Peru
-
పెరూ మాజీ అధ్యక్షుడు ఫుజిమొరి కన్నుమూత
లిమా (పెరూ): పెరూ మాజీ అధ్యక్షుడు అల్బెర్టో ఫుజిమొరి బుధవారం రాజధాని లిమాలో కన్నుమూశారు. దీర్ఘ కాలంగా క్యాన్సర్‌తో పోరాడి మరణించారని ఆయన కుమార్తె కీకో ఫుజిమొరి ‘ఎక్స్’లో ప్రకటించారు. విద్యావేత్త నుంచి పెరూ రాజకీయాల్లోకి మెరుపులా వచ్చిన ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాయి. అవే సంస్కరణలు ఆయన్ను చిక్కుల్లోకీ నెట్టాయి. వామపక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చి తిరుగుబాటుదారులపై తీవ్రమైన అణచివేతను అమలు చేశారు. చివరకు దేశం నుంచి పారిపోయి, ఆ తరువాత జైలు పాలై.. తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో 86 ఏళ్ల వయసులో మృతి చెందారు. 2026 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేయాలని తన తండ్రి భావిస్తున్నారంటూ కొన్ని నెలల క్రితం కీకో ప్రకటించడం గమనార్హం.ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. పెరూ స్వాతంత్య్ర దినం 1938 జూలై 28వ తేదీన రాజధాని లిమాలో ఫుజిమొరి జని్మంచారు. ఈయన కు టుంబం జపాన్ నుంచి వలస వచ్చింది. గణిత శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ అయిన ఫుజిమొరి 1990 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనెవరికీ తెలియదు. తన ప్రచార ర్యాలీల్లో ట్రాక్టర్ నడుపుతూ అందరినీ ఆకట్టుకున్నారు. వామపక్షాల భారీ మద్దతుతో ప్రఖ్యాత రచయిత మారియో వర్గాస్ లోసాను ఓడించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ద్రవ్యోల్బణం తగ్గిస్తానన్న హామీతో అధికారంలోకి వచి్చన ఫుజిమొరి రెండో వారంలోనే నిత్యావసరాలపై సబ్సిడీలను ఎత్తివేయడం ‘ఫుజీ–షాక్’గా పేరుగాంచింది. డజన్ల కొద్దీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. వాణిజ్య సుంకాలను తగ్గించారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు పెరూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. లాటిన్ అమెరికాలో అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా మారడానికి పునాదులు వేశాయి. ఇక స్వేచ్ఛా–మార్కెట్ సంస్కరణలు, కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టాల అమలు కోసం రాజ్యాంగాన్ని పునర్నిరి్మంచారు. వ్యతిరేకత.. అణచివేత.. కేసులు.. 1992లో పార్లమెంట్‌పైకి యుద్ధ ట్యాంకులను ఉపయోగించడంతో పెరూ ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత పెరిగింది. పదేళ్ల పాలనలో అవినీతి కుంభకోణాలు కూడా ప్రజలను ఆయనకు వ్యతిరేకంగా మార్చాయి. అయినా రెండోసారి అధికారంలోకి వచ్చాక తిరుగుబాటుదారులపై తీవ్రమైన అణచివేత, నిర్బంధం అమలు చేశారు. 2000లో మూడోసారి గెలిచిన తరువాత ఫుజిమొరి ఉన్నత సలహాదారు, గూఢచారి చీఫ్ వ్లాదిమిరో మాంటెసినోస్ రాజకీయ నాయకులకు లంచం ఇస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఫుజిమొరి తన పూరీ్వకుల జపాన్‌కు పారిపోయారు. టోక్యో నుంచి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంపారు. రెండు దేశాల పౌరసత్వం ఉన్న ఆయన.. ఆ తరువాత జపాన్ సెనేటర్ పదవికి పోటీపడి ఓడిపోయారు. షైనింగ్ పాత్ మిలిటెంట్ల అణచివేతకు ఆదేశించారనే ఆరోపణలతో ఫుజిమొరిపై పలు కేసులు నమోదయ్యాయి. 25 ఏళ్ల జైలు శిక్ష 2005లో పెరూకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2007లో చిలీ వచి్చన ఆయన్ను అక్కడి అధికారులు 2009లో పెరూకు అప్పగించారు. పలు కేసుల్లో దోషిగా 25 ఏళ్ల జైలుపాలయ్యారు. తరచూ అనారోగ్యం పాలవ్వడంతో క్షమాభిక్ష కోసం అప్పీలు చేశారు. అయితే జైలు నుంచి బయటకు రావడానికి అదో ఎత్తుగడగా ప్రత్యర్థులు తోసిపుచ్చారు. అప్పటి అధ్యక్షుడు పెడ్రో పాబ్లో కుజిన్స్కి 2017లో ఫుజిమొరికి క్షమాభిక్ష ప్రసాదించారు. కొన్ని నెలల తరువాత కుజిన్‌స్కీ అభిశంసనకు గురయ్యారు. పెరూ న్యాయస్థానం ఫుజిమొరి క్షమాభిక్షను రద్దు చేసి, ప్రత్యేక జైలుకు పంపింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు 2023లో కోర్టు క్షమాభిక్షను పునరుద్ధరించింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మొదటి భార్య సుసానాతో విభేదాలు రావడంతో విడిపోయారు. తరువాత ఆయన కుమార్తె కీకోను ప్రథమ మహిళగా నియమించారు. ఆమె మూడుసార్లు పెరూ అధ్యక్ష పదవికి పోటీ పడి, ఓడిపోయారు. కుమారుడు కెంజో కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. -
22 ఏళ్ల క్రితం అదృశ్యం.. చెక్కుచెదరని స్థితిలో మృతదేహం!
22 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ పర్వతారోహకుడి మృతదేహాం పెరూ దేశంలో తాజాగా బయటపడింది. మృతుడిని అమెరికాకు చెందిన విలియం స్టాంప్ఫ్ల్గా గుర్తించారు. జూన్ 2002లో ఆయన ఆదృశ్యమవ్వగా అప్పుడు అతని వయసు 59 ఏళ్లు. పెరూలోని హుస్కరన్ అనే పర్వతాన్ని అధిరోహిస్తూ మిస్ అయ్యారు. ఆ పర్వతం ఎత్తు 6,700 మీటర్లు(22,000 అడుగులు). ఆ సమయంలో విలియం కోసం రెస్క్యూ బృందాలు ఎంత గాలించిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో పర్వతారోహకుడి కుటుంబం అతడిపై ఆశలు వదులుకుంది. వాతావరణ మార్పుల వల్ల ఆండీస్‌లోని కార్డిల్లెరా బ్లాంకా శ్రేణిలో మంచు కరిగిపోవడంతో 22ఏళ్ల క్రితం అదృశ్యమైన విలియం మృతదేహం బయటపడినట్లు పెరూవియన్ పోలీసులు పేర్కొన్నారు.అయితే ఇన్నేళ్ల అతని మృతదేహం దొరికినప్పటికీ.. అది చెక్కుచెదరని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పర్వతారోహకుడి శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అతడి శరీరం మునుపటిలానే ఉందని, ఒంటిపై ఉన్న బట్టలు, బూట్లు మంచులో అలాగే భద్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు.అతని జేబులో లభించిన పాస్‌పోర్టు ఆధారంగా మృతుడిని గుర్తించామని, వారి కుటుంబసభ్యులను సంప్రదించి మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఈశాన్య పెరూలోని హుస్కరన్, కాషాన్ వంటి పర్వతాలను దేశ, విదేశీ పర్వతారోహకులను ఆకర్షిస్తుంటాయి. కాగా గత మేలో ఇజ్రాయెల్, ఇటలీకి చెందిన ఇద్దరు పర్వతారోహకులు హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తూ మృతి చెందారు. -
పెరూలో భారీ భూకంపం
పెరూ: దక్షిణ పెరూలోని ఎరెక్విపా ప్రాంతంలో శుక్రవారం(జూన్28) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డవారికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది అనే దానిని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని ప్రధాని గుస్తావో అడ్రియన్జెన్ తెలిపారు. -
పెరూలో యూపీఐ చెల్లింపులు..
న్యూఢిల్లీ: ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ తాజాగా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భా గంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వంటి రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థను పెరూలో అందుబాటులోకి తేనున్నాయి.ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే దక్షిణ అమెరికాలో దీన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా పెరూ స్థానం సంపాదించనుంది. రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్‌ను ఆ దేశంలో స్థాపించడంతోపాటు వ్యక్తు లు, వ్యాపార సంస్థల మధ్య తక్షణ చెల్లింపులను అందించేందుకు సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుంది.ఇవి చదవండి: బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..! -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇతడే.. వయసెంతంటే!
ఇంతవరకు ప్రపంచంలో అత్యంత వృద్ధుల జాబితాను చూశాం. ఇటివల సుదీర్థకాలం జీవించి ఉన్న వృద్ధులను ఓ ఐదుగురి గురించి తెలుసుకున్నాం. వారిలో కొందరూ గిన్నిస్ రికార్డులకెక్కారు కూడా. వాళ్లందర్నీ కాలదన్నేలా ఎక్కువ కాలం జీవించిన మరో వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. ఇంతవరకు గిన్నిస్ రికార్డులో పేరు నమోదు చేసుక్ను ఆ వృద్ధుల కంటే ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి అతడే. మంచి ఆరోగ్యంతో జీవించి ఉన్న వృద్ధుడు. అతడు పుట్టింది ఎప్పుడో వింటే ఆశ్చర్యపోతారు. అన్ని దశాబ్దాలు ఎలా జీవించాడా? అనిపిస్తుంది. ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరంటే.. హువానుకోలోని సెంగ్రల్ పెరువియన్ ప్రాంతానికి చెందిన మార్సెలినో అబాద్. అతడి వయసు 124 ఏళ్లు అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. సుదీర్ఘకాలం జీవించిన వృద్ధుడిగా ధృవీకరించింది. అత్యంత పురాతనమైన వ్యక్తి కూడా అని తెలిపింది. అన్నేళ్లు అబాద్ జీవించడానికి అతడి అనుసరించిన జీవనశైలేనని చెబుతోంది అక్కడి ప్రభుత్వం. ప్రశాంతతకు పెద్ద పీఠ వేస్తూ ఆనందంగా ఉండటమే గాక అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతాడని మెచ్చుకుంది. ఈ ఏప్రిల్ 5న తన 124వ పుట్టిన రోజుని జరుపుకున్నాడు. అంతేగాదు పెరువియన్ అధికారులు అతడే అత్యంత వృద్ధ వ్యక్తి అని గిన్నిస్ వరల్డ్ రికార్డుకు దరఖాస్తుల చేశారు. అందుకు సంబంధించిన అధికారిక పత్రాలను కూడా సమర్పించినట్లు తెలిపారు. తప్పకుండా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ దరఖాస్తులను స్వీకరిస్తుందని ధీమాగా చెప్పారు అధికారులు. అయితే అక్కడ ప్రభుత్వం ఈ విషయాన్ని 2019లో గుర్తించింది. ప్రభత్వ పెన్షన్ పొందుతూ వృద్ధాశ్రమంలో ఉండటంతో అతని ఐడీతో సహా ఈ విషయాన్ని అదికారులు గుర్తించి వెల్లడించటం జరిగింది. అతడి ఆరోగ్య రహస్యం ఏంటంటే.. అబాద్ తన డైట్లో మంచి పండ్లు ఉండేలా చూసుకుంటాడు. అలాగే గొర్రె మాంసం ఇష్టంగా తింటాడట. పెరువియన్ సంప్రదాయం ప్రకారం తినే కోకా ఆకులను ప్రతిరోజు నమలడం అలవాటు చేసుకున్నానని. బహుశా ఇంతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి అది కూడా ఒక కారణమని అబాద్ చెప్పారు. అంత క్రితం గిన్నిస్ రికార్డులకెక్కిన వారి వయసు.. ఇంతకు మునుపు గిన్నిస్ రికార్డులకెక్కిన వారి వయసు పరిశీలిస్తే..114 ఏళ్ల జీవించిన వెనిజులా వ్యక్తి మరణాంతరం గిన్నిస్ రికార్డులకెక్కాడు. ప్రస్తుతం జీవించి గిన్నిస్ రికార్డులకెక్కిన వృద్ధుడి వయసు 111 ఏళ్లు. అతనితోపాటు ఇప్పటి వరకు జీవించి ఉన్న వృద్ధ మహిళ వయసు కేవలం 117 ఏళ్లు మాత్రమే. అయితే ఇప్పుడు పెరుకి చెందిన అబాద్ అనే వృద్ధుడే వాళ్లందర్నీ వెనక్కినెట్టి ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ రికార్డులకెక్కడం ఖాయం కదూ..! (చదవండి: ఈ పువ్వులతో మధుమేహానికి చెక్ ! ఎలాగంటే..?) -
పెరూ అధ్యక్షురాలి ఇంట్లో ‘రోలెక్స్’ల కోసం సోదాలు!
లీమా: రోలెక్స్ గేట్ వ్యవహారం పెరూను కుదిపేస్తోంది. అధ్యక్షురాలు డినా బొలార్టీ వద్ద 10కి పైగా అతి ఖరీదైన లెక్స్ గడియారాలున్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. వాటికోసం కోర్టు ఆదేశాలతో లిమాలోని ఆమె నివాసంలో పోలీసులు సోదా లు నిర్వహించారు! సోదాలను టీవీ చానల్లో ప్రసారం చేశారు. వాచ్‌లు దొరికాయో లేదో వెల్లడించలేదు. తనవద్ద 18 ఏళ్ల వయసులో సొంత డబ్బులతో కొనుక్కున్న ఒకే రోలెక్స్ ఉందని డినా అంటున్నారు. -
Peru: ఏలియన్ మమ్మీల గుట్టు రట్టు.. అసలు కథేంటంటే..
లిమా: పెరూ రాజధాని లిమా ఎయిర్‌పోర్టులో గత ఏడాది దొరికిన ఏలియన్ మమ్మీల మిస్టరీ వీడింది. ఇవి ఏలియన్ మమ్మీలనేది పెద్ద జోక్ అని ఆర్కియాలజిస్టులు తేల్చారు. లిమా ఎయిర్‌పోర్టులో దొరికిన రెండు బొమ్మలు మనుషులు లేదా జంతువుల ఎముకల నుంచి తయారు చేసినవి అయి ఉండొచ్చని సైంటిస్టులు వెల్లడించారు. ‘అవి ఏలియన్ మమ్మీలు కానే కావు. జంతువుల ఎముకలను మోడ్రన్ గ్లూతో అతికించి తయారు చేసిన బొమ్మలు’అని పెరూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెడిసిన్‌లో పనిచేసే ఆర్కియాలజిస్ట్ ఒకరు తెలిపారు. కాగా, గత ఏడాది అక్టోబర్‌లో లిమా ఎయిర్‌పోర్టులోని డీహెచ్ఎల్ కొరియర్ సంస్థకు చెందిన కార్డ్‌బోర్డు బాక్సులో ఏలియన్ మమ్మీలుగా తొలుత అందరూ భావించిన రెండు బొమ్మలు దొరికాయి. అప్పటి నుంచి ఏలియన్లు ఉన్నారని, అవి భూమి మీదకు వచ్చాయన్న పుకార్లు ఊపందుకున్నాయి. తాజాగా సైంటిస్టులు పరిశోధన చేసి క్లారిటీ ఇవ్వడంతో ఏలియన్ మమ్మీల గుట్టురట్టయింది. ఇదీచదవండి.. ఉక్రెయిన్‌పై యూఎన్ కీలక ప్రకటన -
పురాతన క్రిస్మస్ సంత! ఎక్కడ జరుగుతుందంటే..?
దక్షిణ అమెరికా దేశమైన పెరులో పురాతనమైన క్రిస్మస్ సంత ఏటా డిసెంబర్ 24న ప్రారంభమవుతుంది. ఈ సంత దాదాపు ఐదువందల ఏళ్లకు పైగా కొనసాగుతోంది. పెరులోని కుస్కో నగరంలో ఏర్పాటు చేసే ఈ సంతకు దేశం నలుమూలలకు చెందిన హస్తకళా నిపుణులు తాము తయారు చేసిన బొమ్మలు, చిత్రపటాలు, ఇతర కళాఖండాలతో చేరుకుంటారు. క్రిస్మస్ రోజు అర్ధరాత్రి వరకు ఈ సంత కొనసాగుతుంది. ‘శాంచురాంటికై’ పేరుతో ఈ సంతను ఏర్పాటు చేయడాన్ని పెరు ప్రజలు పండుగలాగా జరుపుకొంటారు. వీథుల్లో నృత్యగానాలతో ఊరేగింపులు జరుపుతూ సందడి చేస్తారు. ఈ సంతలో రకరకాల పరిమాణాల్లో తయారు చేసిన బాల ఏసు బొమ్మలు, ఏసుక్రీస్తు జన్మించిన పశువులపాక నమూనా బొమ్మలు, ఉయ్యాలలోని ఏసు బొమ్మలు, బాల ఏసును తిలకించడానికి వచ్చిన దేవదూతల బొమ్మలు వంటివి అమ్ముతారు. వెదురు, కలప, పింగాణి, వెండి వస్తువులను, సంప్రదాయకరమైన ఆభరణాలను, క్రిస్మస్ అలంకరణల కోసం ఉపయోగించే ఆలివ్ కొమ్మలు, అడవి మొక్కలు వంటివి కూడా అమ్ముతారు. పెరులో జరిగే ఈ సంతను యూనిసెఫ్ ప్రపంచ వారసత్వ వేడుకగా గుర్తించింది. (చదవండి: మగువ కన్నీళ్ల వాసన పురుషుడులోని దూకుడుతనాన్ని తగ్గిస్తుందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి
లీమా: దక్షిణ అమెరికా దేశం పెరూలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెరూలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్లిన కారణంగా ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. ఆండెస్ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళ్తుతుండగా అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా 200 మీటర్ల లోతులో ఉన్నలో లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. గత నెలలో కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనాటి ప్రమాదంలో 13 మంది చనిపోయారు. పెరూలో సరైన రోడ్డు సదుపాయాలు లేక ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైంది. ఇక్కడ రాత్రిపూట, పర్వతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి -
వింతజీవుల అకస్మాత్తు దాడులు.. గ్రహాంతరవాసులే అంటున్న జనం!
గ్రహాంతరవాసులు మనం ఉంటున్న భూమి మీద లేదా విశ్వంలోని మరే ఇతర గ్రహం మీదనైనా నివసిస్తున్నారా? ఈ ప్రశ్నకు ప్రపంచంలోని ఏ శాస్త్రవేత్త కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి గురించి వేల సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. భూమిపై గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి శాస్త్రవేత్తల వాదనలు రెండు రకాలుగా ఉన్నాయి. గ్రహాంతర వాసులు విశ్వంలో ఎక్కడో ఉన్నారని, ఏదో ఒక రోజు తప్పకుండా మన ముందుకు వస్తారని ఒక వర్గం చెబుతుండగా, మరోవర్గం ఈ వాదనను పూర్తిగా ఖండిస్తోంది. పెరూలో 7 అడుగుల వింతజీవులు తాజాగా పెరూ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఆల్టో నానే జిల్లాలో ఇలాంటి ఉదంతం తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రహాంతరవాసుల పొడవు 7 అడుగులు ఉంది. వాటి కళ్లు పసుపు రంగులో ఉన్నాయి. చూపరులకు ఆ వింత జీవులు భయం గొలుపుతున్నాయి. ఆ వింతజీవిని చూసిన ఓ బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆమెను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. ఎదుటివారి ముఖంపై ‘ఏలియన్స్’ దాడి పెరూలోని ఆల్టో నానే జిల్లా నివాసి ఇక్విటు మాట్లాడుతూ గత కొంతకాలంగా నల్లటి హూడీలు ధరించిన ఈ ‘ఏలియన్లు’ జనాలపై దాడిచేస్తున్నాయని చెప్పారు. అలాగే ఇక్కడి గిరిజన ప్రాంతంలో నివసించే ఇకూటి జాతి ప్రజలు కూడా అకస్మాత్తుగా జనాల మధ్యలోకి వచ్చి, దాడి చేసి పారిపోతున్నారని తెలిపారు. వారు ఎదుటివారి ముఖానికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారని, ఇది ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నదని తెలిపారు. 15 ఏళ్ల బాలికపై దాడి నెల రోజుల క్రితం ఆల్టో నానే జిల్లాలో తొలిసారిగా ఏలియన్స్‌గా చెబుతున్న వింత జాతి జీవులు కనిపించాయని అంటున్నారు. వారి దాడుల కారణంగా 15 ఏళ్ల బాలిక గాయాలతో ఆసుపత్రిలో చేరింది. ఈ అమ్మాయి గ్రహాంతరవాసులను చూసి భయపడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ‘వింత జీవుల నుంచి ప్రజలను కాపాడుతున్నాం’ మరోవైపు ఈ జీవులు గ్రహాంతరవాసులా లేదా మరొకరా అనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరికొందరు హుడీ ధరించిన ఇలాంటి జీవిని తమ జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేదని అంటున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే ఆ వింతజీవులు చాలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నాయి. ఆల్టో నానే జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు జైరో రెటెగుయ్ దవిలా మాట్లాడుతూ గ్రహాంతరవాసులుగా కనిపించినవారు ఆ బాలిక మెడపై గాయం చేశారన్నారు. దీంతో రాత్రిపూట తాము కాపలాకాస్తూ, స్థానికులను రక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ వింతజీవులు రాత్రిపూట మాత్రమే బయటకు వస్తుండటంతో, వారి రూపాన్ని సరిగా గుర్తించలేకపోతున్నామన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఇది కూడా చదవండి: Pakistan Richest Man: కేవలం 500 డాలర్లతో అమెరికా చేరుకుని.. -
మనికాకు చేదు అనుభవం.. ఒక్క ట్వీట్‌తో తిరిగొచ్చేలా! థాంక్యూ సర్..
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా.. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ధన్యవాదాలు తెలిపింది. తన బ్యాగేజ్‌ను ఇంటికి చేర్చేలా చొరవ తీసుకున్నందుకు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది. కాగా పెరూ టోర్నమెంట్లో ఆడిన భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనిక బత్రా డచ్ విమానయాన సంస్థకు చెందిన కేఎల్ఎమ్ ఎయిర్‌లైన్స్‌లో భారత్‌కు చేరుకుంది. అయితే ఈ విమానంలో తన విలువైన బ్యాగేజ్‌ను మరిచిపోయిన మనిక ఇక్కడికి వచ్చాక సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థను సంప్రదించినప్పటికీ ఆశించిన స్పందన కరువైంది. దీంతో ఆమె.. సాయం చేయాలని కోరుతూ జ్యోతిరాదిత్య సింధియాకు ట్వీట్ చేసింది. మనికా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మంత్రి కార్యాలయం.. ‘‘ఢిల్లీకి రానున్న విమానంలో బ్యాగేజీ ఉంది. రేపు ఉదయం 01:55 నిమిషాలకు కలెక్ట్ చేసుకోవచ్చు’’ అని బుధవారం ట్విటర్ వేదికగా మనికాకు రిప్లై ఇచ్చింది. కాగా డచ్ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన తాను బ్యాగేజీ పోగొట్టుకున్నానని మనిక మంగళవారం ట్వీట్ చేసింది. ఈ విషయం గురించి ఎయిర్‌పోర్టు సిబ్బందిని ఆరా తీసినా ఫలితం లేకుండా పోయిందంటూ మనికా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయగా.. ఆమెకు ఊరట లభించింది. Thank you so much @JM_Scindia sir and his office for prompt action and helping me in getting my baggage. I have received it this morning. https://t.co/XBVeQIApXO — Manika Batra (@manikabatra_TT) August 9, 2023 -
Earthquake: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి..
పెరు, ఈక్వెడార్‌లోని గయాస్ తీరప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.8గా నమోదైంది. 66 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం ధాటికి చాలా ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా మచాలా, క్యుయెన్సా నగరాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. భూప్రకంపనల ధాటికి జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా మొత్తం 14 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈక్వెడార్ అధ్యక్షుడు గ్విల్లెర్మో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మచాలాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఇతర నగరాలను కూడా సందర్శిస్తానని చెప్పారు. చదవండి: కోవిడ్ డేటాను చైనా తొక్కిపెడుతోంది -
అవును... ఇది నిజమే!
► జపాన్ లోని ఆసోచి కొండల్లో ‘విండ్ ఫోన్’ అనే టెలిఫోన్ బూత్ ఉంది. ‘విండ్ ఫోన్ ఏమిటి? అక్కడెక్కడో కొండల్లో ఉండడం ఏమిటి?’ అనుకుంటున్నారా! విషయంలోకి వస్తే...2011లో జపాన్ లో భూకంపం వచ్చి ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన వారితో ఆత్మీయులకు మాట్లాడే అవకాశం లేదు. వారు ఎక్కడో ఉన్నట్లుగానే భావించి ఫోన్లో మాట్లాడి మనసులో ఉన్న బాధను దించుకోవడమే ఈ ‘విండో ఫోన్’ ఉద్దేశం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో కూడా ‘విండ్ ఫోన్’లు ఏర్పాటయ్యాయి. ► పెరూలో ‘టకనాకుయ్’ పేరుతో ప్రతి సంవత్సరం ‘ఫైటింగ్ ఫెస్టివల్’ జరుగుతుంది. ‘టకనాకుయ్’ అంటే ఒకరితో ఒకరు తలపడడం. అంతమాత్రాన ఈ ఫైటింగ్ ఫెస్టివల్లో రక్తం కారేలా కొట్టుకోరు. ఒక విధంగా చెప్పాలంటే ఉత్తుత్తి ఫైటింగ్ అన్నమాట! మనసులో ఉన్న కోపం, ఒత్తిడి, ఆందోళనను వదిలించుకోవడానికి ఈ ‘ఫైటింగ్ ఫెస్టివల్’ ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది. దీనికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది. -
Brazil and Peru: ఆ లాటిన్ అమెరికా దేశాల్లో... ‘లా’వొక్కింతయు లేదు!
దక్షిణ అమెరికాలో ముఖ్య దేశాలైన బ్రెజిల్, పెరు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. బ్రెజిల్లో మాజీ అధ్యక్షుడే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ దేశాన్ని రావణకాష్టం చేస్తుండగా, పెరులో పదవీచ్యుతుడైన అధ్యక్షునికి మద్దతుగా ప్రజలే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో రోడ్లెక్కుతున్నారు! బ్రెజిల్లో నిరసనకారులు అధ్యక్ష భవనంతో పాటు ఏకంగా పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థల భవనాలపైనే దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. పెరులోనూ జనం రాజధానితో పాటు దేశమంతటా భారీగా ఆందోళనలకు దిగుతూ అట్టుడికిస్తున్నారు. వీటికి సమీప భవిష్యత్తులో కూడా తెర పడే సూచనలు కన్పించడం లేదు! బ్రెజిల్ బేజారు బోల్సొనారో అనుయాయుల అరాచకం కొత్త అధ్యక్షుడు డ సిల్వా ఆపసోపాలు దక్షిణ అమెరికాలో కొంతకాలంగా ‘గులాబి గాలి’ వీస్తోంది. చాలా దేశాల్లో ప్రధానంగా వామపక్ష భావజాలమున్న పార్టీలే అధికారంలోకి వస్తున్నాయి. ఈ ఖండంలోని అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌లోనూ అదే జరిగింది. గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో రైట్ వింగ్ నాయకుడైన జెయిర్ బోల్సొనారో వెంట్రుకవాసి తేడాలో ఓటమి చవిచూశారు. 51 శాతం ఓట్లతో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా నెగ్గారు. కానీ ఈ ఫలితాలను ఒప్పుకుని గద్దె దిగేందుకు బోల్సొనారో ససేమిరా అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వాటికి సుప్రీంకోర్టు మద్దతూ ఉందని ఆరోపణలు గుప్పించారు. ఈవీఎంలపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాతి పరిణామాల్లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, అవినీతి ఆరోపణలపై విచారణను తప్పించుకునేందుకు అంతిమంగా అమెరికాలో తేలారు! కానీ, ‘‘అధికారం మీ చేతుల్లోనే ఉంది. సైన్యం ఇప్పటికీ నా మాటే వింటుంది. దొంగల పాలనను కూలదోయండి’’ అంటూ అక్కడినుంచే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ వస్తున్నారు. ఫలితంగా కొంతకాలంగా బ్రెజిల్ అల్లర్లు, ఆందోళనలు, గొడవలతో అట్టుడుకుతోంది. పార్లమెంటుపై దాడులు ముఖ్యంగా జనవరి 8న కరడుగట్టిన బోల్సొనారో మద్దతుదారులు ఉన్నట్టుండి వేల సంఖ్యలో అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. సైన్యం తిరగబడి ఎన్నికల ఫలితాలను రద్దు చేసి బోల్సొనారోను తిరిగి అధ్యక్షున్ని చేయాలనే డిమాండ్‌తో అరాచకానికి దిగారు. ఆ సమయంలో భద్రతా దళాలు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. పైగా ఆందోళనలు జరుగుతుండగానే పలువురు నేతలు, అధికారులు నవ్వుతూ ఫొటోలు తీసుకుంటూ కన్పించారు! నిజానికి అప్పటికి పది వారాలుగా నిరసనకారులు ఏకంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందే టెంట్లు వేసుకుని మరీ ఆందోళనలు చేస్తున్నా వాటిని ఆదిలోనే తుంచేసేందుకు డ సిల్వా పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. తిరుగులేని ప్రజాదరణ లులా డ సిల్వా సొంతమైనా కీలక సైన్యం మద్దతు ఆయనకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపించాయి. దాంతో పరిస్థితిని ఏదోలా అదుపులోకి తెచ్చేందుకు డ సిల్వా కిందా మీదా పడుతున్నారు. ► మాజీ న్యాయ మంత్రి ఆండెర్సన్ టోరెస్‌తో పాటు పలువురు బోల్సొనారో సన్నిహితులను అరెస్టు చేశారు. ► సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందన్న వార్త నేపథ్యంలో జనవరి 8 ఆందోళనలకు బాధ్యున్ని చేస్తూ ఆర్మీ చీఫ్‌ను తాజాగా తొలగించారు. ► అల్లర్ల వెనక బోల్సొనారో హస్తంపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఏం జరగనుంది... పరిస్థితులను చూస్తుంటే దేశంలో అల్లర్లకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే సూచనలు కన్పించడం లేదు. అవినీతి ఆరోపణలపై ఇటీవలే ఏడాదిన్నర పాటు ఊచలు లెక్కించిన డ సిల్వాకు దేశాన్ని పాలించే అర్హత లేదంటూ బోల్సొనారో మద్దతుదారులు ఇప్పటికీ దేశవ్యాప్తంగా చెలరేగిపోతూనే ఉన్నారు. సైన్యం పూర్తి మద్దతు లేకపోతే వాటికి డ సిల్వా ఏ మేరకు అడ్డుకట్ట వేయగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలుమార్లు సైనిక కుట్రలను, నియంతల పాలనలను చవిచూసిన బ్రెజిల్లో మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తుతాయో, ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాల్సిందే. పెరు.. పేదల తిరుగుబాటు అధ్యక్షురాలు బొలార్టేపై వెల్లువెత్తిన వ్యతిరేకత మాజీ అధ్యక్షుడు కాస్టిలోకు మద్దతుగా ఆందోళనలు ఆమె పేరు మార్గరిటా కొండొరీ. పెరులో ఆండీస్ పర్వత శ్రేణుల్లోని అత్యంత వెనకబడ్డ పునో ప్రావిన్స్‌లో స్థానిక అయ్మారా తెగకు చెందిన వృద్ధురాలు. వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా రెండు రోజుల పాటు అత్యంత కఠినమైన బస్సు ప్రయాణం చేసి మరీ రాజధాని లిమా చేరుకుంది. ‘‘మేమంతా పేదరికంలో మగ్గుతున్నాం. మాపై ఉగ్రవాద ముద్ర వేసినా పర్లేదు. బొలార్టే రాజీనామా చేసేదాకా రాజధాని నుంచి కదిలే ప్రసక్తే లేదు’’ అంటూ సహచర ఆందోళనకారులతో కలిసి పెద్దపెట్టున నినదిస్తోంది. పెరులో దాదాపు ఆరు వారాలుగా ఇదే పరిస్థితి! స్థానిక తెగలకు చెందిన వామపక్ష ఫైర్ బ్రాండ్ నాయకుడు కాస్టిలోను అధ్యక్ష పదవి నుంచి కూలదోసి జైలుపాలు చేసి ఉపాధ్యక్షురాలు దినా బొలార్టే గత డిసెంబర్ 7న అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటినుంచీ ఆమెకు వ్యతిరేకంగా మొదలైన ప్రజాందోళనలు నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. దేశమంతటికీ వ్యాపించడమే గాక హింసాత్మకంగా మారుతున్నాయి. మార్గరిటా మాదిరిగా అత్యంత మారుమూల ప్రాంతాల నుంచి కూడా జనం అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి మరీ లిమాకు ప్రవాహంలా వచ్చి పడుతున్నారు. బొలార్టే తప్పుకుని ఎన్నికలు ప్రకటించే దాకా దాకా ఇంచు కూడా కదిలేది లేదని భీష్మిస్తున్నారు. భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏమిటి సమస్య? ప్రపంచంలో రెండో అతి పెద్ద రాగి ఉత్పత్తిదారు అయిన పెరులో 1990 నుంచి దశాబ్దకాలపు నియంతృత్వ పాలన అనంతరం 2000లో ప్రజాస్వామ్య పవనాలు వీచాయి. 2001 నుంచి 2014 దాకా జోరుగా సాగిన ఖనిజ నిల్వల ఎగుమతితో జీడీపీ రెట్టింపు వృద్ధి రేటుతో దూసుకుపోయింది. కార్మికుల వేతనాలూ ఇతోధికంగా పెరిగాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు మాత్రం బాగా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాయి. సంపదంతా ప్రధానంగా నగర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. మరోవైపు అవినీతి, అవ్యవస్థ నానాటికీ పెచ్చరిల్లాయి. స్థానిక ప్రభుత్వ పెద్దలు బడ్జెట్ కేటాయింపులను ఇష్టారాజ్యంగా భోంచేయడం ప్రారంభించారు. దాంతో కొన్నేళ్లుగా దేశంలో రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. గత రెండేళ్లలోనే ఏకంగా ఐదుగురు అధ్యక్షులు మారారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో లెఫ్టిస్టు అయిన కాస్టిలోపైనా పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణల దాకా వెళ్లడమే గాక రెండుసార్లు అభిశంసన ప్రయయత్నాలూ జరిగాయి. గత డిసెంబర్లో మరోసారి అభిశంసనకు రంగం సిద్ధమవడంతో కాంగ్రెస్‌ను రద్దు చేసి డిక్రీ ద్వారా పాలించేందుకు కాస్టిలో విఫలయత్నం చేశారు. అదే అభియోగంపై చివరికి ఆయన్ను పదవి నుంచి దింపి ఖైదు చేసి బొలార్టే పదవిలోకి వచ్చారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పేదల్లో కాస్టిలోకు విపరీతమైన ఆదరణ ఉండటంతో ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలకు ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 50 మందికి పైగా బలయ్యారు. అల్లకల్లోలం ► ఆందోళనల దెబ్బకు దేశంలో అవ్యవస్థ రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఎమర్జెన్సీ విధించారు. రోడ్డు, రైలు, విమాన తదితర రవాణా సేవలన్నీ స్తంభించాయి. ► మైనింగ్ తదితర కార్యకలాపాలకూ తీవ్ర విఘాతం కలిగింది. ► అపారమైన ఖనిజ నిల్వలున్నా పేదరికంలో మగ్గుతున్న దక్షిణ ప్రాంతాల్లో నిరసనలు బాగా జరుగుతున్నాయి. ► వీటిపై బొలార్టే బలప్రయోగానికి దిగుతున్నారు. అవసరమైతే ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తున్నారు. ఇది మరింత అస్థిరతకు, సామాజిక విభజనకు దారి తీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పెరూలో ఆందోళనలు హింసాత్మకం
లిమా/వాటికన్ సిటీ: దక్షిణ అమెరికా ఖండంలోని పెరూలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జనం వీధుల్లోకి వస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి రాజధాని లిమాకు చేరుకుంటున్నారు. అధ్యక్షురాలు డినా బోలార్టే వెంటనే నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగుతున్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఘర్షణలో 55 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా శుక్రవారం రాత్రి దక్షిణ పూనోలో నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. పోలీసులతో జరిగిన ఘర్షణలో ఒక నిరసనకారుడు మరణించాడు, 9 మంది గాయపడ్డారు. దేశంలో హింస ప్రజ్వరిల్లుతుండడంతో ప్రభుత్వ అప్రమత్తమైంది. పెరూలో 15వ శతాబ్దానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత కట్టడం, ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన మచ్చూపిచ్చూ సందర్శనను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు సాంస్కృతిక శాఖ ప్రకటించింది. మచ్చూపిచ్చూలో 417 మంది సందర్శకులు చిక్కుకుపోయారు. వారిలో 300 మందికిపైగా విదేశీయులున్నారు. పెరూలో హింసాకాండను వెంటనే ఆపాలని ప్రభుత్వానికి, ప్రజలకు పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు. -
Peru: అధ్యక్షుడి అభిశంసన, ఆపై అరెస్టు
లీమా: రాజకీయ సంక్షోభానికి నెలవైన దక్షిణ అమెరికా దేశం పెరూ పాలనా పగ్గాలు హఠాత్తు గా చేతులు మారాయి. తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోందని పెడ్రో క్యాస్టిల్లో ప్రకటించిన కొద్దిగంటల్లోనే పరిణామాలు చకచకా మారిపోయాయి. పార్లమెంట్‌ను రద్దుచేయబోతున్నట్లు, దేశవ్యాప్త కర్ఫ్యూ అమల్లోకి రాబోతోందని ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు పెడ్రో క్యాస్టిల్లోను ఆ దేశ పార్లమెంట్ సభ్యులు వెనువెంటనే అభిశంసనతోపాటు అధ్యక్ష పీఠం నుంచి తప్పించారు. ఆయన అరెస్ట్, నిర్బంధం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలోనే ఉపాధ్యక్షురాలు డినా బొలౌర్టే.. అధ్యక్షురాలిగా ప్రమాణం చేశారు. ఈ పరిణామాన్ని అగ్రరాజ్యం అమెరికా స్వాగతించింది. -
Mystery: 10 వేల అడుగుల పైనుంచి ఆ కుర్చీ కిందపడింది.. చుట్టూ విషసర్పాలు.. అయినా
Lansa Flight 508 Crash Incredible Survival Of Juliane Koepcke: కొందరి ఊహల్లోంచి ఉట్టిపడే కథనాలకంటే.. కొన్ని నిజజీవితాలు భలే గొప్పగా ఉంటాయి. ‘ఏదో శక్తి పక్కనే ఉండి, తీర్చిదిద్దిన కథలా ఇవి?’ అన్నట్లుగా అబ్బురపరుస్తాయి. ప్రకృతి, పరిస్థితులు, గత అనుభవాలు.. ఇలా అన్నీ ఆ కథను ఆసక్తిగా నడిపిస్తాయి. తరతరాలకు గుర్తుండే పాఠాలను నేర్పిస్తాయి. పెరూ దేశంలో అలాంటి అద్భుతమే జరిగింది. ఓ విమాన ప్రయాణం.. పదిహేడేళ్ల అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. అది 1971, డిసెంబరు 24.. వాతావరణం అనుకూలించక పోవడంతో పెరూ రాజధాని లిమా విమానాశ్రయంలో అప్పటికే కొన్ని గంటల నుంచి ‘లాన్సా 508’ ఫ్లయిట్ డిలే అవుతూ వస్తోంది. దాని టేకాఫ్‌ను బలంగా కోరుకుంటోంది పదిహేడేళ్ల జూలియన్ అదెక్కి పుకాల్పాకి వెళ్లేందుకు చాలా ఆత్రంగా ఎదురుచూస్తోంది. లిమాలో ఆ ఫ్లయిట్ ఎక్కితే.. సరిగ్గా గంటలో తన తండ్రి ముందు వాలిపోవచ్చని.. మరునాడే క్రిస్మస్ కావడంతో పేరెంట్స్‌తో కలిసి బాగా సెలబ్రేట్ చేసుకోవాలనే ఊహల్లో విహరిస్తోంది. ఎదురు చూస్తున్నకొద్దీ ఫ్లయిట్ ఆలస్యం అవుతూనే ఉంది. జర్మనీకి చెందిన మారియా, హన్స్ విల్హెల్మ్ కోయెప్కే దంపతులకు 1954, అక్టోబర్ 10న జన్మించింది జూలియన్. తన తల్లితో కలిసుంటూ లిమాలో చదువుకునేది. తండ్రి హన్స్.. పుకాల్పాలోని రెయిన్ ఫారెస్ట్‌లో పనిచేస్తుండేవాడు. కోయెప్కే దంపతులు పెరూలో స్థిరపడిన జువాలజిస్ట్లు. నిజానికి కొన్ని రోజుల ముందే జూలియన్, మారియాలు.. హన్స్ దగ్గరకు వెళ్లేందుకు ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ జూలియన్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరు కావాల్సిరావటంతో ఆ టికెట్స్‌ను రద్దు చేసుకొని.. ‘లాన్సా ఫ్లయిట్ 508’కి ప్రయాణం ఖరారు చేసుకున్నారు. సుమారు 7 గంటల ఎదురు చూపుల తర్వాత ‘ఫ్లయిట్ నంబర్ 508’ లిమా నుంచి బయలు దేరేందుకు సిద్ధంగా ఉందనే అనౌన్స్మెంట్.. జూలియన్ కి చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. కానీ తనకు తెలియదు అదే తన తల్లితో తను చేసే చివరి ప్రయాణమని. ఆ విమానంలో జూలియన్, మారియాలతో కలిపి 85 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది.. మొత్తం 91 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత గుండెలదిరిపడే శబ్దం వినిపించింది. ఏమిటా అని తెలుసుకునేలోపే పెద్ద మెరుపు మెరిసింది. విమానం వెనుక ట్యాంక్ నుంచి మంటలు అలుముకున్నాయి. ఆ భీకరశబ్దం విమానంపై పడిన పిడుగుదని వారందరికీ తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఓ పక్క ప్రయాణికుల హాహాకారాలు.. మరో పక్క చావు భయం. మెల్లగా విమానంలో ఒక్కో భాగం ఊడిపోసాగింది. తల్లి మారియా.. జూలియన్ చేతిని గట్టిగా పట్టుకుంది. కానీ జూలియన్ కూర్చున్న కుర్చీతో సహా ఊడి విమానం నుంచి విడిపోయింది. పదివేల అడుగుల పైనుంచి ఆ కుర్చీ వేగంగా నేలరాలడం తనకు తెలుస్తూనే ఉంది. సుమారు 24 గంటల తర్వాత కళ్లు తెరిచిన జూలియన్ .. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి హడలిపోయింది. కలేమోనని వణుకుతున్న చేతులతో కళ్లు నులుముకుని మరీ చూసింది. ఎటు చూసినా దట్టమైన చెట్ల నీడలే. అప్పుడు తనకు తెలియదు అది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని. అంతా మసకమసకగా కనిపిస్తోంది. జూలియన్కి దృష్టి లోపం ఉండటంతో కళ్లజోడు పెట్టుకుంటేనే కానీ ఏదీ సరిగా కనిపించదు. కానీ ప్రమాదంలో అదీ పోయింది. భుజం విరిగి, మోకాలు బెణికి, కాళ్లు, చేతులు కోసుకుపోయాయి. ఎటు చూసినా విషసర్పాల బుసలు, క్రూరమృగాల గర్జనలే. జరిగిందంతా కళ్లముందు కదులుతుంటే.. తల్లి ఏమైపోయిందోనన్న ఆవేదన, ఎలా బయటపడాలో తెలియని ఆందోళన జూలియన్ మనసుని అతలాకుతలం చేశాయి. తల్లి కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఎలా బయటపడాలో తెలియలేదు. ఎంత దూరం నడిచినా పెద్దపెద్ద మానులే, వాటిని చుట్టుకున్న పాములే. విమానం కూలిన ప్రాంతం వైపు నడవడం మొదలుపెట్టింది జూలియన్. పైన సెర్చ్ ఆపరేషన్ విమానాలు తిరుగుతున్నాయి కానీ వాళ్లకి ఆమె కనిపించలేదు. కాపాడండనే ఆమె అరుపులూ వినిపించలేదు. చుట్టూ మనుషులైతే ఉన్నారు కానీ ఏ ఒక్కరికీ ప్రాణం లేదు. తెగిపడిన తలలు, ఛిద్రమైన శవాలు జూలియన్ని చాలా భయపెట్టాయి. రోజులు గడుస్తున్నాయి. నీరసం ఆవహించేసింది. అప్పుడే దారిలో ఓ మహిళ శవం కనిపించింది. తన తల్లేమోనని ఏడుస్తూ అటు పరుగుతీసింది. కానీ కాదు. ఆ పక్కనే పడి ఉన్న లగేజ్‌లో స్వీట్స్ తీసుకుని తింటూ.. నడవడం మొదలుపెట్టింది. శక్తి కోసం కొన్ని సార్లు ఆకులనూ తిన్నది. ‘నీరు ఉన్నచోట ఆ పల్లానికి మనిషి మనుగడ ఉంటుంద’నే తన తండ్రి మాటలు గుర్తొచ్చి.. ‘ఒక్క మనిషైనా కనిపించకపోతాడా?’ అనే ఆశతో ఓ వాగు ప్రవాహాన్ని అనుసరిస్తూ... నడక సాగించింది. పది రోజులు గడిచాయి. కాస్త దూరంగా మనుషుల మాటలు వినిపించాయి. అటుగా పరుగు తీసిన జూలియన్ నదిలో పడవపై వెళ్తున్నవాళ్లని చూసింది, గట్టిగా అరిచింది. ఈ సారి ఆ అరుపులు వాళ్ల చెవిన పడ్డాయి. ప్రాణాలతో బయటపడిన జూలియన్ కథ ప్రపంచానికి తెలిసింది. బతకడం కోసం తను చేసిన ఒంటరి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. విలేకర్లు ఆమె వెంట పరుగుతీశారు. ఇక తన భార్య, కూతురు ప్రాణాలతో లేరనే నిజాన్ని నమ్మడం మొదలుపెట్టిన జూలియన్ తండ్రి హన్స్.. ప్రాణాలతో తిరిగి వచ్చిన జూలియన్ని చూసి నివ్వెరపోయాడు. కూతుర్ని గుండెకు హత్తుకుని తనివితీరా ఏడ్చాడు. మరియా కూడా ఎక్కడో బతికే ఉండి ఉంటుందనే ఆశ హన్స్‌ని కుదురుగా ఉండనివ్వలేదు. కొన్ని రోజుల పాటు మరియాని వెతుకుతూనే ఉన్నాడు. చివరికి జనవరి 12న మరియా మృతదేహం దొరికింది. జూలియన్ తప్ప ఆ విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరని తేలింది. జర్మన్ ఫిల్మ్ డైరెక్టర్ వెర్నర్ హెర్జోగ్.. జూలియన్ పర్యవేక్షణలో ఇదే స్టోరీ లైన్‌తో 1998లో ‘వింగ్స్ ఆఫ్ హోప్’ అనే సినిమా తీశాడు. 2011 నవంబర్ 1న జూలియన్.. నాటి తన బతుకుపోరాటం గురించి.. ‘వెన్ఐ ఫెల్ ఫ్రమ్ ది స్కై’ అనే పుస్తకం రాసింది. 68 ఏళ్ల జూలియన్ ఇప్పటికీ పెరూలో తన తల్లిదండ్రులు స్థాపించిన పంగువానా పరిశోధనా కేంద్రాన్ని నడుపుతోంది. అంత ఎత్తునుంచి పడినా చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడటం ఓ మిస్టరీ అయితే.. ప్రాణాలు నిలుపుకోవడానికి ఆమె చేసిన పోరు ప్రపంచానికే స్ఫూర్తి. వైద్యపరిభాషలో చెప్పాలంటే అదో మిరాకిల్. ప్రమాదానికి ముందు.. సుమారు ఏడాదిన్నర పాటు నేను మా పేరెంట్స్‌తో రెయిన్ ఫారెస్ట్ పరిశోధనల కేంద్రంలో గడిపాను. అది నాకు బాగా కలిసి వచ్చింది – జూలియన్. -సంహిత నిమ్మన -
గప్‌చుప్‌గా ‘బుగ్గల ప్రపంచ కప్’! విన్నర్ ఎవరంటే..
Baloon World Cup 2021: బుగ్గలతో(బెలూన్స్)తో ఆడుకోవడం పిల్లలకు సరదా. మరి పెద్దవాళ్లకో!. కొందరికి ఉండొచ్చు కూడా. అలాంటి ఆసక్తి గనుక మీకు ఉంటే.. ఛాంపియన్ అయ్యేందుకు అవకాశమూ ఉంది. ఎందుకంటే.. ప్రపంచంలో మొట్టమొదటి ‘బెలూన్ వరల్డ్ కప్’ను ఈ మధ్యే విజయవంతంగా నిర్వహించారు. ఇకపై క్రమం తప్పకుండా నిర్వహిస్తారంట!. స్పెయిన్ టర్రగోనా సిటీలోని ఓ అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఈ టోర్నీ జరిగింది. గప్‌చుప్‌గా పోయిన వారంలో.. వారంపాటు మొట్టమొదటి బెలూన్ వరల్డ్ కప్‌ను నిర్వహించారు. మొత్తం 32 దేశాలు ఇందులో పోటీపడగా.. జర్మనీ, పెరూలు ఫైనల్‌కి చేరాయి. ఫైనల్ పోరులో పెరూకి చెందిన ఫ్రాన్సెస్కో డె లా క్రూజ్ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. దానికింద సరదా కామెంట్లూ కనిపిస్తున్నాయి. PERÚ 🆚 ALEMANIA Primera FINAL de #BalloonWorldCup pic.twitter.com/3oFqZxFYZ5 — Balloon World Cup (@BalloonWorldCup) October 14, 2021 ఎలా ఆడతారంటే.. Balloon Keep Up.. సింపుల్.. బెలూన్ కిందపడకుండా ఆడాలి. కిందపడితే ప్రత్యర్థి వ్యక్తికి ఒక పాయింట్ వెళ్తుంది. 8X8 మీటర్ కోర్టులో ఈ గేమ్‌ను నిర్వహిస్తారు. కాకపోతే లివింగ్ రూం లాంటి ఆ కోర్టులో కారు, సోఫా, కుర్చీలు.. ఇలా రకరకాల వస్తువులు ఉంటాయి. మరి బెలూన్ పగిలిపోతే పరిస్థితి ఏంటి? అని మాత్రం అడగకండి ప్లీజ్!. Revive los últimos segundos de la final que ha coronado a Perú como campeona del mundo! Enhorabuena @efedufran #BalloonWorldCup pic.twitter.com/cY36WikPTp — Balloon World Cup (@BalloonWorldCup) October 14, 2021 పుట్టింది ఇలా.. బార్సిలోనా సాకర్ ప్లేయర్ గెరార్డ్ పిక్యూ, స్పానిష్ ఇంటర్నెట్ సెలబ్రిటీ ఇబయ్ లానోస్‌లు ఈ టోర్నీని నిర్వహించారు. అయితే ఈ ప్రపంచ టోర్నీ పుట్టింది టిక్‌టాక్‌లోని సరదా వీడియోల ఆధారంగా!. యస్.. ఓరేగావ్(యూఎస్)కు చెందిన అర్రెన్డోండో ఫ్యామిలీ టిక్‌టాక్‌లో సరదాగా గేమ్స్ వీడియోలను పోస్ట్ చేసేది. ఆ వీడియోల ఆధారంగా గెరార్డ్ పిక్యూ, ఇబయ్ లాబీ లానోస్‌లు ఈ టోర్నీని రూపొందించారు. అంతేకాదు గెరార్డ్ పిక్యూ డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను కొత్త రూపంలో మార్చే ప్రయత్నంలో ఉన్నాడు కూడా. Ziggy is just waiting for the Dog Balloon World Cup pic.twitter.com/Jb6sOZqJ7G — shitscaredmum 💙 (@shitscaredmum) October 18, 2021 చదవండి: సంచలన ఆరోపణలు: ఆ బాక్సింగ్ మ్యాచ్‌లు ఫిక్సింగ్? -
హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్‌కు అభినందన...
సాక్షి, హైదరాబాద్: పెరూలో ఇటీవల జరిగిన ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి రెండు రజత పతకాలు సాధించిన హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్‌ను తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. తెలంగాణకు చెందిన పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, షూటింగ్లో ఇషా భారత భవిష్యత్ ఆశాకిరణమని ఈ సందర్భం గా మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఐ–లీగ్‌లో తెలుగు కుర్రాడు సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫుట్‌బాల్ ఐ–లీగ్‌లో తెలుగు కుర్రాడు సునీల్ బథాలా అరంగేట్రం చేయనున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన సునీల్‌తో ఈ లీగ్‌లో తొలిసారి బరిలోకి దిగనున్న శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎస్‌డీఎఫ్‌సీ) ఒప్పందం చేసుకుంది. గతంలో భారత అండర్–16 శిబిరంలో పాల్గొన్న సునీల్ 2020 డిసెంబర్లో ఎస్డీఎఫ్సీలో సెంటర్ డిఫెండర్‌గా చేరాడు. తన ఆటతీరుకు మెరు గులు దిద్దుకొని ఐ–లీగ్‌లో పాల్గొనే అవకాశాన్ని సంపాదించాడు. 13 జట్లు పాల్గొనే ఐ–లీగ్ డిసెంబర్లో మొదలయ్యే అవకాశముంది. చదవండి: KKR vs DC, IPL 2021: కోల్‌కతా ‘సిక్సర్’తో... -
Viral: కరెంట్ వైర్ల మధ్య పావురం.. డ్రోన్‌తో పోలీసుల రెస్క్యూ
ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. వ్యవసాయం రంగం మొదలుకొని రక్షణ రంగం వరకు అన్ని సేవలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా పెరు దేశ రాజధాని లీమాలో డ్రోన్ సాయంతో ఓ పావురం ప్రాణాలు కాపాడారు అక్కడి పోలీసులు. ఓ పావురం కాలుకు దారం చుట్టుకోవటంతో హైటెన్షన్ వైర్‌కు చిక్కుకొని కిందికి వేలాడుతూ.. ఎగరలేక విలవిలాడింది. ఇది గమనించిన పోలీసులు ఆ పావురాన్ని రక్షించడానికి డ్రోన్‌ను ఉపయోగించారు. డ్రోన్‌కు కత్తి కట్టి కరెంట్ వైర్ల మధ్య దాన్ని ఆపరేట్ చేస్తూ నెమ్మదిగా పావురం కాలుకున్న దారాన్ని కట్‌చేశారు. దీంతో పావురం సురక్షితంగా కిందపడింది. అనంతరం దాని కాలుకు చుట్టుకొని ఉన్న మొత్తం దారాన్ని తొలగించి పంజరంలో వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కరోనా వైరస్: ఆక్స్ఫర్డ్ టీకా బాగా పని చేస్తోంది
లండన్: ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకా చాలా బాగా పని చేస్తోందని తాజాగా వెల్లడైన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. అమెరికా, చిలీ, పెరూ దేశాల్లో దాదాపు 32 వేల మంది వాలంటీర్లపై ఈ పరిశోధన జరిగింది. ఇందులో కోవిడ్–19ను అడ్డుకోవ డంలో ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకా 79శాతం పనితీరును చూపిందని నివేదిక సోమవారం పేర్కొంది. వ్యాధి ముదరకుండా చూడటం, ఆస్పత్రిపాలు కాకుండా పని చేయడంలో ఈ వ్యాక్సిన్ 100 శాతం ఫలితాలను సాధించినట్లు తేలింది. ఇదే వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా తయరుచేయించి ప్రస్తుతం వ్యాక్సినేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న భారత్) -
తృటిలో తప్పించుకున్న శ్రియ.. లేదంటే!
శ్రియ సరన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే పదిహేనేళ్లు పూర్తయినా చెక్కుచెదరని అందం, అభినయంతో ఆకట్టుకోగల బ్యూటీ. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా పలు చిత్రాల్లో నటించిన శ్రియ సరన్ ప్రస్తుతం ఆమె భర్త ఆండ్రీ కొస్చీవ్‌తో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ ట్రిప్‌లో భాగంగా పెరులో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కుజ్కోలోని ప్రఖ్యాతి గాంచిన మచ్చుపిచ్చు ప్రాంతాన్ని సందర్శించారు ఈ జంట. ఇది 2007లో ప్రపంచంలోని ఏడు కొత్త వింతల్లో ఒకటిగా ఎన్నికైంది. వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు శ్రియ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మచ్చుపిచ్చు వద్ద శ్రియ కూర్చొని ఫోటోకు ఫోజ్ ఇస్తుండగా పక్కనే ఉన్న ఒంటె ఆమె వద్దకు అకస్మాత్తుగా పరిగెత్తుకు వచ్చింది. దీనిని గమనించి అప్రమత్తమైన శ్రియ లేచి దూరం వెళ్లడంతో ఒంటె దాడి నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ వీడియోను ‘టేక్ మీ బ్యాక్’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. కాగా 2018లో శ్రియ రష్యాకు చెందిన అండ్రీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఉదయ్‌పూర్ వేదికగా మారింది. ఆండ్రీ బార్సిలోనాలో స్థిరపడిన మాజీ టెన్నిస్ ఆటగాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)లో అజయ్ దేవగణ్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్ చిత్రంలో నటిస్తున్నారు. చదవండి: సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే.. షూటింగ్లో నిజంగా పేలిన బాంబు.. హీరోకు గాయాలు View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
వైరల్: అమ్మాయిని ముద్దు లంచంగా అడిగిన పోలీస్
-
వైరల్: అమ్మాయిని ముద్దు లంచంగా అడిగిన పోలీస్
లిమ : కరోనా వైరస్ లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన ఓ అమ్మాయిని ముద్దు లంచంగా అడిగాడో పోలీస్. లంచాలు తీసుకునే బుద్ధి మంచం దగ్గర ఆగలేదన్న సామెతగా, అమ్మాయి ముద్దుకు కక్కుర్తిపడి సస్పెండ్ అయ్యాడు. ఈ సంఘటన పెరులోని లిమలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. లిమకు చెందిన ఓ అమ్మాయి కొద్దిరోజుల క్రితం అక్కడి మిరఫ్లోర్స్లోని బ్రాడ్ వాక్ వద్ద ఉన్న రోడ్డు పక్కగా తన కారు ఆపి, పక్కకు వెళ్లింది. లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఆ ప్రదేశంలో కారు నిలపడం నిషిద్ధం. దీంతో ఓ పోలీస్ ఆ కారు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. కొద్ది సేపటి తర్వాత ఆ అమ్మాయి కూడా అక్కడికి వచ్చింది. ఆ పోలీస్ ఆమెనుంచి వివరాలు సేకరించటం మొదలుపెట్టాడు. ఫైన్ వేస్తున్నట్లు ఆమెతో చెప్పాడు. ఫైన్ వేయోద్దని ఆ అమ్మాయి పోలీస్‌ను బ్రతిమాలింది. ( కోతికున్న ఇగురం కట్టుకున్నోడికి లేకపాయె! ) కొద్దిసేపటి చర్చల తర్వాత ఇద్దరి మధ్యా ఓ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం అమ్మాయినుంచి ముద్దు లంచంగా తీసుకుని పోలీస్ ఆమెను వదిలేశాడు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఓ లోకల్ న్యూస్ ఛానల్ మొదటగా ఇందుకు సంబంధించిన వీడియోను ప్రసారం చేసింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన అధికారులు. సదరు పోలీస్‌పై సీరియస్ అయ్యారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. అతడ్ని విధుల్లోనుంచి సస్పెండ్ చేశారు. -
మచు పిచ్చుపై అతనొక్కడే.. ఎందుకంటే
లిమా, పెరూ: పెరూ దేశంలోని మచు పిచ్చు ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మచు పిచ్చు కూడా మూత పడింది. అయితే ఈ పర్యాటక ప్రాంతాన్ని కేవలం ఒక్కడి కోసం తెరిచారు. అయితే అతడేమైనా అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీనా అంటే అది కాదు. మరి ఏంటా ఆ వ్యక్తి ప్రత్యేకత అంటే ఓ సారి ఇది చదవండి.. జపాన్‌కు చెందిన బాక్సింగ్ ట్రైనర్ జెస్సీ కటయామా అనే వ్యక్తి మచు పిచ్చు గంభీర పర్వత శిఖరం చూడాలని భావించాడు. దాంతో మార్చిలో పెరూ చేరుకున్నాడు. అయితే దురదృష్టం కొద్ది కోవిడ్ వ్యాప్తి పెరగడం.. లాక్డౌన్ విధించడం వెంటవెంటనే జరిగాయి. పాపం మూడు రోజుల పర్యటన నిమిత్తం పెరూ చెరుకున్న జెస్సీ ఏకంగా ఆరు నెలల పాటు అక్కడే చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో తన పరిస్థితి గురించి స్థానిక మీడియాకు తెలియజేశాడు. అది కాస్త పర్యాటక అథారిటీకి చేరడంతో ప్రత్యేక అనుమతితో అతడిని మచు పిచ్చు సందర్శించేందుకు అంగీకరించారు పెరూ అధికారులు. దాంతో అతడి కల నిజమయ్యింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ మొదలైన నాటి నుంచి మచు పిచ్చుని దర్శించిన మొదటి వ్యక్తిని నేనే. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన స్థానిక అధికారులకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ స్థానిక టూరిజం అథారిటీ ఫేస్బుక్ పేజీలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: దొంగల గుహలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?) 16 వ శతాబ్దంలో స్పానిష్ ఆక్రమణకు ముందు పశ్చిమ దక్షిణ అమెరికాలో 100 సంవత్సరాల పాటు పాలించిన ఇంకా సామ్రాజ్యపు శాశ్వతమైన వారసత్వం మచు పిచ్చు. ఇంకా సెటిల్మెంట్ శిధిలాలను 1911 లో అమెరికన్ అన్వేషకుడు హిరామ్ బింగ్హామ్ తిరిగి కనుగొన్నారు. ఆ తర్వాత 1983 లో యునెస్కో మచు పిచ్చును ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. అయితే లాక్డౌన్ కారణంగా ముసి వేసిన మచు పిచ్చును మొదట జూలైలో తిరిగి తెరవాలని నిర్ణయించారు. కానీ అది నవంబర్‌కు వాయిదా పడింది.