umesh kumar
-
సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వానికి ఊరట..
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సర్కార్‌కు ఊరట లభించింది. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ (డీఈఆర్సీ) చైర్మన్ నియామకంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై తుది విచారణను జూలై 11న చేపడతామని పేర్కొంది. అప్పటి వరకు డీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్(రిటైర్డ్) ఉమేష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఢిల్లీ స్పీకర్ వీకే సక్సేనా ఆదేశాల మేరకు గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జీగా పనిచేసిన జస్టిస్ ఉమేష్ కుమార్ జూన్ 21న డీఈఆర్సీ చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే ఆరోజు ఢిల్లీ విద్యుత్‌శాఖ మంత్రి అతిషి అనారోగ్యానికి గురవ్వడంతో.. జస్టిస్ కుమార్ ప్రమాణా స్వీకారం జూలై 6కు వాయిదా పడింది. అయితే ఈ ఉమేష్ కుమార్ నియమాకాన్ని(గవర్నర్ ఆదేశాలను) వ్యతిరేకిస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆదేశించింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు నోటీసులు జారీ చేస్తామని పేర్కొంది. అదే విధంగా డీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ ఉమేష్ కుమార్ స్వీకారోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాక జస్టిస్ కుమార్ ప్రమాణ స్వీకారం గురించి ఢిల్లీ స్పీకర్ వీకే సక్సేనా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కోరరాదని సూచించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తదుపరి విచారణ 11న చేపడతామని చెప్పడంతో.. ఉమేష్ కుమార్ నియామకం జూలై 11కు వరకు వాయిదా పడినట్లే. అయితే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కార్ జస్టిస్(రిటైర్డ్) సంగీత్ రాజ్ లోధా పేరును జూన్ 21న ప్రతిపాదించింది. అయితే ఆప్ ప్రభుత్వ విజ్ఞప్తిని పక్కన పెడుతూ జస్టిస్ కుమార్ పేరును ప్రకటిస్తూ కేంద్రం అదే రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై నియంత్రణకు సంబంధించి కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సైతం ఆప్ సర్కార్ సుప్రీంకోర్టులో పోరాడుతోంది. తాజాగా డీఈఆర్సీ చైర్మన్ వివాదంతో వీరి మధ్య వైర్యం మరింత పెరిగినట్లైంది. చదవండి: పురుషులకు జాతీయ కమిషన్.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు -
కారు కింద పడి.. 3 కి.మీ. ఈడ్చుకెళ్లి
బుదాన్ (యూపీ): దేశ రాజధాని ఢిల్లీలో కారు కింద పడ్డ యువతిని ఈడ్చుకొని కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తరహా ఘటనలు తరచూ జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఒక యువకుడి నిండు ప్రాణాలు ఇలాగే బలయ్యాయి. యూపీ పోలీసులు అందించిన వివరాల ప్రకారం సిరసోలా గ్రామానికి చెందిన 22 ఏళ్ల వయసున్న ఉమేష్ కుమార్ శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్కు బయల్దేరగా వెనుక నుంచి వచ్చిన కారు అతనిని ఢీకొట్టింది. కారు బోనెట్‌పైకి ఎగిరి మళ్లీ కిందపడిన కుమార్ ముందువైపునున్న ఎడమ చక్రంలో ఇరుక్కుపోయారు. అయినా కూడా కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా 3 కి.మీ. ప్రయాణించాడు. దీనిని చూసిన స్థానికులు ఆ కారుని వెంబడించి అతనిని పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు డ్రైవర్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
శామ్కో నుంచి టైమర్ ఎస్టీపీ
శామ్కో మ్యుచువల్ ఫండ్ .. టైమర్ ఎస్టీపీ పేరిట ఒక సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ)ని, ఓవర్‌నైట్ ఫండ్‌ను ఆవిష్కరించింది. టైమర్ఎస్టీపీని వారంవారీ, నెలవారీ, త్రైమాసికాలవారీగా కనీసం రూ. 25,000 నుంచి ప్రారంభించవచ్చు. తాము సొంతంగా తయారు చేసిన ఈక్విటీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇండెక్స్ (EMOSI) ఇండికేటర్ ఆధారంగా ఇది పని చేస్తుందని కంపెనీ సీఐవో ఉమేష్ కుమార్ మెహతా తెలిపారు. మార్కెట్లు గరిష్ట, కనిష్ట స్థాయుల్లో ఉన్నప్పుడు తగు రీతిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. మరోవైపు, ఓవర్‌నైట్ ఫండ్ ఎన్ఎఫ్వో (న్యూ ఫండ్ ఆఫర్) అక్టోబర్ 4న ప్రారంభమై 6న ముగుస్తుంది. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. -
పలు పరీక్షల కోసం ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: లోకోపైలట్, టెక్నికల్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు 03242 నంబర్ గల సికింద్రాబాద్–దానాపూర్ ప్రత్యేక రైలు ఆగస్టు 9న సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి ఆగస్టు 11 ఉదయం 7.40కి దానాపూర్ చేరుకుంటుందని ద.మ.రైల్వే సీపీఆర్వో ఉమేశ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ముజఫరాబాద్, సికింద్రాబాద్ మధ్య.. 05289 నంబర్ గల ముజఫరాబాద్–సికింద్రాబాద్ స్పెషల్ ట్రెయిన్ ముజఫరాబాద్ నుంచి ఆగస్టు 8న మధ్యాహ్నం 12కి బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే 05290 నంబర్ గల స్పెషల్ ట్రెయిన్ ఆగస్టు 10న రాత్రి 9కి సికింద్రాబాద్ నుంచి బయల్దేరి, ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ముజఫరాబాద్ చేరుకుంటుంది.. చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్‌కు.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్‌కు 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 06051 నంబర్ చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ వీక్లీ స్పెషల్ ఫేర్ ట్రెయిన్లు చెన్నై సెంట్రల్ నుంచి ఆగస్టు 11, 18, 25, సెప్టెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో (శనివారాలు) రాత్రి 8.10 నుంచి బయల్దేరి ఉదయం 5.45 గంటలకు (సోమవారాలు) అహ్మదాబాద్ చేరతాయి. 06052 నంబర్ అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వీక్లీ వీక్లీ స్పెషల్ ఫేర్ ట్రెయిన్లు అహ్మదాబాద్ నుంచి ఈనెల 13, 20, 27, సెప్టెంబరు 3, 10, 17, 24, అక్టోబరు 1 (సోమవారాలు)న ఉదయం 9.40 నిమిషాలకు బయల్దేరి (మంగళవారాలు) సాయంత్రం 5.10కి చెన్నై సెంట్రల్ చేరుకుంటాయి. -
దినేశ్ రెడ్డి, ఉమేష్ కుమార్ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం
రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి, మరో మాజీ ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ఆదాయానికి మించి అక్రమాస్తులను కూడబెట్టారని తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ సుప్రీం కోర్టు సూచనలను కంటే ఎక్కువగా దర్యాప్తు చేస్తోందని దినేష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని అడ్డుకోవాలంటూ ఆయన విన్నవించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అక్రమాస్తుల కేసులో దినేశ్ రెడ్డిపై సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో ఐపీఎస్ అధికారి ఉమేశ్ కుమార్ ఫిర్యాదు మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుండగా తనపై విచారణను మేజిస్ట్రేట్ కోర్టులో జరపాలంటూ మరో ఐపీఎస్ అధికారి ఉమేష్‌కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. -
ఆ ఆస్తులతో నాకు సంబంధంలేదు: డిజిపి దినేశ్ రెడ్డి
హైదరాబాద్: సుప్రీం కోర్టు పిటీషన్లో పేర్కొన్న ఆస్తులతో తనకు ఎలాంటి సంబంధంలేదని డీజీపీ దినేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ కేసుపై వివరణ ఇచ్చారు. పిటిషన్లో పేర్కొన్నట్లుగా 1500 ఎకరాలతో తనకు సంబంధంలేదని చెప్పారు. 542 సేల్స్ డీడ్స్‌లో కేవలం ఏడున్నర ఎకరాలకు సంబంధించి మాత్రమే తనవిగా వివరించారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలూ బయటపడతాయని చెప్పారు. ఎంపీ సంతకాన్నిఫోర్జరీచేసి మళ్లీ తనపై ఫిర్యాదు చేశారన్నారు. 1977 బ్యాచ్‌కు చెందిన డిజిపి దినేశ్ రెడ్డితో సహా ఆయన సతీమణి కమలా రెడ్డికి చెందిన అన్ని ఆస్తుల లావాదేవీలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వై.రవిప్రసాద్, ఏ.కృష్ణారెడ్డి జరిపిన అన్ని లావాదేవీలపై పూర్తి విచారణకు ఆదేశించాలని ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఉమేష్ కుమార్ పిటిషన్‌లోని అభియోగాలను దినేష్ రెడ్డికి ఎదుర్కోవల్సిందేనని స్పష్టం చేసింది. దర్యాప్తులోని అభ్యంతరాలను ట్రయిల్ కోర్టులో తేల్చుకోవాలని డీజీపీకి సుప్రీంకోర్టు సూచించింది. దినేష్ రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా విచారణ దశ నివేదికను సమర్పించాల్సిందిగా జస్టిస్ బి.ఎస్. చౌహాన్, ఎస్.ఎ. బొబ్దెతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దినేశ్ రెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ప్రారంభించింది. అతనిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రాథమిక విచారణ నివేదికను నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు నిన్న తెలిపాయి. దర్యాప్తులో భాగంగా దినేశ్ రెడ్డిని కూడా సిబిఐ విచారించనుంది. డీజీపీ దినేశ్ రెడ్డి భార్యకు రంగారెడ్డి జిల్లా చంపాపేట, మహేశ్వరం, మేడ్చల్ లలో 90కి పైగా భూముల లావాదేవీలు అమ్మటం, కొనటం జరిగిందని ఉమేష్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా దినేష్‌రెడ్డి తన భార్య పేరుతో బెనామీగా ఆస్తులను కూడబెట్టారంటూ ఉమేశ్ కుమార్, అలాగే షూ కుంభకోణంలో ఉమేశ్ కుమార్ నిందితుడిగా ఉన్నారంటూ దినేష్‌రెడ్డి పరస్పర ఆరోపణలతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
డీజీపీ దినేశ్‌రెడ్డి ఆస్తులపై సీబీఐ దర్యాప్తు
ఉమేశ్‌కుమార్ ‘ఫోర్జరీ’పై దర్యాప్తు కొనసాగుతుంది: సుప్రీం సాక్షి లీగల్ ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.దినేశ్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. అలాగే దినేశ్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పార్లమెంటు సభ్యుడు ఎం.ఎ.కాన్ సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి ఉమేశ్‌కుమార్‌పై కూడా విచారణ కోర్టులో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. డీజీపీపై ఫిర్యాదు కాపీని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించి దర్యాప్తు చేపట్టాల్సిందిగా నిర్దేశించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆరోపణలపై ఎలాంటి దర్యాప్తూ చేపట్టకపోవటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ‘రాష్ట్ర పోలీస్ బాస్‌పై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిం చటం దిగ్భ్రాంతి కలిగించింది’ అని పేర్కొంది. డీజీపీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, దర్యాప్తుపై స్థాయీ నివేదికను నాలుగు వారాల్లో తమకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. రాష్ట్రానికే చెందిన ఐపీఎస్ అధికారి ఉమేశ్ కుమార్ దాఖలుచేసిన అప్పీలును విచారించిన జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసిం ది. డీజీపీ దినేశ్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు ఉమేశ్‌కుమార్ ఒక ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేయటానికి ఫోర్జరీ చేసినప్పటికీ.. దినేశ్‌రెడ్డిపై చేసిన ఆరోపణల్లో బలం ఉన్నందున దీనిపై దర్యాప్తు అవసరమని ధర్మాసనం పేర్కొంది. ‘ఫిర్యాదు బూటకమైనప్పటికీ, దానితో జతపరిచిన సేల్ డీడ్లను అక్రమమార్గంలో సేకరించినవైనప్పటికీ, ఆ పత్రాలు బూటకపు పత్రాలుగా నిర్ధారణకాలేదు. ఆరోపణల్లో కొంత బలం ఉన్నట్లయితే, ప్రతివాదికి (దినేశ్‌రెడ్డికి) నేరంలో భాగస్వామ్యం ఉన్నదని బలప రచే భౌతిక ఆధారాలు ఉన్నట్లయితే.. ఈ కేసును పూర్తిస్థాయిలో పరిశీలించాలి.. అంతేకానీ కక్ష సాధించటానికో, మరేదో స్వార్థ లక్ష్యం కోసమో ఫిర్యాదు చేశారనే ప్రాతిపదిక మీద దానిని కొట్టివేయకూడదు’ అని స్పష్టంచేసింది. -
ఫోర్జరీ కేసులో ఉమేష్ కుమార్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ : జార్ఖండ్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు ఎంఎ ఖాన్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో సీనియర్ ఐపిఎస్ అధికారి ఉమేష్ కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఫోర్జరీ కేసులో ఉమేష్ కుమార్‌పై విచారణ నిలిపివేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అభ్యంతరాలు ఏమైనా ఉంటే దిగువ కోర్టుకు చెప్పాలని ఉమేష్‌కుమార్‌ను ఆదేశించింది. డీజీపీగా దినేష్ రెడ్డిని నియమించడంతో 1977 బ్యాచ్‌కు చెందిన ఈ ఇద్దరు ఐపీఎస్ అదికారుల మధ్య గొడవ మొదలైంది. దినేష్‌రెడ్డిని డిజిపిగా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిసిన వెంటనే ఉమేష్‌కుమార్ తన స్నేహితుడైన ఓ మాజీ జర్నలిస్టుతో కలిసి ఎంఎ ఖాన్ లెటర్‌హెడ్‌ను కొట్టేసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దినేష్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేశారు. ఈ విషయంలో ఒకరి మీద ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ కోర్టులకి ఎక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దినేష్ రెడ్డి అక్రమ ఆస్తులపై విచారణ జరపాలంటూ ఉమేష్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై సీబీఐ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది.