morning walk
-
ఇలాంటి మేకవన్నె పులి మీకు తగిలిందా? మహిళలూ తస్మాత్ జాగ్రత్త!
బెంగళూరు మహానగరంలో చోటుచేసుకున్న భయానక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వాకింగ్ వెళ్లిన మహిళను వేధింపులకు గురిచేశాడో ప్రబుద్ధుడు. తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన ఈ ఘటనసీసీటీవీ కెమెరాలో రికార్డయింది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్త మవుతోంది.బెంగళూరుకు చెందిన మహిళ కోననకుంటె ప్రాంతంలో ఒంటరిగా మార్నింగ్ వాక్కు బయలుదేరింది. మరికొద్దిసేపట్లో రానున్న తన స్నేహితురాలికోసం వెయిట్ చేస్తోంది. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చాడో తెల్లని చొక్కాలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై ఎటాక్ చేశాడు. వెనుక నుంచి ఆమెను వాటేసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విస్తుపోయిన బాధితురాలు తనను తాను విడిపించుకోవడానికి పెనుగులాడింది. ఎలాగో వదిలించుకునే వెళ్లిపోతోంటే మళ్లీ దొరకపుచ్చుకున్నాడు. గట్టిగా నోరుమూయాలని ప్రయత్నించాడు. కానీ ఆమె గట్ టిగట్టిగా అరవడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో ఆమెకు పెద్ద ముప్పు తప్పి నట్టయింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో ‘@peepoye’ అనే పేరుతో ఉన్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయ్యింది. బాధిత మహిళ రాజస్థానీ అని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న బెంగళూరు సౌత్ పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.🤢 A shocking incident in #Bengaluru’s Konanakunte area: A Rajasthani woman, ready for her 5 am walk and waiting for a friend, was groped by a man who crept up on her.She tried to flee, but he sped up, and covered her mouth, attempting to sexually assault her. With such men,… pic.twitter.com/v4P0eLl1lf— Akassh Ashok Gupta (@peepoye_) August 5, 2024 కాగా ఈ ఘటనపై నెటిజన్లు ముఖ్యంగా మహిళలు స్పందించారు.ఇలాంటి మేక వన్నె పులులు చాలామంది పొంచి ఉంటారంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాలవాడి నుంచి మొదలు, టీచర్లు, సొంతబంధువులు కూడా సమయం చూసి ఇలాంటి వేధింపులకు పాల్పడుతూ ఉంటారంటూ తన అనుభవాలను షేర్ చేసు కున్నారు. గట్టిగా అరవడం, తిరిగి ఎటాక్ చేయడం లాంటివి చేయాలని సూచించారు. అంతేకాదు కుటుంబం సభ్యుల సహకారంతో ఇలాంటి దుర్మార్గులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తద్వారా మరోమహిళ ఇలాంటి వేధింపులకు గురి కాకుండా చూడాలని వ్యాఖ్యానించారు. -
మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం
హైదరాబాద్: మార్నింగ్ వాక్కు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జి.రాజేశ్వరి, రవికుమార్ దంపతులు తమ కుమారుడు లోకేషకుమార్‌తో కలిసి మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 30న రాజేశ్వరి మార్నింగ్‌వాక్‌కు వెళుతున్నట్లు చెప్పి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. మధ్యాహ్నం లోకేష్ అత్తగారికి ఫోన్ చేసి తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, తాను చనిపోనని, ఇంటికి మాత్రం రానని చెప్పింది. ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో లోకేష్ ఆదివారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాకింగ్ చేస్తూ.. గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మదలంగి సురేష్ (50) వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు..ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన సురేష్ 2000 సంవత్సరం బ్యాచ్ కానిస్టేబుల్. నగరంలోని సంతో‹Ùనగర్ ఈస్ట్‌మారుతినగర్‌లో ఉంటున్నారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు వాకింగ్ చేస్తున్న సురేష్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. తోటి వాకర్స్ వెంటనే కంచన్‌బాగ్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. కోవిడ్ నుంచి ఆయన రెండుసార్లు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న సౌత్ఈస్ట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, మలక్‌పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగం చంద్రశేఖర్ ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. -
కారు కింద పడి.. 3 కి.మీ. ఈడ్చుకెళ్లి
బుదాన్ (యూపీ): దేశ రాజధాని ఢిల్లీలో కారు కింద పడ్డ యువతిని ఈడ్చుకొని కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తరహా ఘటనలు తరచూ జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఒక యువకుడి నిండు ప్రాణాలు ఇలాగే బలయ్యాయి. యూపీ పోలీసులు అందించిన వివరాల ప్రకారం సిరసోలా గ్రామానికి చెందిన 22 ఏళ్ల వయసున్న ఉమేష్ కుమార్ శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్కు బయల్దేరగా వెనుక నుంచి వచ్చిన కారు అతనిని ఢీకొట్టింది. కారు బోనెట్‌పైకి ఎగిరి మళ్లీ కిందపడిన కుమార్ ముందువైపునున్న ఎడమ చక్రంలో ఇరుక్కుపోయారు. అయినా కూడా కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా 3 కి.మీ. ప్రయాణించాడు. దీనిని చూసిన స్థానికులు ఆ కారుని వెంబడించి అతనిని పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు డ్రైవర్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
ట్రాఫిక్ ఏసీపీ మార్నింగ్ వాక్! మండిపోయిన జనం ఏం చేశారంటే..
కొచ్చి: అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించాలనుకుంటే.. సోషల్ మీడియా ఊరుకోవట్లేదు. సామాజిక మాధ్యమాల సాయంతో జనాలు ఆ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం వెనువెంటనే జరిగిపోతున్నాయి. తాజాగా కేరళలో ఓ ట్రాఫిక్ పోలీస్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. మార్నింగ్ వాక్ కోసం ఏకంగా ఓ రోడ్డునే బ్లాక్ చేయించాడు ట్రాఫిక్ విభాగంలోని ఉన్నతాధికారి. కొచ్చి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ (వెస్ట్) వినోద్ పిళ్లై.. క్వీన్స్‌వాక్‌వేలోని రోడ్డును మూయించేసి మరీ మార్నింగ్ వాక్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో నిరసనలు మొదలయ్యాయి. వాస్తవానికి ఆ రోడ్డు ఆదివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య పిల్లల సైక్లింగ్, స్కేటింగ్ కోసం మూసేయాలి. అయితే మిగతా రోజుల్లోనూ ఉదయం పూట ఆ రోడ్డును మూయించి.. మార్నింగ్ వాక్ చేయడం మొదలుపెట్టాడు ట్రాఫిక్ ఏసీపీ వినోద్ పిళ్లై. అంతేకాదు ఆయన వాకింగ్ చేస్తున్నంత సేపు సిబ్బంది ట్రాఫిక్ డైవర్షన్ బాధ్యతలు చూసుకునేవాళ్లు. ఈయన దెబ్బకు పిల్లల్ని స్కూల్ బస్సులు ఎక్కించడానికి.. రోడ్డుకు మరోవైపు దాదాపు అర కిలోమీటర్ దూరం దాకా వెళ్లాల్సి వచ్చింది పేరెంట్స్. మూడు రోజుల పాటు ఈ సమస్యను ఎదుర్కొన్న స్థానికులు.. చిర్రెత్తుకొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులతో నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో విషయం పైఅధికారుల దృష్టికి చేరింది. దీంతో వినోద్ పిళ్లైకి షో కాజ్ నోటీసు జారీ చేసింది పోలీస్ శాఖ. ఇదిలా ఉంటే.. కుక్క ఈవెనింగ్ వాక్ కోసమని కోసమని స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఘటనపై.. ఢిల్లీలో ఓ ఐఏఎస్ కపుల్‌ను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసింది కేంద్రం. చదవండి: ట్రెండింగ్‌లో ‘కుక్క’! కారణం ఏంటంటే.. -
ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!
ఆరోగ్యంగా, చురుగ్గా... యవ్వనంగా కనిపించాలంటే బరువు సమానంగా ఉండాలి. అధిక బరువు వల్ల వయసు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తారు. అలా కాకుండా ఉండాలంటే బరువును అదుపులో పెట్టుకోవడం అవసరం. బరువు తగ్గాలంటే ఆహారంపై అదుపుతోబాటు కొంత శారీరక వ్యాయామం అవసరం. బరువు తగ్గాల్సిన ప్రక్రియలో లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాలకు తగిన పని... ఈ అన్ని కార్యక్రమాలు సమన్వయంతో జరిగినప్పుడే కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఇలా కొవ్వును తగ్గించే వ్యాయామాల్నే ఏరోబిక్స్ అంటారు. వీటిలో సైక్లింగ్, జాగింగ్ సులువైనవి. ఇప్పుడు జాగింగ్ గురించి చెప్పుకుందాం. ప్రతి రోజూ ఉదయం జాగింగ్ చేయడం చాలా మందికి అలవాటు. శరీరం ఒత్తిడికి గురి కాకుండా, ఈ వ్యాయామం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేమిటో చూద్దాం... జాగింగ్ చేయడానికి జిమ్‌లో లాగా కష్టపడాల్సిన అవసరం లేదు. జాగింగ్ వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అదే విధంగా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా మెరుగుపడుతాయి. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్‌గా జాగింగ్ చేసే వారిలో ఆయుష్షు పెరుగుతుందని కనుగొన్నారు. శారీరకంగా ఫిట్‌గా, క్యాలరీలను కరిగించుకుని బాడీ ఫ్రెష్‌గా కనబడేందుకు దోహదం చేసే వాటిలో జాగింగ్ మెరుగైనది. ఇది గుండె కండరాలను బలోపేతం చేసి గుండె మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. బ్లడ్‌గ్లూకోజ్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది. జాగింగ్ చేసే సమయంలో శరీరం నుంచి ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ గ్రూప్ హార్మోన్లు మానసిక ప్రశాంతకు సహాయపడుతాయి. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ సహజంగానే మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. ఈ ఒక్క కారణం వల్ల శరీరం ఫ్రెష్‌గా ఉంటుంది. ముఖ్యంగా ముఖం తేటగా కనిపిస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు.. ►జాగింగ్ వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరం ఉత్సాహంగా, కదలికలు కలిగి ఉండటం వల్ల కండరాలు కరిగి, బాడీ షేప్ మారి చూడటానికి అందంగా మారుతారు. ►బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జాగింగ్ వల్ల శ్వాసవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ►ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే కనుక జాగింగ్ మంచి మార్గం. ►జాగింగ్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా వ్యాధులతో, ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తి అధికంగా ఉండి శారీరక శక్తిని పెంచుతుంది. ►తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో స్ట్రెస్, డిప్రెషన్, అలసట తగ్గుతాయి. ►కండరాల శక్తిని మెరుగు పరుస్తుంది. వెన్నెముక, తొడల భాగాన్ని దృఢంగా మార్చుతుంది. ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది. మానసిక, శారీర ఆరోగ్యాలన్నింటికి చాలా మేలు చేస్తుంది. జాగింగ్ వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. పాజిటివ్ శక్తి వస్తుంది. ►చర్మానికి రక్తప్రసరణతో పాటు, ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో నిత్యం యవ్వనంగా కనబడుతారు. అయితే కేవలం జాగింగ్ ఒక్కటే చేస్తే సరిపోదు. ఆహారంపై అదుపు కూడా ఉండాలి. అప్పుడే పైన చెప్పుకున్న అన్ని ప్రయోజనాలూ శరీరానికి సమకూరతాయి. చదవండి: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. -
చెన్నై వీధుల్లో రజనీకాంత్ .. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. 70 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇంత యాక్టీవ్‌గా ఉన్నాడంటే దానికి ఒకే ఒక్క కారణం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. కరోనా లాక్డౌన్లో కూడా ఆయన వ్యాయామం చేయడం ఆపలేదు. తనని తాను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మార్నింగ్ వాక్ చేస్తున్నారు రజనీకాంత్. చెన్నైలోని పోయెస్ గార్డెన్ వీధుల్లో వాకింగ్ చేస్తూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో ఆయన బూడిద రంగు టీ-షర్టు, బ్లాక్ జాగర్స్, వైట్ ఫేస్ మాస్క్ , బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ధరించి ఉన్నాడు. లాక్డౌన్ సమయంలో జనాలంతా ఇళ్లలో ఉంటే రజనీ మాత్రం చాలా యాక్టీవ్‌గా వీధుల్లో మార్నింగ్ వాకింగ్ వెళ్లడం అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం రజనీ మార్నింగ్ వాక్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఈ నెల 17న సూపర్‌స్టార్ రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ .50 లక్షల చెక్కును అందజేశారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వంతో సహకరించాలని ఆయన కోరారు. అన్నాత్తే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రజినీకాంత్ ఇటీవల చెన్నైకి వెళ్లిన సంగతి తెలిసిందే. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4 న దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. Live. Love. Run. ♥️ Here is the latest click of Superstar #Rajinikanth during his morning walk! Stay safe & healthy, folks!#Annaatthe pic.twitter.com/89VnubkSsU — Rajinikanth Fans (@RajiniFC) May 20, 2021 -
జర సునో జీ... పెగ్గాలజీ!
పొద్దున్నే శవాన్ని భుజాన వేసుకొని మార్నింగ్‌వాక్‌కు బయలుదేరాడు విక్రమార్కుడు.రోడ్డు మీద ఒక తాగుబోతు సిన్సియర్‌గా ఊగుతూ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నాడు.‘‘తమ్ముడూ, ముందు నువ్వు కంట్రోల్లో ఉండు...’’ అని జాగ్రత్త చెప్పబోయాడు విక్రమార్కుడు.‘‘ఐ డోన్డ్ వాంట్ టు లిజన్ ఎనీ థింగ్ ఫ్రమ్ అదర్స్’’ అన్నాడు ఆ తాగుబోతు.‘‘ఎంత చక్కని ఇంగ్లీషో’’ ముచ్చటపడ్డాడు భుజం మీది బేతాళుడు.‘‘ఇంకాసేపైతే సంస్కృతం కూడా మాట్లాడతాడు. ఎందుకొచ్చిన లొల్లి...ఇక్కడి నుంచి వెళ్దాం’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘రాజా! మనదేశంలో నీటి కొరత ఉందిగానీ, మందు కొరతలేదు....మారుమూల కుగ్రామమునకు వెళ్లినా ముందు మందు ఎదురొస్తుంది..’’ నిట్టూర్చాడు భేతాళుడు.‘‘లెస్సపలికావు’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘రాజా! నీకు పెగ్గాలజీ అనే గ్రంథం గురించి తెలుసునా? తెల్సినా చెప్పకపోయావో...’’ వార్నింగ్ ఇచ్చాడు భేతాళుడు.‘‘నాకు తెలుసు’’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు భేతాళుడు. లాంగ్....లాంగ్ ఎగో ఛీట.జీnజు (డా. ఇంక్) అనే శాస్త్రవేత్త ఉండేవాడు. ఎప్పుడూ ఏవో ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి రకరకాల పండ్ల రసాలు, తొక్కలు, తోటకూరతో ఏదో ద్రావకాన్ని తయారుచేశాడు. డా.ఇంక్గారి మామ పేరు డా.బంక్.‘‘మామగారు....ఓసారి ఇది తాగి మీ ఓపీనియన్ చెప్పండి’’ అని ఒక గ్లాసులో ద్రావకాన్ని అతనికి ఇచ్చాడు.ఇక్కడ మనం డా.బంక్ గురించి చెప్పుకోవాలి. ఈయన పెద్దగా మాట్లాడడు. పెద్దగా నవ్వడు. ‘మౌనమే నా భాష ఓ మనసా’ అన్నట్లుగా ఉంటాడు. గంభీరంగా ఉంటాడు. హుందాగా ఉంటాడు.ఇప్పుడు మళ్లీ సీన్లోకి వద్దాం.గ్లాసులోని ద్రావకాన్ని గటగటా తాగిన డా.బంక్...‘‘అదిరింది అల్లుడు’’ అన్నాడు హుషారుగారు.మరోగ్లాస్ ఇచ్చాడు ఇంక్. సేమ్....గటగటా తాగేశాడు.‘‘అది...రింది....అల్లు....డూ...డూ....డూ’’ అన్నాడు.మామ వాయిస్‌లో మార్పును గ్రహించిన డా.ఇంకో ఇంకో గ్లాస్ ఇచ్చాడు.ఈసారి మరింత మార్పు కనబడింది మామ వాయిస్‌లో...‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్‌స్టార్ నీ ఫేస్ చూస్తే దెయ్యాలు పరార్’ అన్నాడు చిలిపిగా.మరో గ్లాస్ ఇచ్చాడు...ఈసారి చెట్టెక్కికోతిలా నటించడం మొదలుపెట్టాడు....‘సోదరిసోదరుల్లారా...సొప్పబెండల్లారామై నేమ్ ఈజ్ కోతి....నాకు ఉందోయ్ ఒక నీతి’మామగారి వింత చేష్టలు చూసి ‘యురేఖా’ అని ఆనందంగా అరిచాడు డా.ఇంక్.‘ఏది కొడితేమైండ్ బ్లాకయిద్దో...అదే మందు...అదే ఇది’ అన్నాడు.అనతికాలంలోనే ఛీట.జీnజు తయారుచేసిన కొత్త ద్రావకం దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందింది.‘‘మీరు తయారుచేసిన ద్రావకానికి ఏదో ఒక పేరు పెడితే బాగుంటుంది’’ అన్నాడు అసిస్టెంట్.‘‘ఏ పేరో ఎందుకు నా పేరే పెట్టుకుంటాను. నన్ను అందరూ ఛీట.జీnజు అని పిలుస్తారు. మధ్యలో చుక్క తీసేస్తే ఛీటజీnజు అవుతుంది. ఇక ఇప్పటి నుంచినేను తయారుచేసిన ద్రావకం పేరు డ్రింక్’’ అని ప్రకటించాడు.డ్రింక్ చేసేవారి గురించి రాసిందే ‘పెగ్గాలజీ’ గ్రంథం. దీనిలో కొన్ని విశేషాలు ఇప్పుడు చెబుతాను. సంవత్సరం సంవత్సరం చరిత్రమారినట్టు...పెగ్గు పెగ్గుకు మనిషి మారుతాడు. ఎలా అంటే...ఫస్ట్ పెగ్:చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు.‘స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా...’ పాట హైపిచ్‌లో పాడుకుంటారు.రెండో పెగ్: ఇంగ్లిష్ మొదలవుతుంది...దేశాన్ని గురించి తెగ బాధపడుతుంటారు...‘కంట్రీ. కంట్రీ మీన్స్ నాట్ స్టోన్స్. కంట్రీ మీన్స్ హ్యుమన్ బీయింగ్స్. డెమోక్రసీ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. వేరే ది సిటిజన్స్ఎక్సర్సైజ్పవర్ బై డెమోక్రసీ!బట్ వేర్ ఈజ్ డెమోక్రసీ?నో....నో...ఇటీజ్ రాంగ్ డెసీషన్.వేర్ రైట్ ఈజ్ రైట్...బట్ నథింగ్ ఈజ్ రాంగ్...ఐ సే ఎవ్రీ టైమ్...’మూడో పెగ్:హిందీ పాట మొదలవుతుంది...‘మేరి మేరి మెహబూబాతేరి తేరి ఆంకో మే డూబా!న కర్ మేరే దిల్ కే టు తూ తుక్డే...తుక్టే...తుక్టే...నాలుగో పెగ్:తగాదాకు వేళాయెరా!‘‘రేయ్ అప్పాల్రాజు...ఏది ఏమైనా నిన్ను నేను ఆరోజు వెధవ అని తిట్టి ఉండాల్సింది కాదు’‘సరేలే...ఇప్పుడా విషయం ఎందుకు?’’‘ఎందుకంటావేంరా! ఉత్త వెధవ అని కూడా కాదు దొంగ వెధవ అని తిట్టాను. ఐయామ్ రియల్లీ సారీ రా’‘సరేలే జరిగిందేదో జరిగింది...’‘ఎలా జరుగుతుందిరా? నోరు అన్నాక అదుపులో పెట్టుకోవాలి. తింటున్నది గడ్డి కాదు అన్నమే కదా...’‘నీ వాలకం చూస్తుంటే నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడుతావేం?’‘తప్పా తప్పున్నారా!’‘వెధవ అని తిట్టింది నువ్వు. నాది తప్పంటావేంటీ!?’‘వెధవా అని తిట్టినప్పుడు...అరే సుబ్బిగా అలా పరుషపదజాలం ఉపయోగించకూడదురా అని నువ్వు మాట్లాడి ఉంటే నేను మూసుకొని కూర్చునేవాడిని.కానీనువ్వేం చేశావు? వెధవ అని తిట్టినా, దొంగవెధవ అని తిట్టినా, బండ వెధవ అని తిట్టినా...సైలెన్స్‌గా ఉండిపోయావు.ఎదుటోడు నిన్ను ఒక్క తిట్టు తిడితే పదితిట్లు నాన్స్టాప్గాతిట్టమన్నారు పెద్దలు...కానీ...నువ్వేం చేశావు? మౌనంగా ఉండి...నాలోని చెడుని పెంచావు....అందుకే నువ్వు మామూలు వెధవవి కాదు... అక్కుపక్షి వెధవవు. ఎంగిలి విస్తరాకులు ఎత్తుకు పోయి ఇంట్లో భద్రంగా దాచుకునే నీచదరిద్ర నికృష్ట భ్రష్ట వెధవవు...’’‘ఒరేయ్ సుబ్బిగా మాటలు తిన్నగా రానియ్....తిట్లు ఆపకపోతే ఎదురుగా ఆ మురికిగుంట ఉంది చూశావా...అందులో పడేస్తాను. పీడ వదులుతుంది’‘నువ్వు నన్ను పడేసేదేమిట్రా గూట్లే....నేనే పడతాను చూడు....’వామ్మో....చచ్చాన్రో! –అశుభం – యాకుబ్ పాషా -
వాకింగ్‌కు వెళ్లిన బీజేపీ నేత హత్య..!!
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని బర్వానీ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత మనోజ్ థాకరే మృతి చెందారు. ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మనోజ్ గ్రామంలోని రాధా స్వామి భవన్ సమీపంలో విగతజీవిగా కనిపించినట్టు బర్వానీ ఏఎస్పీ చెప్పారు. మృత దేహానికి కొద్ది దూరంలో రక్తపు మరకలతో కూడిన ఒక రాడ్‌ను కనుగొన్నట్టు తెలిపారు. దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. మనోజ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చని వర్ల పోలీస్‌స్టేషన్ ఇన్స్‌చార్జి దినేష్ కుశ్వాహ అనుమానం వ్యక్తం చేశారు. కాగా, రాజకీయ నేతల వరుస హత్యలు మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం మంద్సౌర్ మన్సిపల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ప్రహ్లాద్ బంధ్వార్ను దుండగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ప్రహ్లాద్ హత్య కేసుతో సంబంధాలున్నాయని రాజస్థాన్‌లోని ప్రతాపఘర్లో మనీస్ బైరాగి అనే బీజేపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. -
టీఆర్ఎస్ నాయకుడి దుర్మరణం
సాక్షి, కీసర/మేడ్చల్ : టీఆర్ఎస్ నాయకుడి హఠాన్మరణం కీసర మండలంలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మండల మాజీ వైస్-ఎంపీపీ బి.భరత్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వివరాలు.. మార్నింగ్ వాక్ చేయడానికి బైక్‌పై వెళ్తున్న భరత్‌రెడ్డిని గుర్తు తెలియని లారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన చుట్టుపక్కలవారు ఆయనను జినియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భరత్‌రెడ్డి మృతిచెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాద దృశ్యాలు ఓ సీసీటీవీలో నమోదయ్యాయి. కాగా, భరత్‌రెడ్డి మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
టీఆర్ఎస్ నాయకుడి దుర్మరణం
-
2 గంటలు.. 5 కిలోమీటర్లు..
సిద్దిపేట జోన్: ఉదయం ఆరు గంటల సమయం.. ఇంకా చీకటి తెరలు తొలగిపోలేదు.. అంతలో మూడు వాహనాలు రాజీవ్ రహదారి పక్కన ఉన్న చెట్ల మధ్యకు దూసుకెళ్లాయి. వాహనంలో నుంచి దిగిన నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అక్కడి నుంచి 2 గంటల పాటు 5 కిలోమీటర్ల మేర కాలినడకన ముందుకు సాగారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట పట్టణం నాగులబండ శివారులో ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్క్‌ను పరిశీలించారు. నిధుల అవసరం, మొక్కల పెంపకంపై ఆయన వెంట వెంటనున్న డీఎఫ్‌వో శ్రీధర్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ పార్క్, అర్బన్ పార్క్ పనులపై ఆరా తీశారు. -
స్కూటర్‌పై వెంబడించి.. వేధించి
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్కు వెళ్తొస్తున్న వివాహితపై ఓ కామాందుడు లైంగికదాడికి యత్నించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన న్యూ లింక్ రోడ్డులో గల కాందీవళి ప్రాంతంలో జరిగింది. వివరాలు.. రోజూ మాదిరిగానే మార్నింగ్ వాక్కు వెళ్లిన ఓ మహిళ (33) మలద్ ప్రాంతానికి చేరుకోగానే రామ్రాజ్ పవార్ (33) అనే వ్యక్తి ఆమెను ఫాలో అయ్యాడు. కొంత దూరం వరకు ఆమెను వెనకాలే స్కూటర్‌పై వెంబడించాడు. అనంతరం స్కూటర్‌ను పక్కన పడేసి.. ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె సాయం కోసం గట్టిగా కేకలు వేసింది. వెంటనే స్పందించిన స్థానికులు నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఘటన జరిగినప్పుడు రామ్రాజ్ మత్తులో తూలుతున్నాడనీ, కేసు నమోదు చేసి నిందితున్ని జూడిషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు. -
రిటైర్డ్ టీచర్ మార్నింగ్ వాక్కు వెళ్తుండగా..
కోదాడ(సూర్యాపేట): మార్నింగ్ వాక్ చేయడానికి వెళ్తున్న రిటైర్డ్ మహిళా ఉద్యోగి ప్రమాదవశాత్తూ మృతిచెంచారు. రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న జాముల రాణి(60) ఉపాధ్యాయురాలిగా చేశారు. ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఈ రోజు ఉదయం వాకింగ్ చేయడానికి గ్రౌండ్‌కు వెళ్తుండగా.. 65వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
హిమము.. మనము.. వేకువ దీపము..
మంచు పాడే సుప్రభాతానికి మనం తల మాత్రమే ఆడించం. ఒళ్లంతా ఒణికిస్తాం. చలి కదా. కౌగిలించుకోవడానికి వస్తుంది. మెడలో చేతులు వేస్తుంది. వద్దు.. వద్దు... కాస్త దూరం ఉండు అని దానిని దూరం పెట్టడానికి రగ్గు కప్పుకుంటాం. స్వెటర్ ధరిస్తాం. మఫ్లర్ మెడకు చుట్టుకుంటాం. తలకు ఉన్ని టోపీ ధరిస్తాం. వింటుందా శీతల పవనం? ఇది నా కాలం. నేను వచ్చి వెళ్లే కాలం. మీరు పిలిచినా పిలవకపోయినా సరే మీ ఇళ్లల్లోకి అడుగు పెట్టాల్సిందే అని తెరచిన చీకటిలో నుంచి నెర్రెలిచ్చిన గోడల లోనుంచి పగుళ్లు బారిన పైకప్పుల్లో నుంచి ఇళ్లల్లోకి వచ్చేస్తుంది. అప్పుడిక చేసేదేముంది? కుంపటి దగ్గర కూలబడటమే. నిజానికి చలి చాలా మంచిది. అందరినీ దగ్గర చేస్తుంది. దగ్గర దగ్గరగా కూర్చొ నేలా చేసి వారి మనసుల్లో పరస్పరం వెచ్చని అభిమానం పెంచుతుంది. టీ పొగలను ముఖాన ఊదుతుంది. ఎండ విలువ తెలిసొచ్చేలా చేస్తుంది. ధాన్యాన్ని ఇంటికి తెస్తుంది. విష్ణువుకు ప్రీతికరమైన మార్గశిరాన్ని తెస్తుంది. ధనుర్మాసపు ముగ్గులను ముంగిళ్ల ముందు పరుస్తుంది. గుమ్మడిపూలు, డిసెంబరాలు, మంచులో తడిసిన ముద్దబంతులు... ఇవన్నీ చలికాలపు కానుకలు. వేడి నీళ్ల స్నానమూ వేడి వేడి భోజనమూ చలిమంటా... ఇవన్నీ ఎంత సుఖాన్ని ఇస్తాయో ఇంత చలిలో కూడా భగవంతుడా నీ మీద నా మనసు లగ్నం తప్పదు అని కోనేట మునిగి పవిత్ర స్నానం ఆచరించడం కూడా అంతే సంతృప్తిని ఇస్తాయి. బద్ధకం వల్ల నిద్ర లేవని మగవాళ్లు, స్కూళ్లకు వెళ్లడానికి మారాము చేసే చిన్నవాళ్లు, పొగమంచు పూలకుండీలు, ఆ దూరాన దేవాలయపు గంట మరెక్కడో అజా పిలుపు, ఎక్కడే వేలాడగట్టిన క్రిస్మస్ తార – ఇవన్నీ చలికాలాన కొత్త అనుభూతులు పంచే అనుభవాలు. ఈ కాలంలో మార్నింగ్ వాక్ ఒక గొప్ప ప్రసాదం. మంచుకప్పిన ఒంటరి దారిలో అడుగులేస్తూ నడవడం ఒక ఉల్లాసం. రాత్రి పూట కిటికీలన్ని మూసి దీపాలను మందగింప చేసి రేడియో వింటే అదో పెద్ద మన్చాహే గీత్. అనవసర వేళలో అనవసర కాఫీ తాగడం కూడా ఈ కాలపు వైచిత్రే. పులకించే మనసు ఉండాలే కాని చలికి మించిన నెచ్చెలి ఉండదు కదా! -
నిద్రమత్తుకు నిండు ప్రాణం బలి
– మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొన్న ఐషర్ –అక్కడికక్కడే అతను మృతి డోన్: డ్రై వర్ నిద్రమత్తు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బుధవారం గుత్తి–కర్నూలు హైవేలో డోన్‌పట్టణంలోని కంబాలపాడు క్రాస్ వద్ద మార్నింగ్‌వాకింగ్ చేస్తున్న సీనియర్ ఎల్ఐసీ ఏజెంట్ రామచంద్రారెడ్డి (54)ని సీజీ–07, ఏఎక్స్ 5575 నెంబర్‌గల ఐషర్ వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి వచ్చి ఢీ కొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, లారీ ముందుకు దూసుకెళ్లి గుంతలో పడింది. మార్నింగ్ వాకింగ్ కోసం వచ్చిన పలువురు ఈ ఘటనను చూసి భీతిల్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చూసి రామచంద్రారెడ్డిదిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న స్నేహితులు, ఎల్ఐసీ ఏజెంట్లు, బంధువులు డోన్ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కన్నీటి పర్యంతం ఎల్ఐసీ ఏజెంటుగా రామచంద్రారెడ్డి పట్టణంలో పలువురు ప్రముఖులతో పాటు ప్రజల్లో కూడా మంచి గుర్తింపు వుంది. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం తో వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హుటాహుటిన డోన్ చేరుకొని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. బాధితులను ఓదార్చేక్రమంలో ఆయన కూడా కన్నీటి పర్యంతమై తన ప్రగాఢసానుభూతిని వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోట్లసుజాతమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి ప్రగాఢసంతాపాన్ని తెలిపారు. హైవేపై భయంభయం..: జాతీయ రహదారిపై నడకను సాగించాలంటే పలువురు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలోని ప్రధాన కూడళ్లలో అండర్‌పాస్‌లు లేకపోవడం, సెంట్రల్ లైటింగ్‌తో పాటు హెచ్చరికలు లేకపోవడంతో రహదారిపై నడవాలంటేనే పలువురు హడలెత్తిపోతున్నారు. -
చైన్ స్నాచర్లను ధైర్యంగా ఎదుర్కొంది!
హైదరాబాద్: మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును అపహరించేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. ఆ మహిళ వెంటనే అప్రమత్తమై చైన్ స్నాచర్లను ప్రతిఘటించడంతో పాటు వారిని వెంటాడింది. బైక్ వెంట పరిగెత్తి వారిని పట్టుకొవడానికి యత్నించింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చందానగర్ డివిజన్ సురక్ష హిల్స్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సురక్షహిల్స్‌కు చెందిన రాధాబాయి శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లింది. మోటార్ సైకిల్ పై వచ్చిన దొంగలు ఆమె వాకింగ్ చేస్తున్న సమయంలో మెడలో నాలుగు తులాల బంగారు గొలుసును అపహరించడానికి యత్నించారు. రాధాబాయి వారిని ధైర్యంగా అడ్డుకొంది. ఈ క్రమంలో ఆమె బైక్‌పై ఉన్న వారిని వెంబడిస్తూ.. కిందపడి గాయాలపాలైంది. దీంతో ఆమెకు తల, చేతులకు బలమైన గాయాలయ్యాయి. అయినా ధైర్యంతో దొంగల భారీ నుండి గొలుసును కాపాడుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి రాధాబాయి ఇంటికి వెళ్లి పరామర్శించారు. -
గుండెలు తీసిన పొట్టేళ్లు
శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీరంగాలు, డప్పుచప్పుళ్లకు బెదరకుండా ప్రత్యేక శిక్షణ పొందిన పొట్టేళ్లు బోనాల జాతరకు సిద్ధమయ్యాయి. ఆది, సోమవారాల్లో జరిగే జాతరలో కీలక ఘట్టాలైన తొట్టెలు, ఫలహారంబళ్ల ఊరేగింపులో పొట్టేళ్లు కీలకపాత్ర పోషించనున్నాయి. అమ్మవారికి ప్రీతిపాత్రమైన పొట్టేళ్లను తొట్టెలు, ఫలహారంబళ్లు లాగేందుకు వినియోగిస్తారు. బలిష్టమైన శరీర ఆకృతి, మెలితిరిగిన కొమ్ములతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పొట్టేళ్లను పెంచేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. చిలకలగూడ, కిందిబస్తీ, మైలార్‌గడ్డ, వారాసిగూడ, సీతాఫల్మండి తదితర ప్రాంతాల్లో బోనాల జాతర కోసం ప్రత్యేకంగా పొట్టేళ్ల పెంపకం చేపట్టి ఆర్థిక లబ్ధి పొందుతున్నారు. జాతర సమయంలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు రూ. 3 నుంచి 5 వేలకు పొట్టేళును అద్దెకు ఇస్తుంటామని పెంపకందారులు తెలిపారు. మార్నింగ్‌వాక్‌తో శిక్షణ.. జనసందోహంతోపాటు హోరెత్తించే డప్పుచప్పుళ్లకు బెదరకుండా ఉండేందుకు పొట్టేళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చిలకలగూడకు చెందిన సాయియాదవ్ వివరించారు. ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్‌వాక్‌కు తీసుకువెల్లడంతో పొట్టేళ్లకు శిక్షణ మొదలవుతుందని, బ్రేక్‌ఫాస్ట్‌గా కందిచున్నీ, ఆవుపాలు ఇస్తామన్నారు. మెలితిరిగేందుకు కొమ్ములకు నువ్వులనూనెతో మాలిష్ చేస్తామని, రెండు పొట్టేళ్లు పెంపకానికి రోజుకు సుమారు రూ. 500 ఖర్చు అవుతుందన్నారు. హాబీగా పొట్టేళ్ల పెంపకం చేపట్టానని, జాతర సమయంలో తొట్టెలు, ఫలహారంబళ్లు లాగేందుకు వినియోగిస్తానని సాయియాదవ్ తెలిపాడు. -
మార్నింగ్ వాక్‌లో... తరుముకొచ్చిన మృత్యువు
రోజూలాగే వారిద్దరు కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్న వారు వెనుక నుంచి మృత్యువు తరుముకొస్తుందన్న విషయం గమనించలేదు. నడుచుకుంటూ వెళ్తున్న వారిని వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఒకరు సమీప పొలాల్లో ఎగిరిపడగా...మరొకరు ట్రాక్టర్ ముందు చక్రాల కింద నలిగిపోయూరు. వాక్కు వెళ్లిన వారు ఇంటికి ఇంకా రాలేదమన్న ఆందోళనతో ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు పిడుగు లాంటి వార్త చేరింది. కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. సంతకవిటి: మార్నింగ్ వాక్‌లో వారి వెంట మృత్యువు ట్రాక్టర్ రూపంలో తరుముకొచ్చింది. కళ్లు మూసి తెరిచేలోగా వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ వారిని ఢీకొంది. ఈ ఘటనలో ఉపాధ్యాయుడొకరు మృత్యువాత పడగా...మరొకరు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మండలంలోని చినమిర్తివలస-మల్లయ్యపేట గ్రామాల మధ్య గురువారం జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల తెలిపిన వివరాలు... మంతిన గ్రామానికి చెందిన కాయల ఉపాధ్యాయుడు వెంకటరమణ(38), నల్లబారికి లక్ష్మణరావు గురువారం ఉదయం రోజూలాగే మార్నింగ్ వాక్కు ఇంటి నుంచి బయలుదేరారు. చిన్నమిర్తివలస ఆర్అండ్బీ బీటీ రహదారి మీదుగా మల్లయ్యపేట వైపు నడుస్తూ వెళ్తుండగా పొందూరు నుంచి సంతకవిటి వైపు చిప్స్‌తో వస్తున్న ట్రాక్టర్ వెనుక నుంచి అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో లక్ష్మణరావు రోడ్డు పక్కనే ఉన్న పొలంలో పడిపోగా కాలు విరిగి, నడుముకు బలమైన గాయూలయ్యూయి. లక్ష్మణరావు కేకలకు వెనక్కి తిరిగి చూసేలోగా ఉపాధ్యాయుడు వెంకటరమణపైకి కూడా ట్రాక్టర్ దూసుకొచ్చింది. వెంకటరమణ ట్రాక్టర్ ముందు చక్రాల కింద పడి నలిగిపోయూడు. ఆయన ఛాతి మీదుగా చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో పంట పొలాల్లో పనుల నిమిత్తం వచ్చిన మల్లయ్యపేటకు చెందిన రైతులు సంఘటనా స్థలానికి చేరుకొని 108 వాహనానికి, బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఇంతలోనే వెంకటరమణ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణరావును ప్రాథమిక చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతి చెందిన వెంకటరమణ లావేరు మండలం కె.కుంకాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. ఈయన భార్య లక్ష్మి కూడా ఇదే మండలంలో సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయూమ ఉపాధ్యారుునిగా పని చేస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో విషాదం వెంకటరమణ మృతితో ఆ ఇంట విషాదం అలుముకొంది. తండ్రి దాలయ్య తన కొడుక్కి ఏం జరిగిందో తెలియక భోరున విలపిస్తున్నాడు. వెంకటరమణకు మూడున్నరేళ్ల పురుషోత్తంతో పాటు రెండేళ్ల ప్రసన్న ఉంది. వీరికి తల్లి ఎందుకు ఏడుస్తుందో, నాన్నకు ఏమైందో తెలియక బిత్తర చూపులు చూస్తున్నారు. ఈ సంఘటన చూపరులను కంటతడి పెట్టించింది. కేసు నమోదు... ప్రమాద విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ఎస్.తాతారావు బాధిత కుటుంబీకులు, ప్రత్యక్ష సాక్షులు వద్ద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి వెంకటరమణ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టరును సంతకవిటి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో పాటు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
మండే అక్షరం..
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం అంతరంగం అక్షరాన్ని నమ్ముకున్న ఆ వ్యక్తి... దానినే ప్రేమించాడు. దానితో పాటే నడిచాడు. అక్షరమనే మొక్కల గాలి పీల్చాడు. ‘ఇంతింతై’ అన్నట్టు... ఆ చెట్టు నీడలోనే ఎదిగాడు. అక్షరాలను ఆయుధంగా చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో ముందు వరుసలో నిలిచాడు. కలం వీరులు తోడు రాగా...‘కథ’ం తొక్కాడు. పోరాట పటిమ... అనుభవం అంద రిలో ప్రత్యేకత తెచ్చిపెట్టాయి. అవే ‘ప్రెస్ అకాడమీ చైర్మన్’ పదవి వరించడంలోనూ...‘అల్లం’త ఎత్తున ఆయనను కూర్చోబెట్టడంలోనూ కీలక పాత్ర పోషించాయి. ఆ కలం యోధుడే అల్లం నారాయణ. ఈ అక్షర సేనానితో ‘సాక్షి...మార్నింగ్ వాక్’. పేరు : అల్లం నారాయణ పుట్టిన తేదీ : 13 డిసెంబర్ 1959 తల్లిదండ్రులు : నర్సయ్య, బుచ్చమ్మ భార్య : పద్మ పిల్లలు : రవళి, భావన, రాహుల్ స్వస్థలం : గాజుల పల్లె, మంథని మండలం, కరీంనగర్ జీవితంలో గొప్ప సంతృప్తి: తెలంగాణ రాష్ర్ట ఆవిర్బావం బాగా ఇష్టమైన అంశం: పాత్రికేయుడిగా సుదీర్ఘపయనం. అభిరుచి : నిరంతరం పుస్తకాలు చదవడం నచ్చిన లెజెండ్స్ : చైనా విప్లవోద్యమ నిర్మాత మావో, గద్దర్, గోరటి వెంకన్నల పాటలు, శివసాగర్ కవిత్వం. నచ్చిన సినిమాలు : రష్యన్ దర్శకుడు తార్కోవిస్కీ తాత్విక సినిమాలు నచ్చిన వంటలు : మొక్కజొన్న పేలాలు, బెండకాయ కూర, సర్వపిండి సాక్షి, సిటీబ్యూరో: సుమారు ఐదు దశాబ్దాలు పైబడిన ప్రవాహ గానం. మట్టిని... మనిషిని... మానవ సంబంధాన్ని పట్టి నిలిపిన అక్షర అనుబంధం. కథ, నవల, పాట, పత్రికా రచనలను ప్రాణప్రదంగా భావించే పయనం అల్లం సోదరుల సొంతం. వీరికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రెక్కాడితేగానీ డొక్కాడని అల్లం నర్సయ్య, బుచ్చమ్మల ముగ్గురు కుమారులు వారు. సాహిత్యంలో నిప్పుల ఉప్పెనలు కురిపించిన అన్న అల్లం రాజయ్య... ఆ బాటనే నడిచిన అల్లం వీరయ్య, అల్లం నారాయణ లు. విప్లవకారుడిగా.. కవిగా... రచయితగా... సంపాదకుడిగా... తెలంగాణ ఉద్యమకారుడిగా అందరికీ సుపరిచితులైన అల్లం నారాయణ... తెలంగాణ రాష్ర్ట ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో తన అనుభవాలు.. భవిష్యత్తు ప్రణాళికలు ‘అల్లం’ మాటల్లోనే... ఉద్యమ జీవితం ఎమర్జెన్సీ చీకటి రోజులు. పారా మిలిటరీ పద ఘట్టనల కింద అన్ని తెలంగాణ పల్లెల్లాగే మా గాజుల పల్లె కూడా నలిగిపోతున్న సందర్భమది. కరీంనగర్ జిల్లా మంథనికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా పల్లె. అమ్మా, నాయనలకువ్యవ సాయమే ఆధార ం. ఇక చదువంటే అన్న రాజయ్యతోనే మొదలైంది. ఆయన బాటలోనే రెండో అన్న వీరయ్య, నేను నడిచినం. మా ముగ్గురి తోబుట్టువు సోదరి లక్ష్మి. మూడో తరగతి వరకే ఊళ్లో చదువుకున్న. ఆ తరువాత వెన్నంపల్లిలో ఐదు వరకు చదివిన. మంథనిలో పదో తరగతి పాసై ఇంటర్లో చేరే నాటికి చీకటి రోజులు వచ్చిపడ్డాయి. 1975లో ఇంటర్ మొదటి సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు. విప్లవోద్యమం వైపు వెళ్లాను. అప్పటి పరిస్థితులు అలాంటివి. కొంతకాలం పనిచేసిన తరువాత గంభీరావు పేటలో ఒక సంఘటనలో అరెస్టయ్యాను. 2 నెలల పాటు నిర్బంధం. ఆ తరువాత మరోసారి అరెస్టయి... ఎమర్జెన్సీ ఎత్తి వేయడంతో బయటకు వచ్చిన. తిరిగి అజ్ఞాతంలోకే వెళ్లిపోయిన. 1982లో బయటకు వచ్చిన తరువాత ఉస్మానియాలో ఎమ్మేలో చేరిన. 1984లో చదువు పూర్తయింది. ఉస్మానియాలో చదువుకొనే రోజుల్లోనే పద్మ, నేను స్టేజీ మ్యారేజ్ చేసుకున్నాం. కరీంనగర్ టౌన్లో ఆ రోజుల్లో మా పెళ్లి చర్చనీయాంశం. పైగా నా పెళ్లిలో నేనే వక్తను కావడం విశేషం. పత్రికా రంగంలోకి... ఉపాధి కోసం కొంత కాలం వ్యవసాయం చేసిన. కానీ గిట్టుబాటు కాలేదు. అదే సమయంలో కరీంనగర్ కేంద్రంగా విజయ్ కుమార్ సంపాదకత్వంలో వెలువడిన ‘జీవగడ్డ’ పత్రిక నాతో పాటు, మరికొంత మంది మిత్రులకు ఒక చక్కటి అవకాశం. నేను, చారి, ఘంటా చక్రపాణి అట్లా పరిచయమైన వాళ్లమే. ‘జీవగడ్డ’లో పని చేసే రోజుల్లోనే ‘వెన్నెల కోనల్లో’ శీర్షికతో కథనాలు రాసిన. ఆ తరువాత 1986లో బెంగళూరు, విజయవాడల్లో కొంతకాలం పత్రికా రంగంలో వివిధ బాధ్యతలు నిర్వర్తించా. 1989 నుంచి విధి నిర్వహణ హైదరాబాద్‌కు మారింది. ఇదంతా ఒకవైపు అయితే... ఉద్విగ్నభరితమైన తెలంగాణ ఉద్యమం మరోవైపు. ఈ ఉద్యమంలో ‘తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్’ (టీజేఎఫ్) చారిత్రక బాధ్యతను నిర్వర్తించింది. రాజకీయ వర్గాల్లో స్తబ్దత నెలకొన్నప్పుడు... కేంద్రం వైఖరిలో మార్పులు కనిపించినప్పుడు... నిరాశా నిస్పృహలతో విద్యార్థులు, యువత బలిదానాలకు పాల్పడుతున్నప్పుడు... ఆ వర్గాలను ముందుకు నడిపించడంలో టీజేఎఫ్ క్రియాశీల కర్తవ్యం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గొప్ప సంతృప్తి అయితే... ఆ ఉద్యమంలో టీజేఎఫ్ పాత్ర అంతే ఉత్తేజకరమైన అనుభవం. ప్రెస్ అకాడమీ లక్ష్యాలు సుదీర్ఘ కాలం సాగిన తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. కొంతమంది బలిదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరితో పాటు తమ బతుకులు బాగుపడతాయని విలేకరులూ ఆశలు పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు.. జిల్లా కేంద్రాలు... రాష్ట్ర రాజధానిలో వివిధ బాధ్యతల్లో పని చేసే వారికి ఎన్నో ఆశలు...ఆకాంక్షలు ఉన్నాయి. ఏ ఒక్కరి ఆశలను వమ్ము చేయబోం. ముఖ్యంగా హెల్త్‌కార్డులకు అప్పటి ఉమ్మడి ప్రభుత్వంలో కొంత కృషి జరిగింది. జర్నలిస్టులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్‌కార్డులు అందజేయాలనే ప్రతిపాదన ఉంది. సబ్ఎడిటర్లకూ అక్రిడిటేషన్లు అందించాలి.ప్రభుత్వం నుంచి లభించే ఈ గుర్తింపు ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా దక్కవలసిందే. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలోనూ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అ న్ని అంశాలపైనా ప్రత్యేక కార్యాచరణతో అకాడమీ ముందుకు వెళుతోంది. ముఖ్యమంత్రి వివిధ పనుల్లో తీరిక లేకుండా ఉండడం వల్ల అకాడమీ సమావేశం జరుగలేదు. త్వరలో సీఎంతో సమావేశమవుతాం. అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటాం. కొత్త రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి బాటలు పడతాయి. ‘ఆర్ట్ ఆఫ్ అకాడమీ’గా... తెలంగాణ ఆవిర్భావం వరకు వచ్చిన మొత్తం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కథనాలన్నింటినీ ఒక రిసోర్స్‌గా భద్రపర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు, సాంస్కృతిక అణచివేతకు గురైన తెలంగాణ భాష, యాస, మాండలికాలకు కొత్త రాష్ట్రంలో ప్రాచుర్యం లభించవలసి ఉంది. ప్రత్యేకంగా తెలంగాణ పదకోశాన్ని రూపొందిస్తాం. భాషపై విస్తృతంగా సదస్సులు, వర్క్‌షాపులు ఏర్పాటు చే స్తాం. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ స్థాయిల్లో పని చేసే వారికి అవగాహన, నైపుణ్యం పెరిగేలా అత్యుత్తమ శిక్షణనిచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మొత్తంగా ప్రెస్ అకాడమీని ఒక ‘ఆర్ట్ ఆఫ్ అకాడమీ’గా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రభుత్వంఉంది. -
భార్య కళ్లముందే భర్త మృతి
శృంగవరపుకోట: ఆలూమగలిద్దరూ మార్నింగ్‌వాక్‌కు వెళ్లారు. అడుగులో అడుగేస్తూ నడుస్తున్న వారి వెనకే ఆర్టీసీ బస్ మృత్యురూపంలో వచ్చి ఢీకొట్టడంతో భర్త రోడ్డు మీదే ప్రాణాలు కోల్పోయారు. వివరాలిలా ఉన్నాయి. శృంగవరపుకోటలో గాంధీనగర్ రెండవవీధికి చెందిన దాసరి కృష్ణమూర్తి(63) భార్య కామేశ్వరిలు మంగళవారం వేకువజామున మార్నింగ్‌వాక్‌కు బయల్దేరారు. వారిద్దరరూ ఎస్.కోట నుంచి కొత్తూరు వైపు వాకింగ్ చేస్తున్నారు. భార్య కామేశ్వరి కాస్త ముందుగా న డిచి కొత్తూరు గ్రామంలో వినాయక ఆలయం వద్ద కూర్చుంది. కృష్ణమూర్తి కొత్తూరు గ్రామం శివాలయం వద్ద రోడ్డు మలుపు తిరుతుండగా ఎస్.కోటలో బయల్దేరిన అరకు -విశాఖ డీలక్స్ ఆర్టీసీ బస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఢీకొట్టిన బస్ కృష్ణమూర్తిని సుమారు 30మీటర్లకు పైగా ఈడ్చుకు పోవడంతో రోడ్డుపై పడ్డ ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. అదే దారిలో వాకింగ్‌కు వచ్చిన వారు గమనించి బస్ ఢీకొని వృద్ధుడు చనిపోయారని చెప్పుకోవడంతో వినాయక ఆలయం వద్ద కూర్చున్న భార్య కామేశ్వరికి అనుమానం వచ్చి చూడగా చనిపోయింది భర్త కావడంతో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. భర్తతో పాటు తాను కూడా పోకుండా ఎందుకు ఉండిపోయానంటూ ఆమె నెత్తీ నోరు బాదుకుంటుంటే చూపరులు చలించిపోయారు. ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ కేఆర్డీ. ప్రసాద్ బస్‌ను సంఘటనా స్థలంలో వదిలి ఎస్.కోట స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఎస్.కోట ఎస్సై ఎస్.కె.ఘనీ కేసు నమోదు చేసి, వివరాలు సేకరించి, మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి పంపి, ఆర్టీసీబస్‌ను తీయించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. -
ప్రతి అడుగూ ‘స్పెషల్’
జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ సోమేశ్‌కుమార్‌తో ‘మార్నింగ్ వాక్’ సోమేశ్ కుమార్... జీహెచ్ఎంసీ కమిషనర్‌గా 14 నెలలుగా నగర ప్రజలకు సుపరిచితులు. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్‌గా జీహెచ్ఎంసీ పాలక మండలి, స్టాండింగ్ కమిటీల బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. లక్ష్య సాధనలో భాగంగా తాను శ్రమిస్తూ... ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించే ఆయన సీరియస్ ఆఫీసర్‌గానే అందరికీ తెలుసు. ...ఇదంతా నాణేనికి ఒకవైపు అందరిలాగే ఆయనకూ హాబీలు... అలవాట్లు ఉన్నాయి. మరచిపోలేని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. మనసును మెలిపెట్టిన బాధాకర ఘటనలు ఉన్నాయి. పత్రికలు చదవడమే కాదు...పుస్తకాలు రాసే అభిరుచి ఉంది. ఆరోగ్యం కోసం నడకతో పాటు సమాజ క్షేమానికి ఉపకరించే మొక్కలపైనా మక్కువ ఉంది. సినిమాలు.. షికార్లు.. ఇతరత్రా సరదాలు ఉన్నాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ ప్రేమ కథ ఉంది. పెళ్లి దాకా వేచి చూసిన నిరీక్షణ ఉంది. ...ఇది నాణేనికి రెండోవైపు ...వ్యక్తిగత విషయాలతో పాటు ప్రజా జీవితానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకూ సమాధానాలిచ్చారు. తమ కుటుంబానికి చెందిన వివిధ అంశాలను తన సతీమణి డాక్టర్ జ్ఞాన్ ముద్రతో కలిసి ‘మార్నింగ్‌వాక్’లో సోమేశ్‌కుమార్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు.. ఈ ఆదివారం ప్రత్యేకం.. సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత డిజిటల్ రోజుల్లో ఏ దరఖాస్తు నింపాలన్నా ఫస్ట్ నేమ్, మిడిల్‌నేమ్, లాస్ట్నేమ్లు అవసరం. ఈ స్పెషలాఫీసర్‌కు మాత్రం ఫస్ట్ నేమ్ సోమేశ్... లాస్ట్ నేమ్ కుమార్. ఇంటి పేరు కనిపించదు. ప్రాథమిక విద్యలో ఉన్నంత కాలం పాఠశాల రిజిస్టర్లలో పేరుకు ముందు ఇంటి పేరు ఉన్నప్పటికీ. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ వచ్చేనాటికి పేరు మాత్రమే మిగిలింది. ఇంటి పేరు ఉంటే కులం, మతం వంటి వివరాలు తెలిసే వీలుంటుంది. అవేవీ అక్కరలేని సమానత్వమే కావాలనుకుంటున్న మిగతా విద్యార్థుల మాదిరిగానే ఇంటిపేరు లేకుండా పరీక్షల దరఖాస్తును నింపారు. సర్టిఫికెట్ అలాగే వచ్చింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. ఐఏఎస్ కల... తండ్రి డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేసే వారు. ఐఏఎస్‌లు సాధించిన వారు ఊళ్లోనే కాకుండా జిల్లాలో, రాష్ట్రంలో ప్రభావం చూపుతుండటంతో పెద్ద అధికారులైతే అలాంటి అవకాశం వస్తుందని సోమేశ్ కుమార్ భావించారు. చాలా మంది జీవితాలు మార్చేందుకు ఐఏఎస్ కావడమే మార్గమనుకున్నారు. దాన్ని పొందేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడయ్యారు. ప్రేమలో పడ్డారు.. ఐఏఎస్‌కు ఎంపిక కావడానికి ముందు అలహాబాద్‌లో సైంటిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు డాక్టర్ జ్ఞాన్ముద్రతో ప్రేమలో పడ్డారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. వారి మనసు మారేంత వరకూ వేచి ఉన్నారు. అలా ఒకటి కాదు...రెండు కాదు.. ఆరేడేళ్లు వేచి చూశారు. మొక్కలతో దోస్తీ చిన్నప్పటి నుంచీ మొక్కల పెంపకంపై సోమేశ్ కుమార్‌కు మక్కువ. కరువు జిల్లా అనంతపురం కలెక్టర్‌గా పని చేసినప్పుడు 60 ఎకరాల్లో చింతచెట్లు నాటించారు. పాడేరులో 40 వేల ఎకరాల్లో నాలుగు కోట్ల సిల్వర్ ఓక్ మొక్కల పెంపకం ఓ రికార్డు. వాటి నీడలో పెరిగే కాఫీ మొక్కలతో అక్కడి ప్రజలకు ఓ జీవనమార్గం చూపారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా గ్రీన్కర్టెన్లకు తెర తీశారు. రోడ్ల పక్కన ఫుట్‌ఫాత్‌లను ఆనుకుని ఉండే గోడలు కనిపించకుండా తీగల్లా పెరిగే మొక్కలు నాటడం.. ఫుట్‌పాత్‌లపై తక్కువ ఎత్తులోని మొక్కలతో పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టారు. రాయడమంటే ఇష్టం... బాల్యం నుంచీ రాసే అల వాటు ఉంది. ఏడోతరగతిలో మోడల్ ప్రశ్నపత్రాలను రూపొందించి.. వా టికి సమాధానాలు కూడా చిన్న పేరాల్లా రాసి మిత్రులకు పంచారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలంటీ భయపడే వారికి అవి ఉపయోగపడేవి. పెద్ద సమస్యలను సరళం చేయడం అలా అలవడింది. అదే ధోరణిలో జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను లెక్కింపును మూడు ముక్కలతో తేల్చిపారేశారు. నాయకత్వ లక్షణాలు.. ఢిల్లీ యూనివర్సిటీలో చదివే రోజుల్లో విద్యార్థి సంఘ నాయకునిగా ఉన్నారు. పీజీ సాయంత్రం తరగతుల విభాగానికి ఉపాధ్యక్షునిగా పని చేశారు. సినిమాలు... నటులు సినిమాలంటే ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా నెలకు రెండు మూడు సినిమాలు చూస్తానంటారు.అంతకుముందు ఇంకా ఎక్కువే చూసేవారు. వారాంతాల్లో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లడం సంతోషాన్నిచ్చే చర్య. నచ్చిన సినిమాల్లో రెండు మూడు చెప్పమంటే చక్‌దే ఇండియా, బ్యాండ్‌బాజా భారత్, 3 ఇడియట్స్ .. అంటారు. నటుల్లో సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్‌ల నుంచి రవితేజ దాకా, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రాల నుంచి సోనాక్షిసిన్హా, విద్యాబాలన్‌ల దాకా వివిధ పేర్లు ప్రస్తావించారు. మరచిపోలేనిది: కుటుంబంతో కలసి సత్యసాయి వద్ద గడిపిన క్షణాలు. బాధ పడ్డ క్షణాలు.. ఐఏఎస్ కోసం రెండుసార్లు కష్టపడినా ఎంపిక కాలేదు. రెండోసారి అవకాశం ఒక్క అడుగు దూరంలోనే చేజారిపోయినప్పుడు. అనంతపురం జిల్లాలో పని చేసేటప్పుడు పల్స్‌పోలియో తరహాలో చిన్న పిల్లల్లో నట్టల నివారణకు 8 లక్షల డోసుల మందు వేశారు. జిల్లా మొత్తంలో ఒకరికి వాంతులయ్యాయి. ఇదంతా మందు వల్లే జరిగిందనే వదంతులు కలచి వేశాయంటారు. నోరు లేని వారి కోసం.. డబ్బు, బలం ఉన్నవారు ఏదో ఒక విధంగా తమ పనులు చేసుకుంటారు. పేదలు, బలహీనులకు నోరు కూడా ఉండదు. న్యాయంగా అందాల్సిన పథకాలు దక్కకుండా పోతుంటాయి. అలాంటి వారిని దేవుడైనా ఆదుకోవాలి. ప్రభుత్వమైనా పట్టించుకోవాలి. ప్రభుత్వంలో మనమంటూ ఒక హోదాలో ఉన్నప్పుడు అలాంటి వారికి ఉపకరించే పనులు చే యడం కనీస ధర్మమంటారు సోమేశ్‌కుమార్. ఈ వరుసలోదే డ్రైవర్ కమ్ ఓనర్ పథకం (డ్రైవర్లనే ఓనర్లుగా మార్చేందుకు బ్యాంకు రుణాలిప్పించే పథకం. )తొలిదశలో 105 మంది డ్రైవర్లు ఓనర్లయ్యారు. రెండో దశలో మరో 303 మందికి త్వరలోనే ఈ పథకం కింద కార్లు ఇవ్వనున్నారు. ఫేస్ టూ ఫేస్ ప్రశ్న : స్పెషలాఫీసర్‌గా బాధ్యత మరింత పెరిగినట్లుంది..!? జ : అవును. మిగతా ప్రభుత్వ శాఖల్లో ఫలితాలు కనిపించడానికి కొంత సమయం పడుతుంది. జీహెచ్ఎంసీలో ఉదయం పని ప్రారంభిస్తే.. సాయంత్రానికే ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ దశలో స్పెషలాఫీసర్ కావడంతో బాధ్యత ఎన్నో రెట్లు పెరిగింది. ప్రశ్న : పెరిగిన బాధ్యతలతో ఏం చేయాలనుకుంటున్నారు? జ : పాలక మండలి లేదు. సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు మరోమారు చెప్పేందుకు వీలు లేకుండా నిర్ణీత వ్యవధిలో ఫిర్యాదులు వాటంతటవే పరిష్కారం కావాలనేది లక్ష్యం. అందుకు ప్రయత్నిస్తున్నాను. అవినీతి తగ్గాలి. ఇందుకు ప్రభుత్వ పెద్దల నుంచి రాజకీయ సంకల్పం కూడా ఉంది. రహదారులు బాగుండాలి. ఒక గమ్యం చేరేందుకు 20 నిమిషాలు పడుతుందనే అంచనా ఉంటే.. అందుకనుగుణంగా రహదారులు ఉండాలి. ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు. ఈ దిశగా ఆలోచిస్తున్నా. ప్రశ్న : టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి..? జ : ఎవరేమనుకున్నా పట్టించుకోను. నా పని నేను చేస్తాను. బాధ్యతలు నిర్వర్తిస్తాను. ముఖ్యమంత్రి వద్దకు వివిధ సమీక్ష సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పెద్ద కార్పొరేషనే కాక... ఏ కార్యక్రమం చేయాల్సి వచ్చినా జీహెచ్ఎంసీ కీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. సీఎం ఆలోచనల అమలుకు యత్నించాలి. ప్రజలకు ఆయన చెప్పినవి చేయాల్సి ఉంటుంది. అందుకు సమన్వయంతో పనిచేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పిన పనులూ చేయాలి. ఒక అధికారిగా వీరందరితో సమన్వయం అవసరం. దాన్ని మరోలా భావిస్తే ఏం చేయాలి? ప్రశ్న : మిమ్మల్ని చాలామంది మొండిఘటం అంటారు.. ? జ : నేను చెప్పేది..చేసేది ఒకటే. ఏదైనా నిజాయితీగా చేస్తాను. నన్ను విమర్శించే వారు సైతం నేను చేసేది కరక్టే అని ఒప్పుకుంటారు. అందువల్లే ఎవరేమనుకున్నా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనగలుగుతున్నాను. ప్రశ్న : ఉద్యోగులపై కోపం ప్రదర్శిస్తారని? జ : ఎవరి పనులు వారు చేయాలి. లక్షలాది ప్రజలకు సేవలందించాల్సిన జీహెచ్ఎంసీలో ఎన్నో బాధ్యతలుంటాయి. వివిధ ఒత్తిళ్లుంటాయి. ఒక్కరి నిర్లక్ష్యం ఎంతోమందిపై ప్రభావం చూపుతుంది. దాని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కరెక్ట్‌గా చెబుతాను. కచ్చితంగా చేయమంటాను. ఒకసారి, రె ండుసార్లు చె ప్పిచూస్తాను. అయినా వినిపించుకోకుంటే.. ఏం చేయాలి ? వారి విధులు సక్రమంగా నిర్వర్తించాలని చెబుతానే తప్ప ఇతరత్రా ఉండదు. తమ పనులు సరిగ్గా చేసేవారికి నాతో సమస్య ఉండదు. కుటుంబం - ఇష్టా ఇష్టాలు పేరు : సోమేశ్‌కుమార్, స్పెషలాఫీసర్, కమిషనర్, జీహెచ్ఎంసీ, (1989 బ్యాచ్) స్వరాష్ట్రం : బీహార్. కుటుంబం తల్లి : మీనాక్షి సింగ్ (గృహిణి) తండ్రి : స్వర్గీయ సుఖ్‌నందన్ సిన్హా (జాయింట్ కలెక్టర్‌గా రిటైరయ్యారు) అక్కలు : వీణ (గృహిణి), సుమన్(గృహిణి) చెల్లెళ్లు : సంగీత (ఆరోగ్య శాఖ, పాట్నా) శిఖా (మహిళా శిశు సంక్షేమ శాఖ, పాట్నా) తమ్ముడు : సుజిత్‌కుమార్ (సుప్రీం కోర్టులో అడ్వొకేట్) సతీమణి : డాక్టర్ జ్ఞాన్ ముద్ర (ఎన్ఆర్డీలో హెచ్ఆర్డీ విభాగం అధిపతి) కుమార్తె : సాయి గరిమ (ఇంటర్ ఫస్ట్ ఇయర్, సివిల్ సర్వీస్ లక్ష్యం) ఇష్టాలు.. నచ్చేరంగు : లేత నీలి వ ర్ణం ఇష్టమైన ఆహారం : అన్నం, కందిపప్పు, ఆలుఫ్రై లక్కీ నెంబర్ : 4, 8 విదేశీ పర్యటన : 40 దేశాలకు పైగా తిరిగారు. లావోస్, టర్కీ నచ్చాయి. దైవభక్తి : ఉంది. నెలకోమారు మెహదీపట్నం సాయిబాబా గుడికి వెళతారు. ఇంట్లో రోజూ దండం పెట్టుకుంటారు. క్రీడల్లో ప్రవేశం : క్రికెట్, బ్యాడ్మింటన్ రచనలు : వివిధ అంశాలపై 40కి పైగా రచనలు. వీటిల్లో కొన్ని ప్రపంచ బ్యాంకు, ఇతరసంస్థలు వెలువరించిన పుస్తకాల్లో చోటు చేసుకున్నాయి. ‘మెథడ్స్ ఫర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్’ అనే గ్రంథం (జపనీస్ భాషలో కూడా అనువదించారు). ఎంఏ (ఫిలాసఫీ) ఫస్టియర్‌లో ఉండగా రాసిన ‘ఇంట్ర డ్యూసింగ్ సైకో ఫిజిక్స్’ 1984లో అచ్చయింది. పనిచేసిన స్వచ్ఛంద సంస్థలు: 1996 -1999 వరకు ‘యాక్షన్ ఎయిడ్’ 2005-2008 వరకు ‘ఎయిడ్ ఎట్ యాక్షన్’ (డెప్యుటేషన్‌పై పనిచేశారు.) స్ఫూర్తి : బి.ఎన్.యుగంధర్ (మాజీ ఐఏఎస్), మహమ్మద్ యూనస్ (బంగ్లాదేశ్). దినచర్య : ఉదయం 5 - 6 గంటల మధ్య నిద్ర లేస్తారు. 45 నిమిషాల పాటు అర్థాంగితో కలిసి ఎన్ఐఆర్డీ క్యాంపస్‌లో నడక. కదురని పక్షంలో ఇంట్లో ట్రెడ్‌మిల్‌పై. అరగంట పాటు దినపత్రికలు తిరగేయడం, ప్రజల ఫిర్యాదులు, కార్యాలయ పనులకు సంబంధించి అధికారులకు మెసేజ్‌లు, క్షేత్ర స్థాయి తనిఖీలు. కార్యాలయ విధులతో రాత్రి ఇల్లు చేరేసరికి 10- 11 గంటలవుతుంది. -
ఔను.. ఆయన ప్రేమలో పడ్డారు!
సోమేశ్ కుమార్... జీహెచ్ఎంసీ కమిషనర్‌గా 14 నెలలుగా నగర ప్రజలకు సుపరిచితులు. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్‌గా జీహెచ్ఎంసీ పాలక మండలి, స్టాండింగ్ కమిటీల బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. లక్ష్య సాధనలో భాగంగా తాను శ్రమిస్తూ... ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించే ఆయన సీరియస్ ఆఫీసర్‌గానే అందరికీ తెలుసు. ఇదంతా నాణేనికి ఒకవైపు అందరిలాగే ఆయనకూ హాబీలు... అలవాట్లు ఉన్నాయి. మరచిపోలేని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. మనసును మెలిపెట్టిన బాధాకర ఘటనలు ఉన్నాయి. పత్రికలు చదవడమే కాదు...పుస్తకాలు రాసే అభిరుచి ఉంది. ఆరోగ్యం కోసం నడకతో పాటు సమాజ క్షేమానికి ఉపకరించే మొక్కలపైనా మక్కువ ఉంది. సినిమాలు.. షికార్లు.. ఇతరత్రా సరదాలు ఉన్నాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ ప్రేమ కథ ఉంది. పెళ్లి దాకా వేచి చూసిన నిరీక్షణ ఉంది. ఇది నాణేనికి రెండోవైపు వ్యక్తిగత విషయాలతో పాటు ప్రజా జీవితానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకూ సమాధానాలిచ్చారు. తమ కుటుంబానికి చెందిన వివిధ అంశాలను తన సతీమణి డాక్టర్ జ్ఞాన్ ముద్రతో కలిసి ‘మార్నింగ్‌వాక్’లో సోమేశ్‌కుమార్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు.. ఈ ఆదివారం ప్రత్యేకం.. జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ సోమేశ్‌కుమార్‌తో ‘మార్నింగ్ వాక్’ సిటీబ్యూరో: ప్రస్తుత డిజిటల్ రోజుల్లో ఏ దరఖాస్తు నింపాలన్నా ఫస్ట్ నేమ్, మిడిల్‌నేమ్, లాస్ట్నేమ్లు అవసరం. ఈ స్పెషలాఫీసర్‌కు మాత్రం ఫస్ట్ నేమ్ సోమేశ్... లాస్ట్ నేమ్ కుమార్. ఇంటి పేరు కనిపించదు. ప్రాథమిక విద్యలో ఉన్నంత కాలం పాఠశాల రిజిస్టర్లలో పేరుకు ముందు ఇంటి పేరు ఉన్నప్పటికీ. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ వచ్చేనాటికి పేరు మాత్రమే మిగిలింది. ఇంటి పేరు ఉంటే కులం, మతం వంటి వివరాలు తెలిసే వీలుంటుంది. అవేవీ అక్కరలేని సమానత్వమే కావాలనుకుంటున్న మిగతా విద్యార్థుల మాదిరిగానే ఇంటిపేరు లేకుండా పరీక్షల దరఖాస్తును నింపారు. సర్టిఫికెట్ అలాగే వచ్చింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. ఐఏఎస్ కల... తండ్రి డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేసే వారు. ఐఏఎస్‌లు సాధించిన వారు ఊళ్లోనే కాకుండా జిల్లాలో, రాష్ట్రంలో ప్రభావం చూపుతుండటంతో పెద్ద అధికారులైతే అలాంటి అవకాశం వస్తుందని సోమేశ్ కుమార్ భావించారు. చాలా మంది జీవితాలు మార్చేందుకు ఐఏఎస్ కావడమే మార్గమనుకున్నారు. దాన్ని పొందేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడయ్యారు. మొక్కలతో దోస్తీ చిన్నప్పటి నుంచీ మొక్కల పెంపకంపై సోమేశ్ కుమార్‌కు మక్కువ. కరువు జిల్లా అనంతపురం కలెక్టర్‌గా పని చేసినప్పుడు 60 ఎకరాల్లో చింతచెట్లు నాటించారు. పాడేరులో 40 వేల ఎకరాల్లో నాలుగు కోట్ల సిల్వర్ ఓక్ మొక్కల పెంపకం ఓ రికార్డు. వాటి నీడలో పెరిగే కాఫీ మొక్కలతో అక్కడి ప్రజలకు ఓ జీవనమార్గం చూపారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా గ్రీన్కర్టెన్లకు తెర తీశారు. రోడ్ల పక్కన ఫుట్‌ఫాత్‌లను ఆనుకుని ఉండే గోడలు కనిపించకుండా తీగల్లా పెరిగే మొక్కలు నాటడం.. ఫుట్‌పాత్‌లపై తక్కువ ఎత్తులోని మొక్కలతో పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టారు. రాయడమంటే ఇష్టం... బాల్యం నుంచీ రాసే అల వాటు ఉంది. ఏడోతరగతిలో మోడల్ ప్రశ్నపత్రాలను రూపొందించి.. వా టికి సమాధానాలు కూడా చిన్న పేరాల్లా రాసి మిత్రులకు పంచారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలంటీ భయపడే వారికి అవి ఉపయోగపడేవి. పెద్ద సమస్యలను సరళం చేయడం అలా అలవడింది. అదే ధోరణిలో జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను లెక్కింపును మూడు ముక్కలతో తేల్చిపారేశారు. నాయకత్వ లక్షణాలు.. ఢిల్లీ యూనివర్సిటీలో చదివే రోజుల్లో విద్యార్థి సంఘ నాయకునిగా ఉన్నారు. పీజీ సాయంత్రం తరగతుల విభాగానికి ఉపాధ్యక్షునిగా పని చేశారు. సినిమాలూ...నటులు సినిమాలంటే ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా నెలకు రెండు మూడు సినిమాలు చూస్తానంటారు.అంతకుముందు ఇంకా ఎక్కువే చూసేవారు. వారాంతాల్లో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లడం సంతోషాన్నిచ్చే చర్య. నచ్చిన సినిమాల్లో రెండు మూడు చెప్పమంటే చక్‌దే ఇండియా, బ్యాండ్‌బాజా భారత్, 3 ఇడియట్స్ .. అంటారు. నటుల్లో సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్‌ల నుంచి రవితేజ దాకా, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రాల నుంచి సోనాక్షిసిన్హా, విద్యాబాలన్‌ల దాకా వివిధ పేర్లు ప్రస్తావించారు. మరచిపోలేనిది: కుటుంబంతో కలసి సత్యసాయి వద్ద గడిపిన క్షణాలు. బాధ పడ్డ క్షణాలు.. ఐఏఎస్ కోసం రెండుసార్లు కష్టపడినా ఎంపిక కాలేదు. రెండోసారి అవకాశం ఒక్క అడుగు దూరంలోనే చేజారిపోయినప్పుడు.అనంతపురం జిల్లాలో పని చేసేటప్పుడు పల్స్‌పోలియో తరహాలో చిన్న పిల్లల్లో నట్టల నివారణకు 8 లక్షల డోసుల మందు వేశారు. జిల్లా మొత్తంలో ఒకరికి వాంతులయ్యాయి. మందు వల్లే జరిగిందనే వదంతులు కలచి వేశాయంటారు. నోరు లేని వారి కోసం.. డబ్బు, బలం ఉన్నవారు ఏదో ఒక విధంగా తమ పనులు చేసుకుంటారు. పేదలు, బలహీనులకు నోరు కూడా ఉండదు. న్యాయంగా అందాల్సిన పథకాలు దక్కకుండా పోతుంటాయి. అలాంటి వారిని దేవుడైనా ఆదుకోవాలి. ప్రభుత్వమైనా పట్టించుకోవాలి. ప్రభుత్వంలో మనమంటూ ఒక హోదాలో ఉన్నప్పుడు అలాంటి వారికి ఉపకరించే పనులు చే యడం కనీస ధర్మమంటారు సోమేశ్‌కుమార్. ఈ వరుసలోదే డ్రైవర్ కమ్ ఓనర్ పథకం (డ్రైవర్లనే ఓనర్లుగా మార్చేందుకు బ్యాంకు రుణాలిప్పించే పథకం. )తొలిదశలో 105 మంది డ్రైవర్లు ఓనర్లయ్యారు. రెండో దశలో మరో 303 మందికి త్వరలోనే ఈ పథకం కింద కార్లు ఇవ్వనున్నారు. ప్రేమలో పడ్డారు.. ఐఏఎస్‌కు ఎంపిక కావడానికి ముందు అలహాబాద్‌లో సైంటిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు డాక్టర్ జ్ఞాన్ముద్రతో ప్రేమలో పడ్డారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. వారి మనసు మారేంత వరకూ వేచి ఉన్నారు. అలా ఒకటి కాదు...రెండు కాదు.. ఆరేడేళ్లు వేచి చూశారు. ప్రశ్న : స్పెషలాఫీసర్‌గా బాధ్యత మరింత పెరిగినట్లుంది..!? జ : అవును. మిగతా ప్రభుత్వ శాఖల్లో ఫలితాలు కనిపించడానికి కొంత సమయం పడుతుంది. జీహెచ్ఎంసీలో ఉదయం పని ప్రారంభిస్తే.. సాయంత్రానికే ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ దశలో స్పెషలాఫీసర్ కావడంతో బాధ్యత ఎన్నో రెట్లు పెరిగింది. ప్రశ్న : పెరిగిన బాధ్యతలతో ఏం చేయాలనుకుంటున్నారు? జ : పాలక మండలి లేదు. సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు మరోమారు చెప్పేందుకు వీలు లేకుండా నిర్ణీత వ్యవధిలో ఫిర్యాదులు వాటంతటవే పరిష్కారం కావాలనేది లక్ష్యం. అందుకు ప్రయత్నిస్తున్నాను. అవినీతి తగ్గాలి. ఇందుకు ప్రభుత్వ పెద్దల నుంచి రాజకీయ సంకల్పం కూడా ఉంది. రహదారులు బాగుండాలి. ఒక గమ్యం చేరేందుకు 20 నిమిషాలు పడుతుందనే అంచనా ఉంటే.. అందుకనుగుణంగా రహదారులు ఉండాలి. ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు. ఈ దిశగా ఆలోచిస్తున్నా. ప్రశ్న : టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి..? జ : ఎవరేమనుకున్నా పట్టించుకోను. నా పని నేను చేస్తాను. బాధ్యతలు నిర్వర్తిస్తాను. ముఖ్యమంత్రి వద్దకు వివిధ సమీక్ష సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పెద్ద కార్పొరేషనే కాక... ఏ కార్యక్రమం చేయాల్సి వచ్చినా జీహెచ్ఎంసీ కీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. సీఎం ఆలోచనల అమలుకు యత్నించాలి. ప్రజలకు ఆయన చెప్పినవి చేయాల్సి ఉంటుంది. అందుకు సమన్వయంతో పనిచేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పిన పనులూ చేయాలి. ఒక అధికారిగా వీరందరితో సమన్వయం అవసరం. దాన్ని మరోలా భావిస్తే ఏం చేయాలి? ప్రశ్న : మిమ్మల్ని చాలామంది మొండిఘటం అంటారు.. ? జ : నేను చెప్పేది..చేసేది ఒకటే. ఏదైనా నిజాయితీగా చేస్తాను. నన్ను విమర్శించే వారు సైతం నేను చేసేది కరక్టే అని ఒప్పుకుంటారు. అందువల్లే ఎవరేమనుకున్నా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనగలుగుతున్నాను. ప్రశ్న : ఉద్యోగులపై కోపం ప్రదర్శిస్తారని? జ : ఎవరి పనులు వారు చేయాలి. లక్షలాది ప్రజలకు సేవలందించాల్సిన జీహెచ్ఎంసీలో ఎన్నో బాధ్యతలుంటాయి. వివిధ ఒత్తిళ్లుంటాయి. ఒక్కరి నిర్లక్ష్యం ఎంతోమందిపై ప్రభావం చూపుతుంది. దాని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కరెక్ట్‌గా చెబుతాను. కచ్చితంగా చేయమంటాను. ఒకసారి, రె ండుసార్లు చె ప్పిచూస్తాను. అయినా వినిపించుకోకుంటే.. ఏం చేయాలి ? వారి విధులు సక్రమంగా నిర్వర్తించాలని చెబుతానే తప్ప ఇతరత్రా ఉండదు. తమ పనులు సరిగ్గా చేసేవారికి నాతో సమస్య ఉండదు. -
మార్నింగ్ వాక్ వద్దంటున్న వైద్యులు
ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాయుకాలుష్యం న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణ కోసం ఉదయాన్నే లేచి నడక, వర్కవుట్లు చేయడమో సర్వసాధారణం. అయితే ఈ చలికాలంలో అటువంటిమేమీ చేయొద్దని, ఒకవేళ చేస్తే ఆరోగ్యం సంగతి దే వుడెరుగు, అనారోగ్యం బారినపడడం తథ్యం. ఉదయపు వేళల్లో వీచే గాలి తాజాగా ఉంటుందని, అందువల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతామని అందరూ భావిస్తారు. ఈ ఆలోచన ఎక్కడైనా ఉపయోగపడుతుందేమో కానీ జాతీయ రాజధానిలో మాత్రం అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పుగా పరిణమించే కాలుష్య కారకాలు గాలిలో సమ్మిళితమయ్యాయి. ఈ కారణంగా మీ ఊపిరితిత్తుల పనిసామర్థ్యం కాలక్రమేణా తగ్గిపోవడం తథ్యమని ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తెలుపుతున్నారు. మార్నింగ్ వాక్ చేయడమంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమేనంటున్నారు. అందువల్ల ఉదయం పూట ఇంటికే పరిమితం కావాలని హితవు పలుకుతున్నారు. సాధారణంగా అయితే ఉదయం పూట గాలి అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. ఆ తర్వాత క్రమేపీ కలుషితమవుతుంది. అయితే నగరంలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. నగరంలోని దుమ్మధూళి కణాల స్థాయి ఉదయం వేళల్లోనే 2.5 శాతంగా నమోదవుతోంది. ఉదయం ఆరు గంటలనుంచి పది గంటలవరకూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొగమంచు కారణంగా దృశ్యస్పష్టత తగ్గిపోతుందని, ఇందువల్ల కళ్లపై ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు. ఈ విషయమై నగర వాతావరణ శాఖ అనుబంధ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఫోర్‌క్యాస్టింగ్ అండ్ రీసెర్చి సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త గుఫ్రాన్బేగ్ మాట్లాడుతూ ‘సాయంత్రం ఏడు గంటలనుంచి ఉదయం ఏడు గంటలవరకూ నగర వాతావరణంలో ధూళికణాల సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఉదయం పదిగంటలదాకా కొనసాగుతోంది’అని అన్నారు. వాయుకాలుష్య నియంత్రణకు చర్యలు: కేంద్ర మంత్రి జవదేకర్ న్యూఢిల్లీ: నగరంలో వాయుకాలుష్య నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేక ర్ గురువారం రాజ్యసభకు తెలియజేశారు. వాయుకాలుష్యం పెరుగుదల నగరంలో మరణాల సంఖ్యను పెంచుతుండడంపై అనేకమంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వాయుకాలుష్య నియంత్రణ, మరణాల శాతం తగ్గింపునకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కాలుష్య శుద్ధికి సంబంధించిన ఉత్పత్తులకు ప్రోత్సాహమిస్తామన్నారు. -
మా ‘వాక్’ వినండి!
ఆరోగ్యమే మహా ‘భాగ్యం’ నడక, యోగాతో అనారోగ్యానికి చెక్ మార్నింగ్ వాక్‌తో ఎన్నో ప్రయోజనాలు కిటికీ రెక్కలు దాటుకొని వచ్చే సూర్య కిరణాలు నిద్ర లేపి.. ఇబ్బంది పెడుతున్నాయని విసుక్కోవద్దు... మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండని గుర్తు చేస్తున్నాయని గ్రహించండి. తలుపు తెర(డోర్ కర్టెన్) అటువైపు లాగేసి... సూర్యుడి కంట పడకుండా ఉండిపోవచ్చని భావించకండి. ఆరోగ్యాన్నిచ్చే ఆదిత్యుని మాట వింటే... అనారోగ్యం మనవైపు చూడడానికే భయపడుతుందని గ్రహించండి. దుప్పటి లాక్కుని చలి నుంచి తప్పించుకుంటున్నామని భ్రమిస్తున్నారేమో...ఆ ముసుగులోనే వ్యాధులు మనల్ని కౌగిలించుకుంటున్నాయని తెలుసుకోండి. లేవండి. నడవండి. ఆరోగ్య ప్రపంచం వైపు సాగండి. ప్రతి రోజూ ఉదయాన్నేనాలుగు అడుగులు నడిస్తే ఏమవుతుంది? బద్ధకం వదిలిపోతుంది. అలాగే మరో అరగంట నడిస్తే కొంచెం ఆయాసంగా అనిపించినా... మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. ఒంట్లోని కొవ్వు కరిగిపోతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఎముకల దృఢత్వానికి అవసరమైన విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది. పైసా ఖర్చు లేకుండా సంపాదించుకునే ఆరోగ్యాన్ని కొంత మంది కేవలం బద్ధకం వల్ల దూరం చేసుకుంటున్నారు. పాతికేళ్లు నిండకముందే హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండెపోటు, ఊబకాయం, తదితర జబ్బుల బారిన పడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది చిన్న వయసులోనే పెద్ద జబ్బులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మార్నింగ్ వాక్, యోగా, వ్యాయామాల వల్ల ఆరోగ్యాన్ని పదిలపర్చుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నా రు. గుండెకు మేలు హైదరాబాద్ నగరం రాష్ట్రానికి మాత్రమే కాదు... హృద్రోగులకూ రాజధానిగా మారుతోంది. పాతికేళ్ల క్రితం గుండె జబ్బులు చాలా అరుదు. ప్రతి వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే ఈ సమస్య ఉండేది. నేడు ఏ కార్పొరేట్ ఆస్పత్రిలో వైపు చూసినా 70-100 మంది హృద్రోగులు తారస పడుతున్నారు. వీరిలో 50 ఏళ్ల లోపు వారే ఎక్కువ. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచంలో ప్రతి వంద మందిలో ముగ్గురు గుండె నొప్పితో బాధ పడుతుండగా...గ్రేటర్లో ఈ సంఖ్య 5నుంచి 6 వరకూ ఉంటోంది. వీరు నిత్యం కనీసం 40 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని..తద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని ప్రముఖ గుండె మార్పిడి వైద్య నిపుణుడు డాక్టర్ ఏజీకే గోఖలే చెప్పారు. మంచు కురిసే సమయంలో కాకుండా సూర్య కిరణాలు వ చ్చిన తర్వాత వ్యాయామం చేయడం ఉత్తమం. ఒత్తిడిని జయిస్తేనే... ఉరుకుల పరుగుల జీవితం.. రోజంతా కంప్యూటర్లతో సహవాసం.. ఆలస్యపు పెళ్లిళ్లు..ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి.. సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భార్య ఒక షిఫ్టులో పని చేస్తే.. భర్త మరో షిఫ్టులో పని చేయాల్సి వస్తోంది. ఫలితంగా స్త్రీ, పురుషుల హార్మోన్లలో సమతుల్యత లోపించి, సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. ఐటీహబ్‌గా పెరుగాంచిన హైటెక్ నగరంలో ప్రస్తుతం నూటికి 30 శాతం మంది ఐటీ దంపతులు పిల్లల కోసం పరితపిస్తున్నారు. ఉదయాన్నే లేచి యోగాసనాలు చేయడం, శారీరక బరువును అదుపులో ఉంచుకోవడం... మార్నింగ్ వాక్ చేయడం.. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడం వల్ల సంతాన ప్రాప్తికి అవకాశం ఉంటుందని స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ పద్మజ సూచించారు. స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది వాతావరణంలో ఓజోన్ 100 మైక్రో గ్రాములు దాటకూడదు. పగటి వేళ 120-150 మైక్రోగ్రాములు దాటుతోంది. సీసం, ఆర్సినిక్, నికెల్ వంటి భారలోహ ధాతువులు కలిగిన గాలి పీల్చితే అది శ్వాసకోశాల్లోంచి రక్తంలోకి చేరుతుంది. ఇది నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలుష్యంతో ముక్కు ద్వారాలు మూసుకుపోయి...గాలి తీసుకోవడం కష్టమవుతుంది. జ్ఞాపకశక్తిని దెబ్బ తీస్తుంది. పిల్లల ఎదుగుదలను నిరోధిస్తుంది. తెల్లవారు జామున వాకింగ్‌కు వెళ్లడం వల్ల స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చని ఫల ్మనాలజిస్ట్ డాక్టర్ సునంద చెప్పారు. విటమిన్ ‘డి’ నైట్‌షిఫ్ట్‌ల వల్ల నగరంలో చాలా మంది మధ్యాహ్నం తర్వాత నిద్ర లేస్తున్నారు. ఉదయం ఏడు గంటల్లోపు వచ్చే సూర్యకిరణాల్లో ఎముకల పటిష్టతకు అవసరమైన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారు, గృహిణులు సూర్యరశ్మికి నోచుకోవడం లేదు. కాల్షియం లోపంతో ఎముకల్లో పటుత్వం తగ్గిపోతోంది. విటమిన్ డి లోపం వల్ల గ్రేటర్లో 60 శాతం మంది కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. బాధితుల్లో 60 శాతం మహిళలు ఉంటే, 40 శాతం పురుషులు ఉన్నారు. సాధారణంగా 50 ఏళ్లుపైబడిన వారిలో కనిపించే ఈ లక్షణాలు ప్రస్తుతం పాతికేళ్ల యువతీ యువకుల్లో క నిపిస్తున్నాయి. తొలి సంధ్యవేళలో వ్యాయామం చేయడం వల్ల ఎముకల పటుత్వానికిఅవసరమైన విటమిన్ డని పొందవచ్చని ప్రముఖ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల వైద్య నిపుణుడు డాక్టర్ అఖిల్ దాడి చేప్పారు. ‘భారం’ కాకుండా ఉండాలంటే... అధిక బరువు.... మనకు తెలియకుండానే మన శరీరాన్ని రోగాల పుట్టగా మార్చేస్తుంది. ఇది ఒక వ్యాధి కాకపోవచ్చు. కానీ, అనేక ఇతర సమస్యలకు కారణమవుతోంది. నగరంలో 2005లో స్థూలకాయుల సంఖ్య ఐదు శాతం ఉంటే.. ప్రస్తుతం ఇది 40 శాతానికి చేరుకున్నట్లు అంచనా. తగ్గిన శారీరక శ్రమ.. నిశిరేయిలో విందులు, వినోదాలు.. పిజ్జాలు, బర్గర్లు...శరీరంలో కొవ్వును పేర్చేస్తున్నాయి. మార్నింగ్ వాక్, జిమ్‌కు వెళ్లడం, యోగాసనాలతో బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చని ప్రముఖ బెరియాట్రిక్ సర్జన్ డాక్టర్ మహిధర్ వల్లేటి చెప్పారు. రోగాలకు ముకుతాడు వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కేలరీలు కరిగిపోతాయి. గుండె, కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. అనేక జబ్బులకు మధుమేహం, అధిక బరువే కారణం. వీటి వల్ల వచ్చే వ్యాధులను వ్యాయామంతో అదుపులో ఉంచుకోవచ్చు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి, ఆహరపు అలవాట్లు మార్చుకోవాలి. నిత్యం కనీసం 30 నిమిషాల పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్/ యోగాచేయాలి. ఇలా వారానికి కనీసం 150 నిమిషాలు చేయాలి. బీపీ 140/90, షుగర్ ఫాస్టింగ్‌లో 100/120, పోస్ట్ లంచ్‌లో 140/180 మించకుండా చూసుకోవాలి. - డాక్టర్ ఎం.గోవర్థన్, జనరల్ ఫిజిషియన్, కేర్ ఆస్పత్రి యోగాతో ఎంతో మేలు యోగాతో నయం కాని వ్యాధి లేదు. సర్వరోగ నివారిణి ఇది. వివిధ రకాల దీర్ఘకాలిక రుగ్మతలతో బాధ పడుతున్న వారు వాటిని నయం చేసుకునేందుకు యోగా గురువులను ఆశ్రయిస్తున్నారు. శారీరకంగానే కాకుండా మానసిక పరివర్తనలో చాలా మార్పులు తీసుకువస్తుంది. మందులకు లొంగని క్యాన్సర్‌ను ప్రాణాయామంతో జయించవచ్చు. అర్థమత్స్యేంద్రాసనం, వకునాసనం, మండుకాసనాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఉత్తనపదాసనం, నవుకాసన ంతో అధిక బరువును, పవనముక్తాసనంతో గ్యాస్ట్రిక్ సమస్యలను జయించవచ్చు. ప్రాణాయామం, వసాసనం, మత్స్యాసనంతో శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇలా ఒక్కో జబ్బుకు ఒక్కో ప్రత్యేక ఆసనం ఉంది. - బి.చంద్రారెడ్డి గురూజీ, సప్తరుషి యోగ విద్యాకేంద్రం, ఫిలింనగర్