
పవన్ మూడో 'కళ్యాణ్'౦
పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ ముచ్చటగా మూడోసారి పెళ్ళి చేసుకున్నాడు. అయితే ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్30న ఎర్రగడ్డ సబ్‌రిజిస్టార్ ఆఫీస్‌లో పవన్-అన్నా లెజ్నోవా ( డానా మార్క్స్) రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్‌కు రష్యన్ మోడల్ అయిన దానా మార్క్స్ తో 'తీన్మార్' చిత్రం సమయంలో ప్రేమ చిగురించిందని చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ ఓ పాప ఉన్నట్లు కూడా సమాచారం. అయితే ఆ సర్టిఫికెట్ పవన్ కళ్యాణ్--అన్నా లెజ్నోవా పేరుతో ఉంది.
గతంలో పవన్ విశాఖ చెందిన నందినిని మొదట పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత బద్రి సినిమాలో హీరోయిన్గా నటించిన రేణుదేశాయ్‌తో సహజీవనం చేసి ....ఓ కుమారుడు పుట్టిన తర్వాత చట్టబద్దంగా వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి అకీరాతో పాటు ఓ పాప కూడా ఉన్నారు. అయితే కొంతకాలం నుండి పవన్, రేణు దేశాయ్ వేర్వేరుగా ఉంటున్నారు.
కొద్ది నెలల క్రితమే డానా మార్క్స్ తో పవన్ సహజీవనం చేస్తున్నట్లు...రేణు దేశాయ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలపై రేణు దేశాయ్ కానీ, ఇటు మెగా ఫ్యామిలీ కానీ పెదవి విప్పలేదు. తాజాగా పవన్ మూడో పెళ్లి వ్యవహారం చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులతో పాటు ప్రేక్షకులకు, మీడియాకు హాట్ టాపిక్‌గా మారింది.
కాగా ఈ విషయంపై నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం సరికాదని... అయితే కొన్ని కోట్లమంది అభిమానులు ఉన్న సెలబ్రెటీలు ఆచితూచీ అడుగు వేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇది మంచి సంప్రదాయం కాదని ఆయన అన్నారు. పవన్ కూడా మూడో పెళ్లిపై స్పందించి వివరణ ఇస్తే బాగుంటుందన్నారు. ఓ టీవీ ఛానల్ ఈ వార్తను బ్లాక్మెయిల్ చేసేందుకు యత్నిస్తేనే.... పవన్ తన పెళ్లి వార్తను వెలుగులోకి తెచ్చినట్లు తెలుస్తోందని నట్టి కుమార్ అన్నారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోవటంలో తప్పేముందని అన్నారు. కేవలం వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు. పెళ్లి చేసుకోవటమా, చేసుకోకపోవటమా అనేది పవన్ పర్సనల్ మేటర్ అని అన్నారు. పబ్లిక్ లో పవన్ ను తప్పుబట్టే విషయం లేదన్నారు.