![23 People Killed in Bus Crash in Peru - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/3/peru%20copy.jpg.webp?itok=w4ERHKYl)
పెరు : దక్షిణ అమెరికాలోని పెరులో 50 మందితో ప్రయాణీస్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 23 మంది మృతి చెందారు. మిగిలిన వారు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుస్కో నుంచి పుయెర్టో మల్డొనాడో వెళ్లే మార్గంలో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు పడిపోయిన లోయ లోతు దాదాపు వంద మీటర్లుటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కాగా, రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, పర్వత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం పాములా మెలికలు తిరిగి ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment