లీమా: రాజకీయ సంక్షోభానికి నెలవైన దక్షిణ అమెరికా దేశం పెరూ పాలనా పగ్గాలు హఠాత్తు గా చేతులు మారాయి. తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోందని పెడ్రో క్యాస్టిల్లో ప్రకటించిన కొద్దిగంటల్లోనే పరిణామాలు చకచకా మారిపోయాయి. పార్లమెంట్‌ను రద్దుచేయబోతున్నట్లు, దేశవ్యాప్త కర్ఫ్యూ అమల్లోకి రాబోతోందని ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు పెడ్రో క్యాస్టిల్లోను ఆ దేశ పార్లమెంట్ సభ్యులు వెనువెంటనే అభిశంసనతోపాటు అధ్యక్ష పీఠం నుంచి తప్పించారు.
ఆయన అరెస్ట్, నిర్బంధం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలోనే ఉపాధ్యక్షురాలు డినా బొలౌర్టే.. అధ్యక్షురాలిగా ప్రమాణం చేశారు. ఈ పరిణామాన్ని అగ్రరాజ్యం అమెరికా స్వాగతించింది.
Comments
Please login to add a commentAdd a comment