లీమా: దక్షిణ అమెరికా దేశం పెరూలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెరూలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్లిన కారణంగా ప్రమాదం జరిగింది.
వివరాల ప్రకారం.. ఆండెస్ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళ్తుతుండగా అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా 200 మీటర్ల లోతులో ఉన్నలో లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. గత నెలలో కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనాటి ప్రమాదంలో 13 మంది చనిపోయారు. పెరూలో సరైన రోడ్డు సదుపాయాలు లేక ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైంది. ఇక్కడ రాత్రిపూట, పర్వతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Comments
Please login to add a commentAdd a comment