దక్షిణ కొరియా నేషనల్ అసెంబ్లీ తీర్మానం
సియోల్: దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. దేశ తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్–సూపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ప్రతిపక్షం మెజారిటీ కలిగిన నేషనల్ అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో అనూహ్యంగా మార్షల్ లా విధించడం, అనంతర పరిణామాల్లో ఆయన్ను నేషనల్ అసెంబ్లీ అభిశంసించడం తెలిసిందే.
తాజాగా తాత్కాలిక అధ్యక్షుడు హన్‌ను నేషనల్ అసెంబ్లీ అభిశంసించిన నేపథ్యంలో ఆయనకు ఇకపై ఎలాంటి అధికారాలు, విధులు ఉండవు. పదవిలో కొనసాగించాలా లేదా దించేయాలా అనే విషయాన్ని రాజ్యాంగ న్యాయస్థానం తేల్చేదాకా ఇదే పరిస్థితి కొనసాగనుంది. యూన్ అభిశంసన అంశం ఇప్పటికే రాజ్యాంగ న్యాయస్థానం పరిశీలనలో ఉండటం తెలిసిందే. అధ్యక్షుడు, తాత్కాలిక అధ్యక్షుడి అభిశంసనలు దేశంలో రాజకీయపరమైన అయోమయాన్ని మరింత పెంచాయి. ఆర్థిక అనిశ్చితి ఫలితంగా అంతర్జాతీయంగా దక్షిణ కొరియా ప్రతిష్ట దెబ్బతిననుంది.
Comments
Please login to add a commentAdd a comment