శామ్‌కో మ్యుచువల్ ఫండ్ .. టైమర్ ఎస్‌టీపీ పేరిట ఒక సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎస్‌టీపీ)ని, ఓవర్‌నైట్ ఫండ్‌ను ఆవిష్కరించింది. టైమర్‌ఎస్‌టీపీని వారంవారీ, నెలవారీ, త్రైమాసికాలవారీగా కనీసం రూ. 25,000 నుంచి ప్రారంభించవచ్చు.
తాము సొంతంగా తయారు చేసిన ఈక్విటీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇండెక్స్ (EMOSI) ఇండికేటర్ ఆధారంగా ఇది పని చేస్తుందని కంపెనీ సీఐవో ఉమేష్ కుమార్ మెహతా తెలిపారు. మార్కెట్లు గరిష్ట, కనిష్ట స్థాయుల్లో ఉన్నప్పుడు తగు రీతిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. మరోవైపు, ఓవర్‌నైట్ ఫండ్ ఎన్‌ఎఫ్‌వో (న్యూ ఫండ్ ఆఫర్) అక్టోబర్ 4న ప్రారంభమై 6న ముగుస్తుంది. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment