
ఏమరపాటులో జరిగే ప్రమాదాల గురించి తెలియంది కాదు. నిర్లక్క్ష్యం, చిన్నతప్పిదాలతో ప్రాణాలే పొగొట్టుకుంటున్నారు కొంతమంది. అయితే ఇక్కడ మాత్రం ఓ పసివాడి ప్రాణం.. కళ్ల ముందే గాల్లో కలిసేది. కానీ, వాడి అదృష్టం బాగుంది.
ఓ పసివాడు వేగంగా తొక్కుకుంటూ మెయిన్ రోడ్డు వరకు చేరుకున్నాడు. వేగంగా వచ్చి అదుపు తప్పి కంట్రోల్ చేయలేక రోడ్డు మీద వెళ్తున్న ఓ బైకును ఢీకొట్టి ఎగిరి రోడ్డ అవతల పడ్డాడు. సరిగ్గా ఆ వెనకే బస్సు వస్తోంది. అయితే సైకిల్ రోడ్డు మీద పడిపోగా.. చిన్నారి కొద్దిలో బస్సు చక్రాల కింద పడకుండా తప్పించుకోగలిగాడు. సైకిల్ పైకి బస్సు ఎక్కేసింది. చిన్న గాయం లేకుండా బయటపడగలిగాడు ఆ పసివాడు.
#RoadSafety
— Telangana State Police (@TelanganaCOPs) March 25, 2022
Share your thoughts... pic.twitter.com/9m4ctrrwJq
తెలంగాణ పోలీసులు ఆ వీడియోను ట్వీట్ చేసి.. కామెంట్ చేయాలంటూ నెటిజన్లను అడిగారు. బైక్ అతను దేవుడిలా వచ్చాడని, ఆ బైక్ వల్ల చిన్నారి ఎగిరి అవతల పడ్డాడని లేదంటే బస్సు కింద పడేవాడేనని అంటున్నారు.
కేరళ కన్నూరు జిల్లా తాలిపారంబాకు సమీపంలోని చోరుక్కల వద్ద ఆదివారం (మార్చి 24) సాయంత్రం ఈ ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల ఆ పసివాడు ప్రాణాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. ఆ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో.. వీడియో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment