కారు కింద పడి.. 3 కి.మీ. ఈడ్చుకెళ్లి | Man Dragged Under Car for 3 Kilometres in UP, Dies in Hospital | Sakshi
Sakshi News home page

కారు కింద పడి.. 3 కి.మీ. ఈడ్చుకెళ్లి

Published Sat, Feb 18 2023 6:00 AM | Last Updated on Sat, Feb 18 2023 6:00 AM

Man Dragged Under Car for 3 Kilometres in UP, Dies in Hospital - Sakshi

బుదాన్‌ (యూపీ): దేశ రాజధాని ఢిల్లీలో కారు కింద పడ్డ యువతిని ఈడ్చుకొని కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తరహా ఘటనలు తరచూ జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం మార్నింగ్‌ వాక్‌కి వెళ్లిన ఒక యువకుడి నిండు ప్రాణాలు ఇలాగే బలయ్యాయి. యూపీ పోలీసులు అందించిన వివరాల ప్రకారం  సిరసోలా గ్రామానికి చెందిన 22 ఏళ్ల వయసున్న ఉమేష్‌ కుమార్‌ శుక్రవారం ఉదయం మార్నింగ్‌ వాక్‌కు బయల్దేరగా వెనుక నుంచి వచ్చిన కారు అతనిని ఢీకొట్టింది.

కారు బోనెట్‌పైకి ఎగిరి మళ్లీ కిందపడిన కుమార్‌ ముందువైపునున్న ఎడమ చక్రంలో ఇరుక్కుపోయారు. అయినా కూడా కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా 3 కి.మీ. ప్రయాణించాడు. దీనిని చూసిన స్థానికులు ఆ కారుని వెంబడించి అతనిని పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు డ్రైవర్‌ని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement