న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సర్కార్‌కు ఊరట లభించింది. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ (డీఈఆర్‌సీ) చైర్మన్ నియామకంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై తుది విచారణను జూలై 11న చేపడతామని పేర్కొంది. అప్పటి వరకు డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్(రిటైర్డ్) ఉమేష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
కాగా ఢిల్లీ స్పీకర్ వీకే సక్సేనా ఆదేశాల మేరకు గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జీగా పనిచేసిన జస్టిస్ ఉమేష్ కుమార్ జూన్ 21న డీఈఆర్‌సీ చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే ఆరోజు ఢిల్లీ విద్యుత్‌శాఖ మంత్రి అతిషి అనారోగ్యానికి గురవ్వడంతో.. జస్టిస్ కుమార్ ప్రమాణా స్వీకారం జూలై 6కు వాయిదా పడింది.
అయితే ఈ ఉమేష్ కుమార్ నియమాకాన్ని(గవర్నర్ ఆదేశాలను) వ్యతిరేకిస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆదేశించింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు నోటీసులు జారీ చేస్తామని పేర్కొంది. అదే విధంగా డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ ఉమేష్ కుమార్ స్వీకారోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాక జస్టిస్ కుమార్ ప్రమాణ స్వీకారం గురించి ఢిల్లీ స్పీకర్ వీకే సక్సేనా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కోరరాదని సూచించింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టు తదుపరి విచారణ 11న చేపడతామని చెప్పడంతో.. ఉమేష్ కుమార్ నియామకం జూలై 11కు వరకు వాయిదా పడినట్లే. అయితే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కార్ జస్టిస్(రిటైర్డ్) సంగీత్ రాజ్ లోధా పేరును జూన్ 21న ప్రతిపాదించింది. అయితే ఆప్ ప్రభుత్వ విజ్ఞప్తిని పక్కన పెడుతూ జస్టిస్ కుమార్ పేరును ప్రకటిస్తూ కేంద్రం అదే రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై నియంత్రణకు సంబంధించి కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సైతం ఆప్ సర్కార్ సుప్రీంకోర్టులో పోరాడుతోంది. తాజాగా డీఈఆర్‌సీ చైర్మన్ వివాదంతో వీరి మధ్య వైర్యం మరింత పెరిగినట్లైంది.
చదవండి: పురుషులకు జాతీయ కమిషన్.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment