
న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులను ఢీకొట్టిన కారు, వారిని 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలోని వేదాంత్ దేశికా మార్గ్‌లోని బెర్ సరాయ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శనివారం రాత్రి 7.45 గంటల సమయంలో చోటుచేసుకుంది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఎస్‌ఐ) ప్రమోద్, హెడ్ కానిస్టేబుల్ శైలేశ్ చౌహాన్ ట్రాఫిక్ ఉల్లంఘనుల వాహనాలకు చలాన్లు రాస్తున్నారు.
అదే సమయంలో ఓ కారు రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా వేగంగా దూసుకువచి్చంది. దాంతో శైలేశ్, ప్రమోద్ ఆ కారును ఆపారు. అయితే అది ఒక్కసారిగా స్పీడందుకుని ఇద్దరినీ 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లి మాయమైంది. గాయపడ్డ పోలీసులను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. వారు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారని అధికారులు తెలిపారు. కారు యజమానిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment