
వాషింగ్టన్ : ఫేస్ మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టన్స్..కరోనాకు ముందు పెద్దగా పరిచయం లేని పేర్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికా నుంచి అమలాపురం దాకా పట్టణాల నుంచి పల్లెల దాకా ఇప్పుడు అందరికీ సుపరిచతం అయ్యాయి. వీటి వాడకం కూడా బాగా పెరిగింది. దాదాపుగా అన్ని కరోనా ప్రభావిత దేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వైరస్ వ్యాప్తిని నియంత్రంచడంలో ఫేస్ మాస్క్ చాలా ముఖ్యమైందంటూ తాజాగా అమెరికా పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఒకవేళ ఈ నిబంధన లేకపోతే కరోనా కేసులు మరిన్ని పెరిగేవని తెలిపింది. స్టే ఎట్ హోమ్, సోషల్ డిస్టన్స్ కంటే ఫేస్ మాస్క్ ద్వారా వైరస్‌ను ఇతరులకు సోకకుండా రక్షిస్తుందని ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీలో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడైంది. (మరోసారి లాక్‌డౌన్ దిశగా చైనా..! )
ఫేస్ మాస్క్ తప్పనిసరి చేస్తూ ఏప్రిల్ 6 న ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని పరిశోధనలో తేలింది. ఏప్రిల్ 17న న్యూయార్క్‌లోనూ ఫేస్ మాస్క్ తప్పనిసరి చేయడం ద్వారా 66,000 వేల కేసులు తగ్గినట్లు పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ నిబంధన ద్వారా న్యూయార్క్‌లో ఇన్ఫెక్షన్ల రేటు రోజుకు సుమారు 3 శాతం తగ్గినట్టు తెలిపారు. కరోనా వల్ల అత్యధిక మరణాలు చోటుచేసుకున్న ఇటలీలోనూ పేస్ మాస్క్ కారణంగా 78,000 వేల కరోనా కేసులు తగ్గాయని వివరించారు.
ఇటలీ,న్యూయార్క్ నగరాల్లో ఫేస్ మాస్క్ నిబంధనల కంటే ముందు క్వారంటైన్, సోషల్ డిస్టన్స్ లాంటివి అమల్లో ఉన్నాయని అవి డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కేసులు పెరగకుండా మాత్రమే ఇవి నియంత్రంచగలిగాయని పరిశోధకులు వెల్లడించారు. అయితే గాల్లో కొన్ని గంటల పాటు నిలిచి ఉండే వైరస్ కణాలతో ఇతరులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున ఫేస్ మాస్క్ దీని నుంచి రక్షిస్తుందని పేర్కొంది. (అమెరికాలో సిక్కు యువతి అరుదైన ఘనత )
Comments
Please login to add a commentAdd a comment