రాల్లో కథానాయికగా నటించినా, ఆ తర్వాత వెండి తెరపై కనిపించలేదు. తరచూ ఏదోఒక వివాద వార్తల్లో ఉంటూనే ఉంది. ఆ మధ్య బిగ్‌బాస్–3 రియాల్టీ షోలో పాల్గొని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న వనిత ఇటీవల మూడో పెళ్లి చేసుకుంది. ఈమె మూడో పెళ్లి కూడా వివాదాలకు గురవుతోంది. వనిత తాజాగా పెళ్లి చేసుకున్న పీటర్‌పాల్ కూడా ఇంతకుముందు ఒక పెళ్లి చేసుకున్నాడు. అది ఇప్పుడు వివాదంగా మారింది. వనిత, పీటర్ పాల్ పెళ్లి చేసుకున్నరోజు సాయంత్రమే అతని మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో భర్త తనకు విడాకులు ఇవ్వకుండానే నటి వనితను పెళ్లి చేసుకున్నారని ఆరోపింది. ఈ వ్యవహారాన్ని చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని నటి వనితపేర్కొంది. నటి వనిత మూడో పెళ్లిపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు. నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్, నటి కుట్టి పద్మిని అదేవిధంగా నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖర్ వంటివారు పీటర్ పాల్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి వనిత పెళ్లి చేసుకుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారిపై వనిత విరుచుకుపడింది. ‘మీ పని మీరు చూసుకోండి’ అంటూ ఫైర్ అయ్యింది. లక్ష్మీరామకృష్ణన్, కుట్టిపద్మిని వెంటనే సారీ చెప్పారు. నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖర్ మాత్రం తాను క్షమాపణ చెప్పేదిలేదన్నారు. నటి వనిత అంటే తనకు అభిమానమన్నారు. అలా ఒక అభిమానిగా ఆమె తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపే హక్కు తనకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నటి వనిత తన ట్విటర్లో పేర్కొంటూ ‘ఒక తల్లిగా తన జీవితం, ప్రతిభపై అక్కరచూపుతున్న మీ అందరికీ తాను చెప్పేది ఒక్కటే.. నేను సహజంగానే సివంగిని’ అని చెప్పింది. తన పిల్లలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు అని అంది. మరి ఈ చర్చ ఇంకా ఎంత కాలం సాగుతుందో చూడాలి. -
ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధపడ్డాడు
అమీర్‌పేట: రెండు పెళ్లిలు చేసుకోవడమేగాక ముచ్చటగా మూడో పెళ్లికి సిద్దపడ్డాడో ప్రబుద్ధుడు అందుకు అంగీకరించాలని భార్యను బాలింత అని కూడా చూడకుండా బెల్టుతో చితకబాదిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోడబండ సైడ్ త్రీకి చెందిన మొహ్మద్‌ఖాన్ మొదట షమీనా బేగం, రెండో సారి రుక్సార్ బేగం అనే మహిళలను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలకు ముగ్గురేసి పిల్లలు ఉన్నారు. బ్యాగుల వ్యాపారం చేసే ఖాన్ ముడో పెళ్లి చేసుకునేందుకు సిద్దపడ్డాడు. అందుకు అనుమతినివ్వాలని గత కొన్ని రోజులుగా రెండో భార్యను రుక్సార్ బేగంను వేధిస్తున్నాడు. ప్రసవమై 10 రోజుల క్రితమే ఇంటికి వచ్చిన ఆమెను హింసించసాగాడు. అంగీకారపత్రంపై సంతకం చేయాలని బాలింత అని చూడకుండా బెల్టుతో చితకబాదాడు. సంతకం పెట్టక పోతే బిల్డింగ్‌పై నుంచి తోసేసి చంపుతానని బెదిరించాడు. దీంతో తమకు న్యాయం చేయాలని ఇద్దరు భార్యలు షమీనా బేగం, రుక్సార్ బేగం ఎస్ఆర్నగర్ పోలీసులను ఆశ్రయించారు. మహిళా సంఘాల నాయకులు శ్రీలత,లత వారికి మద్దతు పలికారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. -
నవ్వు ఆపుకోలేకపోయిన మాజీ భార్య
ముంబై: బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రాహుల్ మహాజన్ మూడోసారి పెళ్లి చేసుకున్నారు. కజక్‌స్తాన్ మోడల్ నటాల్య ఇలినాను నంవబర్ 20న ఆయన పెళ్లాడారు. వివాదాలతో సావాసం చేసిన మహాజన్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో పైలట్ శ్వేతా సింగ్, టీవీ నటి డింపీ గంగూలీని ఆయన పెళ్లిచేసుకుని, విడిపోయారు. మహాజన్ మూడో పెళ్లిపై ఆయన మాజీ భార్య డింపీ స్పందించారు. ఈ వార్త విని తనకు మొదట నవ్వు వచ్చిందని వెల్లడించారు. రాహుల్, ఇలినా సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. గృహహింస కారణంగానే మొదటి ఇద్దరు భార్యలు రాహుల్ నుంచి విడిపోయారు. ఆయనకు శ్వేతా సింగ్ చిన్ననాటి స్నేహితురాలు. 13 ఏళ్లుగా పరస్పర పరిచయం ఉన్నప్పటికీ వారి వైవాహిక జీవితం విచ్ఛిన్నమైంది. శారీరకంగా హింసిస్తున్నాడన్న కారణంతో 2007, డిసెంబర్లో అతడి నుంచి విడిపోయారు. 2008లో వీరికి విడాకులు మంజురయ్యాయి. అదే ఏడాది హిందీ బిగ్‌బాస్ 8లో ఆయన పోటీ పడ్డారు. గ్రాండ్ ఫైనల్ చేరువైన సమయంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో ఆయనను షో నుంచి తప్పించారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా పాయల్ రొహతగి, మోనికా బేడితో ప్రేమాయాణం నడిపినట్టు ప్రచారం జరిగింది. 2010లో నేషనల్ టీవీలో ప్రసారమైన ‘రాహుల్ దుల్హనియా లే జాయేగా’ రియాలిటీ షోలో డింపీ గంగూలీని రాహుల్ రెండో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత 2014, ఫిబ్రవరి 25న వీరు విడాకులు తీసుకున్నారు. తనను దారుణంగా కొట్టేవాడని డింపీ అప్పట్లో ఆరోపించారు. రాహుల్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె మరో పెళ్లి చేసుకున్నారు. భర్త, కూతురుతో కలిసి ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. రాహుల్ మూడో వివాహంపై డింపీ స్పందిస్తూ.. ‘ఇలినా గృహ హింస బారిన పడకూదని కోరుకుంటున్నా. రాహుల్ చాలా మారిపోయి ఉంటాడని అనుకుంటున్నా. మీరిద్దరూ ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు’ పేర్కొన్నారు. -
నిత్య పెళ్లి కొడుకు
నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసి మూడో పెళ్లి చేసుకుని తనను ముంచేశాడని భార్య కన్నీరు పెట్టింది. నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలుసుకుని భర్త ఇంటి ముందు ఆమె తల్లిండ్రులతో కలిసి సోమవారం ధర్నాకు దిగింది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాళేనికి చెందిన పుచ్చలపల్లి గంగిరెడ్డి, జయమ్మ దంపతుల ఏకైక కుమార్తె రాధను బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన కమతం శ్రీనివాసులురెడ్డి, శ్రీనివాసమ్మ ఏకైక కుమారుడు కమతం వెంకట ప్రసాద్‌రెడ్డికి ఇచ్చి 2016 డిసెంబరు 4న తిరుమలలో వివాహం చేశారు. వరకట్నం కింద రూ.11 లక్షల నగదు, 15 సవర్ల బంగారం ఇచ్చారు. అయితే వివాహానికి ముందు నెల్లూరులో ఉన్నామని చెప్పిన ప్రసాద్‌రెడ్డి వివాహమైన తర్వాత బుచ్చిరెడ్డిపాళేనికి తీసుకు వచ్చాడు. సొంత ఇళ్లు, పొలాలు ఉండటంతో ఇక్కడే ఉందామని నమ్మబలికాడు. పది రోజుల తర్వాత నుంచి రాధ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిని తన పేరిట రాయమని రాధను మామ శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశాడు. వాళ్లకు వేరే ఆధారం లేదని రాధ చెప్పడంతో భర్త, అత్తమామలు చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. మామ శ్రీనివాసులురెడ్డి కోడలు రాధను శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడు. అత్త శ్రీనివాసమ్మ రాధ జడ కత్తిరించడం, వాతలు పెట్టడం మొదలు పెట్టింది. రాత్రి నిద్రపోయే సమయంలో శ్రీనివాసులురెడ్డి కోడలు రాధ పక్కన పడుకునేవాడు. ఈ విషయం భర్త ప్రసాద్‌రెడ్డికి చెప్పినా సర్దుకుపోమని చెప్పేవాడు. ఈ క్రమంలో 2017 ఏప్రిల్‌లో నెల్లూరుకు ద్విచక్ర వాహనంలో తీసుకెళుతూ పడేశాడు. దీంతో నువ్వు మీ పుట్టింటికి వెళ్లి కొంతకాలం ఉండమని చెప్పాడు. అప్పటికే చిత్రహింసలు భరించలేక ఇబ్బంది పడుతున్న రాధ అత్తింట్లో ఉండలేక రెండు నెలలు పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రసాద్‌రెడ్డి అత్తమామలకు ఫోన్‌చేసి మీ అమ్మాయిని మీ వద్దే ఉంచుకోండి అంటూ చెప్పాడు. విచారిస్తే వెలుగులోకి వచ్చింది ప్రసాద్‌రెడ్డి ఫోన్ సంభాషణతో కంగారు పడిన రాధ తల్లిదండ్రులు బుచ్చిరెడ్డిపాళేనికి రాగా ఇంట్లోకి రానివ్వలేదు. తలుపులకు తాళం వేశారు. లోపల ఉండి కూడా ఎవరూ లేరని ప్రసాద్‌రెడ్డి తల్లి శ్రీనివాసమ్మ చెప్పేది. దీంతో ప్రసాద్‌రెడ్డి కుటుంబీకులు, స్థానికులను విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసాద్‌రెడ్డికి 2013లో సుప్రియ అనే యువతితో వివాహమైంది. 2015లో కాగులపాడుకు చెందిన నిరోషా అనే యువతితో వివాహం జరుగుతుండగా ప్రసాద్‌రెడ్డికి ముందే జరిగిన పెళ్లి విషయం తెలిసి మండపంలోనే వివాహాన్ని ఆపేశారు. ఆ తర్వాత 2016 డిసెంబరు 4వ తేదీన రాధను వివాహం చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడని రాధ వాపోయింది. పోలీసుల అదుపులో భర్త రాధ తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ప్రసాద్‌రెడ్డి ఇంటి ముందు సోమవారం ధర్నాకు దిగింది. దీంతో మామ శ్రీనివాసులురెడ్డి తమపై కొందరు దాడి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఇంటి వద్దకు రాగా, జరిగిన విషయం తెలిసి పోలీసులు ప్రసాద్‌రెడ్డిని బయటకు పిలిచారు. అయితే అతను ఇంట్లో తలుపు వేసుకుని బయటకు రాలేదు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులకు ఫిర్యాదు గతంలో బుచ్చిరెడ్డిపాళెంలో పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రాధ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ వద్దకు వెళ్లడంతో తన సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పింది. 2017 జూన్‌లో విజయవాడ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇప్పుడు చార్జిషీట్ సిద్ధం చేస్తుండటంతో ఎక్కడ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందోనని ఆస్తి మొత్తం ప్రసాద్‌రెడ్డి తన తల్లి శ్రీనివాసమ్మ పేరిట రిజిస్టర్ చేశారని తెలిపింది. అత్త మామలతో కాకుండా వేరో చోట తాను కాపురం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తనకు న్యాయం చేయాలని రాధ కన్నీటి పర్యంతమైంది. ఈ విషయమై సీఐ టీవీ సుబ్బారావును సంప్రదించగా రాధ ఎస్పీని కలిసిన విషయం వాస్తవమేనన్నారు. ఫిర్యాదు తనకు అందగా పరిశీలించానన్నారు. ఇది వరకే దీనిపై విజయవాడలో కేసు నమోదైందని, కోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. -
‘మూడో పెళ్లి’ లొల్లిపై స్పందన
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ‘పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్’ (పీటీఐ) పార్టీ అధ్యక్షడు ఇమ్రాన్ ఖాన్‌కు కోపం వచ్చింది. ముచ్చటపడి చేసుకున్న మూడో పెళ్లి పెటాకులైందంటూ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆయన తరపున పార్టీ పీటీఐ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఎలాంటి నిర్ధారణ లేకుండా ప్రచురించిన కథనాలపై పీటీఐ వర్గాలు మండిపడుతున్నాయి. తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ ఉర్దూ పత్రిక ‘రోజ్నామా ఉమ్మత్’ ఎడిటర్‌కు, మరికొన్ని వెబ్సైట్లకు లేఖలు రాసింది. కాగా, ఇమ్రాన్ తన ఆధ్యాత్మిక సలహాదారు అయిన బుష్రా మనేకాను మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే గత కొంత కాలంగా ఆమె బానిగలా(ఇమ్రాన్ నివాసం)లో కనిపించటం లేదు. దీంతో ఆమె ఇళ్లు విడిచివెళ్లిపోయిందంటూ పుకార్లు మొదలయ్యాయి. మనేకా పిల్లల(అంతకు ముందు భర్త వల్ల కలిగిన సంతానం) వ్యవహారమే దీనంతటికి కారణమంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో అసహనానికి లోనైన ఇమ్రాన్‌కు బుష్రాతో విభేదాలు తలెత్తాయని.. ఆ పరిస్థితి ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయేలా పురిగొల్పిందని రోజ్నామా ఉమ్మత్ అనే ఒక ఉర్దూ పత్రిక ప్రచురించింది. అనంతరం ఈ వార్తలు సోషల్ మీడియాలో, ఇతర పబ్లికేషన్లలో చక్కర్లు కొట్టడంతో ఇమ్రాన్‌కు కష్టాలు మొదలయ్యాయి. ‘పీటీఐ’ ఈ వ్యవహారంలో మౌనం వహిస్తూ వచ్చింది. అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే సరికి ఇప్పుడు స్పందించింది. మరోవైపు పెంపుడు కుక్కల వ్యవహారం మనేకాకు చికాకు తెప్పించిందన్న మరో కథనం కూడా చక్కర్లు కొట్టింది. -
మూడో పెళ్లి కూడా మూన్నాళ్ల ముచ్చటే!
-
మూడో పెళ్లీ పెటాకులు.. కష్టాల్లో ఇమ్రాన్!
-
మూడో పెళ్లీ పెటాకులు.. కష్టాల్లో ఇమ్రాన్!
ఇస్లామాబాద్: ముచ్చటపడి చేసుకున్న మూడో పెళ్లి కూడా పెటాకులు కావడంతో ఇమ్రాన్ ఖాన్ కష్టాలు ఎదుర్కొంటున్నారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. పెంపుడు కుక్కలు, పిల్లల వ్యవహారాల్లో దంపతుల మధ్య విబేధాలు తలెత్తాయని, గొడవపడిన తర్వాత మూడో భార్య బుష్రా తన పుట్టింటికి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. పిల్లలు.. పెంపుడు కుక్కలు: పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం.. ఇమ్రాన్ పెంపుడు కుక్కల వల్ల కొత్త భార్య బుష్రా ఇబ్బందులు పడ్డారు. మతపరమైన కార్యకలాపాలకు కుక్కలు ఆటంకం మారడంతో వాటిని ఇంట్లో నుంచి పంపేయాలని భార్య కోరగా, అందుకు ఇమ్రాన్ నిరాకరించారు. బుష్రాకు మొదటి భర్త ద్వారా కలిగిన పిల్లలు ఇప్పుడు ఇమ్రాన్తోనే కలిసి ఉండటం కూడా గొడవలకు మరో కారణమని తెలిసింది. పెల్లల్ని వేరుగా ఉంచాలని పెళ్లికి ముందే ఇమ్రాన్-బుష్రాల మధ్య ఒప్పందం జరిగిందని, కానీ పరిస్థితులు అందుకు విరుద్ధంగా తయారయ్యాయని, అలా మొదలైన గొడవలు క్రమంగా పెద్దవై దంపతులు విడిపోయేదాకా వెళ్లిందని టైమ్స ఆఫ్ ఇస్లామాబాద్ పత్రిక పేర్కొంది. కాగా, ఇమ్రాన్ పెళ్లి పెటాకుల వార్తలు సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. మూడు నెలలు తిరక్కుండానే: 1995లో బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహమాడిన ఇమ్రాన్.. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. 2015లో బీబీసీ జర్నలిస్ట్ రేహమ్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నా 9 నెలలకే ఆ బంధమూ తెగిపోయింది. ఇక మూడోదిగా మతగురువైన బుష్రా మనేకాను ఇమ్రాన్ 2018 ఫిబ్రవరిలో పెళ్లాడారు. సరిగ్గా మూడు నెలలు కూడా తిరక్కముందే ఇలా జరగడంపై కుటుంబీకులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. -
‘ఇమ్రాన్ పచ్చి మోసగాడు, నా ముందే ఆమెతో..!’
లాహోర్ : మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లిపై రెండో భార్య రేహమ్ ఖాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇమ్రాన్ పచ్చి మోసగాడని, వివాహేతర సంబంధాల్లో ఆరితేరాడని ఆరోపించారు. ‘టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేహమ్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. మూడో పెళ్లి ప్రకటన ఓ నాటకం : ‘‘నేను భార్యగా ఉన్నప్పుడే అతనికి బుష్రాతో వివాహేతర సంబంధం ఉంది. నా ముందే ఆమెతో చనువుగా ఉండేవాడు. అందుకే 10 నెలలు తిరక్కుండానే అతనికి విడాకులు ఇచ్చేశా. మొన్న ఆదివారం ఇమ్రాన్ మూడో పెళ్లి చేసుకున్నట్లు పీటీఐ పార్టీ ప్రకటించింది. కానీ నిజమేంటంటే.. ఆ తంతు నెలన్నర కిందటే జరిగింది. విచిత్రమేంటో తెలుసా? నా పెళ్లప్పుడు కూడా ఇలానే జరిగింది. మేం పెళ్లి చేసుకున్న రెండు నెలల తర్వాత ఆ ఫొటోలు, ప్రకటనను మీడియాకు ఇచ్చారు. ఇమ్రాన్ లాంటి నీతిమాలిన వ్యక్తిని నా జీవితంలో చూడలేదు’’ అని రేహమ్ వ్యాఖ్యానించారు. కౌంటర్ ఇవ్వబోయి అడ్డంగా బుక్కయ్యారు : రేహమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలపై స్పందించిన ఇమ్రాన్ అభిమానులు.. కౌంటర్ ఇచ్చేందుకు విఫలయత్నం చేశారు. ‘రేహమ్ వ్యాఖ్యలు వాస్తవాలేనని నమ్ముతున్నారా?’ అని ట్విటర్లో పోల్ క్వశ్చన్ పెట్టారు. ప్రతిగా రేహమ్ సైతం తన దగ్గరున్న ఆధారాలను బయటపెట్టారు. గడిచిన మూడేళ్లుగా ఇమ్రాన్- బుష్రాలు కలిసే ఉంటున్నట్లు స్వయంగా బుష్రా మాజీ భర్తే చెప్పినట్లు పేర్కొన్నన్నారు. ‘ఇమ్రాన్-బుష్రాలు జనవరిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. కానీ మొన్ననే పెళ్లైనట్లు పార్టీ ప్రకటించడం దారుణం’ అని నెటిజన్లు సైతం వ్యాఖ్యానించారు. దీంతో ఖంగుతిన్న ఇమ్రాన్ వర్గీయులు ‘వంద మంది కుట్రదారులు వచ్చినా మా గెలుపును ఆపలేరు’అంటూ కవరింగ్ ఇచ్చారు. 1992లో పాక్ జట్టుకు క్రికెట్ ప్రపంచ కప్ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్.. తొలుత బ్రిటిష్ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఖాన్.. జర్నలిస్టే అయిన రేహమ్‌ను(2015లో) రెండోపెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. ఇప్పుడు తాజాగా మత గురువైన బుష్రాను మూడో పెళ్లి చేసుకురు. -
ఇమ్రాన్ ఖాన్... మూడో పెళ్లి
లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం, తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ఖాన్ (65) మూడో వివాహం చేసుకున్నాడు. తన ఆధ్యాత్మిక సలహాదారుగా వ్యవహరిస్తున్న బుష్రా మనేకాను ఇమ్రాన్ పెళ్లాడాడని పార్టీ అధికారి ప్రతినిధి ఫవాద్ చౌదరి ఆదివారం వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పార్టీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పాక్‌కు 1992 ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్... క్రికెట్ నుంచి వైదొలగిన అనంతరం 1995లో బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహమాడాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయాడు. 2015లో బీబీసీ జర్నలిస్ట్ రేహమ్ ఖాన్‌ను మనువాడినా 9 నెలలకే ఆ బంధం తెగిపోయింది. బుష్రాను ఇమ్రాన్ పెళ్లి చేసుకున్నట్లుగా ఇటీవల వదంతులు వస్తున్నాయి. వీటిని అతడు ఖండించాడు. కానీ ఈ ప్రభావం పార్టీపై పడుతుండటంతో స్పష్టత ఇవ్వాలని నాయకుల నుంచి ఒత్తిడి వచ్చింది. దీంతో విషయాన్ని మాజీ క్రికెటర్ అధికారికంగా వెల్లడించాడు. బుష్రాకు ఇది వరకే వివాహమైంది. ఆమెకు ఐదుగురు పిల్లలున్నారు. కస్టమ్స్ అధికారి అయిన తన భర్త ఫరీద్ మనేకా నుంచి ఆమె విడాకులు తీసుకుంది. -
మూడో పెళ్లి చేయలేదని తల్లిని కడతేర్చాడు
సాక్షి, చెన్నై: తనకు పెళ్లి చేయడం లేదన్న ఆగ్రహంతో కన్న తల్లిని ఓ యువకుడు గొంతు కోసి కడతేర్చాడు. వివరాలు.. చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన వేణు(80), లక్ష్మి(75) దంపతులకు కుమార్(30), మురుగన్(28) ఇద్దరు కుమారులు. కుమార్‌కు వివాహమైంది. మురుగన్‌కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. గంజాయికి అలవాటు పడి వేధిస్తుండడంతో అతడితో కాపురం చేయలేక ఆ ఇద్దరు భార్యలు వదలి వెళ్లారు. ప్రస్తుతం తనకు మూడో పెళ్లి చేయాలని మురుగన్ తల్లిదండ్రుల్ని వేధించడం మొదలుపెట్టాడు. ఇలాఉండగా ఈ నెల 19న మురుగన్ తండ్రి వేణు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి తల్లి లక్ష్మితో గొడవపడ్డ మురుగన్, కత్తితో ఆమె గొంతు కోసి ఉడాయించాడు. రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలో మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో తండ్రి వేణును గొంతు నులిమి మురుగన్ హత్య చేసినట్టు తేలిసింది. అజ్ఞాతంలో ఉన్న ఈ ఉన్మాదిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. -
స్నేహితురాలితో రహస్యంగా మూడో పెళ్లి..?
లాహోర్ : మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్(65) రహస్యంగా మూడోపెళ్లి చేసుకున్నారన్న వార్త పొరుగుదేశంలో చర్చనీయాంశమైంది. ఖాన్‌కు ఆథ్యాత్మిక సలహాదారుగానేకాక, స్నేహితురాలిగానూ కొనసాగుతోన్న మహిళను జనవరి 1న పెళ్లాడినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఖాన్ ఆంతరంగికులు కొందరు మాత్రమే వివాహతంతులో పాల్గొన్నట్లు తెలిపాయి. 1992లో పాక్ జట్టుకు క్రికెట్ ప్రపంచ కప్ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్.. తొలుత బ్రిటిష్ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఖాన్.. జర్నలిస్టే అయిన రేహమ్‌ను(2015లో) రెండోపెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. కొంతకాలంగా ఆయన ఒంటరిగా ఉంటున్నారు. అవన్నీ అవాస్తవాలు : కాగా, ఇమ్రాన్ మూడోపెళ్లి విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని పీటీఐ ప్రతినిధులు అన్నారు. ‘‘కొందరు పనిగట్టుకొని ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. ప్రస్తుతం ఆయన(ఇమ్రాన్) దృష్టంతా 2018 ఎన్నికలపైనే ఉంది. ఒకవేళ మూడో పెళ్లంటూ చేసుకుంటే ఎన్నికల తర్వాతే చేసుకుంటారు’’ అని ఖాన్ సన్నిహితులు స్పష్టతనిచ్చారు. -
ముగ్గురు భార్యల కానిస్టేబుల్ రాసలీలలు
సాక్షి, మేడ్చల్ : ముగ్గురు భార్యలతో ఓ కానిస్టేబుల్ రాసలీలలు రచ్చకెక్కాయి. ఒక భార్యకు తెలియకుండా మరో భార్యను.. వీరిద్దరికి తెలియకుండా ముచ్చటగా మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక మూడు చోట్ల కాపురాలు పెట్టేశాడు. మూడో భార్యతో ఉండగా.. మొదటి భార్య రెడ్ హ్యాండెడ్‌గా తన కుమారుడితో కలిసి హెడ్ కానిస్టేబుల్ రాజేంద్రను పట్టుకుంది. ఈ ఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఫీర్జాదిగూడలో ఆదివారం చోటు చేసుకుంది. మూడో మహిళను మొదటి భార్య చితకబాదింది. తండ్రికి, తనయుడికి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అయితే రాజేంద్ర రాసలీలలపై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా మొదటి భార్య విలేకరులతో మాట్లాడుతూ... ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధాలు నడుపుతున్నాడని, దీనివల్ల తమ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోతోందని, పిల్లల భవిష్యత్ నాశనమవుతుండడంతో వేరేదారి లేక ఆయన బండారం బయటపెట్టాల్సి వచ్చిందన్నారు. రాజేంద్ర వరంగల్ జిల్లా సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. -
మూడో పెళ్లి కావాలా ?
►పెళ్లి కుమారుడికి రెండో భార్య బంధువుల దేహశుద్ధి ►డబ్బు కోసం మూడో పెళ్లికి యత్నం తుమకూరు : ఈపాటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని డబ్బు కోసం మూడో పెళ్లికి సిద్ధమైన వ్యక్తికి స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన తుమకూరు నగరంలోని జయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు... మధుగిరి తాలూకాలోని సంకపురం గ్రామానికి చెందిన మహ్మద్పీర్ తుమకూరు నగరంలోని శాంతినగరకు చెందిన తబుసుమ్ బానును మూడో పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యాడు. అంతకు ముందే నిశ్చితార్థం జరగడంతో మంగళవారం న గరంలోని మదర్ షాదీ మహలల్లలో పెళ్లి జరగాల్సి ఉంది. ఇప్పటికే రూ. 60 వేల కట్నంతో పాటు ఇంటికి కావాల్సిన వస్తువులను కూడా పెళ్లి కుమార్తె వారు అందజేశారు. విషయం తెలుసుకున్న రెండో భార్య బంధువులు అక్కడికి చేరుకుని మహ్మద్ పీర్ను పట్టుకుని చితకబాదారు. అనంతరం రోడ్డుపైకి తీసుకువచ్చి జయనగర పోలీసులకు అప్పగించారు. ఇతనికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగినట్లు తమకు తెలియదని తబుసుమ్ బంధువులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
48 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల బాలిక మూడో వివాహం
టీనగర్: అతని వయస్సు 48. ఇప్పటికే ఓ భార్య వదిలి వెళ్లింది. మరో భార్య అతని వద్దే ఉంటోంది. తాజాగా మూడోసారి 14 ఏళ్ల గిరిజన బాలికను వివాహమాడాడు. ఇందుకుగాను బాలిక తండ్రి మూడెకరాల భూమిని వరకట్నంగా అందించాడు. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. కృష్ణగిరి జిల్లా, డెంకణీకోట తాలూకాలోని కోడాంగియూర్ గ్రామానికి చెందిన మాధప్పన్ (48) రైతు. ఇతని మొదటి భార్య గతంలోనే విడిచి వెళ్లింది. ప్రస్తుతం ఇతని వద్ద రెండో భార్య ఉంటోంది. ఇలావుండగా మాధప్పన్ మూడోసారి అదే గిరిజన గ్రామానికి చెందిన బాలికను (14)ను గత వారం వివాహమాడాడు. ఆమె ఎనిమిదో తరగతి వరకూ చదివింది. బాలికను వివాహం చేసుకున్నందుకు ఆమె తండ్రి మూడెకరాల పొలాన్ని మాధప్పన్‌కు అందజేశాడు. ఈ విషయం ఆ గ్రామానికి వెళ్లిన ఒక వ్యక్తి ద్వారా కృష్ణగిరి జిల్లా చిన్నారుల సంక్షేమ అధికారి విన్సెంట్‌కు తెలిసింది. గురువారం ఆయన ఒక కమిటీని సదరు గ్రామానికి పంపి విచారణ జరిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కోట్టమంచు గిరిజన గ్రామాల్లో బాల్యవివాహలు పెచ్చుమీరుతున్నాయని, ఇదివరకే తొమ్మిది మంది చిన్నారులకు వివాహాలు జరిగాయని తెలిపారు. ప్రస్తుతం మాధప్పన్ గతవారం వివాహం చేసుకున్నాడని, దీనిపై కృష్ణగిరి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశామని చెప్పారు. -
మూడో పెళ్లి చేసుకోవాలనుంది: మాజీ క్రికెటర్
ఇస్లామాబాద్: 'నాకు తెలిసి ఎవరి జీవితంలోనైనా విడాకులు తీసుకోవడం అత్యంత దురదృష్టకర సంఘటన. ఇప్పటికే రెండు సార్లు విడాకులు తీసుకున్న అనుభవంతో ఈ మాట చెబుతున్నా. అయితే నేను రాజీ పడే రకాన్ని కాదు. అందుకే మూడో పెళ్లి చేసుకుని మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నా' అని లేటు వయసులో ఘాటు కోరికను వెల్లడించారు మాజీ క్రికెటర్, పాకిస్థాన్ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుతం తాను ఒంటరినని, బ్యాచిలర్ లైఫ్ బోర్ కొడుతున్నదని ఆయన చెప్పారు. 40 ఏళ్ల వయసులో మొదటి పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యతో విడిపోవడం, గతేడాది జనవరిలో రెండో పెళ్లి.. అది కూడా పెటాకులైన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించారాయన. గత వారం ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మొదటిసారిగా తన వ్యక్తిగత జీవితంపై పెదవి విప్పారు. 'క్రికెట్ లో మంచి ఊపు మీదున్నప్పుడే మా వాళ్లు పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేశారు. కానీ ఒక పని అనుకుంటే నా లక్ష్యమంతా దానిమీదే ఉంటుంది. అప్పట్లో క్రికెటే నా ప్రాణం. అందుకే క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యాకే జెమీనాను పెళ్లాడా. పదకొండేళ్ల మా అనుబంధానికి తీపి గుర్తులు ఇద్దరు పిల్లలు. ఎప్పుడైతే నా లక్ష్యం దేశంపైకి.. అంటే రాజకీయాలవైపు మళ్లిందో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. జెమీనా పాకిస్థాన్ లో ఉండలేని.. నేనేమో పాకిస్థాన్ తప్ప మరో చోట ఉడలేని పరిస్థితి. దీంతో క్రమంగా ఇద్దరి మధ్య పూడ్చలేని అగాథం ఏర్పడింది. విడిపోక తప్పలేదు. మొదటి వివాహం రద్దయిన తర్వాత దాదాపు 10 ఏళ్లు నేను ఒంటరిగానే ఉన్నా. అందుకు బలమైన కారణం ఉంది. (చదవండి: ఇమ్రాన్ హత్యకు రెండో భార్య కుట్ర?) విడాకులు.. పిల్లలపై తీవ్ర ప్రభావాలు.. నేనూ, జెమీనా విడిపోయినప్పుడు మా పిల్లలకు 9, 11 ఏళ్లు. తల్లిదండ్రులు విడిపోయారనే దానికంటే వాళ్లు వేరొకిరిని పెళ్లి చేసుకున్నారనే భావన పిల్లలల్లో కలిగితే కుంగిపోతారని నా స్నేహితుడైన మానసిక వైద్యుడొకరు చెప్పారు. అందుకే ఆమెతో విడిపోయిన 10 ఏళ్ల వరకూ నేను రెండో పెళ్లి చేసుకోలేదు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఒంటరిగా ఉంటూ నేను పడే బాధను అర్థం చేసుకుంటారనే ఉద్దేశం కలగగానే.. గతేడాది(2015లో) రెహమ్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నా. మనం ఒకటి తలిస్తే అల్లా ఒకటి చేస్తాడు. రేహమ్ నేను 10 నెలలకే విడిపోయాం. మళ్లీ నా వ్యక్తిగత జీవితాన్ని ఒంటితనం ఆవహించింది. (చదవండి: చపాతీలు చెయ్యమన్నాడని..) ఎన్ని కష్టాలు ఎదురైనా, నిలబడి పోరాడాలనే నేను కోరుకుంటా. రాజకీయాల్లోనూ అంతే. పార్టీ పెట్టిన మొదట్లో ఎన్నెన్నో సందేహాలు, సవాళ్లు. ఇప్పుడు నా పార్టీ నిలబడింది. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడతామనే నమ్మకం ఉంది. అలాగే పర్సనల్ లైఫ్ లో సంతోషంగా ఉండేందుకు మూడో పెళ్లి చేసుకోవాలనుకుటున్నా. ఇప్పుడు నాకు 60 ఏళ్లు. అన్ని విధాలా తగిన మహిళ దొరుకుతుందన్న ఆశ లేదు. కానీ నేను దేవుణ్ని అమితంగా నమ్ముతా. ఆయన ప్రణాలిక ఎలా ఉందోమరి!' అంటూ కోరికను వెల్లడించారు ఇమ్రాన్ ఖాన్. -
పీలే మూడో వివాహం
సావోపాలో: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే 75 ఏళ్ల వయస్సులో మూడోసారి పెళ్లికొడుకయ్యారు. జపాన్‌కు చెందిన తన చిరకాల ప్రియురాలు... 50 ఏళ్ల మార్సియా సిబెల్ వోకిని శనివారం ఆయన వివాహం చేసుకున్నారు. 1980ల్లో తొలిసారిగా వీరిద్దరు ఒకరికొకరు పరిచయమయ్యారు. అయితే 2010 నుంచి మాత్రం సన్నిహితులయ్యారు. వ్యాపార వేత్త అయిన వోకి ఇటీవలి కాలంలో పీలే పలుమార్లు అనారోగ్యానికి గురైనప్పుడు దగ్గరుండి సపర్యలు చేశారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే వీరిద్దరు వివాహం చేసుకోవాలనుకున్నా పీలే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వాయిదా పడింది. పీలే అన్ని స్థాయిల్లో కలిపి తన కెరీర్లో 1,363 మ్యాచ్‌లు ఆడి 1,281 గోల్స్ చేశారు. 1957 నుంచి 1971 మధ్య బ్రెజిల్ తరఫున 91 మ్యాచ్‌లు ఆడారు. పీలే సభ్యుడుగా ఉన్న బ్రెజిల్ జట్టు 1958, 1962, 1970లలో ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించింది. -
దిగ్గజ ఆటగాడికి మూడో పెళ్లి
రియోడిజనీరో: బ్రెజిల్ ఫుట్‌బాట్ మాజీ దిగ్గజం పీలే త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఇదివరకే ఇద్దర్ని వివాహామాడిన పీలే వారికి విడాకులిచ్చిన విషయం తెలిసిందే. 75 ఏళ్ల ఈ ఫుట్‌బాల్ లెజెండ్, 42 ఏళ్ల మార్సియా సిబెలే వివాహం మంగళవారం జరగనుంది. వీరిద్దరూ 2010 నుంచి డేటింగ్ చేస్తున్నట్లు కొన్ని నెలల నుంచి వార్తలు ప్రచారం అవుతున్నాయి. తన పెళ్లి వార్తను పీలే స్వయంగా మీడియాకు తెలిపారు. 1958, 1962, 1970లలో ఫుట్ బాల్ ప్రపంచకప్ సొంతం చేసుకున్న బ్రెజిల్ జట్టులో కీలక ఆటగాడు పీలే. 1363 మ్యాచ్ లాడిన పీలే 1281 గోల్స్ చేశాడు. వ్యక్తిగత జీవితానికొస్తే.. పీలే మొదట రోస్ మేరి ఛోల్బీని పెళ్లి చేసుకోగా వీరికి ముగ్గురు సంతానం కలిగారు. ఆ తర్వాత అస్సీరియా నాస్కిమెంటోతో జీవితాన్ని పంచుకున్నాడు. ఆమెతో జోషువా, సెలెస్ట్ అనే ఇద్దరు కవలలకు పీలే తండ్రయ్యారు. ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్న బ్రెజిల్ మాజీ ఆటగాడు తన గర్ల్ ఫ్రెండ్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. -
'మూడో పెళ్లి చేసుకోలేదు'
-
'మూడో పెళ్లి చేసుకోలేదు'
హైదరాబాద్: తనపై వస్తున్న వదంతులకు పుల్‌స్టాప్ పెట్టేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్. ఈ క్రికెటర్ మరో వివాహం చేసుకున్నాడని ఇటీవల వదంతులు షికార్లు చేస్తున్నాయి. కొన్ని మీడియాలలో వార్తలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విసుగుచెందిన అజహరుద్దీన్ ఈ విషయంపై ట్విట్టర్ పోస్ట్ ద్వారా సమాధానమిచ్చాడు. స్నేహితురాలు షాన్నన్ మేరీని ఈ క్రికెటర్ పెళ్లి చేసుకున్నాడని ఊహాగనాలు వినిపించగా, తాను మూడో వివాహం చేసుకోలేదని ఆ వార్తలను ఖండించాడు. ఇదిలాఉండగా, తన డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించడానికి శనివారం ముంబైకి వెళ్లినపుడు షాన్నెన్ ను ఆయన తన భార్యగా పరిచయం చేశాడన్నది వదంతులకు ఊతమిచ్చింది. ఇటీవల జరుగుతున్న ఐటీపీఎల్ లీగ్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఏసెస్, ఫిలిప్పైన్స్ మ్యాచ్ వీక్షించడానికి గర్ల్ ఫ్రెండ్ షాన్నెన్తో కలిసి వచ్చిన విషయం అందరికీ విదితమే. టీమిండియా విజయవంతమైన క్రికెట్ కెప్టెన్లలో ఒకడుగా పేరుగాంచిన అజహర్ మొదటి భార్య నౌరీన్‌తో 1996లో విడాకులు తీసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా, రెండో భార్య సంగీతా బిజ్లానీ, అజహర్ 2010లో విడిపోయారు. షాన్నెన్తో సన్నిహితంగా ఉండటంతో తాను వివాహం చేసుకున్నట్లు అందరు భావించినట్లు చెప్పాడు. అయితే తాను మూడో వివాహం చేసుకున్నాడన్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ తప్పుడు కథనాలు అని మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కొట్టిపారేశాడు.