ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాజియాబాద్‌లో ఓ కారును స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. రాహుల్ విహార్ సమీపంలోని ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్ వే మీద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు స్థానికి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇందులో ఎస్‌యూవీ కారు, స్కూల్ బస్సు ఎదురెదురుగా రావడం కనిపిస్తుంది. రాంగ్ రూట్‌లో వస్తున్న పాఠశాల బస్సు గురుగ్రామ్ వైపు వెళ్తున్న ఎస్‌యూవీ కారును ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది.
ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు రాంగ్ రూట్‌లో వస్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. బస్సు డ్రైవర్, ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆరుగురు ప్రాణాలు పోయాయని ఆరోపిస్తున్నారు.
చదవండి: ‘70 ఏళ్ల మా అమ్మ నా పక్క సద్దుతుంది’.. అనగానే..
Traffic police sleeping, bus was on wrong side. Who is responsible for these deaths.
— HINDUSTAN MERI JAAN (@Hindustan_Meri1) July 11, 2023
Horrific road accident on Delhi-Meerut Expressway, car flipped over, 6 people died. #DelhiMeerutExpressway #RoadAccident #BusAccident #CarAccident #TeJran #Article370 #SeemaHaider pic.twitter.com/yPVPrtnmLF
Comments
Please login to add a commentAdd a comment