
పెరంబూరు: సూర్యదేవిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నటి వనితా విజయకుమార్ మూడో పెళ్లి చేసుకోవడంపై వీడియోల ద్వారా సూర్యదేవి విమర్శల దాడి చేసి వార్తల్లో నిలిచారు. ఈ నెల 22న వనితా ఫిర్యాదుతో వడపళని మహిళా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తరువాత నటి కస్తూరీ తన న్యాయవాది ద్వారా సూర్యదేవికి బెయిల్ ఇప్పించారు. (నటి వనితతో గొడవ, ఆ మహిళ ఎక్కడ?)
కాగా అంతకు ముందు సూర్యదేవిని విచారించిన పోలీస్ అధికారికి కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీస్ అధికారి చెన్నై ఐఐటీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సూర్యదేవి మాత్రం పరీక్షలు చేసుకోకుండా పరారీలో ఉన్నట్లు పోలీసులు ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని సూర్యదేవి యూట్యూబ్‌లో వీడియో విడుదల చేశారు. కరోనా వ్యాప్తికి పాల్పడుతోందంటూ చేసిన ఫిర్యాదుపై విరుగంబాక్కమ్ పోలీసులు సూర్యదేవిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment