impeachment of President
-
Peru: అధ్యక్షుడి అభిశంసన, ఆపై అరెస్టు
లీమా: రాజకీయ సంక్షోభానికి నెలవైన దక్షిణ అమెరికా దేశం పెరూ పాలనా పగ్గాలు హఠాత్తు గా చేతులు మారాయి. తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోందని పెడ్రో క్యాస్టిల్లో ప్రకటించిన కొద్దిగంటల్లోనే పరిణామాలు చకచకా మారిపోయాయి. పార్లమెంట్‌ను రద్దుచేయబోతున్నట్లు, దేశవ్యాప్త కర్ఫ్యూ అమల్లోకి రాబోతోందని ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు పెడ్రో క్యాస్టిల్లోను ఆ దేశ పార్లమెంట్ సభ్యులు వెనువెంటనే అభిశంసనతోపాటు అధ్యక్ష పీఠం నుంచి తప్పించారు. ఆయన అరెస్ట్, నిర్బంధం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలోనే ఉపాధ్యక్షురాలు డినా బొలౌర్టే.. అధ్యక్షురాలిగా ప్రమాణం చేశారు. ఈ పరిణామాన్ని అగ్రరాజ్యం అమెరికా స్వాగతించింది. -
ట్రంప్ అభిశంసనపై విచారణ మొదలు
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక మాజీ అధ్యక్షుడి అభిశంసనపై సెనేట్‌లో విచారణ మొదలైంది. ట్రంప్‌పై విచారణ అర్ధరహితం అంటూ రిపబ్లికన్ పార్టీ చేసిన వాదన ఓటింగ్‌లో వీగిపోయింది. ట్రంప్‌పై అభిశంసన విచారణ రాజ్యాంగబద్ధమేనంటూ సెనేట్ 56–44 ఓట్ల తేడాతో విచారణకు ఓకే చెప్పింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు విచారణకు మద్దతు పలికారు. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో ట్రంప్‌ని ముద్దాయిగా తేల్చడం, అలాంటి వ్యక్తికి రిపబ్లికన్లు కొమ్ము కాస్తున్నారని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసమే డెమొక్రాట్లు అభిశంసన తీర్మానంపై విచారణకు పట్టుపట్టారు. దీంతో రెండోసారి అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా, పదవి నుంచి దిగిపోయాక అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారు. అభిశంసన తీర్మానం సెనేట్‌లో నెగ్గే అవకాశం లేదు. సెనేట్‌లో రెండింట మూడు వంతుల మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తేనే తీర్మానం పాస్ అవుతుంది. అంటే 100 మంది సభ్యులున్న సభలో 67 మంది ఓట్లు వెయ్యాలి. రెండు పార్టీలకూ చెరి 50 మంది సభ్యుల బలం ఉంది. మరో ఆరుగురు రిపబ్లికన్లు అభిశంసనకు అనుకూలంగా ఉండడంతో 56 మంది అవుతారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే సభ చైర్మన్ కమలా హ్యారిస్ తన ఓటు వినియోగించుకుంటారు. ఏది ఏమైనా 67 మంది సభ్యుల మద్దతు లభించే అవకాశాలైతే లేవు. క్యాపిటల్ భవనం దాడి వీడియోలే ఆయుధం క్యాపిటల్‌పై దాడిని ట్రంప్ ప్రోత్సహించారన్న అభియోగాలపైనే అభిశంసన ప్రక్రియ కొనసాగుతుంది. సంబంధిత వీడియోలను వినియోగించాలని డెమొక్రాట్లు వ్యూహరచన చేస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా ట్రంప్ ఆందోళనకారుల్ని ఎలా రెచ్చగొట్టారో వీడియోల ద్వారా సభ సాక్షిగా నిరూపించడానికి సభ్యులు కసరత్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించి ట్రంప్‌ని బోనులు పెట్టడమే లక్ష్యంగా తాము ముందుకు వెళతామని సెనేట్‌లో ఇంపీచ్మెంట్ మేనేజర్ జామీ రాస్కిన్ చెప్పారు. అభిశంసనపై వాదనలు వినిపించుకోవడానికి ఇరుపక్షాలకు 16 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. అనంతరం సెనేట్ సభ్యులకు ఇరుపక్షాల్ని ప్రశ్నించడానికి నాలుగు గంటల సమయం కేటాయిస్తారు. అది పూర్తయి చర్చలు జరిగాక అభిశంసనపై ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ట్రంప్ అభిశంసనపై మాట్లాడుతున్న హౌజ్ ఇంపీచ్మెంట్ మేనేజర్ జేమీ రస్కిన్ -
అభిశంసనపై వాదనలకు ట్రంప్ లాయర్ల బృందం ?
వాషింగ్టన్: ఈ నెల 8వ తేదీ నుంచి సెనేట్‌లో ప్రారంభం కానున్న తన అభిశంసన విచారణకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి ట్రంపే కారణమనీ, అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ట్రంప్ సొంత రిపబ్లికన్ పార్టీకి చెందిన 10 మంది సభ్యులు మద్దతు ఇచ్చారు. దీంతో ఈ నెల 8వ తేదీన అభిశంసనపై విచారణకు మార్గం సుగమ మైంది. ట్రంప్ తరఫున ప్రముఖ లాయర్లు డేవిడ్ ష్కోయెన్, బ్రూస్ ఎల్ కాస్టర్ వాదనలు వినిపించనున్నారు. డెమోక్రాట్లు మూడింట రెండొంతుల మద్దతు సాధిస్తే అభిశంసన ఆమోదం పొందుతుంది. ఫలితంగా ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం కోల్పోతారు. అయితే, సెనేట్‌లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు చెరో 50 మంది సభ్యుల బలం ఉంది. తీర్మానం ఆమోదం పొందాలంటే డెమోక్రాట్లకు మరో 17 మంది మద్దతు అవసరం. అమెరికా చర్రితలో రెండుసార్లు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కావడం గమనార్హం. -
ట్రంప్ అభిశంసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని బుధవారం ప్రతినిధుల సభ ఆమోదించింది. అమెరికా చరిత్రలోనే ప్రతినిధుల సభలో రెండు సార్లు అభిశంసనకు గురైన అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. 2019 డిసెంబర్‌లోనూ ట్రంప్‌ను ప్రతినిధుల సభ అభిశంసించింది. క్యాపిటల్ భవనంపై దాడికి బాధ్యుడిని చేస్తూ డెమొక్రటిక్ సభ్యులు ప్రతినిధుల సభలో ‘తిరుగుబాటు చేసేలా రెచ్చగొట్టారు’అనే ప్రధాన ఆరోపణతో ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం ఈ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో ట్రంప్ అభిశంసనకు అనుకూలంగా 232 ఓట్లు, వ్యతిరేకంగా 197 ఓట్లు వచ్చాయి. 10 మంది రిపబ్లికన్ సభ్యులు కూడా ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేయడం విశేషం. అమెరికా చరిత్రలో ఇది నాలుగో అభిశంసన ప్రక్రియ. మద్దతుదారులను ఉద్దేశించి రెచ్చగొట్టేలా ప్రసంగించారని, ఆ కారణంగానే ప్రజాస్వామ్య సౌధమైన క్యాపిటల్ భవనంపై దాడితో పాటు హింస చెలరేగిందని ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంలో ఆరోపించారు. ఆ దాడి కారణంగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను పార్లమెంటు నిర్ధారించే ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ హింసలో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందడంతో, ఈ అభిశంసన తీర్మానం సెనెట్‌కు వెళ్తుంది. సెనెట్‌లో కూడా ఆమోదం పొందితే.. ట్రంప్ ఇక జీవితకాలంలో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టలేరు. అయితే, సెనెట్ సమావేశాలు ఇప్పటికే జనవరి 19 వరకు వాయిదా పడ్డాయి. జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా డెమొక్రటిక్ నేత జో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతో, అధ్యక్షుడిగా గడువు ముగిసేవరకు వైట్‌హౌజ్‌లో కొనసాగే అవకాశం ట్రంప్‌కు లభించింది. బైడెన్ ప్రమాణ స్వీకారం లోపు సెనెట్‌లో అభిశంసన తీర్మానం ప్రక్రియ ముగిసే అవకాశం లేదని సెనెట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్ కానెల్ పేర్కొన్నారు. సెనెట్‌లో ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే కనీసం 17 మంది రిపబ్లికన్ సభ్యులు అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది. అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ ఎంపీలైన అమీ బెరా, ఆర్ఓ ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. -
ట్రంప్‌ని గడువుకు ముందే తప్పిస్తారా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని గడువుకి ముందే గద్దె దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీనికి గల మార్గాలను అన్వేషిస్తోంది. ట్రంప్‌ని ఎలాగైనా తప్పించాలని సభ్యుల్లో చర్చ జరుగుతోంది. అధ్యక్షుడిగా జనవరి 20న ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ ఈలోగా అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ అధికరణం ద్వారా ట్రంప్‌ని తొలగించడానికి గల అవకాశాలను కాంగ్రెస్ సభ్యులు పరిశీలిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది అభిశంసన తీర్మానం కాగా, రెండోది 25వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన అధికరణం. దేశ ఉపాధ్యక్షుడు, మంత్రి మండలి సభ్యులు కలిసి ఈ అధికరణాన్ని ప్రయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఏమిటీ సవరణ? రాజ్యాంగంలోని 25వ సవరణలో నాలుగు సెక్షన్లు ఉన్నాయి. అమెరికా అ«ధ్యక్షుడు పదవిలో ఉండగానే మరణిస్తే దీనిలో మొదటి సెక్షన్ ద్వారా ఉపాధ్యక్షుడు పదవి బాధ్యతలు చేపడతారు. రెండో సెక్షన్ ఉపాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి సంబంధించినది కాగా, మూడోది అధ్యక్షుడెవరైనా తనంతట తానుగా పదవిలో కొనసాగలేనని, తప్పుకుంటానని చెప్పినప్పుడు ఉపాధ్యక్షుడికి అధికారాన్ని అప్పగించడానికి వినియోగిస్తారు. ఇక అధ్యక్షుడు పాలనా వ్యవస్థపై నియంత్రణ కోల్పోతే ఉపాధ్యక్షుడు, కేబినెట్ సభ్యుల ఆమోదంతో నాలుగో సెక్షన్ ద్వారా అధ్యక్షుడిని తొలగించవచ్చు. అభిశంసన చేయొచ్చా? ట్రంప్‌ని అభిశంసన ద్వారా కూడా పదవి నుంచి తొలగించవచ్చు. అయితే ఇది ప్రతినిధుల సభ ద్వారా జరగాలి. మూడింట రెండు వంతుల మెజార్టీతో ప్రతినిధుల సభ ఆమోదిస్తే, దానిని సెనేట్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఒకే రోజులో ఈ ప్రక్రియని ముగించేలా వెసులుబాటు ఉంది. గత ఏడాది ట్రంప్‌పై అభిసంశన తీర్మానం పెట్టినా సెనేట్‌లో వీగిపోయింది. -
డొనాల్డ్ ట్రంప్‌కి ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం సెనేట్‌లో వీగిపోయింది. తద్వారా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌కు రాజకీయ విజయం లభించినట్లయింది. ట్రంప్‌పై డెమొక్రాట్లు పెట్టిన అభిశంసన తీర్మానం రిపబ్లికన్ల ఆధిక్యంలోని సెనేట్‌లో వీగిపోవడంతో ట్రంప్‌కి ఊరట లభించింది. అయితే, అభిశంసనకు గురైన అధ్యక్షులెవరూ తర్వాతి ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. అభిశంసనను ఎదుర్కొన్నా, తిరిగి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోన్న తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంపే అవుతారు. అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుకున్నారన్న ఆరోపణలతో ట్రంప్‌పై గత డిసెంబర్లో డెమొక్రటిక్ పార్టీ అమెరికన్ కాంగ్రెస్‌లో అభిశంసనను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఆమోదం పొందిన అభిశంసన తీర్మానాన్ని తాజాగా సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగం 52–48 ఓట్ల తేడాతో, కాంగ్రెస్ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగం 53–47 ఓట్ల తేడాతో వీగిపోయాయి. అభిశంసనను తిప్పికొట్టేందుకు 100 మంది సభ్యుల సభలో మూడింట రెండొంతుల ఓట్లు అవసరం. సెనేట్‌లో అ«ధికార రిపబ్లికన్ పార్టీకి 53 సీట్లు, డెమొక్రటిక్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. ట్రంప్‌పై వెల్లువెత్తిన ఆరోపణలు.. రాబోయే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ ఇచ్చే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు ట్రంప్ ఉక్రెయిన్ సాయం తీసుకున్నారనీ, బదులుగా ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు విమర్శలొచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బిడెన్‌పైనా, ఆయన కొడుకు హంటర్‌పై ఉన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేయాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడితెచ్చారన్న విమర్శలొచ్చాయి. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్లో మాట్లాడారనీ డెమొక్రటిక్ పార్టీ ఆరోపిస్తోంది. అందుకే ట్రంప్‌పై అభిశంసన తీర్మానం తీసుకువచ్చింది. ఖండించిన ట్రంప్..: తనపై అభిశంసనకు డెమొక్రటిక్ పార్టీ చేసిన యత్నం సిగ్గుచేటని అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. 2020లోనూ, ఆ తరువాత కూడా అమెరికా ప్రజల పక్షాన నిలుస్తానని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు అధ్యక్షభవనం ప్రకటించింది. తొలి నుంచీ తనపై ఆరోపణలు అవాస్తవమని చెబుతున్న ట్రంప్.. అభిశంసనపై దేశం విజయం సాధించిందనీ, అధ్యక్షభవనం నుంచి ప్రకటన చేస్తానని ట్విట్టర్లో వెల్లడించారు. అయితే, అమెరికా ప్రజల ఆకాంక్షలనూ, రాజ్యాంగ బాధ్యతలను సెనేటర్లు విస్మరిస్తున్నారనీ, వాస్తవాలను గుర్తించడంలో వారు విఫలమవుతున్నారని డెమొక్రటిక్ పార్టీ విమర్శించింది. -
డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్
-
ట్రంప్‌పై అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దిగువ సభ అభిశంసించింది. సెనేట్‌లోనూ అభిశంసన ఆమోదం పొందితే అధ్యక్షపదవి నుంచి ట్రంప్ దిగిపోవాల్సిందే. అమెరికాలోని డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో విశ్వాసపరీక్షలో ట్రంప్‌పై రెండు అంశాల ప్రాతిపదికగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణ ఒకటైతే, కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనేది రెండో ఆరోపణ. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలకు అనుకూలంగా 230 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 197 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌ను అడ్డకున్నారన్న ఆరోపణలకు అనుకూలంగా 229 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన జో బిడెన్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఉక్రెయిన్ను ఒత్తిడిచేసి, ఆ దేశాన్ని తనకు రాజకీయంగా సాయం చేయాలని ట్రంప్ కోరడం అధికార దుర్వినియోగమని అభియోగంలో పేర్కొన్నారు. ప్రతినిధుల సభ విచారణకు ట్రంప్ సహకరించకుండా కాంగ్రెస్‌ను అడ్డుకున్నారన్నది రెండో అభియోగం. సెనేట్‌కి అభిశంసన తీర్మానం ప్రతినిధుల సభ ఆమోదం తర్వాత ట్రంప్ అభిశంసన తీర్మానం సెనేట్‌కు వెళుతుంది. అమెరికా అధ్యక్ష పదవిలో ట్రంప్ కొనసాగాలా? లేదా? అన్నది సెనేట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రతినిధుల సభలో అభిశంసన పూర్తయినప్పటికీ సెనేట్‌లోనూ నెగ్గడం కీలకం. సెనేట్‌లోనూ అభిశంసన ఆమోదం పొందితే ట్రంప్ అధికారం నుంచి వైదొలగాలి. అయితే అభిశంసన ఆమోదం పొంచే అవకాశమే లేదు. సెనేట్‌లో ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ ఉంది. అభిశంసన ఆమోదం పొందాలంటే అందుకు సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. అది జరిగే అవకాశమే లేదు. దీంతో ట్రంప్ అధికారపీఠాన్ని దిగకపోవచ్చు. అయినప్పటికీ అమెరికా రాజకీయ చరిత్రలో అభిశంసనను ఎదుర్కున్నారనే మరక మాత్రం ట్రంప్‌పై పడింది. జనవరి రెండోవారంలో సెనేట్‌లో ఓటింగ్ ఉండే చాన్సుంది. అభిశంసనను ఎదుర్కొన్న మూడో అధ్యక్షుడు ట్రంప్ అమెరికా చరిత్రలో అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షుల్లో ట్రంప్ మూడోవ్యక్తి. గతంలో ఆండ్య్రూ జాన్సన్, బిల్‌క్లింటన్‌లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ప్రతినిధుల సభలో ఓటింగ్ జరుగుతున్నప్పుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో కలిసి మిచిగాన్‌లోని బాట్లే క్రీక్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. తనపై అభిశంసనపై ట్రంప్ మాట్లాడుతూ ‘అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే వాళ్లు నాపై అభిశంసనకు యత్నిస్తున్నారు. లక్షలాది మంది ఓటర్లు ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని గద్దెదించాలని డెమొక్రాట్లు ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు. అభిశంసన ఎదుర్కొన్నవారు మళ్లీ గెలవలేదు ఇప్పటివరకు అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షులెవరూ తిరిగి ఆ తర్వాతి ఎన్నికల్లో గెలవలేదు. 1868లో అభిశంసనకు గురైన అమెరికా అధ్యక్షుడు ఆండ్య్రూ జాన్సన్ ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలవలేకపోయారు, బిల్ క్లింటన్‌పై 1998లో అభిశంసన ప్రవేశ పెట్టారు. రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో క్లింటన్ విజయం సాధించలేకపోయారు. 1974లో ఆనాటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అభిశంసన ప్రక్రియ సభ ముందుకు రాకముందే పదవికి రాజీనామా చేశారు. -
అందుకే ఆ ఓటు వేయలేదు: తులసి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ఓటింగ్ సందర్భంగా.. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన తులసి గబ్బార్డ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్‌ను అభిశంసించే తీర్మానానికి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఆమె ఓటు వేయలేదు. అభిశంసన సందర్భంగా సభలో ఉన్నట్లు(ప్రెజెంట్) మాత్రమే ఆమె ఓటు వేశారు. ప్రతినిధుల సభలో తులసి వ్యవహారశైలి పట్ల రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకు ఆధిపత్యం ఉన్న ప్రతినిధుల సభలో ట్రంప్ అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించింది. దీంతో అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌నకు భారీ షాక్ తగిలినట్లయింది. ఇక తదుపరి సెనేట్‌లో అభిశంసనను ట్రంప్ ఎదుర్కోనున్నారు.(అభిశంసనకు గురైన ట్రంప్) ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా తులసి గబ్బార్డ్ ఓటు వేయకపోవడం ద్వారా పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీపడాలనుకున్న మహిళ.. ట్రంప్‌ను సమర్థిస్తున్నారా అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తులసి గబ్బార్డ్ మాట్లాడుతూ.. తనకు అన్నింటికన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. ‘నా నిర్ణయంతో కొందరు ఏకీభవించకపోవచ్చు. అయితే నేనెంతగానో ప్రేమించే నా దేశమే నాకు ముఖ్యం. 658 పేజీల అభిశంసన నివేదిక చదివిన తర్వాత.. అందుకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయాలనే విషయంలో నాకు స్పష్టత లేకుండా పోయింది. నిజానికి ఓటింగ్ సమయంలో నేను పూర్తి స్పృహలో లేను. అయితే అధ్యక్షుడు ట్రంప్ తను చేసిందానికి పశ్చాత్తాపపడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేశాన్ని విభజించే ఎటువంటి నిర్ణయాలకు నేను అనుకూలం కాదు’ అని తులసి చెప్పుకొచ్చారు. అదే విధంగా అధ్యక్షుడిని గద్దె దింపేందకు కేవలం రాజకీయ అంశాలే ముఖ్యకారణం కాకూడదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. (విలక్షణ వ్యక్తిత్వం.. తులసి గబ్బార్డ్ సొంతం) -
అందుకే.. ఇలా చేయక తప్పలేదు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన సందర్భంగా హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. డెమొక్రాట్లను సామాజిక తీవ్రవాదులుగా అభివర్ణించిన రిపబ్లికన్లు... ట్రంప్‌ను ద్వేషిస్తూ కక్షపూరిత రాజకీయాలకు దిగారని మండిపడ్డారు. అదే విధంగా వాళ్లకు ఉక్రెయిన్ గురించి వివరాలు అక్కర్లేదని.. కేవలం అధికారం కోసమే అభిశంసనకు పట్టుబట్టారని ఆరోపించారు. ఇక అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యుడు బారీ లౌడర్మిల్స్ చర్చ సందర్భంగా.. ట్రంప్‌ను ఏకంగా జీసస్‌తో పోల్చారు. ‘ మీ చరిత్రాత్మక ఓటు ఉపయోగించుకునే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. వారం రోజుల్లో క్రిస్మస్ రాబోతుంది. ఆ జీసస్‌పై అసత్యపు ఆరోపణల నేపథ్యంలో.. విచారణలో తనపై ఆరోపణలు చేసిన వారిని ఎదుర్కొనే అవకాశం ఆయనకు లభించింది. కొన్ని హక్కులు కూడా లభించాయి. కానీ ఇక్కడ డెమొక్రాట్లు మాత్రం అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కేవలం అధ్యక్షుడిపై ఉన్న ద్వేషం కారణంగానే ఆయనను అభిశంసించారనే విషయాన్ని ప్రజలు తప్పక గుర్తుపెట్టుకుంటారని.. ఎన్నికల్లో డెమొక్రాట్లకు తగిన బుద్ధి చెబుతారని విమర్శలు గుప్పించారు.(అభిశంసనకు గురైన ట్రంప్) ఇందుకు స్పందనగా డెమొక్రాట్లు సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. ‘అధ్యక్షుడిపై వచ్చిన ఆరోపణలు, అందుకు గల సాక్ష్యాలను పరిశీలించకుండా... విమర్శలకు దిగుతూ అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. ట్రంప్ అభిశంసన జ్యుడిషియరీ కమిటీలో భాగమైన జెర్రీ నాడ్లర్ మాట్లాడుతూ.. ‘మేం వినాలనుకోవడం లేదు అందుకే వినబోము. ఎందుకంటే అధ్యక్షుడి తప్పులు కప్పిపుచ్చడమే మా పని అన్నట్లు ఉంది’ అని రిపబ్లికన్ల విమర్శలను తిప్పికొట్టారు. ఇక హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ మాట్లాడుతూ... ‘అధ్యక్షుడి అధికార దుర్వినియోగం కారణంగా అభిశంసనకు గురయ్యారు. ఇది చాలా విషాద ఘటన. అయితే ఇంతకుమించి ఆయన మాకు మరో అవకాశం ఇవ్వలేదు. ఇది జాతీయ భద్రతకు, ఎన్నికల వ్యవస్థకు సమగ్రతకు, విశ్వసనీయతకు సంబంధించిన అంశం. కాబట్టి సభ్యులకు ఇది తప్పలేదు’ అని పేర్కొన్నారు. ఇది అమెరికాపై దాడి తనను అభిశంసించడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘వామపక్ష తీవ్ర భావజాలం.. దారుణమైన అబద్ధాలు ఆడింది. డెమొక్రాట్లు ఇంకేమీ చేయలేరు. ఇది అమెరికాపై దాడి. రిపబ్లికన్ పార్టీపై దాడి’ అని ట్వీట్ చేశారు. అదే విధంగా అభిశంసన నేపథ్యంలో తనకు మద్దతుగా నిలుస్తున్న వారి ట్వీట్లు, తనకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్న వీడియోలను ట్విటర్లో షేర్ చేశారు. ఇక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. ప్రతిపక్ష డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న ప్రతినిధుల సభ ట్రంప్ అభిశంసన తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో జనవరిలో ఆయన సెనేట్‌లో అభిశంసనను ఎదుర్కోనున్నారు. అయితే అక్కడ రిపబ్లికన్ల ఆధిక్యం ఉండటంతో ట్రంప్ అభిశంసన నుంచి తప్పించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. SUCH ATROCIOUS LIES BY THE RADICAL LEFT, DO NOTHING DEMOCRATS. THIS IS AN ASSAULT ON AMERICA, AND AN ASSAULT ON THE REPUBLICAN PARTY!!!! — Donald J. Trump (@realDonaldTrump) December 18, 2019 -
అభిశంసనకు గురైన ట్రంప్
-
ట్రంప్‌కు భారీ షాక్.. అభిశంసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ షాక్ తగిలింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన అభిశంసనకు గురయ్యారు. ప్రతిపక్ష డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న ప్రతినిధుల సభ ట్రంప్ అభిశంసన తీర్మానానికి ఆమోదం తెలిపింది. తదుపరి ఆయన సెనేట్‌లో అభిశంసనను ఎదుర్కోనున్నారు. కాగా అమెరికా అధ్యక్ష చరిత్రలో అభిశంసనకు గురైన మూడో అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. ఇక 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జోయ్ బైడన్ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉందన్న వార్తల నేపథ్యంలో... బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బైడన్ కుమారుడు హంటర్ బైడన్‌కు ఉక్రెయిన్‌లో భారీగా వ్యాపారాలున్నాయి. ఈ క్రమంలో ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్... దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూశారని... బైడన్, ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపిస్తూ అభిశంసనకు పట్టుబట్టారు. అయితే ట్రంప్ మాత్రం వీటిని కొట్టిపడేశారు. ఈ క్రమంలో ఆడం చిఫ్ నేతృత్వంలో అభిశంసన విచారణ కమిటీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి బుధవారం ఆమోదించింది. దీంతో ట్రంప్ అభిశంసనకు గురైనట్లు స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రకటించారు. ఇక సెనేట్‌లో జనవరి నుంచి ఆయన విచారణ ఎదుర్కోనున్నారు. అయితే సెనేట్‌లో అధికార రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్నందు వల్ల ట్రంప్ అభిశంసన వీగిపోయే అవకాశం ఉంది. అభిశంసన అంటే..? తీవ్రమైన నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు గద్ద దింపే ప్రక్రియే అభిశంసన. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర అధికారులు దేశద్రోహం, లంచాలు ఇవ్వడం, అధికార దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడితే అభిశంసించే అధికారం అమెరికా కాంగ్రెస్‌కు ఉంది. ప్రక్రియ ఎలా ? అధ్యక్షుడిని అభిశంసించి గద్దె దింపడం సులభమేమీ కాదు. దీనికి సుదీర్ఘమైన న్యాయప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అధ్యక్షుడిపై నమోదైన అభియోగాలను సాక్ష్యాధారాలతో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హౌస్ జ్యుడీషియరీ కమిటీ విచారిస్తుంది. అక్కడ ఆరోపణలు రుజువైతే 435 మంది సభ్యులు కలిగిన ప్రతినిధుల సభ సాధారణ మెజారీటీతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. -
అమెరికా తరపునే మాట్లాడా : ట్రంప్
న్యూయార్క్ : అభిశంసన విచారణ ప్రక్రియ సాగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విపక్షాల తీరును తప్పుపట్టారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం అధ్యక్ష పీఠాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ట్రంప్ ఎదురుదాడి ముమ్మరం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడుకి తాను ఫోన్ చేసిన క్రమంలో తమ దేశం గురించి ఉక్రెయిన్‌కు, ఉక్రెయిన్ గురించి అమెరికాకు అంతా తెలుసునంటూ మీరు మాకు సాయం చేయాలని కోరానని, ఇక్కడ మాకు అని అమెరికాను ఉద్దేశించి అన్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా అటార్నీ జనరల్ మీకు లేదా మీ వాళ్లకు ఫోన్ చేస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడితో అన్నానని వెల్లడించారు. ఈ మాటలపైనే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. అమెరికన్లకు డెమోక్రాట్లు క్షమాపణ చెప్పాలని ట్రంప్ కోరారు. కాగా, ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ చేసిన ఫోన్ కాల్ కలకలం రేపడంతో అభిశంసన విచారణ ప్రధానంగా ఈ అంశం చుట్టూ సాగుతోంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున తనకు ప్రధాన పోటీదారుగా నిలవనున్న జో బిడెన్‌కు ఉక్రెయిన్‌లో ఉన్న వ్యాపారాలపై విచారణ జరిపి, తనకు సాయం చేయాలంటూ జెలెన్స్కీని కోరారన్నది ట్రంప్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
‘ట్రంప్ ప్రజాస్వామ్యానికే పెనుముప్పు’
వాషింగ్టన్ : అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధ్యక్షుడికి అండగా నిలబడటం తప్పుడు సంకేతాలు పంపుతుందని, ఇది అమెరికా భవిష్యత్‌కు మంచిది కాదని ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియకు ఆమె గట్టి మద్దతుదారుగా నిలిచారు. అధికార దుర్వినియోగానికి పాల్పడే అధ్యక్షుడిని ఇలాగే వదిలేస్తే రానున్న అధ్యక్షులు సైతం తమ సొంత రాజకీయ ప్రయోజనాలను అమెరికన్ ప్రజలపై రుద్దుతారని, మన జాతీయ భద్రత, ఎన్నికలు, మన ప్రజాస్వామ్యానికే ఇది ముప్పుగా పరిణమిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జ్యుడిషియరీ కమిటీ ఎదుట ట్రంప్ అభిశంసనపై విచారణ తొలి రోజున ప్రమీలా జయపాల్ ట్రంప్ అభిశంసనకు మద్దతుగా మాట్లాడారు. జ్యుడిషియరీ కమిటీలో ఆమె ఒక్కరే ఇండియన్-అమెరికన్ సభ్యురాలు కావడం గమనార్హం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవిని వాడుకుంటున్న అధ్యక్షుడిని సాగనంపకుంటే మనం ఎక్కువ కాలం ప్రజాస్వామ్యంలో మనగలగలేమని, నియంత పాలనలో కూరుకుపోతామని ఆమె హెచ్చరించారు. . ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ చేసిన ఫోన్ కాల్ కలకలం రేపడంతో అభిశంసన విచారణ ప్రధానంగా ఈ అంశం చుట్టూ సాగుతోంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున తనకు ప్రధాన పోటీదారుగా నిలవనున్న జో బిడెన్‌కు ఉక్రెయిన్‌లో ఉన్న వ్యాపారాలపై విచారణ జరిపి, తనకు సాయం చేయాలంటూ జెలెన్స్కీని కోరారన్నది ట్రంప్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
ట్రంప్‌పై అభిశంసన విచారణ ప్రారంభం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిశంసనపై విచారణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అమెరికా పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభలో ఇంటలిజెన్స్ కమిటీ అధ్యక్షుడు, డెమొక్రాట్ పార్టీ నేత ఆడమ్ షిఫ్ ఈ బహిరంగ విచారణను ప్రారంభించారు. ‘వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ అధికారులను ట్రంప్ ఒత్తిడి చేశారా?’ అనే ప్రశ్నతో విచారణ ప్రారంభమైంది. విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఈ విచారణలో ఉక్రెయిన్‌లో అమెరికా దౌత్యాధికారి టేలర్, డెప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ కెంట్లను తొలుత ప్రశ్నించనున్నారు. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ చేసిన ఫోన్ కాల్‌పై ఈ విచారణ ప్రధానంగా ఆధారపడింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున తనకు ప్రధాన పోటీదారుగా నిలవనున్న జో బిడెన్‌కు ఉక్రెయిన్‌లో ఉన్న వ్యాపారాలపై విచారణ జరిపి, తనకు సాయం చేయాలంటూ జెలెన్స్కీని కోరారన్నది ట్రంప్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. -
ట్రంప్ అభిశంసన ప్రక్రియకు లైన్ క్లియర్
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అధికార రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లదే పైచేయిగా ఉన్న ప్రతినిధుల సభలో గురువారం 232–196 ఓట్ల తేడాతో తీర్మానం నెగ్గింది. ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ నిధుల మంజూరును సాకుగా చూపి ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై బహిరంగ విచారణ జరిపించాలని, అధ్యక్షుడిని అభిశంసించాలని ప్రతిపక్షం పట్టుబడుతోంది. -
ట్రంప్ ‘ఆత్మ విమర్శ’
‘అభిశంసన’ భూతం వైట్‌హౌస్ తలుపు తడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. పశ్చిమాసియా యుద్ధ క్షేత్రాలనుంచి తమ సైన్యాలు నిష్క్ర మించడం ఖాయమని ట్విటర్ ద్వారా ఆయన ప్రపంచానికి చాటారు. అయితే తమ అధ్యక్షుడు చేసిన ప్రకటనను అక్కడి విదేశాంగ శాఖ ఎలా తీసుకుంటుందో, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంట గాన్ ఏమంటుందో, ప్రత్యేకించి ట్రంప్‌ను నెత్తిన పెట్టుకుని ఆయన్ను దేశాధ్యక్షుణ్ణి చేసిన రిపబ్లికన్ పార్టీ ఏం చేస్తుందో, అమెరికన్ కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో ఇంకా చూడాల్సి ఉంది. ఆ దేశంలో అంతర్గత పరిణామాలు చివరకు ఎటు పయనిస్తాయన్న సంగతలా ఉంచితే... వరస ట్వీట్ల ద్వారా ట్రంప్ చాలా విషయాలే చెప్పారు. చెప్పారనేకంటే అందరూ దశాబ్దాలుగా చెబుతున్న అంశాలనే ఆయన ధ్రువీకరించారనాలి. జన విధ్వంసక ఆయుధాలున్నాయన్న తప్పుడు అభిప్రాయంతో పశ్చి మాసియాలోకి ప్రవేశించడం దేశ చరిత్రలో అత్యంత దారుణమైన నిర్ణయమని ట్రంప్ అంగీకరిం చారు. అలాంటి ఆయుధాలు లేవని అనంతరకాలంలో తేలిందని ఆయన గుర్తు చేశారు. ఈ తప్పుడు నిర్ణయం పర్యవసానంగా దేశం 8 లక్షల కోట్ల డాలర్లు నష్టపోయిందని, వేలాదిమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఆయన వాపోయారు. అమెరికాకు జరిగిన నష్టం గురించే ట్రంప్ మాట్లాడుతున్నారు. తాము దురాక్రమించిన, దాడులు చేసిన దేశాల స్థితిగతుల గురించి మౌనంవహిస్తున్నారు. ఆ దేశాల దుస్థితి చూస్తే ఎలాంటి వారికైనా కళ్లు చెమరుస్తాయి. ఇరాక్ నుంచి సిరియా వరకూ అన్ని దేశాలదీ ఒకే వ్యథ. ఆ దేశాలన్నీ దాదాపు వల్లకాళ్లుగా మారాయి. లక్షలాదిమంది ప్రజానీకం బాంబు దాడుల్లో, క్షిపణి దాడుల్లో దుర్మ రణం పాలయ్యారు. మరిన్ని లక్షల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. తమ ఆప్తుల్లో అనేకులు మరణించారో... సముద్రాలు దాటి వేరే దేశాల్లో తలదాచుకుంటున్నారో తెలియని అయోమయంలో అనేక కుటుంబాలున్నాయి. ఇంటికి కనీసం ఇద్దరు, ముగ్గురు అంగవికలులయ్యారు. అమెరికా నిర్వాకం వల్ల ఐఎస్ వంటి ఉగ్రవాద భూతాల పాలబడి మహిళలు, బాలికలు ఎదుర్కొన్న హింస చెప్పనలవికానిది. వారు అత్యాచారాలకూ, ఇతర లైంగిక హింసలకూ బలైపోయారు. సర్వస్వం కోల్పోయారు. వారిని నడిరోడ్డుపై సంతలో పశువుల్లా వేలం వేసిన ఉదంతాలు వెల్లడై ప్రపంచం దిగ్భ్రాంతిలో మునిగింది. చిన్న చిన్న పిల్లలు సైతం బలవంతంగా మానవ బాంబులుగా మారి తమ ప్రాణాలు బలిపెట్టారు. భారీ విధ్వంసాలకు కారకులయ్యారు. ఇప్పటికీ ఆ దేశాలు జరిగిన నష్టం నుంచి కోలుకోలేదు. అక్కడ శిథిల గృహాలు, చిన్నాభిన్నమైన జీవనం, మనిషి అన్న ప్రతివాడినీ అను మానంతో చూసే కళ్లూ దర్శనమిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా తీసుకున్న తప్పుడు నిర్ణయం పర్యవసానంగా ఆ దేశాల్లో కనీసం రెండు, మూడు తరాల భవిష్యత్తు సర్వనాశనమైంది. తిండి, బట్ట, విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస అవసరాలకు కూడా దిక్కులేని స్థితి ఏర్పడింది. ఆ దేశాల ప్రజానీకానికి జరిగిన నష్టాలముందు... వారు ఎదుర్కొన్న, ఇప్పటికీ ఎదుర్కొంటున్న కష్టా లముందు అమెరికా కోల్పోయింది లేశమాత్రమే అని చెప్పాలి. ట్రంప్ ప్రకటన ఏమేరకు సాకారమవు తుందన్న సంగతలా ఉంచితే ఆయనే స్వయంగా తమ దేశం చేసినవి తప్పుడు పనులని అంగీకరిం చారు గనుక పశ్చిమాసియా దేశాల ప్రజలకు క్షమాపణ చెప్పడం, వారికి పరిహారం చెల్లించడం కనీస బాధ్యత. దాన్ని ఆయన గుర్తించకపోతే ఐక్యరాజ్య సమితి ఆ పని చేయించాలి. బోస్నియాలో 1992లో సాగిన నరమేథానికి కారకులైనవారిని 20 ఏళ్ల పాటు విచారించి యుద్ధ నేరస్తులుగా నిర్ధారించి శిక్షలు విధించారు. దశాబ్దంక్రితం శ్రీలంకలో తమిళ టైగర్లను అణిచేపేరిట సాగిన నరమేథాన్ని యుద్ధ నేరంగా పరిగణించాలంటూ భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్లు కోరుతున్నాయి. రెండేళ్లలో ఆ దేశం తనకు తానుగానే నిష్పాక్షిక న్యాయవిచారణ నిర్వహించి నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని మండలి గత మార్చిలో గడువు విధించింది. మరి ఇప్పుడు పశ్చిమాసియా విషయంలో అమెరికా, దాని మిత్ర దేశాలపై సమితి ఈ పనిచేయగలదా? దాని తరం కాదన్న భరోసాతోనే ట్రంప్ ఈ మాదిరి ట్వీట్లు చేయగలుగు తున్నారు. అమెరికా సైన్యం చొరబడినంత సులభం కాదు... వెనక్కి రావడం. ఆ దేశాలన్నీ ఇప్పుడు పర స్పర అవిశ్వాసంతో, ఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇరుగు పొరుగుతో నిత్యం సంఘర్షిస్తు న్నాయి. ఇప్పుడు సిరియా స్థితి అదే. తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని ట్రంప్ చెప్పిన కొన్ని గంటలకే సిరియా ఉత్తర ప్రాంతంలోని కుర్దుల ప్రాంతాలపై టర్కీ బాంబుల వర్షం కురిపిం చడం ప్రారంభించింది. వేలాదిమంది ఇళ్లూ వాకిళ్లూ వదిలి ప్రాణభయంతో పరుగులు పెడుతు న్నారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని వైట్ హౌస్ చెప్పడంతో టర్కీ అధ్యక్షుడు ఎర్డో గాన్ మరింత విజృంభిస్తున్నారు. ఇన్నాళ్లూ అమెరికాకు అండగా ఉండి, ఇరాక్‌లో సైతం ఐఎస్‌ను అణ చడంలో తోడ్పడిన కుర్దులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ పరిణామాలు చూశాక తమ సైన్యాన్ని సిరియా ఉత్తరప్రాంతానికి తరలించాలనుకుంటున్నామని అమెరికా రక్షణ శాఖ ప్రతి నిధి చెబుతున్నారు. దీనికి ట్రంప్ ఆమోదం ఉందో లేదో తేలలేదు. సిరియాలో అంతక్రితం తమ సైని కులు 2,000మంది ఉంటే ఆర్నెల్లక్రితం సగం మందిని వెనక్కు రప్పించారు. ఇప్పుడు మరింత తగ్గిస్తా మన్న ప్రకటనను ఆయన నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ట్రంప్ మాటలు నిజంగా ఆచ రణలోకొస్తే ఏం చేయాలన్నది ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు చర్చించి నిర్ణయిం చాలి. తదనుగుణంగా అమెరికా, మిత్ర దేశాలు నడుచుకోవాలి. అఫ్ఘానిస్తాన్, లిబియా, సోమాలియా, ఇరాక్ వంటిచోట్ల ఇన్నేళ్లుగా సాగించిన దారుణాలను విచారించడానికి సహకరించాలి. ఇవేమీ చేయ కుండా సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చి అమెరికాను ఉద్ధరిస్తానంటే ప్రపంచ ప్రజానీకం సహించదు. -
ట్రంప్‌పై మళ్లీ అభిశంసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దించడానికి డెమొక్రాట్లు మరోసారి అభిశంసన తీసుకువచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జోయ్ బైడన్ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉంది. బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. బైడన్ కుమారుడు హంటర్ బైడన్‌కు ఉక్రెయిన్‌లో భారీగా వ్యాపారాలున్నాయి. ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్ దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూశారని, బైడన్ ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్టు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది. ట్రంప్ చర్యలన్నీ జాతీయ భద్రతకు భంగకరంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ డెమొక్రాట్లు వాదిస్తున్నారు. డెమొక్రాట్ ప్రజాప్రతినిధుల్ని కలుసుకొని చర్చించిన తర్వాత హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ట్రంప్‌పై అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసన ప్రక్రియ మొదలైనట్టు ప్రకటించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు, అధ్యక్షుడైనా సరే ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అని నాన్సీ అన్నారు. అభిశంసన ప్రక్రియపై ట్రంప్ స్పందించారు. తనని వెంటాడి వేధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ట్రంప్‌పై తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ బలం లేకపోవడంతో వీగిపోయింది. పదవి నుంచి ఎలా తొలగిస్తారు ? అమెరికా అధ్యక్షుడిని గద్దె దింపాలంటే సెనేట్ అత్యంత కీలకం. సెనేట్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో అధ్యక్షుడికి తన వాదనల్ని వినిపించుకునే అవకాశం ఉంటుంది. సెనేట్‌లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు (67 మంది) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవిని కోల్పోవలసి వస్తుంది. గతంలో ఎదుర్కొన్నవారెవరు? అమెరికా అధ్యక్షులెవరూ ఇప్పటివరకు అభిశంసనకు గురి కాలేదు. 1868లో ఆండ్రూజాన్సన్, తిరిగి 1998లో బిల్ క్లింటన్లపై అభిశంసన ప్రవేశపెట్టినా సెనేట్‌లో వారిద్దరికీ ఊరట లభించింది. ఇక 1974లో రిచర్డ్ నిక్సన్ అభిశంసన తీర్మానంపై చర్చ జరగక ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పటివరకు సభలో 60సార్లకు పైగా అభిశంసన ప్రక్రియ జరిగింది. -
సోనియా, రాహుల్‌కు నేను ముందే చెప్పా!!
కోల్‌కతా: భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభిశంసన నోటీసు ఇవ్వడం తప్పేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ అభిశంసన నోటీసుకు తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని ఆమె తెలిపారు. అసలు ఈ నోటీసులు చేపట్టవద్దంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆయన తల్లి సోనియాగాంధీకి ముందే తాను సలహా ఇచ్చినట్టు వెల్లడించారు. ‘కాంగ్రెస్ మా మద్దతు కోరింది. కానీ మేం ఇవ్వలేదు. అభిశంసనకు వెళ్లకండి అంటూ నేను సోనియా, రాహుల్‌కు చెప్పాను’ అని మమతా ఓ చానెల్‌తో తెలిపారు. న్యాయవ్యవస్థలో తమ పార్టీ జోక్యం చేసుకోబోదని ఆమె తెలిపారు. దుష్ప్రవర్తనకు పాల్పడుతున్నారంటూ సీజేఐకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభిశంసన నోటీసుకు ఏడు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై 64మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. అయితే, కాంగ్రెస్ ఆరోపణలకు తగినంతగా ఆధారాలు లేవంటూ.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నోటీసును తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
అసంబద్ధ రాజకీయ క్రీడ
రాజకీయ అవినీతి వెర్రితలలు వేసినప్పుడు రాజకీయాలకు, అవకాశవాదానికి మధ్య ఉండే అస్పష్ట విభజన రేఖ చెరిగిపోయి ప్రజాస్వామ్యం ప్రహసనంగా మారుతుంది. బ్రెజిల్ ప్రజాస్వామ్యం పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. 2014లో రెండో దఫా దేశాధ్యక్ష పదవిని చేపట్టిన దిల్మా రోసెఫ్‌పై అవినీతి, అధికార దుర్వినియోగాల ఆరోపణలపై విచారణ జరుపుతున్నందున సెనేట్ (ఎగువ సభ) ఆమెను మే 12న తాత్కాలికంగా అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ (దిగువ సభ) అంతకు ముందే ఆమెను అభిశంసిస్తూ తీర్మానించింది. సెనేట్ ఆరు నెలలలోగా విచారణను పూర్తి చేసి, ఈ అభిశంసనను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చెయ్యాల్సి ఉంటుంది. 2015 మార్చి నుంచి బ్రెజిల్‌ను కుదిపేస్తున్న ‘కార్ వాష్’ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, న్యాయస్థానాల పట్టుదల కారణంగా... తీగలాగితే డొంకంతా బయటపడ్డట్టు అధికార, ప్రతిపక్షా లనే తేడా లేకుండా చాలా మంది రాజకీయ ప్రముఖులపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వరంగ పెట్రో సంస్థ పెట్రోబ్రాస్ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై భారీ కుంభకోణానికి పాల్పడ్డారు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు సైతం ముడుపులు అందించారు. ఈ కుంభకోణంలో ఎలాంటి ఆరోపణలు, కేసులు లేని ఏకైక ప్రముఖ నేత రోసెఫ్. అభిశంసనకు గురై అధ్యక్ష పదవిని కోల్పోనున్నది కూడా ఆమే! రోసెఫ్‌పై ఉన్న ఆరోపణలు అవినీతికి సంబంధిం చిన్నవి కానే కాదు. 2014 ఎన్నికలకు ముందు ఆమె ప్రభుత్వ గణాంకాలను తమ పార్టీకి అనుకూలంగా వక్రీకరించి బడ్జెట్ లోటును తక్కువగా చూపి ఓటర్లను వంచించారనేది ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణ. ప్రభుత్వాలు గణాంకాల గారడీతో ఆర్థిక వృద్ధి కథనాన్ని ఆశావహంగా తీర్చిదిద్దడం మన దేశం సహా పలు ప్రముఖ ప్రజాస్వామ్య దేశాలలో ఆమోదనీయమైనదిగా చలామణి అవుతూ ఉన్నదే. ఏదేమైనా అభిశంసన కోరాల్సిన తప్పిదమేమీ కాదు. కాకపోతే ఈ కుంభకోణం జరుగుతున్న కాలంలో పెట్రోబ్రాస్ పాలక వర్గంలో సభ్యులుగా ఉండి కూడా ఆమె దీన్ని జరగనిచ్చారని తప్పు పట్టడం సమంజసమే. కానీ ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధిని పొందని ఆమెను గద్దె దించడానికి పార్లమెంటును, రాజ్యాంగాన్ని వాడుకుంటున్న వారంతా కోట్ల కొద్దీ డాలర్ల ముడుపులు అందుకున్న వారు కావడమే వైచిత్రి. రోసెఫ్ అభిశంసన వ్యూహ కర్త దిగువ సభ స్పీకర్ ఎడువార్డో కన్హా. ఆయనకు పెట్రోబ్రాస్ నుంచి 4 కోట్ల డాలర్ల ముడుపులు అందాయని సుప్రీం కోర్టులో కేసులున్నాయి. శిక్ష పడితే 184 ఏళ్లు జైల్లో మగ్గాల్సి వస్తుంది. ఆయన, రోసెఫ్ వర్కర్స్ పార్టీ (పీకే) నేతృత్వంలోని అధికార కూటమిలో భాగస్వామ్య పక్షమైన డెమోక్రటిక్ మూవ్మెంట్ పార్టీ(పీఎమ్డీబీలో)కి చెందిన వారు. కాగా, రోసెఫ్ సస్పెన్షన్ తదుపరి తాత్కాలిక అధ్యక్షునిగా ప్రభుత్వాన్ని ఏర్పరచిన ఉపాధ్యక్షుడు మైఖేల్ టెమర్ కూడా ఆదే పార్టీ నేత. ఆయనపైనా కార్ వాష్ కేసులున్నాయి. రోసెఫ్‌ను గద్దెదించడం ద్వారా ప్రజల దృష్టిని పెట్రోబ్రాస్‌పై నుంచి మరల్చి, పోలీసు అధికారులను, న్యాయమూర్తులను మార్చి అవినీతి ఆరోపణల నుంచి బయటపడాలనే వ్యూహాన్ని రచించినది ఆయనే. కన్హాతో టెమర్ కుమ్మక్కయ్యారనే వార్తలు దిగువ సభలో ఓటింగ్‌కు ముందే వినవచ్చాయి. అది నిజమేనని ఆయన ఏర్పరచిన తాత్కాలిక ప్రభుత్వ మంత్రివర్గం చెప్పింది. ఏ భావజాలానికి చెందని పీఎమ్డీబీలో టెమర్‌కు వామపక్షం వైపు మొగ్గుగల మధ్యేవాదిగాlపేరుంది. మహిళలకు, నల్లజాతీయులకు, మూలవాసులకు స్థానం లేకుండా చేసి శ్వేతజాతీయులు, పురుషులు మాత్రమే ఉన్న పచ్చి మితవాద మంత్రి వర్గాన్ని ఏర్పరచి ఆయన పరిశీలకులను నిర్ఘాంతపరచారు. రోసెఫ్ అభిశంసనను రాజకీయ కుట్రగా చూస్తున్నవారి అంచనాలు తప్పు కావనడానికి అధారాలు సైతం టెమర్ ప్రభుత్వం ఏర్పడిన పది రోజులకే బయట పడ్డాయి. కార్ వాష్ కేసుల నుంచి తప్పించుకోవడానికి కేసులున్నవారంతా ఒక్కటై రోసెఫ్‌పై అభిశంసన తీర్మానాన్ని గెలిపిస్తే, టెమర్ అధ్యక్షులై ప్రజల దృష్టిని మరల్చి కేసులను నీరుగారుస్తారంటూ ప్రణాళికా శాఖా మంత్రి రొమేరో జుకా జరిపిన సంభాషణ టేపులు బయటçపడ్డాయి. దీంతో ఆయన ‘దీర్ఘకాలిక సెలవు’పై వెళ్లాల్సి వచ్చింది. వారం తిరిగే సరికే మరో మంత్రి ఫెబియానో సెలివేరియా అవే టేపుల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. రోసెఫ్ వ్యతిరేకులకు సెనేట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్నదని తెలుస్తోంది. కాబట్టి సెనేట్ ఓటింగ్‌లో రోసెఫ్ అభిశంసనకు ఆమోదం లభించవచ్చు. అయినా బ్రెజిల్ రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం లేదు. కారణం ఇది ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభం. రోసెఫ్ వామపక్ష వర్కర్స్ పార్టీ 2002 నుంచి అధికారంలో ఉంది. ప్రత్యేకించి లూలా హయాంలో సామాజిక అసమానతలు, జాతి వివక్ష గణనీయంగా తగ్గింది. పేదరిక నిర్మూలనలో గొప్ప విజయాలనే సాధించారు. ఆనాటి తీవ్ర ఆర్థిక తిరోగమనం నుంచి వేగంగా వృద్ధి చెందుతున్న ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా బ్రెజిల్‌ను లూలా నిలపగలిగారు. దేశ జనాభాలో దాదాపు సగంగా ఉన్న నల్ల జాతీయులు, మూలవాసులకు సమానత్వాన్ని, హక్కులను కల్పించడంలో లూలా, రోసెఫ్లు ప్రశంసనీయమైన కృషి చేశారు. అయితే అదే సమయంలో ఉన్నత, సంపన్న, కులీన వర్గాలలో ఈ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తి పెరిగింది. 2008 నుంచి మొదలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2012 నుంచి బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపసాగింది. 2014 నుంచి బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ ఏటికేడాది కుచించుకుపోతూ వచ్చింది. వరుసగా ఐదేళ్లుగా ఎగుమతులు క్షీణిస్తున్నాయి. బడ్జెట్ లోటును తగ్గించుకోవడానికి చేసిన ప్రయ త్నాలు వర్కర్స్ పార్టీకి ప్రధాన మద్దతుదార్లయిన పేద, మధ్య తరగతి ఆదాయ వర్గాలలో అసంతృప్తిని రాజేశాయి. పలు జాతులకు నిలయమైన బ్రెజిల్లో ప్రత్యేకించి నల్ల జాతీయులను సేవకులుగా పరిగణించే కులీన జాత్యహంకార ధోరణులు ఉన్నత వర్గాలలో మొదటి నుంచీ ఉన్నాయి. అవినీతిపరులైన రాజకీయ వేత్తలంతా పార్టీలకు అతీతంగా ఏకమై ప్రజాభిప్రాయాన్ని తలకిందులు చేసే అవకాశవాద రాజకీయ క్రీడకు వేదికగా పార్లమెంటును దిగజార్చడానికి ఈ సార్వత్రిక అసంతృప్తి ఆస్కారమిచ్చింది. రాజకీయ అవినీతి, అవకాశవాదం కలసి ఆడుతున్న ప్రజాస్వామ్య ప్రహసనంలో నష్టపోయేది ప్రజలు కావడమే విషాదం.