చైనాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో అన్నీ దేశాలు ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టాయి. భారత్‌లోనూ కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వైరస్ కట్టడికి అన్నిజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
ప్రస్తుతం న్యూ ఇయర్ వేడుకలకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటటంతో తాజాగా తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌కు అస్వస్థత..
Comments
Please login to add a commentAdd a comment