
సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. 70 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇంత యాక్టీవ్‌గా ఉన్నాడంటే దానికి ఒకే ఒక్క కారణం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. కరోనా లాక్‌డౌన్‌లో కూడా ఆయన వ్యాయామం చేయడం ఆపలేదు. తనని తాను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మార్నింగ్ వాక్ చేస్తున్నారు రజనీకాంత్. చెన్నైలోని పోయెస్ గార్డెన్ వీధుల్లో వాకింగ్ చేస్తూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ ఫోటోలో ఆయన బూడిద రంగు టీ-షర్టు, బ్లాక్ జాగర్స్, వైట్ ఫేస్ మాస్క్ , బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ధరించి ఉన్నాడు. లాక్‌డౌన్ సమయంలో జనాలంతా ఇళ్లలో ఉంటే రజనీ మాత్రం చాలా యాక్టీవ్‌గా వీధుల్లో మార్నింగ్ వాకింగ్ వెళ్లడం అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం రజనీ మార్నింగ్ వాక్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా, ఈ నెల 17న సూపర్‌స్టార్ రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ .50 లక్షల చెక్కును అందజేశారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వంతో సహకరించాలని ఆయన కోరారు.
అన్నాత్తే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రజినీకాంత్ ఇటీవల చెన్నైకి వెళ్లిన సంగతి తెలిసిందే. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4 న దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.
Live. Love. Run. ♥️
— Rajinikanth Fans (@RajiniFC) May 20, 2021
Here is the latest click of Superstar #Rajinikanth during his morning walk! Stay safe & healthy, folks!#Annaatthe pic.twitter.com/89VnubkSsU
Comments
Please login to add a commentAdd a comment