bus crash
-
ఘోర ప్రమాదం.. ఎస్యూవీ కారును ఢీకొట్టిన పాఠశాల బస్సు.. వీడియో వైరల్
ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాజియాబాద్‌లో ఓ కారును స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. రాహుల్ విహార్ సమీపంలోని ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్ వే మీద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు స్థానికి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇందులో ఎస్యూవీ కారు, స్కూల్ బస్సు ఎదురెదురుగా రావడం కనిపిస్తుంది. రాంగ్ రూట్లో వస్తున్న పాఠశాల బస్సు గురుగ్రామ్ వైపు వెళ్తున్న ఎస్యూవీ కారును ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు రాంగ్ రూట్లో వస్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. బస్సు డ్రైవర్, ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆరుగురు ప్రాణాలు పోయాయని ఆరోపిస్తున్నారు. చదవండి: ‘70 ఏళ్ల మా అమ్మ నా పక్క సద్దుతుంది’.. అనగానే.. Traffic police sleeping, bus was on wrong side. Who is responsible for these deaths. Horrific road accident on Delhi-Meerut Expressway, car flipped over, 6 people died. #DelhiMeerutExpressway #RoadAccident #BusAccident #CarAccident #TeJran #Article370 #SeemaHaider pic.twitter.com/yPVPrtnmLF — HINDUSTAN MERI JAAN (@Hindustan_Meri1) July 11, 2023 -
Dubai: భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం
అబుదాబీ: దుబాయ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారతీయుడికి భారీ పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని యూఏఈ సుప్రీం కోర్టు ఆదేశించింది. స్టూడెంట్‌గా ఉన్న సమయంలో ఆ యువకుడు యాక్సిడెంట్‌కు గురికాగా, దాని వల్ల అతని జీవితం నాశనం అయ్యిందని.. కాబట్టి భారీగానే పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు తెలిపింది. 2019లో ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. మెట్రో స్టేషన్ పార్కింగ్‌లోకి ప్రవేశించే చోట బస్సు డ్రైవర్ ఓవర్‌హెడ్ హైట్ బారియర్‌ను ఢీకొట్టడంతో.. బస్సు ఎడమ పైభాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. అందులో 12 మంది భారతీయులే కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో అప్పుడు ఇంజినీరింగ్ చదువుతున్న ముహమ్మద్ బైగ్ మీర్జా సైతం గాయపడ్డాడు. తన చివరి సెమీస్టర్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్న అతను.. సెలవుల్లో బంధువుల ఇంటికి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. యాక్సిడెంట్‌కు కారణమైన డ్రైవర్‌కు (ఒమన్‌కు చెందిన వ్యక్తి) 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది అక్కడి చట్టం. అంతేకాదు.. బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హామ్ ‘బ్లడ్ మనీ’(పరిహారపు నగదు) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అప్పట్లో.. ఈ ప్రమాదంలో గాయపడిన మీర్జాకు 1 మిలియన్ దిర్హామ్ చెల్లించాలని యూఏఈ ఇన్సూరెన్స్ అథారిటీ చెప్పింది. అయితే ఆ పరిహారం సరిపోదని బాధితుడి బంధువులు కోర్టుకి ఎక్కారు. తన క్లయింట్ ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడని, సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని, ప్రమాదంలో అతని బ్రెయిన్ సగ భాగం దెబ్బతిందని, ప్రధాన అవయవాలన్నీ పూర్తిగా దెబ్బ తిన్నాయని, పైగా చదువు కూడా పూర్తి చేయలేకపోయాడని, అతని జీవితమే నాశనం అయ్యిందిని.. మీర్జా తరపు న్యాయవాది వాదనలు వినిపించాడు. ఇంతకాలం వాదనలు జరగ్గా.. బుధవారం యూఏఈ సుప్రీం కోర్టు ఐదు మిలియన్ల దిర్హామ్(మన కర్సెనీలో రూ. 11 కోట్లు) మీర్జాకు చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. -
కళ్ల ముందే ఆ పసివాడి ప్రాణం గాల్లో కలిసేది, కానీ..
ఏమరపాటులో జరిగే ప్రమాదాల గురించి తెలియంది కాదు. నిర్లక్క్ష్యం, చిన్నతప్పిదాలతో ప్రాణాలే పొగొట్టుకుంటున్నారు కొంతమంది. అయితే ఇక్కడ మాత్రం ఓ పసివాడి ప్రాణం.. కళ్ల ముందే గాల్లో కలిసేది. కానీ, వాడి అదృష్టం బాగుంది. ఓ పసివాడు వేగంగా తొక్కుకుంటూ మెయిన్ రోడ్డు వరకు చేరుకున్నాడు. వేగంగా వచ్చి అదుపు తప్పి కంట్రోల్ చేయలేక రోడ్డు మీద వెళ్తున్న ఓ బైకును ఢీకొట్టి ఎగిరి రోడ్డ అవతల పడ్డాడు. సరిగ్గా ఆ వెనకే బస్సు వస్తోంది. అయితే సైకిల్ రోడ్డు మీద పడిపోగా.. చిన్నారి కొద్దిలో బస్సు చక్రాల కింద పడకుండా తప్పించుకోగలిగాడు. సైకిల్ పైకి బస్సు ఎక్కేసింది. చిన్న గాయం లేకుండా బయటపడగలిగాడు ఆ పసివాడు. #RoadSafety Share your thoughts... pic.twitter.com/9m4ctrrwJq — Telangana State Police (@TelanganaCOPs) March 25, 2022 తెలంగాణ పోలీసులు ఆ వీడియోను ట్వీట్ చేసి.. కామెంట్ చేయాలంటూ నెటిజన్లను అడిగారు. బైక్ అతను దేవుడిలా వచ్చాడని, ఆ బైక్ వల్ల చిన్నారి ఎగిరి అవతల పడ్డాడని లేదంటే బస్సు కింద పడేవాడేనని అంటున్నారు. కేరళ కన్నూరు జిల్లా తాలిపారంబాకు సమీపంలోని చోరుక్కల వద్ద ఆదివారం (మార్చి 24) సాయంత్రం ఈ ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల ఆ పసివాడు ప్రాణాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. ఆ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో.. వీడియో వైరల్ అవుతోంది. -
ఈజిప్టులో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన కైరో నుండి 320 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఈజిప్టు అసియుట్ దక్షిణ ప్రావిన్స్‌లోని రహదారిపై చోటు చేసుకుంది. అస్సియట్ గవర్నర్ ఎస్సామ్ సాద్ ప్రకటన ప్రకారం రాజధాని కైరో నుంచి అసియుట్‌కు వెళ్తున్న బస్సు, ట్రక్కును ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. రెండు వాహనాలు దగ్ధం కావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏడాది వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ అధికారిక గణాంకాల ప్రకారం ఈజిప్టులో 2019 లో సుమారు 10,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇటీవలి సంవత్సరంలో 3,480 మందికి పైగా మరణించారు. 2018 లో 8,480 కారు ప్రమాదాలు జరగ్గా, 3,080 మందికి పైగా మరణించారు. -
ఈజిప్టులో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
-
లోయలో పడ్డ బస్సు ; 23 మంది దుర్మరణం
పెరు : దక్షిణ అమెరికాలోని పెరులో 50 మందితో ప్రయాణీస్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 23 మంది మృతి చెందారు. మిగిలిన వారు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుస్కో నుంచి పుయెర్టో మల్డొనాడో వెళ్లే మార్గంలో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు పడిపోయిన లోయ లోతు దాదాపు వంద మీటర్లుటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కాగా, రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, పర్వత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం పాములా మెలికలు తిరిగి ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 12కు చేరిన భారత మృతులు
దుబాయి : దుబాయిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భారతీయుల సంఖ్య 12కు పెరిగింది. ఒమన్ నుంచి దుబాయికి వెళుతున్న బస్సు అతివేగంతో ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌బోర్డును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో 12 మంది భారతీయులేనని దుబాయిలోని భారత కాన్సులేట్ జనరల్ విపుల్ తెలిపారు. మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి జయ్శంకర్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. Deeply grieved by the unfortunate bus accident in Dubai that has claimed 12 Indian lives. My sincere condolences to the families. Our Consulate @cgidubai is extending all help. https://t.co/wh2PV8sdMj — Dr. S. Jaishankar (@DrSJaishankar) June 7, 2019 -
దుబాయిలో 8 మంది భారతీయుల మృతి
దుబాయి: యూఏఈలోని దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 31 మంది ప్రయాణికులతో ఒమన్ నుంచి దుబాయికి వస్తుంగడగా ఈ ఘటన చోటుచేసుకుంది. 1/2) We are sorry to inform that as per local authorities and relatives it is so far confirmed that 8 Indians have passed away in Dubai bus accident. Consulate is in touch with relatives of some of the deceased & awaits further details for others to inform their families. — India in Dubai (@cgidubai) June 6, 2019 2/2) The names of those who have passed away are: Mr. Rajagopalan, Mr. Feroz Khan Pathan, Mrs. Reshma Feroz Khan Pathan, Mr. Deepak Kumar, Mr. Jamaludeen Arakkaveettil, Mr. Kiran Johnny, Mr. Vasudev, Mr. Tilakram Jawahar Thakur. — India in Dubai (@cgidubai) June 6, 2019 అతివేగంతో ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌బోర్డును ఢీకొట్టి బస్సు బోల్తాపడింది. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నట్లు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. భారత్‌కు చెందిన రాజగోపాలన్, ఫిరోజ్ ఖాన్ పఠాన్, రేష్మ ఫిరోజ్ ఖాన్ పఠాన్, దీపక్ కుమార్, జమాలుద్దీన్ అరక్కవీటిల్, కిరన్ జానీ, వాసుదేవ్, తిలక్‌రామ్ జవహార్ ఠాకూర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు కాన్సులేట్ అధికారులు తెలిపారు. #هام | في تمام الساعة 5:40 من مساء اليوم، وقع #حادث مروري بليغ لباص مواصلات على متنه 31 راكب يحمل لوحة أرقام سلطنة عمان على شارع الشيخ محمد بن زايد وتحديدا (مخرج الراشدية) الى محطة المترو نتج عنه وفاة 15 راكب من جنسيات مختلفة وإصابة 5 أشخاص آخرون بإصابات بليغة. pic.twitter.com/ma5FRPW9OX — Dubai Policeشرطة دبي (@DubaiPoliceHQ) June 6, 2019 -
లోయలో పడ్డ బస్సు... 23 మంది విద్యార్థులు మృతి
ఖాట్మాండ్ : నేపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 23 మంది విద్యార్థులు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖాట్మాండ్‌లోని సేన్‌చుక్ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి వస్తుండగా శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాజధానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్రీ గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పిన బస్సు 700 మీటర్ల ఎత్తు నుంచి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. కాగా రోడ్లు అధ్వానంగా ఉన్న కారణంగానే తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజుల్లో నేపాల్ జరిగిన రెండో ప్రమాదం ఇది. డిసెంబరు 15న ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు లోయలో పడిపోవడంతో 20మంది మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
లోయలో పడ్డ బస్సు ..19 మంది మృతి
మనీలా: దక్షిణ ఫిలిఫ్పైన్స్ ఒక్సిడెంటల్ మిన్‌డోరో ప్రావిన్స్‌లోని సబ్లాయన్ పట్టణ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.30 గంటలకు జరిగిందిని విపత్తు నిర్వహణాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను దగ్గరలోని మూడు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు. -
ఎదురుదాడికి దిగిన మావోయిస్టులు
చర్ల: ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు మావోయిస్టులు ప్రతికార చర్యలకు దిగారు. తెలంగాణ హైదరాబాద్ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు, మరో ప్రైవేట్ సర్వీసును మావోయిస్టులు దగ్ధం చేశారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగ్దల్పూర్కు ఆర్టీసీ బస్సు వెళుతుండగా.. సుకుమా జిల్లా దోర్నపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్తి గ్రామ సమీపంలో మావోయిస్టులు నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దించేశారు. ఆ తరువాత బస్సు డీజిల్ ట్యాంక్‌ను పగులగొట్టి, ఆయిల్‌ను బస్సులో చల్లి నిప్పంటించారు. ఇదే మార్గం గుండా వెళ్తున్న మరో ప్రైవేటు బస్సు, టిప్పరు, ఒక ట్రాక్టర్‌ను సైతం దగ్ధం చేశారు. ప్రయాణికులు చూస్తుండగానే ఒకరిని కాల్చి చంపారు. మృతుడు కానిస్టేబుల్‌గా భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ, ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్లు సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపునకు చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు మావోయిస్టులు ఎదురుదాడి నేపథ్యంలో ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపధ్యంలో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌కు బయల్దేరారు. అలాగే ఖమ్మం, భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ముందస్తు సమాచారం ఇచ్చి పర్యటించాలని పోలీసు శాఖ సూచించింది. -
పెరూలో బస్సు ప్రమాదం: 9మంది మృతి
లిమా: పెరూ దేశంలో జరిగిన బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. డబుల్ డెక్కర్ టూరిస్టు బస్సు అదుపుతప్పి కొండపై నుంచి పడడంతో తొమ్మిదిమంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 25 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో కెనడియన్, చిలీ దేశస్తుడు కూడా ఉన్నారని రక్షణ సిబ్బంది తెలిపారు. ఈ సంఘటన లిమాలో అధ్యక్షుడి భవనానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆదివారం రాత్రి జరిగిందని పెరూ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. నగర అందాలను చూసేందుకు స్థానిక బస్సు శాన్ క్రిస్టోబల్ కొండపై వెళ్తున్నపుడు ఈ ప్రమాదం సంభవించిందన్నారు. ఆ సమయంలో బస్సు అతివేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోందన్నారు. -
ఘోర ప్రమాదం.. 20మంది చిన్నారులు ఆహుతి
జోహన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులతో వెళుతున్న బస్సు శుక్రవారం ప్రమాదానికి గురైంది. దేశ రాజధాని ప్రిటోరియాకు 70 కిలోమీటర్ల (45 మైళ్ళు) దూరంలో ఉన్న బ్రోంకోర్సట్స్ రూట్ వెరేనా పట్టణాల మధ్య రహదారిపై మినీబస్ -ట్రక్కు గుద్దుకోవడంతో 20మంది చిన్నారులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగడంతో చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనలో మరికొంత మంది విద్యార్థులు గాయపడ్డట్టు తెలుస్తోంది. పారామెడికల్ సిబ్బంది, అగ్రిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాతున్నాయని స్తానిక అధికారులు ఒక ప్రకటనలోతెలిపారు. -
ఘోర బస్సు ప్రమాదం, 18 మంది మృతి
పనామా సిటీ: ఉత్తర అమెరికా దేశం పనామాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని పనామా సిటీకి నైరుతి దిశగా 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంటన్‌లో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సులో 50 మందికి పైగా కూలీలను తీసుకెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలంలోనే 16 మంది మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారని సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జోస్ డొండెరిస్ తెలిపారు. క్షతగాత్రులను హెలికాప్టర్ల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతుఉన్నామని ఆయన వెల్లడించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం : 16 మంది మృతి
రోమ్ : ఉత్తర ఇటలీలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హంగేరికి చెందిని విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, 36 మందికి గాయాలయ్యాయని ఇటలీ పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి పైలాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 52 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా హంగేరియాకు చెందిన 16 నుంచి 18 ఏళ్ల వయస్సున్న విద్యార్థులుగా సమాచారం. స్కూల్ ట్రిప్ ముగించుకొని ఫ్రాన్స్ వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. -
వీకెండ్ టూర్ నుంచి తిరిగొస్తూ..
బ్యాంకాక్: ప్రకృతి సౌందర్యాలను చూస్తూ లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేశారు. మనసు నిండా ఆనందంతో ఇళ్లకు బయలుదేరారు. అయితే గమ్యం చేరేలోపే అనూహ్యరీతిలో మృత్యువాతపడ్డారు. థాయిలాండ్ లోని కాంచనాబురి ప్రాంతంలో ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ సహా 8 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రగాయాలపాలయ్యారు. స్థానిక మీడియా, పోలీసుల కథనం ప్రకారం.. 40 మంది టూరిస్టుల బృందం గత వారం బ్యాంకాక్ నుంచి ప్రఖ్యాత శ్రీనగరింద్ డ్యామ్ పరిసర ప్రాంతానికి పర్యటనకు వెళ్లారు. టూర్ ముగించుకుని ఆదివారం తిరిగివస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. మలుపుల ఘాట్ రోడ్డులో వేగంగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా కొండను ఢీకొట్టడంతో ముందు భాగమంతా నుజ్జునుజ్జయింది. దీంతో మృతదేహాలను వెలికితీయడం కష్టంగా మారింది. సంఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ రహదారిపై అవగాహన లేనందునే డ్రైవర్ పొరపాటు చేసిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
లోయలో పడిన బస్సు :15 మంది మృతి
లిమా : బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడి 15 మంది మృతి చెందగా... మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మధ్య పెరూ ప్రాంతంలో చోటు చేసుకుందని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. క్షతగాత్రులను హురజ్లోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులు వెల్లడించారని చెప్పారు. దాంతో పెరూ రాజధాని లిమాలోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని... ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు. బస్సు లిమా నుంచి లాటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు.