![Donald Trump impeachment hearings swing open - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/14/trum.jpg.webp?itok=iU2w13CQ)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిశంసనపై విచారణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అమెరికా పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభలో ఇంటలిజెన్స్ కమిటీ అధ్యక్షుడు, డెమొక్రాట్ పార్టీ నేత ఆడమ్ షిఫ్ ఈ బహిరంగ విచారణను ప్రారంభించారు. ‘వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ అధికారులను ట్రంప్ ఒత్తిడి చేశారా?’ అనే ప్రశ్నతో విచారణ ప్రారంభమైంది. విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఈ విచారణలో ఉక్రెయిన్‌లో అమెరికా దౌత్యాధికారి టేలర్, డెప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ కెంట్‌లను తొలుత ప్రశ్నించనున్నారు. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ట్రంప్ చేసిన ఫోన్ కాల్‌పై ఈ విచారణ ప్రధానంగా ఆధారపడింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున తనకు ప్రధాన పోటీదారుగా నిలవనున్న జో బిడెన్‌కు ఉక్రెయిన్‌లో ఉన్న వ్యాపారాలపై విచారణ జరిపి, తనకు సాయం చేయాలంటూ జెలెన్‌స్కీని కోరారన్నది ట్రంప్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ.
Comments
Please login to add a commentAdd a comment