face mask
-
ఈ మల్టీకలర్ ఫేస్‌మాస్క్ ధర వింటే షాకే..!
కరోనా బారీనుంచి ఆ సమయంలో ఎన్నోరకాల ఫేస్‌మాస్క్‌లను వాడారు. వాటి వలన ఫలితాలు, నష్టాలు కూడా అనుభవించారు. అదొక విధమైతే.., ఈ చర్మ సమస్యలు మరో విధము. వయసు పెరిగేకొద్దీ చర్మం ముడతలు బారుతుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. ఈ సమస్యలను డీల్ చేయాలంటే ఈ లైట్ థెరపీ మాస్క్‌ను వాడాల్సిందే.. దీన్ని 15 నుంచి 25 నిమిషాల వరకు ముఖానికి పెట్టుకుని ఉంచితే.. మంచి ఫలితం లభిస్తుంది. ఆప్షన్స్‌లో మల్టీ కలర్స్‌ని మార్చుకోవడంతో వివిధ చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎటువంటి నొప్పి, శ్రమ, ఇబ్బంది లేకుండా ముఖంలో మెరుపుని సొంతం చేసుకోవచ్చు. ఈ మాస్క్ సాయంతో రెడ్, బ్లూ, ఆరెంజ్, పర్పుల్, వైట్, గ్రీన్, సియాన్ ఇలా మొత్తంగా 7 రంగుల్లో ట్రీట్మెంట్ని అందుకోవచ్చు. రిమోట్ సాయంతో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పోర్టబుల్గానూ, కంఫర్టబుల్‌గానూ పని చేస్తుంది. స్త్రీల సౌలభ్యం, సౌకర్యం కోసం రూపొందిన ఈ ఎల్ఈడీ బ్యూటీ మాస్క్.. ఫుడ్–గ్రేడ్ సిలికాన్ మెటీరియల్‌తో తయారైంది. ఇంట్లోనే కాదు ప్రయాణాల్లోనూ సులభంగా ఉపయోగించుకోవచ్చు, ఈ మాస్క్ బిజీ లైఫ్‌స్టయిల్‌కి సరైనది. ఎప్పుడైనా, ఎక్కడైనా.. ఏపని చేసుకుంటూ అయినా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. ఈ స్కిన్‌కేర్ టూల్.. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముడతలు, మచ్చలు వంటి ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. బ్లూ లైట్ చికాకు, అలసటలను దూరం చేస్తుంది. వైట్ లైట్ చర్మానికి పునరుజ్జీవాన్ని అందిస్తుంది. సియాన్ లైట్ స్కిన్ టోన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా ఒక్కో కలర్ ఒక్కో సమస్యను దూరం చేస్తుంది. ఈ పరికరం ఇంట్లో ఉంటే హోమ్ స్పాను ఎంజాయ్ చేయొచ్చు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,083 రూపాయలు. ఇవి చదవండి: ఈ భయం.. ఒక ఫోబియా అని మీకు తెలుసా! -
క్షణాల్లో ఫేస్‌మాస్క్‌ను రెడీ చేసే మెషీన్.. కొరియన్లు చేసేది ఇదే
నిజానికి ఫేస్ మాస్క్‌లతో స్కిన్ కేర్ పొందడం మంచి ప్రయత్నమే. కానీ వాటిని సిద్ధం చేసుకోవడమే కష్టం. ఆ కష్టాన్ని సులభతరం చేస్తుంది ఈ లేటెస్ట్ ఫేస్ మాస్క్ డివైస్. ఇంట్లో తయారు చేసుకునే సాధారణ ఫేస్ మాస్క్ వేసుకుంటే.. అప్లై చేసుకునే సమయంలో ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువవుతుంది. కొన్నిసార్లు సగం ఆరి.. సగం ఆరక ఇబ్బందవుతుంది. గుజ్జుమెత్తగా లేకుంటే ఉండాల్సిన సమయం కంటే ముందే రాలిపోతుంది. ఇలా ఒక్కటని కాదు.. ఫేస్ మాస్క్ విషయంలో అన్నీ సమస్యలే. అదే ఈ మెషిన్‌తో తయారైన మాస్క్‌ని క్లాత్ మాదిరి పట్టుకుని.. ముఖంపై సమాంతరంగా సులభంగా పరచుకోవచ్చు. పైగా ఈ మెషిన్ని మనం క్లీన్ చెయ్యాల్సిన పనిలేదు. సెల్ఫ్ క్లీనింగ్ మోడ్ ఆన్ చేస్తే పది సెకన్లలో క్లీన్ అయిపోతుంది. దీనికి చార్జింగ్ పెట్టుకుని.. వైర్‌లెస్‌గా వాడుకోవచ్చు. ఎన్ని నీళ్లు పొయ్యాలి.. ఇన్‌గ్రీడియెంట్స్ ఏ మోతాదులో కలపాలి.. అనే సూచనలను వాయిస్ మోడ్‌లో ఇస్తూంటుంది ఈ మేకర్. అవసరం లేదనుకుంటే వాయిస్ రిమైండర్ ఆపేసుకోవచ్చు. ఇది సరిగ్గా రెండు నిమిషాల్లో మాస్క్కి కావాల్సిన పేస్ట్‌ని సిద్ధం చేస్తుంది. ఇందులో కూరగాయలు, పండ్లు, విటమిన్ టాబ్లెట్స్ వంటివి పేస్ట్‌లా చేసుకోవచ్చు. దీని ధర సుమారుగా 6 వేలరూపాయల పైమాటే. మాస్క్ ప్లేట్స్‌ని బట్టి.. అందులో లిక్విడ్ వేయగానే ఆయా షేప్ మాస్క్‌లు సిద్ధమవుతాయి. కళ్లు, ముక్కు, పెదవులకు ఇబ్బంది లేకుండా రూపొందిన ఫేస్ షేప్‌లో ఉండే ప్లేట్‌తో పాటు.. కళ్లు, ముక్కు, పెదవుల ఆకారంలో ఉండే ప్లేట్స్ కూడా డివైస్‌తో పాటు లభిస్తాయి. ఈ సౌకర్యాలన్నింటిని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. -
ఏంటిది? మొత్తం ముఖానికే మాస్క్! బాబోయ్! మళ్లీ చైనాకు ఏమైంది?
మొన్న మొన్నటి వరకు చైనా కరోనాతో భయానక నరకాన్ని చవి చూసింది. అన్ని దేశాలు బయటపడ్డా చైనా మాత్రం అంతా తేలిగ్గా ఆ మహమ్మారి నుంచి బయటపడలేకపోయింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్న వేళా! మళ్లా చైనీయులకు ఏమైందో గానీ మొత్తం ముఖం కవర్ అయ్యేలా మాస్క్ ధరిస్తున్నారు. కరోనా టైంలో కేవలం ముక్కుకి మాత్రమే మాస్క్ వేస్తే ఇప్పుడు ఏకంగా మొత్తం ముఖానికి మాస్క్ ఏంటి? బాబోయ్!.. మళ్లీ చైనాలో ఏం మహమ్మారి వచ్చింది అని అన్ని దేశాలు ప్రశ్నలు సంధించడం ప్రారంభించాయి. ఇంతకీ అక్కడ ఏమైందంటే.. చైనాలో ఎండలు గట్టిగా మండిపోతున్నాయి. ఆ వేడికి అక్కడ ప్రజలు తాళ్లలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటుంటే..దంచికొడుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారట. ఈ ఎండ నుంచి రక్షించుకోవడానికి అక్కడ ఉన్న వాళ్లంతా ఇలా ఫేస్మొత్తం కవర్ చేసేలా 'ఫేస్కినిక్' అనే మాస్క్‌లు వేస్తున్నారట. చైనాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండటంతో నివాసుతులు దగ్గర్నుంచి, పర్యాటకులు వరకు అందరూ కూడా పోర్టబుల్ ఫ్యాన్లను కూడా తీసుకువెళ్తున్నారట. ఎండ వేడి నుంచి కాపాడుకునేందుకు టోపీలు, వివిధ రకాల మొత్తటి దుస్తులను ఆశ్రయిస్తున్నారు అక్కడ ప్రజలు. అదీగాక అక్కడ మహిళలు ఫెయిర్ స్కిన్‌నే ఇష్టపడతారు అందువల్ల ఈ ఎండ నుంచి తమ మేను కాంతి తగ్గకుండా ఉండేందుకు వారంతా ఇలా ముఖమంతా కవర్ అయ్యేలా మాస్క్‌లు వేసుకుంటున్నారు. ఇవి చాలా తేలిగ్గా, సింథటిక్ ఉండటంతో చర్మం కమిలిపోకుండా ఉంటుందట. అంతేకాదు ఈ ఎండలు ఎలా ఉన్నా ఈ 'పేస్కినిక్' మాస్క్‌లు మాత్రం హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. (చదవండి: ఓపక్క గర్జించే జలపాతం..సెల్ఫీ పిచ్చితో చేసిన పని..) -
బ్యూటిప్స్
ఏ కాలంలోనైనా జిడ్డు చర్మం బాగా ఇబ్బంది పెడుతుంటుంది. జిడ్డుపోగొట్టి ముఖం ఫ్రెష్‌గా ఉండడానికి ఎగ్, లెమన్ఫేస్మాస్క్ బాగాపనిచేస్తుంది. ఒక గుడ్డును తీసుకుని దానిలోని తెల్లసొనను ఒక గిన్నెలో వేసి దానికి స్పూను తాజా నిమ్మరసం చేర్చి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఫేస్‌మాస్క్ ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ముఖం మీద జిడ్డు, మొటిమలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది ఈ ప్యాక్. -
కరోనా విజృంభణ.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..
చైనాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో అన్నీ దేశాలు ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టాయి. భారత్‌లోనూ కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వైరస్ కట్టడికి అన్నిజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం న్యూ ఇయర్ వేడుకలకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటటంతో తాజాగా తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌కు అస్వస్థత.. -
ఇక ఆఫీసుల్లోనూ మాస్క్‌లు తప్పనిసరి!
బెంగళూరు: చైనా నుంచి కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ బీఎఫ్.7 స్ట్రెయిన్ భారత్‌లో విజృంభించే అవకాశాల నేపథ్యంలో.. కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాకుండా దాదాపుగా అంతటా మాస్క్ తప్పనిసరి చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. పలు దేశాల్లో ప్రధానంగా పొరుగు దేశం చైనాలో కరోనా కల్లోలం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. బీఎఫ్.7 ప్రభావంతో కరోనా కేసులు, మరణాలతో చైనా ఆగం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇక కర్ణాటక ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలతో పాటు ఇండోర్ లొకేషన్స్, క్లోజ్డ్ ప్రాంతాల్లోనూ మాస్క్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఏసీ గదులున్న ప్రాంతాల్లోనూ మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో థియేటర్లు, ఆఫీసుల్లోనూ మాస్క్ మస్ట్ కానుంది. అలాగే.. జలుబు లక్షణాలు కనిపించినా, శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తినా.. కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక వైద్యారోగ్య శాఖ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించి.. సీఎం బొమ్మైకి నివేదిక సమర్పించింది. పాజిటివ్ పేషెంట్ల శాంపిల్స్‌ను జీనోమిక్ సీక్వెన్సింగ్‌కు పంపించనున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ వెల్లడించారు. అన్ని జిల్లాల్లో వైద్య విభాగాలను అప్రమత్తం చేసినట్లు, సరిపడా బెడ్లు, ఆక్సిజన్‌తో సిద్ధంగా ఉండాలని సూచించినట్లు ఆయన తెలిపారు. -
పిల్లలూ.. మనం జంతువులను పుస్తకాల్లోనే చూడాలేమో..!
హెచ్ఎం: పిల్లలూ... మీరెప్పుడైనా పులిని చూశారా... విద్యార్థులు: ఊహు.. చూడలేదు సార్... హెచ్ఎం: పోనీ.. ఏనుగునీ.. విద్యార్థులు: (లేదన్నట్టుగా తెల్ల మొహం) హెచ్ఎం: భవిష్యత్తులో మీరు వీటిని జూలో, పుస్తకాల్లోనే చూడాల్సిన పరిస్థితి రావొచ్చేమో.. విద్యార్థులు: ఎందుకు సార్? హెచ్ఎం: ఎందుకంటే... అడవులు నశించిపోవడంతో జంతు సంపద కూడా అంతరించిపోతోంది.. అంటూ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కొత్తపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోసూరు రాము బోధించారు. విద్యార్థులతో జంతు మాస్క్‌లు ధరింపజేసి, ఆయన కూడా మాస్క్ వేసుకొని బోధన చేశారు. దేశంలో వేలల్లో ఉన్న జంతు సంపద వందల్లోకి చేరిందని.. ప్రస్తుత పరిస్థితులను విద్యార్థులకు వివరించారు. వినూత్న రీతిలో బోధిస్తే విద్యార్థులు ఆసక్తిగా విషయాన్ని అర్థం చేసుకుంటారనే ఇలా చేశానని ఆయన చెప్పారు. (క్లిక్ చేయండి: కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!) -
Covid-19: కరోనా అంతు చూసే మాస్కు!
కరోనా ఇక కాస్త మందగించిందంటూ మూడో వేవ్ దాటిన తర్వాత ప్రజలంతా కొద్దిగా హాయిగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో... తన ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోలేదంటూ అది అడపాదడపా సందడి చేస్తూనే ఉంది. దేశంలో చాలా చోట్ల కేసులు మళ్లీ పెరుగుతున్నాయంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దాంతో మూలన విసిరేసిన మాస్కుల డబ్బాలు మళ్లీ తెరవాల్సిందేనంటూ ఆరోగ్య నిపుణులూ, ప్రభుత్వ పెద్దలూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ తాకిన కొద్దిసేపటికి అది నిర్వీర్యం అయిపోయే కొత్త మాస్కులను శాస్త్రవేత్తలు రూపొందించారు. వైద్యులు వాడే ఎన్–95 మాస్కులూ, ప్రజలు ఉపయోగించే మూడు పొరల మాస్కుల తరహాలో కరోనాను అరికట్టే రసాయనంతో మరో పొరను చేర్చుతూ వీటిని రూపొందించామంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కెంటకీకి చెందిన కెమికల్ ఇంజనీర్ దిబాకర్ భట్టాచార్య. ‘కొత్తగా రూపొందించిన ఈ పొర మీదికి ‘సార్స్–సీవోవీ–2’వైరస్ లేదా దానికి సంబంధించిన అంశాలేవైనా చేరి... అక్కడ దాని మీద కనీసం 30 సెకండ్ల పాటు ఉంటే దాని స్పైక్ ప్రోటీన్ నిర్వీర్యమవుతుంది. కొమ్ముల్లా ఉండే ఈ స్పైక్ ప్రోటీన్‌ను ఓ తాళం చెవిలా ఉపయోగించుకునే వైరస్ మన జీవకణాల్లోకి చేరుతుందన్న విషయం తెలిసిందే. ఇది ఎన్–95లా పనిచేస్తున్నప్పటికీ దీనిపైని అదనపు పొరపై యాంటీవైరస్ ఎంజైమ్ పూత ఉంటుంది. అది కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేస్తుంది. తద్వారా ‘సార్స్–సీవోవీ–2’వ్యాప్తిని గణనీయంగా అరికడుతుంది’అంటున్నారు దిబాకర్ భట్టాచార్య. దీనిని మరింత అభివృద్ధి చేస్తే మరింత సమర్థంగా వ్యాప్తిని అరికడుతుందనే భరోసా ఇస్తున్నారు. దీన్లో వాడిన ‘స్మార్ట్ ఫిల్టరేషన్ మెటీరియల్’కేవలం గాల్లో వ్యాపించి కరోనాను వ్యాప్తిచేసే ఏరోసాల్స్‌ను మాత్రమే నిర్వీర్యం చేస్తుంది తప్ప శ్వాసప్రక్రియకు ఎలాంటి అవరోధం కల్పిందంటూ పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ఇవి అటు డ్రాప్లెట్స్(సన్నటి లాలాజల తుంపర్ల)తో పాటు ఇటు ఏరోసాల్స్ (గాల్లో ఉండే అతి సూక్ష్మమైన కణాలు) ద్వారా కలిగే వైరస్ వ్యాప్తులను అరికడుతుందంటున్నారు. విశ్వసనీయమైన ఎన్–95 కంటే సమర్థమైందని, కరోనా వైరస్ సహా, 100 నానోమీటర్ల సైజులో ఉన్న అన్ని పార్టికిల్స్నూ 98.9 శాతం సమర్థంగా అడ్డుకుంటుందనేది పరిశోధకుల మాట. ఈ వివరాలన్నీ ‘కమ్యూనికేషన్స్ మెటీరియల్స్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాదం పొడితో ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది..!
బాదం పొడి ఒక టీ స్పూన్ (బాదంపప్పు మీద ఉండే పొట్టుతో సహా గ్రైండ్ చేసినది), బాదం నూనె ఒక టీ స్పూన్, గసగసాల పొడి ఒక టీ స్పూన్, గోధుమ పిండి ఒక టీ స్పూన్, పన్నీరు తగినంత తీసుకోవాలి. బాదం పొడి, గసాల పొడి, గోధుమ పిండిలో బాదం నూనె, తగినంత పన్నీటితో పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత వలయాకారంగా స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి. -
అలర్ట్: మాస్క్ ధరించకుంటే దించేస్తారు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు అలర్ట్. ఎయిర్‌పోర్ట్‌లోగానీ, విమానంలోగానీ మాస్క్ ధరించకుంటే అనుమతించకూడదని కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మాస్కులు ధరించకుంటే.. దించేయాలని తెలిపింది. అంతేకాదు.. ప్రయాణం మొత్తంలో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్పోర్ట్, విమానాల్లో కరోనా నిబంధనలు పాటించకుంటే.. ప్రయాణికులను అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్కులు ధరించేలా చూడాలంటూ ఢిల్లీ హైకోర్టు.. రెగ్యులేటరీ బాడీని ఆదేశించింది. మాస్క్‌లు ధరించడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని, పదే పదే హెచ్చరించినా పట్టించుకోపోతే వాళ్లను.. నిబంధనలను పాటించని ప్రయాణికుల జాబితాలో చేర్చి, తదనంతర చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. Mask Must ఈ తరుణంలో.. డీజీసీఏ ఆదేశాలనుసారం మాస్క్‌లు ధరించని ప్రయాణికులపై చర్యలు తీసుకోనున్నారు ఎయిర్పోర్ట్ నిర్వాహకులు. అలాంటి ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకునే హక్కు కూడా కల్పించారు. ప్రయాణాల్లో కేవలం ప్రత్యేక కారణాలు చూపిస్తేనే.. మాస్క్ తొలగించే అవకాశం కల్పిస్తారు. -
గురుభక్తి చాటుకున్న ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు
ఉత్తర కొరియాలో ఒమిక్రాన్ విజృంభణకు కారణం.. అధికారుల నిర్లక్ష్యమే అని గుర్రుగా ఉన్నాడు నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా.. కరోనా నిబంధనలను మాత్రం కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో.. మాస్క్ నిబంధనలను పక్కనపెట్టాడు కిమ్ జోంగ్ ఉన్. ఎందుకంటారా?.. కొరియన్ పీపుల్స్ ఆర్మీ మార్షల్ హ్యోన్ చొల్ హయే మరణం.. అక్కడి ప్రభుత్వవర్గాల్లో విషాదాన్ని నింపింది. అయితే ఆయన అంత్యక్రియల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన.. అందరి దృష్టి ఆకర్షించింది. ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొని తన గురువుకి నివాళి అర్పించాడు. అంతేకాదు.. కరోనా భయంతో అంతా మాస్కులు ధరించిన వేళ ఆయన మాత్రం మాస్క్ లేకుండానే గురువుకి గౌరవం ఇచ్చాడు. మే 12న అక్కడ తొలి కరోనా కేసు ప్రకటన వెలువడగా.. అప్పటి నుంచి మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చివరకు కిమ్ కూడా మాస్క్‌ను వదలలేదు. అలాంటి గురువు శవపేటిక మోసే సమయంలో మాత్రం మాస్క్‌ను పూర్తిగా పక్కనపెట్టాడు. కిమ్ జోంగ్-2 2011లో చనిపోయిన తర్వాత.. కిమ్‌ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించింది హ్యోన్ చొల్ హయే. అందుకు గురుభక్తిని అంతగా చాటుకున్నాడు కిమ్. ఇది చూసిన వాళ్లంతా.. కర్కశంగా వ్యవహరించే కిమ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు దక్షిణ కొరియా, అమెరికా నుంచి వ్యాక్సిన్ సాయం ప్రకటన వెలువడినా.. కిమ్ నుంచి ప్రతి సమాధానం లేకపోవడం గమనార్హం. -
కోరలు చాస్తోన్న కరోనా.. తమిళనాడులో ఆంక్షలు
సాక్షి, చెన్నై: కరోనా ప్రభావం తగ్గిపోయిందని సంతోషపడుతున్న తరుణంలో వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో గురువారం 21 కేసులు నమెదు కాగా శుక్రవారం 37 మంది వైరస్ బారిన పడ్డారు. కేసుల సంఖ్యలో క్రమంగా పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే రూ.500 జరిమానా విధానం శక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఐఐటీ మద్రాసులో ముగ్గురికి కరోనా పాజిటివ్ బయటపడడంతో అప్రమత్తమై మరికొందరికి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ సంఖ్య శుక్రవారానికి 30కి చేరింది. ఈ క్రమంలో మే 8వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా లక్ష మెగా వ్యాక్సిన్ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ తెలిపారు. రెండు కోట్ల మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు శిబిరాలు పనిచేస్తాయని చెప్పారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కేసులు భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయని అన్నారు. సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఉత్తరా ది నుంచి కార్మికులను రప్పించే సంస్థలు చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి (జీహెచ్)కి ముందుగా సమాచారం ఇవ్వాలని మంత్రి సూచించారు. అలాగే వారందరినీ జీహెచ్‌కు తీసుకొస్తే ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుపుతారని తెలిపారు. గుంపులుగా రైళ్లలో వచ్చే ఉత్తరాది కూలీలపై అప్రమత్తంగా ఉండాలని.. లేకుంటే పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. తమిళనాడులో ఇప్పటికే కరోనా కేసులు 39కి చేరుకున్నాయని తెలిపారు. కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. చదవండి👉🏾 సీఎం జగన్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ క్వారంటైన్లో ఐఐటీ మద్రాసు విద్యార్థులు కరోనా కట్టడి చర్యల్లో భాగంగా చెన్నై ఓమందూరులోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఐఐటీ మద్రాసులో 700 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. స్వల్ప లక్షణాలున్న వారిని కళాశాల ప్రాంగణంలో హోం క్వారంటైన్లలో ఉంచామన్నారు. విద్యార్థులకు కోవిడ్ సోకితే ఆయా ప్రాంగణాల్లోనే క్వారంటైన్లో ఉంచి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
మాస్క్ ఇక తప్పనిసరి కాదు.. ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత
ముంబై: కొవిడ్ నిబంధన విషయంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై మాస్క్‌లు ధరించడం తప్పనిసరి ఏం కాదని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 1, శుక్రవారం నుంచి సడలింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మాస్క్ ధరించకపోతే.. పెనాల్డీ విధించబోమని పేర్కొంది. మరోవైపు కరోనా వైరస్ నియంత్రణంలో ఉందని, కాబట్టి, ఆంక్షల సడలింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005 యాక్ట్ ప్రకారం ఇంతకాలం అమలు చేసిన ఆంక్షల్ని ఎత్తేసినట్లు పేర్కొంది. అయితే కరోనా ముప్పు ఇంకా పూర్తి స్థాయిలో తొలగిపోలేదు కాబట్టి ప్రజలంతా స్వచ్చందంగా మాస్క్‌లు ధరించాలని మాత్రం మహా సర్కార్ సూచించింది. బీఎంసీ కూడా మాస్క్ తప్పనిసరి కాదని, ఫైన్ విధించబోమని చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి శనివారం నుంచి ఇది అమలులోకి రావాల్సి ఉంది. అయితే.. ఒకరోజు ముందస్తుగానే ఈ ఆదేశాలను విడుదల చేసింది ప్రభుత్వం. Maharashtra Government issues order withdrawing all COVID19 restrictions. pic.twitter.com/wTaKCPUa7G — ANI (@ANI) April 1, 2022 కరోనా వైరస్ 2020లో ప్రపంచాన్ని కుదిపేయగా.. డబ్ల్యూహెచ్‌వో తో పాటు వైద్య నిపుణులంతా ముఖానికి మాస్క్ ధరించడం వల్లనే వైరస్ కట్టడి అవుతుందని సూచించిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్ర, ప్రత్యేకించి ముంబైలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించని వాళ్ల నుంచి కనిష్టంగా 200రూ. నుంచి.. గరిష్టంగా బాగానే ఫైన్ వసూల్ చేశారు అక్కడి అధికారులు. -
మాస్క్ ధరించడం చాయిసే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసిందని ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ‘గత రెండేళ్లుగా కరోనాతో ఎంతో ఇబ్బందిపడ్డాం. మాస్క్‌లు ధరించడాన్ని కొంత అసౌకర్యంగా భావించాం. అందువల్ల మాస్క్ పెట్టుకోవాలా.. వద్దా.. అనేది ఇప్పుడు చాయిస్ మాత్రమే’అని స్పష్టం చేశారు. అయితే కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోనందున మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం మంచిదని అభిప్రాయపడ్డారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాస్క్‌లు ధరించాలని, ముఖ్యంగా ఆసుపత్రులకు వెళ్లినప్పుడు తప్పనిసరని పేర్కొన్నారు. ఇతరులు జనసమూహంలో ఉన్నప్పుడు ధరించాలని సూచించారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా కొనసాగుతుందని, అయితే ఈ విషయం లో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తు తం రోజుకు 40 కరోనా కేసులు నమోదవుతున్నాయని, 20 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదన్నారు. ఆరేడు జిల్లాల్లో ఒక్కో కేసు, జీహెచ్ఎంసీలో 20 వరకు కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం 0.18 శాతం పాజిటివిటీ నమోదవుతోందని, ఇప్పటివరకు ఇదే అత్యల్పమని పేర్కొన్నారు. కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నా, ఆ వేరియంట్లు ఇప్పటికే మనదేశంలో వచ్చిపోయాయని అన్నా రు. ఈ ఏడాది చివరినాటికి కరోనా ఎండమిక్ దశకు చేరుకుంటుందని, ఏదో ఒక ప్రాంతానికి అది పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎన్ని వేరియంట్లు వచ్చినా మనం తట్టుకోగలమన్నారు. వ్యాక్సిన్ వికటించి ఒకరు మృతి 18 ఏళ్లుపైబడిన వారందరికీ మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 12–14 ఏళ్ల వయస్సు పిల్లల వ్యాక్సినేషన్లో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు వెనుకబడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లోనూ వ్యాక్సినేషన్ చేపట్టామని, ఈ రెండు జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లు ఎక్కువగా ఉన్నాయని, యాజమాన్యాల నుంచి అనుమతి రావడంలేదన్నారు. ప్రతీ తొమ్మిది నెలలకు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఇప్పటికే ఐటీ కంపెనీలు 50 నుంచి 60 శాతం వరకు వర్క్‌ఫ్రం హోం ఎత్తేశాయని, మిగిలినవి కూడా ఇదే పద్ధతిని పాటించాలని కోరారు. 12–14 ఏళ్ల పాపకు వ్యాక్సిన్ వికటించి బ్రెయిన్‌డెడ్ అయిన సంఘటనపై డాక్టర్ శ్రీనివాసరావు స్పందిస్తూ, టీకాకు, దానికి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ వయస్సు వారిలో 7 లక్షలకుపైగా టీకాలు వేస్తే, ఎవరికీ ఏమీ కాలేదన్నారు. రాష్ట్రంలో 6 కోట్ల టీకా డోసులు వేస్తే, రాష్ట్రంలో ఒకరు చనిపోయారని, దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించిందన్నారు. టిమ్స్ ఆసుపత్రిని ఎత్తేయడంలేదని, అక్కడ సాధారణ ఓపీ కొనసాగుతుందని, దాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. పెరిగిన ఎండల తీవ్రత రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిపోయిందని, రాష్ట్రంలోని 6 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం 40 డిగ్రీలకుపైగా ఎండలు ఉంటున్నాయని, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని అన్నారు. వడదెబ్బ తగిలినవారిని వెంటనే నీడలోకి తీసుకువెళ్లి గాలి ఆడేలా చూడాలని, అరగంటలోపు లక్షణాలు తగ్గకపోతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. నిరంతరం బయట ఉంటూ విధులు నిర్వహించేవాళ్లు ఎక్కువగా నీరు, పానీయాలు తీసుకోవాలన్నారు. రోజుకు 4 లీటర్లకుపైగా నీరు తాగాలని, కొబ్బరినీళ్లు, మజ్జిగ తరచూ తీసుకోవాలన్నారు. ఈసారి ఎండలు తీవ్రంగానే ఉంటాయన్నారు. అన్ని ఆసుపత్రులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ పంపించామన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
ముంచుకొస్తున్న థర్డ్ వేవ్.. ముంబై తర్వాత హైదరాబాదే.. కోవిడ్ కేసుల్లో కాదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా.. థర్డ్ వేవ్ భయాలు అన్ని రాష్ట్రాలను చుట్టుముడుతున్నా.. ప్రజలు మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వీడటం లేదు. కరోనా మార్గదర్శకాలను పాటించాలని, పక్కాగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు పదేపదే కోరుతున్నా పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ముంబై, సిమ్లా, కోల్‌కతా, జమ్మూ, చెన్నై, గువాహటి, చండీగఢ్, పుణే, రాయ్‌పూర్‌లలో డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నవంబర్, డిసెంబర్ మాసాలలో మాస్కుల ధరింపుపై సర్వే నిర్వహిస్తే ఒక్క ముంబై మినహా మరే నగరంలోనూ 50 శాతానికి మించి ప్రజలు మాస్కులు ధరించట్లేదని తేటతెల్లమైంది. చదవండి: సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్: మంత్రి క్లారిటీ మాస్కులను పురుషులకన్నా మహిళలే ఎక్కువగా ధరిస్తున్నట్టు వెల్లడైంది. ఇందులో అత్యధికంగా ముంబైలో 76.28 శాతం మంది మాస్కులు ధరిస్తుండగా, మిగతా ఏ నగరంలోనూ 50 శాతానికి మించి ధరించడం లేదని తేలింది. ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే 45.75శాతం మంది పూర్తి స్థాయిలో, 17.10 శాతం మంది పాక్షికంగా మాస్కులు ధరిస్తున్నారు. చదవండి: యూపీలో బీజేపీ భారీ షాక్.. 24 గంటల వ్యవధిలో.. కాగా తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 1,920 కరోనా కేసులు రికార్డయినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో ప్రకటించింది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,015 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కరోనా కేసులు 6,97,775కు చేరింది. ఇక మంగళవారం 83,153 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా మహారాష్ట్రలో కొత్తగా 34,424 కేసులు వెలుగు చూశాయి. వీటిలో ముంబైలోనే 11,647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,21,477కు చేరింది. ఇక రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు1,281కి పెరిగాయి. చదవండి: కరోనా కల్లోలం: భారత్‌లో భారీగా పెరిగిన కేసులు.. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఎలాంటి మాస్క్‌లు ధరించాలంటే..
కొత్త సంవత్సర వేడుకలు, పండుగల నేపథ్యాల్లో ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభించొచ్చన్న వైద్య వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయన్న ఆందోళన నడుమే.. వ్యాక్సినేషన్ రేటు రోజురోజుకీ పెరిగిపోతోంది కూడా. అదే తరుణంలో మాస్క్‌ల వాడకం, ఇతర జాగ్రత్తల గురించి కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కరోనా వేరియెంట్లలో డెల్టా, ఒమిక్రాన్ వేరియెంట్లు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ తరుణంలో వైద్య నిపుణులు ‘మాస్క్ అప్‌గ్రేడ్’ థియరీని తెరపైకి తీసుకొచ్చారు. అంటే.. ఇప్పుడు వాడుతున్న వాటి కంటే మెరుగైన మాస్క్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్ వేరియెంట్ల స్థాయికి సాధారణ మాస్క్‌లు సరిపోవంటున్నారు గ్లోబల్ హాస్పిటల్స్ పల్మనాలిజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హరీష్ ఛాప్లే. సాధారణ మాస్క్‌లు, సర్జికల్ మాస్క్‌ల కంటే.. ఎన్95, ఎఫ్ఎఫ్పీ2, కేఎన్95 మాస్క్‌లు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సిబ్బందిని ఇవి కచ్చితంగా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హెల్త్ కేర్ వర్కర్స్, ఇన్ఫెక్షన్కు గురయ్యే హైరిస్క్ ఉన్న వాళ్లు ఈ తరహా మాస్క్‌లు ఉపయోగించాలని చెప్తున్నారు. అయితే ఇమ్యూనిటీ జోన్లో ఉన్నవాళ్లు, వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకున్నవాళ్లు క్లాత్ మాస్క్‌ల ద్వారా కూడా రక్షణ పొందవచ్చని ఇంటెర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ వినీత తనేజా చెప్తున్నారు. కాకపోతే సింగిల్, డబుల్ లేయర్ మాస్క్‌ల కంటే మూడు పొరల మాస్క్‌ల్ని ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఒకవేళ సింగిల్, డబుల్ లేయర్ మాస్క్‌లు గనుక ఉపయోగిస్తున్నట్లయితే.. వాటిపైనా మరో మాస్క్ ధరించడం మేలని చెప్తున్నారు. ఇక ఎలాంటి మాస్క్ ధరించాలని ఎంచుకోవడం కంటే.. దానిని సరిగా ధరించడం ఇప్పుడు తప్పనిసరి అవసరం. ఎందుకంటే వైరస్ వేరియెంట్లు ఎంత ప్రమాదకరమైనవి అయినా.. రక్షణ కల్పించే మార్గం ఎక్కువగా ఇదొక్కటి మాత్రమే అని డాక్టర్ వినీత చెప్తున్నారు. చాలామంది మాస్క్‌ను కిందకి పైకి జారవేస్తూ ఉంటారు. కానీ, దీనివల్ల రిస్క్‌కు ఛాన్స్ ఉంటుంది. అందుకే బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో మాస్క్‌ను ముక్కు పైభాగం నుంచి గదవ భాగం వరకు పూర్తిగా కప్పి ఉంచడం ఉత్తమమని డాక్టర్ వినీత చెప్తున్నారు. ఉత్తగా ధరించడం కాదు.. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో చాలామంది జాగ్రత్తలను పక్కాగా పాటించారు. అయితే రాను రాను ఆ వ్యవహారం చిరాకు తెప్పించడమో లేదంటే వ్యాక్సినేషన్ ఇచ్చిన ధైర్యమోగానీ ఆ అలవాట్లను చాలావరకు దూరం చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్‌ల విషయంలో అయినా కనీస జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ టిప్స్ ►మాస్క్‌లను తీసేటప్పుడు, ధరించేటప్పుడు వాటి చివరల దారాలను మాత్రమే ముట్టుకోవాలి. ►క్లాత్ మాస్క్‌లను ఒక్కసారిగా వాడాక శుభ్రంగా ఉతకాలి. వేడినీళ్లలో ఉతక్కూడదు. ►సర్జికల్ మాస్క్‌లను మళ్లీ ఉపయోగించడం మంచిదికాదు. ►ఇంట్లో అందరి మాస్క్‌లను కలిపి ఉంచకూడదు. విడివిడిగా ఉంచాలి. ►మాస్క్ మీద శానిటైజర్ చల్లడం, రుద్దడం లాంటివి చేయకూడదు. ►మాస్క్‌లకు డ్యామేజ్లు, లీకేజీలు లేకుండా చూసుకోవాలి. ►ఇతరులతో మాట్లాడేటప్పుడు మాస్క్‌లను పదే పదే కిందకి జరపడం లాంటివి చేయకపోవడం మంచి అలవాటు. ►పిల్లలకు నాన్ మెడికల్ మాస్క్‌లు వాడడం మంచిది. ►పిల్లలకు ఆరోగ్య సమస్యలుంటే గనుక వైద్యులను సంప్రదించి మెడికల్ మాస్క్‌లు వాడొచ్చు. ►మాస్క్ జాగ్రత్తగా వాడడమే కాదు.. వాటిని పారేసేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించడం ఒక బాధ్యత. మరికొన్ని.. ♦పదే పదే ముఖాన్ని చేతులతో రుద్దకపోవడం. ♦సామూహిక భోజనాలకు దూరంగా ఉండడం. ♦తరచూ చేతుల్ని సబ్బుతో, హ్యాండ్‌వాష్‌తో క్లీన్ చేసుకోవడం. ♦చలికాలంలో జలుబు, ఇతర సమస్యల కారణంగా అలర్జీతో ముక్కులో వేలు పెడుతుంటారు. అలా చేయకపోవడం ఉత్తమం. ♦శానిటైజర్ రాసిన చేతులతో తినుబండారాల్ని తాకరాదు. ♦శానిటైజర్‌ను క్యారీ చేయడం మరీ మంచిది. మాస్క్‌ను ధరిస్తూ శుభ్రతను పాటిస్తూ వీలైనంత మేర భౌతిక దూరం పాటిస్తే సాధారణ జాగ్రత్తలతోనూ కరోనా వేరియెంట్లను జయించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
చావు తెలివంటే ఇదే.. ట్రిపుల్ రైడింగ్.. హెల్మెట్ లేదు.. మూతికి ఉండాల్సిన మాస్కేమో!
సాక్షి, జీడిమెట్ల : పోలీస్ చలానాల నుంచి తప్పించుకోవాలంటే మూతికి ఉండాల్సిన మాస్క్‌ను బండికి పెట్టుకోవాలి. అప్పుడే ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్రూట్లలో ఇష్టం వచ్చినట్లు వెళ్లొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొంతమంది యువకులు ఇలా బైక్ నంబర్ ప్లేట్‌ను మాస్క్‌తో మూసేసి పోలీసుల కెమెరాలకు చిక్కకుండా తిరుతున్నారు. ఇలాంటి వారు ఏదైనా ప్రమాదం చేసి తప్పించుకుంటే దొరకడం కష్టంగా మారుతుంది. ఇటువంటి వాహనదారుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించకుంటే ఇది ప్రమాదమేనని ప్రజలు అంటున్నారు. చింతల్లో నంబర్ ప్లేట్‌కు మాస్కు పెట్టి యువకులు ఇలా ట్రిపుల్ రైడింగ్‌లో వెళ్తున్నారు. అసలే కోవిడ్ మహమ్మారి మరోసారి రెక్కలు విప్పేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన కొంతమంది నిర్లక్ష్యం వీడటం లేదు. ఇంకోవైపు రాష్ట్రంలో రోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలబారినపడి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా యువకులు తమకేం కాదులే అన్న విపరీత ధోరణితో అటు వైరస్‌ను , ఇటు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. చదవండి: నగరానికి నయా పోలీస్ బాస్.. సీవీ ఆనంద్ గురించి ఆసక్తికర విశేషాలు.. హైదరాబాద్ నగరంలో గతంలో దర్శనమిచ్చిన ‘మాస్కు’ నెంబర్ ప్లేట్లు.. -
Telangana: మాస్క్ ధరలు.. తగ్గేదే లే!
ఆస్పత్రుల్లో సర్జికల్ మాస్కులుగా మాత్రమే పరిచయం ఉన్నవి కాస్త.. కరోనా టైం నుంచి మన జీవితాల్లో భాగం అయ్యాయి. వేవ్‌లు విరుచుకుపడుతున్నప్పుడల్లా మూతులకు అతుక్కుపోతున్నాయి. ఆంక్షలు, అభ్యంతరాల నేపథ్యంలో అవసరంకొద్దీ అప్పటికప్పుడు ఎంతైనా సరే చెల్లించి కొనేస్తున్నారు జనాలు. అయితే మాస్క్‌ల ఉత్పత్తి పెరుగుతున్నా.. వాటి ధరలు మాత్రం ఇంకా దిగిరాకపోవడంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో ఓసారి చూద్దాం. హైదరాబాద్ సహా ఇతర పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో మూడు పొరల సర్జికల్ మాస్క్ ధర ఒకటి రూ.10 నుంచి 15 రూ. మధ్య ఉంటోంది(డిజైన్లు, ఇతర కంపెనీలవి మినహాయించి). సాధారణ మెడికల్ షాపు ఓనర్ల నుంచి బిజీ ఏరియాల దగ్గర చిరువ్యాపారుల దాకా ఈ ధరకి ఫిక్సయిపోయారు. ఇక మండలాలు, రూరల్ ఏరియాల్లో ఇంతకంటే ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు. సాధారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల నుంచి సర్జికల్ బయటకు వచ్చేది రూపాయిలోపు(ఒక్కోటి) ధరకే!. మరి అన్నేసి రేట్ల రేటుకు అమ్మడం ఎందుకు?. ప్రతీకాత్మక చిత్రం మధ్యవర్తులే కారణం.. హైదరాబాద్ శివారులో దాదాపు పది యూనిట్ల నుంచి నిత్యం మాస్క్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో యూనిట్ రోజులో లక్ష నుంచి 4 లక్షల దాకా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. అంటే ఒక్క హైదరాబాద్ నుంచే రోజుకి 30 లక్షల సర్జికల్ మాస్కుల ఉత్పత్తి అవుతున్నాయన్నమాట. ఇవిగాక మరో పది లక్షల మాస్క్‌లను ఢిల్లీ నుంచి దిగుమతి చేస్తున్నారు. మొత్తంగా 40 లక్షల మాస్క్‌లతో భారీ సప్లయి నడుస్తోంది. అయినప్పటికీ ధరలు మాత్రం దిగి రావట్లేదు. అయితే దళారులు, మధ్యవర్తుల కారణంగానే వీటి ధరలు అధికంగా ఉంటున్నాయని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు.. రిటైలర్స్‌కు 90పై. నుంచి 1.రూ.మధ్య అమ్ముతున్నారు. మొదటి వేవ్ నుంచి ఇదే ధర కొనసాగుతోంది కూడా. కానీ, రిటైలర్స్ నుంచి కొందరు దళారులు వీటిని కొనుగోలు చేసి.. మూడు నుంచి ఐదు రూపాయల కమిషన్‌తో కిందిస్థాయికి అమ్మకాలు చేస్తున్నారు. అందుకే తామూ అధిక ధరలకు అమ్ముతున్నామని మెడికల్ షాప్ ఓనర్లు, వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇక మాస్క్ ధరించకపోతే ఫైన్లు విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు వీళ్ల వ్యాపారానికి మరింత కలిసొస్తోంది. ప్రతీకాత్మక చిత్రం మాదేం లేదు కరోనా మొదటి, రెండో వేవ్‌ల టైంలో తెలంగాణలో మాస్క్‌ల కొరత నడిచింది. ఉత్పత్తి అస్థిరత వల్ల ధరలు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు డిమాండ్‌కు మించి సప్లయ్ ఉంటున్నా.. అధిక ధరలకు అమ్ముతుండడం విశేషం. ఫస్ట్ వేవ్ కోనా టైంలో ఒక్కో మాస్క్‌ను 8రూ నుంచి 9రూ. గరిష్ట ధరకు అమ్మేవాళ్లు. అయితే తయారీదారులు ఇప్పుడూ పాత రేట్లకే అమ్ముతున్నా.. కస్టమర్‌కి మాత్రం ఐదు నుంచి పది రేట్లకు చిల్లు పడుతోంది. పైగా ఈ ఏడాది వేసవి తర్వాత ఉత్పత్తి గణనీయంగా పెరిగినా.. ధరలు మాత్రం దిగిరావట్లేదు. తెలంగాణలో సరిపడా యూనిట్లు ఉన్నాయని, ధరల విషయంలో మాదేం లేదంటున్నారు మ్యానుఫ్యాక్చరర్స్. పైగా మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి దందాలను, ధరల నియంత్రణను ప్రభుత్వాలే చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు వాళ్లు. ప్రస్తుతం స్టాక్ వివరాలు ఎన్ 95 మాస్కులు.. 41 లక్షల కుపైనే 3 పొరల మాస్క్‌లు, కోటి 50 లక్షలకు పైనే పీపీఈ కిట్స్.. 8 లక్షలకుపైనే హోం ట్రీట్మెంట్ కిట్స్.. 8.71 లక్షలు కొసమెరుపు.. బల్క్‌గా త్రీ లేయర్స్ మాస్క్‌లను కొనుగోలు చేస్తున్న కొందరు.. షాపులు, మెడికల్ స్టోర్లు కాకుండా రోడ్ల మీద, ఫుట్‌పాత్‌లపై రూ. 2 నుంచి 7రూ. మధ్య అమ్మేస్తున్నారు కొందరు. కానీ, వాటి క్వాలిటీపై నమ్మకం లేక చాలామంది దూరంగా ఉంటూ వస్తున్నారు. మాస్క్ మస్ట్.. ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందే వేరియెంట్. గాలి ద్వారా శరవేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేప్పుడు, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో, పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్లేస్‌లకు వెళ్లినప్పుడు మాస్క్‌లు(మూడు పొరలున్న ఎలాంటి మాస్క్‌లైనా సరే వాడడం మరీ మంచిది) ధరించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: క్రిప్టోకరెన్సీలపై ఫైనల్ వర్డ్ ఇదే: ఆర్బీఐ -
కరోనా సోకితే.. మాస్క్ చెప్పేస్తుంది!
కరోనా సోకినా చాలా మందిలో పెద్దగా లక్షణాలు కనిపించవు. వారు టెస్టులకు వెళ్లరు, కరోనా ఉన్నట్టు వారికే తెలియదు. కానీ అలాంటి వారి నుంచి ఇతరులకు వైరస్ సోకుతుంది. మరి ప్రత్యేకంగా టెస్టులేమీ అవసరం లేకుండా.. మనం పెట్టుకున్న మాస్కే కరోనా ఉందో లేదో గుర్తించగలిగితే చాలా మేలు కదా.. అలాంటి మాస్కులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ మాస్కులేమిటి? కరోనాను ఎలా గుర్తిస్తాయి? వంటి వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ సులువుగా పరీక్షించేందుకు.. కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో.. దానిని సులువుగా గుర్తించడంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త యసుహిరో సుకమొటో నేతృత్వంలోని బృందం ప్రత్యేక మాస్కులపై దృష్టిపెట్టింది. ఆస్ట్రిచ్ పక్షులు కరోనా వైరస్‌ను బలంగా ఎదుర్కొంటున్నాయని ఇటీవల గుర్తించిన నేపథ్యంలో.. దీనిని తమ పరిశోధనకు ఆధారంగా తీసుకుంది. ఆస్ట్రిచ్ పక్షి ‘యాంటీబాడీ’లను ఉపయోగించి.. కరోనాను గుర్తించగల మాస్కులను అభివృద్ధి చేసింది. యూవీ లైట్లో మెరుస్తూ.. సుకమొటో బృందం ఆస్ట్రిచ్ పక్షుల గుడ్లను తీసుకుని, వాటిల్లోకి బలహీనపర్చిన కరోనా వైరస్‌ను ఇంజెక్ట్ చేసింది. అందులో ఏర్పడిన యాంటీబాడీలను సేకరించింది. ఒక సన్నని ఫిల్టర్ (మాస్కు వంటి ఒక పొర)పై ఆ యాంటీబాడీలను స్ప్రే చేసి.. సాధారణ మాస్కులో అమర్చింది. కొందరు కరోనా రోగులకు ఈ మాస్కులు ఇచ్చి.. కొద్ది గంటల పాటు ధరించాలని సూచించింది. ►రోగులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, శ్వాసించినప్పుడు విడుదలయ్యే కరోనా వైరస్.. ఈ మాస్కుల్లోని ఫిల్టర్పైకి చేరింది. ఆ ఫిల్టర్‌పై ఉన్న ఆస్ట్రిచ్ యాంటీబాడీలు కరోనా వైరస్‌ను గుర్తించి అతుక్కుపోయాయి. ►శాస్త్రవేత్తలు కొద్దిగంటల తర్వాత రోగుల నుంచి ఆ మాస్కులను సేకరించారు. వాటిలోని ఫిల్టర్లపై.. యాంటీజెన్లకు అంటుకునే ఫ్లోరోసెంట్ డై (కాంతి పడితే మెరిసే పదార్థం)ను స్ప్రే చేశారు. తర్వాత ఆ మాస్కులపై అల్ట్రా వయోలెట్ (యూవీ) కాంతిని ప్రసరింపజేస్తే.. కరోనా వైరస్ ఉన్న ప్రాంతాలన్నీ మెరుస్తూ కనిపించాయి. ఏడాదిలో అందుబాటులోకి.. ఈ మాస్కులను మరింతగా అభివృద్ధి చేస్తున్నామని.. స్ప్రే అవసరం లేకుండానే, కేవలం సెల్‌ఫోన్ లైట్ ఆధారంగా మెరిసేలా మార్చుతున్నామని పరిశోధనకు నే తృత్వం వహించిన సుకమొటో తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కడైనా కరోనా నిర్ధారణ పరీక్ష చేయడానికి ఈ మాస్కులు వీలు కల్పిస్తాయని.. ఈ విధానంలో కచ్చితత్వం కూడా ఎక్కువని వెల్లడించారు. త్వరలోనే వీటిని జపాన్‌లో ప్రవేశపెడతామని, ఏడాదికల్లా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని వివరించారు. అయితే దీని ధర ఎంత ఉంటుందన్నది వెల్లడించలేదు. ఆస్ట్రిచ్ ‘యాంటీబాడీ’ల స్పెషాలిటీ ఏంటి? భూమ్మీద ప్రస్తుతం జీవించి ఉన్న పక్షి జాతుల్లో అతి పురాతనమైనవి ఆస్ట్రిచ్‌లు. ఈ క్రమంలోనే వాటిలో అత్యంత సమర్థవంతమైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆడ ఆస్ట్రిచ్ పక్షులకు ఈ సామర్థ్యం మరింత ఎక్కువ. భారీ సంఖ్యలో వైరస్లు, బ్యాక్టీరియాలకు అత్యంత వేగంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. దీనిపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఆస్ట్రిచ్‌ల యాంటీబాడీలను ఉపయోగించి.. వివిధ రోగాలకు వ్యాక్సిన్లు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఇదేమి చోద్యం? మూతికి ఉండాల్సిన మాస్క్ నంబర్ ప్లేటుకు ..
MAN Using Face Mask On Number Plate: కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోనేలేదు.. ఇంతలోనే కొంతమంది వాహనదారులకు మరో వైరస్ సోకింది.. మూతికి ఉండాల్సిన మాస్కు బండి నంబర్ ప్లేటుకు చేరింది.. తలకు ఉండాల్సిన హెల్మెట్ హ్యాండిల్‌కు షిఫ్ట్ అయ్యింది. దీంతో చేతిలో ఉన్న కెమెరాతో వాహనదారుల నంబర్ ప్లేట్స్‌పై క్లిక్మనిచే ట్రాఫిక్ పోలీసులకు తల నొప్పి మొదలైంది. ఇలా ఒకరో ఇద్దరో కాదు వందల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు రయ్యిమంటూ దుసుకుపోతున్నా ఏం చేయలేని దుస్థితి పోలీసులది.. గురువారం అత్తాపూర్‌లో కనిపించింది ఈ దృశ్యం.. చదవండి: ఆఫీసుకు హాయ్.. ఇంటికి బైబై.. కారణం ఇదే! -
ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారో పార్లర్‌కి వెళ్లాల్సిన పనేలేదు!
మీ వయసు కంటే పదేళ్ల పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? పని ఒత్తిడి, కాలుష్యం కారణమేదైనా.. చర్మంపై ముడతలు, మచ్చలు, నల్లని వలయాలు, మృతకణాలు ఏర్పడి చర్మాన్ని జీవం కోల్పోయేలా చేస్తుంది. ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ఫేస్ ఫ్యాక్ ద్వారా మీ చర్మానికి తిరిగి జీవం పోయొచ్చంటున్నారు బ్యూటీషియన్లు. మందారం, ఉసిరిలతో ఫేస్ ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో, ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. కావల్సిన పదార్ధాలు ►1 మందారం పువ్వు లేదా 2 టేబుల్ స్పూన్ల మందారం పువ్వు పొడి ►1 టేబుల్ స్పూన్ తేనె ►2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి లేదా 1 మీడియం సైజు ఉసిరి కాయ తయారీ ఇలా ►మందారం పువ్వు పొడి లేనట్లయితే ఒక మందారం పువ్వును ఒక రాత్రంతా నానబెట్టి మెత్తగా గ్రేండ్ చెయ్యాలి. ►అలాగే ఉసిరి పొడి అందుబాటులో లేకపోతే మీడియం సైజు ఉసిరి కాయను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ►వీటికి తేనె జోడించి అన్నింటినీ బాగా కలుపుకుంటే ఫేస్ ప్యాక్ రెడీ. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! ఎలా అప్లై చేయాలంటే.. 5-7 నిముషాలు ముఖానికి ఆవిరిపట్టించాలి. ఇలా చేయడం ద్వారా చర్మ గ్రంధులన్నీ తెరచుకుంటాయి. ఫలితంగా ఫేస్ ప్యాక్‌లో ఉన్న అన్ని పధార్థాలు చర్మంలోకి చొచ్చుకుని పోయి రెట్టింపు ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖం అంతటా ఫ్యాక్‌లా వేసుకుని 20 నిముషాల పాటు ఉంచుకుని, చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇవీ ప్రయోజనాలు.. వారానికి కనీసం ఒక్కసారైనా ఈ ఫేస్ ప్యాక్ వాడితే, దీనిలోని విటమిన్ సి, చర్మానికి న్యాచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేసి, తడిగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడి, చర్మం మెరిసేలా చేస్తుంది. అలాగే మందారం పువ్వు చర్మంలోని మృతకణాలను, మురికిని తొలగించి కాంతివంతం చేస్తుంది. నల్లని వలయాలను, ముడతలను కూడా నివారిస్తుంది. చదవండి: Health Tips: గుడ్డు, బీట్రూట్, ఉసిరి, పాలకూర.. వీటితో ఐరన్ లోపాన్ని తరిమేద్దాం..! -
Skin Care: ముడతలు, మచ్చలు, మృతకణాల నివారణకు అరటి తొక్క ఫేస్ మాస్క్..
అరటిపండు తిని తొక్కపడేస్తున్నారా? అరటి తొక్కతో మీ చర్మం మెరిసేలా చేయొచ్చని తెలుసా? అవునండి! దీనిలో చర్మానికి మేలు చేసే పోషకాలు, పైటోనూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పబ్మెడ్ సెంట్రల్ ప్రచురించిన నివేదికలో అరటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయని, ఇవి సూర్యరశ్మివల్ల దెబ్బతిన్న చర్మానికి, ప్రీరాడికల్స్ నుంచి రక్షించి చికిత్సనందిస్తుందని వెల్లడించింది. పొడి చర్మానికి కూడా ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇక అరటితోలుతో ఏ విధంగా చర్మాన్ని కాపాడుకోవచ్చో తెలుసుకుందామా.. అరటి తోలుతో మసాజ్ ముఖాన్ని నీటితో శుభ్రపరిచి టవల్‌తో తుడుచుకోవాలి. తర్వాత అరటి తొన లోపలిభాగంతో ముఖచర్మంపై 10 నిముషాలపాటు మర్దన చేయాలి. మరోపది నిముషాలు ఆరనివ్వాలి. చివరిగా చల్లని నీటితో కడిగెయ్యాలి. ఇలా చేయడం ద్వారా చర్మంపై వాపు, ముడతలు తొలగి ముఖం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. అరటి తోలు ఫేస్ మాస్క్ అరటి తొక్కల్లో రెండు అరటి ముక్కలను కూడా వేసి పేస్టులా అయ్యేంతవరకూ మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, పెరుగు కలపాలి. అవసరమైతే రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని ముఖానికి అప్లై చెయ్యాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. అరటిలోని బి6,బి12 విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ అనేక చర్మసమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అరటి తోలు ఫేస్ స్క్రబ్బర్ అరటి తోలును చిన్న ముక్కలుగా కట్‌చేసి, టేబుల్‌స్పూన్ చొప్పున పసుపు, చక్కెర, తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి 15-20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ స్క్రబ్బర్‌ను వారానికి ఒకసారైనా వాడితే చర్మంపై మృతకణాలను తొలగించి చర్మం కాంతులీనేలా చేస్తుంది. అరటి తోలు ప్యాచెస్ అరటి తొక్కను రెండు ముక్కలుగా కట్‌చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. పది నిముషాల తర్వాత బయటికి తీసి వీటిని రెండు కళ్ల మీద 15-20 నిముషాలుంచి కడిగేసుకోవాలి. ఈ ప్రక్రియ కంటి కింద నల్లని వలయాలు, ముడతలు రాకుండా నివారిస్తుంది. చదవండి: Vajrasana Benefits: మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి, ఎసిడిటీ నివారణకు.. యోగా మంత్రమిదే! -
ఆంధ్రప్రదేశ్‌లో నిలకడగా ‘కరోనా’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గణాంకాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కేరళలో ఇప్పటికే థర్డ్‌వేవ్ మొదలైనట్టు సంకేతాలొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా అదుపులోనే ఉన్నట్టు కేసుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనం సమూహాలుగా చేరుతుండటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం అనే మూడు అంశాలపైనే కరోనా నియంత్రణ ఆధారపడి ఉంటుందంటున్నారు. ఓ వైపు కరోనా నియంత్రణకు ప్రభుత్వం శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది. రిస్కు గ్రూపులుగా చెప్పుకునే ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు, 45 ఏళ్ల వయసు దాటిన వారు, గర్భిణులకు టీకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు కోట్ల డోసులు వేసిన 10 రాష్ట్రాల్లో ఏపీ చేరింది. ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్‌ను నిలువరించేందుకు జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మాస్కుల్లేకుండా బయటకొస్తే రూ.100 జరిమానా, మాస్కుల్లేని వారిని లోపలకు అనుమతించే వాణిజ్య, వ్యాపార సముదాయాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ జరిమానా విధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. -
మాస్క్ మినహాయింపుల్లేవ్.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
VIRAL VIDEO: ‘వేర్ ఏ మాస్క్-సేవ్ ఏ లైఫ్’.. కరోనా టైం మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న నినాదం ఇది. దశల వారీగా, వేరియెంట్లతో మానవాళిపై వైరస్ విరుచుకుపడుతున్నా.. మాస్క్‌లు వీడొద్దంటూ వైద్య నిపుణులు మొత్తుకుంటున్నారు. కరోనా వచ్చి తగ్గినా.. వ్యాక్సినేషన్ నడుస్తున్నా.. పూర్తిస్థాయి రక్షణ కోసం మాస్క్.. వీలైతే డబుల్ మాస్కులు ధరించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆంక్షల సడలింపుతో చాలామంది ముఖానికి మాస్క్‌లు ధరించడం లేదు. ధరించినా కొందరు అసంపూర్తిగా పెట్టుకుంటున్నారు. రద్దీ మార్కెట్లు, ప్రయాణాల్లో, ఆఫీసుల్లో.. చాలామందిలో ఈ నిర్లక్క్ష్యం పెరిగిపోయింది. అడిగితే దురుసు-నిర్లక్క్ష్యపు సమాధానాలు వినిపిస్తున్నాయి. పైగా థర్డ్ వేవ్ ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నా.. చాలామందిలో ఈ ధోరణి మారడం లేదు. ఈ తరుణంలో ఓ పాత వీడియోను తెరపైకి తెచ్చారు కొందరు. పైగా సందర్భానికి తగ్గ వీడియో కావడంతో చాలామంది వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా మళ్లీ వైరల్ చేస్తున్నారు. వైకల్యం ఉన్నా తమనే మాస్క్ ధరించడం నుంచి మినహాయింపు ఇవ్వకండని, తామే మాస్క్‌లు ధరించినప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నవాళ్లూ ధరించడం తప్పనిసరని గుర్తు చేసే ఆ వీడియో కిందటి ఏడాది ఫస్ట్ వేవ్ తర్వాత బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను మేరీల్యాండ్ యూనివర్సిటీ డాక్టర్ ఫహీమ్ యూనస్ ట్విటర్ అకౌంట్ నుంచి కిందటి ఏడాది సెప్టెంబర్ 16న పోస్ట్ అయ్యింది. కావాలంటే మరోసారి మీరూ చూసేయండి. బాధ్యతను గుర్తు చేసుకుని దయచేసి సక్రమంగా మాస్క్‌లు ధరించండి. -
మాస్క్ మినహాయింపుల్లేవ్.. ఒక్కసారి ఈ వీడియో చూడండి