National Assembly
-
French Election Results 2024: సంకీర్ణమా... సంక్షోభమా?
పారిస్: ఫ్రాన్స్ ముందస్తు ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ సారథ్యంలోని అతివాద కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంటు దిగువ సభ నేషనల్ అసెంబ్లీకి జూన్ 30న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో గెలిచిన ఆ కూటమి ఆదివారం కీలకమైన రెండో రౌండ్ పోలింగ్‌లో చేతులెత్తేసింది. 577 స్థానాలకు గాను 143 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. సోమవారం వెలువడ్డ ఫలితాల్లో ఏ కూటమికీ మెజారిటీ రాలేదు. తొలి రౌండ్ పరాజయం నేపథ్యంలో వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)తో అవగాహనకు రావడం అధికార సెంట్రిస్ట్ కూటమికి కలిసొచి్చంది. మెజారిటీ స్థానాల్లో అవి ఒకే అభ్యరి్థని నిలపడంతో నేషనల్ ర్యాలీ కూటమి జోరుకు కళ్లెం పడింది. ముఖ్యంగా మెరీన్ లీ పెన్ సారథ్యంలోని నేషనల్ ర్యాలీ కూటమి ఫాసిస్టు ఎజెండాకు ప్రత్యామ్నాయంగా సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ తదితరాలతో ముందుకొచ్చిన ఎన్పీఎఫ్ అతి పెద్ద కూటమిగా అవతరించింది. దానికి 193 సీట్లు రాగా సెంట్రిస్ట్ కూటమి 164 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఎవరికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 289 సీట్లు రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దాంతో ఎన్పీఎఫ్తో కలిసి మాక్రాన్ కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా, లేక పరిస్థితి రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ప్రధాని పదవి కోసం ఎన్పీఎఫ్ పట్టుబడుతుండటం, ఆ కూటమిలోని అతివాద పార్టీలతో అధికారం పంచుకునేందుకు మాక్రాన్ సుముఖంగా లేకపోవడం వంటివి కారణం. దీనికి తోడు ఎన్పీఎఫ్లోనూ కీచులాటలున్నాయి. ఫ్రాన్సు లో దశాబ్దాలుగా ఏక పార్టీ పాలనే సాగుతూ వస్తోంది. నేషనల్ ర్యాలీకి ఆశించిన ఫలితాలు రాకపోయినా 2022 ఎన్నికల్లో కేవలం 89 సీట్లు సాధించిన కూటమి బలం ఈసారి గణనీయంగా పెరిగింది. ఫలితాలు తమకు ఎదురుదెబ్బ కాదని, తమ విజయం వాయిదా మాత్రమే పడిందని లీ పెన్ అన్నారు. అప్పుడే కీచులాటలు ఫలితాల నేపథ్యంలో ప్రధాని గేబ్రియెల్ అటల్ సోమవారం రాజీనామా చేశారు. దాన్ని మాక్రాన్ తిరస్కరించారు. ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు మూడు వారాలే ఉండటంతో తాత్కాలికంగా పదవిలో కొనసాగాలని కోరారు. అందుకు అటల్ సిద్ధంగా ఉన్నా ఎన్పీఎఫ్ మాత్రం అధికారం చేతులు మారాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రజాభీష్టాన్ని గౌరవించి తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, ప్రధాని పదవి తమకే చెందాలని వామపక్ష నేత జీన్ లూక్ మెలెన్‌చోన్ డిమాండ్ చేశారు. అదే జరిగితే అధ్యక్షుడు, ప్రధాని వేర్వేరు పారీ్టల నుంచి ఉండటం ఫ్రాన్స్‌లో 22 ఏళ్లలో ఇదే తొలిసారి అవుతుంది. పలు అధికారాలను కూడా ప్రధానితో మాక్రాన్ పంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని కో హాబిటేషన్గా పిలుస్తారు. దేశ చరిత్రలో ఇలాంటి సందర్భాలు ఇప్పటికి మూడుసార్లు వచ్చాయి. పలు మాక్రాన్ సంస్కరణలకు చరమగీతం పాడతామని, అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన ప్రజా వ్యయ పథకాన్ని తెస్తామని, ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరి అవలంబిస్తామని ఎన్పీఎఫ్ ఇప్పటికే స్పష్టం చేయడంతో సంకీర్ణం ఏర్పాటు, మనుగడపై సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు ఎన్పీఎఫ్ భాగస్వాముల్లో అతివాద వామపక్షమైన ఫ్రాన్స్ అన్»ౌడ్తో కలిసి పని చేయబోమని మాక్రాన్ ఇప్పటికే ప్రకటించారు. సోషలిస్టులు, గ్రీన్స్‌తో భాగస్వామ్యానికి మొగ్గుతున్నారు. కానీ కొన్ని పక్షాలను పక్కన పెట్టేందుకు ఎన్పీఎఫ్ కూటమి అంగీకరించకపోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా నూతన జాతీయ అసెంబ్లీని జూలై 18న సమావేశపరుస్తానని మాక్రాన్ ప్రకటించారు. నాటో భేటీ కోసం బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. తిరిగొచ్చాక సంకీర్ణ ఏర్పాటుపై ఎన్పీఎఫ్తో చర్చలుంటాయని భావిస్తున్నారు. హంగ్ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ పడిపోయింది. యూరో విలువ కూడా 0.2 శాతం పడిపోయింది.ప్రధానీ పవర్‌ఫుల్లే... ఫ్రాన్స్‌లో 1958 నుంచి సెమీ ప్రెసిడెన్షియల్ పాలన వ్యవస్థ అమల్లో ఉంది. దీన్ని ఫిఫ్త్ రిపబ్లిక్‌గా పిలుస్తారు. ఇందులో అధ్యక్షునితో పాటు పార్లమెంటుకూ విశేషాధికారాలు ఉంటాయి. 1962 నుంచి అధ్యక్షుడిని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా నేరుగా ఎన్నుకుంటున్నారు. ఆయనే దేశాధిపతిగా, సాయుధ దళాల కమాండర్‌గా వ్యవహరిస్తారు. విదేశాంగ విధానం, రక్షణ విషయాలపై సర్వాధికారాలు ఆయనవే. ప్రధాని సిఫార్సు మేరకు కేబినెట్‌ను నియమిస్తారు. దేశీయ నిర్ణయాలన్నీ ప్రధాని నేతృత్వంలోని పార్లమెంటు తీసుకుంటుంది. ఆయనను అధ్యక్షుడు తొలగించలేరు. రాజీనామాను అభ్యరి్థంచవచ్చు. రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘిస్తే మూడింట రెండొంతుల మెజారిటీతో అధ్యక్షున్ని పార్లమెంటు అభిశంసించవచ్చు. ఫలించని ముందస్తు... నేషనల్ అసెంబ్లీ పదవీకాలం 2027 దాకా ఉంది. కానీ జూన్ 9న యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ చేతుల్లో మాక్రాన్ కూటమి ఘోర పరాజయం చవిచూసింది. దీనికితోడు ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న నేరాలు తదితరాలతో మాక్రాన్ నాయకత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మాక్రాన్ ముందస్తుకు వెళ్లారు. ఎన్నికల తేదీలు ప్రకటించగానే, సోషలిస్టులు, ఎకాలజిస్టులు, కమ్యూనిస్టులు, ఫ్రాన్స్అన్»ౌడ్ వంటివి కలిసి కలిసి ఎన్పీఎఫ్గా ఏర్పడ్డాయి. నేషనల్ ర్యాలీ కూటమిని ఓడించడమే లక్ష్యంగా చాలాచోట్ల ఎన్పీఎఫ్, సెంట్రిస్ట్ అభ్యర్థుల్లో ఎవరో ఒకరు తప్పుకుని ఓట్ల చీలికను నివారించారు. ఫలితంగా నేషనల్ ర్యాలీని నిలువరించినా మాక్రాన్ కూటమికి ఆయన ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు.దేశవ్యాప్త హింస... ఎన్నికల్లో ఆధిక్యం నేపథ్యంలో ఎన్పీఎఫ్ మద్దతుదారులు వీధుల్లోకొచ్చి సంబరాలు చేసుకున్నారు. పారిస్‌లోని ప్లేస్ డి లా రిపబ్లిక్ వద్ద వేలాదిగా గుమిగూడారు. ఈ క్రమంలో వారికి, నేషనల్ ర్యాలీ అభిమానులకు ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హింస చెలరేగింది. మాసు్కలు ధరించిన నిరసనకారులు పారిస్ వీధుల్లో పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఆస్తులను తగలబెట్టారు. రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.ఒలింపిక్స్‌పై ప్రభావమెంత? హంగ్ ఫలితాలతో ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరత నెలకొనడంతో జూలై 26 నుంచి జరగాల్సిన పారిస్ ఒలింపిక్స్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. అవి పూర్తయేదాకా పదవిలో కొనసాగేందుకు ప్రధాని అటల్ సుముఖంగా ఉన్నా ఆలోపే కొత్త ప్రధాని రావాల్సిందేనని అత్యధిక స్థానాలు సాధించిన లెఫ్ట్ కూటమి పట్టుబడుతోంది. ఒలింపిక్స్ భద్రత వ్యవహారాలు చూసుకునే కీలకమైన అంతర్గత భద్రత శాఖ మంత్రి గెలాల్డ్ డ్రమానియన్ కొనసాగడంపైనా సందిగ్ధతే కొనసాగుతోంది. ఒలింపిక్స్‌ను ఫ్రాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడేళ్లుగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలిక స్టేడియాలు, మౌలిక సదుపాయాలు తదితరాలపై ఇప్పటికే 260 కోట్ల డాలర్లకు పైగా వెచి్చంచింది. ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయినట్టేనని, ఒలింపిక్స్ నిర్వహణకు ఇబ్బందేమీ ఉండబోదని మాక్రాన్ ప్రభుత్వం చెబుతోంది. వాటి పర్యవేక్షణకు ఇబ్బంది ఉండకూడదనే అటల్ రాజీనామాను మాక్రాన్ ఆమోదించలేదని సమాచారం. ఏం జరగవచ్చు? సంకీర్ణ ఏర్పాటు సాధ్యపడని పక్షంలో రోజువారీ వ్యవహారాలను నడిపేందుకు ఏ పారీ్టలకు చెందని నిపుణులతో కూడిన ప్రభుత్వాన్ని మాక్రాన్ ఏర్పాటు చేసే వీలుంది. అయితే దేనికైనా పార్లమెంటు అనుమతి తప్పనిసరి. అధ్యక్షునిగా మాక్రాన్ పదవీకాలం 2027 దాకా ఉంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఆలోపు తప్పుకోబోనని ఆయన ఇప్పటికే ప్రకటించారు. -
French elections 2024: ఫ్రాన్స్‌లో నేడే రెండో దశ ఎన్నికలు
పారిస్: ఫ్రాన్స్‌లో ముందస్తు ఎన్నికల్లో కీలక దశకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటులో దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలోని 577 స్థానాలకు గాను 501 చోట్ల ఆదివారం రెండో రౌండ్లో భాగంగా పోలింగ్ జరగనుంది. తొలి రౌండ్లో 76 స్థానాలకు జరిగిన ఓటింగ్‌లో విపక్ష నేషనల్ ర్యాలీ, దాని మిత్ర పక్షాలు స్పష్టమైన ఆధిక్యం కనబరిచాయి. పోలైన 68 శాతం ఓట్లలో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి ఏకంగా 33.14 శాతం ఓట్లతో విజయం సాధించింది. మరో విపక్ష కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ 27.99 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ సారథ్యంలోని మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి కేవలం 20.04 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. జూన్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో మెరీన్ లీ పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ విజయం నేపథ్యంలో విపక్షాలు పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టమయ్యాయి. దాంతో మేక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే. రెండో రౌండ్లో కూడా నేషనల్ ర్యాలీ కూటమి హవాయే కొనసాగవచ్చంటున్నారు. అదే జరిగి 289 పై చిలుకు స్థానాలతో అది పూర్తి మెజారిటీ సాధిస్తే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఘనత సాధించిన తొలి రైటిస్టు కూటమి అవుతుంది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. అప్పుడు కూటమి అధ్యక్షుడు జోర్డాన్ బార్డెల్లా ప్రధాని అవుతారు. ఆయనతో మాక్రాన్ అధికారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. -
దక్షిణాఫ్రికా దక్కేదెవరికో?
సియాంకొబా. దక్షిణాఫ్రికాలో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఊరూవాడా హోరెత్తించిన ఎన్నికల నినాదం. అంటే ‘మాదే ఘనవిజయం’ అని జులు భాషలో అర్థం. కానీ ఘనవిజయం దేవుడెరుగు, ఏఎన్సీ ఈసారి సాధారణ మెజారిటీ సాధించడం కూడా కష్టమేనని ఒపీనియన్ పోల్స్ అంటున్నాయి. వర్ణవివక్ష అంతమై తెల్లవారి పాలన ముగిశాక 1994లో ప్రజాస్వామిక పద్ధతిలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచింది మొదలు 30 ఏళ్లుగా ఏఎన్‌సీయే అధికారంలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో దానికి తొలిసారి గట్టి పోటీ ఎదురవుతోంది... దక్షిణాఫ్రికాలో ఎన్నికలకు వేళైంది. 400 మందితో కూడిన నేషనల్ అసెంబ్లీతో పాటు 9 ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు కూడా బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా ఏడో విజయం కోసం ఏఎన్సీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కానీ పెచ్చరిల్లుతున్న అవినీతి, నిరుద్యోగం, కరెంటు కోతలు, నీటి కొరత, మౌలిక సదుపాయాల లేమి వంటివి పారీ్టకి బాగా ప్రతికూలంగా మారాయి. వీటిపై ప్రజాగ్రహం ప్రచారం పొడవునా స్పష్టంగా కన్పించింది. శనివారం అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్వహించిన చివరి ప్రచార సభ కూడా అనుకున్నంతగా విజయవంతం కాలేదు. సభకు వేదికైన చారిత్రక సొవెటో టౌన్‌షిప్‌లోని 90వేల మంది సామర్థ్యమున్న ఫుట్‌బాల్ స్టేడియం పూర్తిగా నిండకపోవడం ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి అద్దం పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. 71 ఏళ్ల రామఫోసాపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి. విచ్చలవిడిగా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు విపక్షాలు ఆరోపించాయి. ఆయనను అభిశంసించాలని పార్లమెంట్ నియమించిన న్యాయ నిపుణుల కమిటీ కూడా సూచించింది. అయితే పార్లమెంట్లో ఉన్న మెజారిటీ సాయంతో ఆ ప్రక్రియను ఏఎన్సీ అడ్డుకుంది. రామఫోసాపై జరిగిన పోలీసు దర్యాప్తు వివరాలు బయటకు రాలేదు. వీటన్నింటి నేపథ్యంలో ఈసారి ఏఎన్సీ తన చరిత్రలో తొలిసారిగా 50 శాతం కంటే తక్కువ ఓట్లకు పరిమితమయ్యేలా కన్పిస్తోంది. అదే జరిగితే అతి పెద్ద పారీ్టగా నిలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దక్కదు. ఏఎన్సీ ఈసారి ఇతర పారీ్టల మద్దతుపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుందని సర్వేలూ పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ఆదివారం వెల్లడ య్యే ఫలితాలపైనే నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ జాకబ్ జుమా పంచ్... మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా గతేడాది రామఫోసాతో విభేదించి సొంత పార్టీ పెట్టుకోవడం ఏఎన్‌సీకి పెద్ద దెబ్బ! 82 ఏళ్ల జుమా ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరాడుతున్నారు. ఆయన పార్టీ ఉంకొంతో వెసీజ్వె (ఎంకే) 13 శాతం దాకా ఓట్లు రాబట్టవచ్చని సర్వేల్లో వెల్లడయ్యింది. అధికారంలోకి రాకపోయినా ఏఎన్సీ అవకాశాలను బాగా దెబ్బ తీయడం ఖాయమని పరిశీలకులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా జుమా సొంత ప్రావిన్స్ క్వాజులూ నాటాల్లో ఏఎన్సీ ఆధిపత్యానికి ఎంకే పూర్తిగా గండికొట్టనుందని అంటున్నారు. క్వాజులూ ప్రావిన్స్‌లోని ఎంకే నేతల్లో తెలుగు మూలాలున్న విశి్వన్ గోపాల్‌రెడ్డి ప్రముఖ స్థానంలో ఉండటం విశేషం.బరిలో 51 విపక్షాలు దక్షిణాఫ్రికాలో ప్రధాన ప్రతిపక్షం డెమొక్రటిక్ అలయెన్స్ (డీఏ). ఈ కూటమికి 22 నుంచి 27 శాతం ఓట్లు రావచ్చని ఏప్రిల్‌లో ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. అయితే పలువురు నేతలు డీఏను వీడి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఇది విపక్ష కూటమికి ప్రతికూలంగా మారింది. ఈసారి 51 ప్రతిపక్షాలు పోటీలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఏఎన్‌సీకి కలిసొచ్చేలా కని్పస్తోంది.ముస్లిం ఓట్లపై వల... జనాభాలో ముస్లింలు 2 శాతం కంటే తక్కువే ఉంటారు గానీ వారి ప్రతి ఓటూ విలువైనదే. అందుకే ముస్లింల ఓట్లపై పారీ్టలు వల విసురుతున్నాయి. పాలస్తీనా ఉద్యమానికి పోటీలు పడి మరీ మద్దతు ప్రకటిస్తున్నాయి. గాజాలో దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన సమస్యలివీ... → తీవ్ర కరెంటు కోతలు → పెచ్చరిల్లిన అవినీతి → పేదరికం (50 శాతం దాటింది) → 32 శాతం దాటిన నిరుద్యోగం (ప్రపంచంలోనే అత్యధికం) → తీవ్ర నీటి కొరత → మౌలిక సదుపాయాల లేమి → మితిమీరిన నేరాలు, హింసాకాండ → రాజకీయ హత్యలుదక్షిణాఫ్రికా పార్లమెంటులో రెండు సభలుంటాయి. 90 మంది సభ్యులతో కూడిన నేషనల్ కౌన్సిల్, 400 మంది సభ్యులుండే నేషనల్ అసెంబ్లీ. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో దీని సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మెజారిటీ సాధించే పార్టీ సారథి అధ్యక్షుడవుతారు. దేశ జనాభా 6.2 కోట్లు కాగా ఓటర్లు 2.8 కోట్ల మంది. జనాభాలో 80 శాతానికి పైగా నల్లజాతీయులే. ఈ ఎన్నికల్లో తొలిసారిగా స్వతంత్రులకు కూడా పోటీ చేసే అవకాశం కలి్పంచారు.ఎన్నికల నేపథ్యంలో దక్షిణాఫ్రికావ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ హత్యలు కలకలం సృస్టిస్తున్నాయి. 2023 జనవరి నుంచి 40 మందికి పైగా విపక్ష నేతలు, నిజాయతీపరులైన అధికారులు, హక్కుల కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఇది అధ్యక్షుడు రామఫోసా పనేనంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రచారంలో దీన్ని ప్రధానాంశంగా కూడా మార్చుకున్నాయి. వీటిపై ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నేషనల్ అసెంబ్లీలో బలాబలాలు (మొత్తం స్థానాలు 400) ఏఎన్సీ 230 డెమొక్రటిక్ అలయన్స్ 84 ఎకనమిక్ ఫ్రీడం ఫైటర్స్ 44 ఇతరులు 42 -
Pakistan General Elections 2024: పాకిస్తాన్లో హంగ్
ఇస్లామాబాద్/లాహోర్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో హంగ్ నెలకొంది. గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టికీ స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. పోరు ఏకపక్షమేనని, సైన్యం దన్నుతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్) విజయం ఖాయమని వెలువడ్డ ముందస్తు అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. శుక్రవారం రాత్రికల్లా ఫలితాల సరళి దాదాపుగా ముగింపుకు వచ్చింది. మెజారిటీ మార్కు 133 కాగా పీటీఐ 97 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టిగా నిలిచింది. ఇమ్రాన్ జైలుపాలై పోటీకే దూరమైనా, ఎన్నికల గుర్తు రద్దై అభ్యర్థులంతా స్వతంత్రులుగా నానారకాల గుర్తులపై పోటీ చేయాల్సి వచ్చినా దేశవ్యాప్తంగా వారి జోరు కొనసాగడం విశేషం. నవాజ్ పార్టికి 66, బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టికి 51 స్థానాలు దక్కాయి. మిగతా పార్టిలకు 24 సీట్లొచ్చాయి. మరో 27 స్థానాల ఫలితాలు వెల్లడవాల్సి ఉంది. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 336 కాగా 266 సీట్లకే ఎన్నికలు జరుగుతాయి. మహిళలకు, మైనారిటీలకు రిజర్వు చేసిన 70 సీట్లను పార్టీలు గెలుచుకునే స్థానాల ఆధారంగా వాటికి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. ఒక అభ్యర్థి మృతి నేపథ్యంలో ఈసారి 265 స్థానాల్లో పోలింగ్ జరగ్గా ఇప్పటిదాకా 238 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తోడు ఫలితాల వెల్లడి విపరీతంగా ఆలస్యమవుతుండటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అధికారులే ఫలితాలను పీఎంఎల్‌కు అనుకూలంగా మార్చేస్తున్నారని పీటీఐ దుమ్మెత్తిపోస్తోంది. లాహోర్ స్థానంలో చాలాసేపటిదాకా వెనకబడి ఉన్న నవాజ్ చివరికి మంచి మెజారిటీతో నెగ్గినట్టు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాహోర్‌లోని మరో మూడు స్థానాల్లో ఆయన కూతురు, సోదరుడు, మరో బంధువు గెలిచినట్టు ఈసీ ప్రకటించింది. అయితే మరో స్థానంలో మాత్రం పీటీఐ మద్దతుతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి చేతిలో నవాజ్ ఓటమి చవిచూడటం విశేషం. ఈ నేపథ్యంలో పీటీఐ ప్రదర్శనను షరీఫ్ అభినందించడం విశేషం. కాకపోతే పీఎంఎల్ అత్యధిక స్థానాల్లో నెగ్గి అతి పెద్ద పార్టిగా అవతరించిందని ఆయన చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాల రీత్యా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటూ పిలుపునిచ్చారు. పీటీఐ చైర్మన్ గోహర్ ఖాన్ మాత్రం ఏ పార్టితోనూ పొత్తు పెట్టుకోబోమంటూ కుండబద్దలు కొట్టారు. స్వతంత్రులుగా నెగ్గిన ఆ పార్టీ అభ్యర్థులకు ఎర వేసి లాక్కునేందుకు పీఎంఎల్ జోరుగా ప్రయతి్నస్తోందని వార్తలొస్తున్నాయి. -
పార్లమెంట్ విశ్వాసం పొందిన పాక్ పీఎం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం పార్లమెంట్‌లోని దిగువసభ నేషనల్ అసెంబ్లీ విశ్వాసం పొందారు. మొత్తం 342 మంది సభ్యులకుగాను 180 మంది షరీఫ్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు. షరీఫ్ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థకు మధ్య ఇటీవలి కాలంలో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సమయంలో ఈ పరిణామం సంభవించింది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన సమయంలో షరీఫ్‌కు 174 మంది సభ్యులు మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం. పంజాబ్, ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్ అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ)కి అవసరమైన నిధుల కేటాయింపునకు సంబంధించిన బిల్లును నేషనల్ అసెంబ్లీ ఇటీవల తిరస్కరించిన నేపథ్యంలో షరీఫ్ ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధమయింది. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు జరపాలంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ గట్టిగా పట్టుబడుతోంది. -
ఇమ్రాన్ ఖాన్ సిక్సర్.. ఆకాశానికెత్తిన మీడియా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ చరిత్ర సృష్టించారు. ఆ దేశ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసి.. ఆరింటిలో ఆయన ఘన విజయం సాధించారు. దీంతో అధికారం కోల్పోయినప్పటికీ తెగ విమర్శలు గుప్పించిన ఆ దేశ మీడియా.. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ను ఆకాశానికెత్తేస్తోంది. తాజాగా జాతీయ అసెంబ్లీలో ఎనిమిది సీట్లకు, పంజాబ్ అసెంబ్లీకి మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏడు స్థానాలకు పోటీ చేశారు. ఆదివారం ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో ఆరు స్థానాల్లో ఆయన ఘన విజయం సాధించారు. దీంతో.. పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న పీటీఐ డిమాండ్‌కు బలం చేకూరినట్లయ్యింది. పాక్‌లో ఈ ఏప్రిల్‌లో ప్రధాని పీఠం నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయాక.. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఈ క్రమంలో 131 స్థానాలకు గానూ దశల వారీగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది పాక్ ఎన్నికల సంఘం. అయితే.. ఈ ఆరు నెలల పాలన తీరుపైనా ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందనేది పీటీఐ వాదన. ఈ మేరకు జాతీయ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈసీ మాత్రం అందుకు సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తోంది. ఈ క్రమంలో.. ఇప్పుడు ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి ప్రతికూలంగా రావడం గమనార్హం. Entire nation stands with Imran Khan !! pic.twitter.com/hbvdMBAz70 — PTI (@PTIofficial) October 17, 2022 ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమికి భంగపాటే ఎదురైంది. అధికార పార్టీ మిత్రపక్షం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండు స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఇక అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు గడుస్తున్నా.. ఆర్థిక సంక్షోభం, ఆ వెంటనే వరదలు పాక్‌ను అల్లకల్లోలం చేశాయి. ఈ క్రమంలో సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మంత్రులు, అధికారులు ఎక్కడ కనిపించినా.. ప్రజల నుంచి బహిరంగంగా అవమానాలే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఫలితాలు సైతం ప్రతికూలంగా రావడంతో ప్రభుత్వానికి గుబులు పట్టుకుంది. దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. పాక్ పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, విదేశీ కుట్రతో గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పిలుపు ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరు స్థానాల్లో గెలుపొందినప్పటికీ.. ఒక్కదాని మినహా మిగతా అన్నింటికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో మిగతా స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో పాక్ గడ్డపై అత్యధికంగా ఐదు స్థానాల్లో పోటీ చేసి.. ఐదింటిలోనూ విజయం సాధించారు ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టి పాక్ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను తిరగరాశారు. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి ఇల్లీగల్‌గా ఫారిన్ ఫండ్స్ దక్కించుకుందని పీటీఐ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే మాత్రం ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లాల్సి రావడమే కాదు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి పీటీఐ అర్హత కోల్పోతుంది కూడా. ఇదీ చదవండి: చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిన్నదేశం -
ఎట్టకేలకు... ఇమ్రాన్ ఇంటికి
ఇస్లామాబాద్: నెలకు పైగా నానా మలుపులు తిరుగుతూ వచ్చిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం కథ ఎట్టకేలకు కంచికి చేరింది. పాక్ జాతీయ అసెంబ్లీలో శనివారం రోజంతా జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం అర్ధరాత్రి దాటాక అధికార సభ్యుల గైర్హాజరీలో జరిగిన ఓటింగ్‌లో 174 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దాంతో విపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గడం, ఇమ్రాన్ పదవీచ్యుతుడు కావడం చకచకా జరిగిపోయాయి. అంతకుముందు జాతీయ అసెంబ్లీ వేదికగా శనివారం రోజంతా పాక్ రాజకీయాలు నానా మలుపులు తిరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తీర్మానంపై ఓటింగ్ జరిపేందుకు ఉదయం 10.30కు సమావేశమైన సభ అర్ధర్రాతి దాకా నాలుగైదుసార్లు వాయిదా పడింది. స్పీకర్ అసద్ ఖైజర్ ఉద్దేశపూర్వకంగానే ఓటింగ్‌ను జాప్యం చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. తక్షణం ఓటింగ్ చేపట్టాలని కోరాయి. కానీ ఓటింగ్‌కు స్పీకర్ ససేమిరా అన్నారు. ‘‘ఓటింగ్ జరిపి ఇమ్రాన్‌తో నా 30 ఏళ్ల బంధాన్ని తెంచుకోలేను. కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సి వచ్చినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ జరపబోను’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ గలాభా మధ్యే రాత్రి వేళ ఇమ్రాన్ తన నివాసంలో అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించారు. రాజీనామా చేయబోయేది లేదని స్పష్టం చేశారు. ఆయన సభకు కూడా వెళ్లలేదు. అనంతరం పాక్ కాలమానం ప్రకారం రాత్రి 10.30 తర్వాత స్పీకర్ ఇమ్రాన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. విదేశీ కుట్రకు రుజువుగా కేబినెట్ తనకు ముఖ్యమైన పత్రాలు అందజేసిందని, వాటిని సీజేఐ, విపక్ష నేత పరిశీలించాలని కోరారు. ‘‘ఓటింగ్ జరిపి విదేశీ కుట్రలో భాగం కాలేను. రాజీనామా చేస్తున్నా’’ అని అర్ధరాత్రి 11.30కు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి కూడా ఆయన బాటలోనే నడిచారు. స్పీకర్ సూచన మేరకు విపక్ష పీఎంఎల్ (ఎన్)కు చెందిన ప్యానల్ చైర్మన్ అయాజ్ సాదిక్ అధ్యక్షతన అర్ధరాత్రి 11.45కు ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. 11.50కి అధికార పీటీఐకి చెందిన 156 మంది ఎంపీలూ సభ నుంచి వెళ్లిపోయారు. సభ నిబంధనల మేరకు 11.58కి సభను మర్నాటికి వాయిదా వేశారు. నాలుగు నిమిషాల అనంతరం అర్ధరాత్రి 12.02కు సభ తిరిగి సమావేశమైంది. అనంతరం మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానాన్ని ఓటింగ్‌కు స్వీకరిస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. తర్వాత తలుపులన్నీ మూసేసి ఓటింగ్ చేపట్టారు. 12.10కి ఓటింగ్ జరిగింది. 342 మంది సభ్యులున్న సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే విపక్షాలకు కనీసం 172 మంది మద్దతు అవసరం. రాత్రి ఒంటిగంటకు 174 మంది అనుకూలంగా ఓటేయడంతో తీర్మానం సులువుగా గట్టెక్కింది. అంతకుముందు, శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఇమ్రాన్ కావాలనే ధిక్కరిస్తున్నారంటూ విపక్షాలు మరోసారి కోర్టు తలుపు తట్టాయి. ఇమ్రాన్ దేశం విడిచిపోకుండా చూడాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తూ వచ్చిన సుప్రీంకోర్టు ప్రధా న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ శనివారం అర్ధరాత్రి 12 తర్వాత కోర్టును సమావేశపరచాలని అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. పూర్తిస్థాయి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరుపుతామని ప్రకటించారు. ఈలోపు పరిస్థితులు మారి పరిణామాలు ఓటింగ్‌కు దారి తీశాయి. భారత్‌కే వెళ్లిపో... ఇమ్రాన్‌పై విపక్షాల ధ్వజం భారత్‌ను ప్రశంసిస్తూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై అక్కడి విపక్షాలు మండిపడ్డాయి. భారత్ అంతగా నచ్చితే అక్కడికే వెళ్లిపోవాలని పీఎంఎల్ (ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం అన్నారు. భారత్ సిసలైన సార్వభౌమ దేశమని, ఏ అగ్రరాజ్యం కూడా దాన్ని శాసించలేదంటూ ఇమ్రాన్ ప్రశంసించడం తెలిసిందే. ‘‘అవిశ్వాస తీర్మానాల విషయంలో కూడా భారత్‌ను అనుసరించు. అక్కడి ప్రధానులు 27 దాకా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు. వాజ్‌పేయి వంటివారు కేవలం ఒక్క ఓటుతో ఓడి హుందాగా తప్పుకున్నారు. అంతే తప్ప నీలా ఎవరూ ప్రజాస్వామ్యంతో, రాజ్యాంగంతో, విలువలతో ఇష్టానికి ఆడుకోలేదు’’ అని ఆయన్నుద్దేశించి మరియం అన్నారు. ‘‘ఇమ్రాన్ ఓ సైకో. ఆయనకు పిచ్చెక్కింది’’ అంటూ మండిపడ్డారు. -
ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు షాక్! ‘ఓటింగ్ జరగాల్సిందే..’
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఇమ్రాన్‌పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం సరికాదని కోర్టు పేర్కొంది. ఇమ్రాన్ సర్కార్‌పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం, జాతీయ అసెంబ్లీ రద్దు వంటి అంశాలపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ ఉమర్ అట బండియల్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ముందు అటార్నీ జనరల్ ఖలీద్ జావెద్ ఖాన్ వాదనలు వినిపించారు. పార్లమెంటు అంతర్గత వ్యవహారాల్లో న్యాయస్థాన జోక్యం సరికాదని, స్పీకర్ నిర్ణయాలను సవాల్ చేసే అధికారం కోర్టులకు లేవని పాక్ ప్రధాని తరపు న్యాయవాది వాదించారు. అనంతరం పాక్ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఉమర్ అటా బండియల్ తీర్పు వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. అవిశ్వాసంపై మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని, జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పాక్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ జరగనుంది. చదవండి: శ్రీలంక ప్రధాని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఏ క్షణం ఏం జరుగుతుందో? -
Sakshi Cartoon: పార్లమెంటును రద్దు చేసి విపక్షాలకు షాకిచ్చిన ఇమ్రాన్ ఖాన్...
పార్లమెంటును రద్దు చేసి విపక్షాలకు షాకిచ్చిన ఇమ్రాన్ ఖాన్... -
ఇమ్రాన్ యార్కర్..: పాక్‌లో రాజకీయ సంక్షోభం...
నెల రోజులుగా పదవీ గండం ఎందుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (69) కీలక సమయంలో తనలోని కెప్టెన్‌ను పూర్తిస్థాయిలో బయటికి తీశారు. అవిశ్వాస తీర్మానంపై డిప్యూటీ స్పీకర్‌తో పదునైన యార్కర్ వేయించారు. ఆ తీర్మానం చెల్లదనే నిర్ణయంతో విపక్షాలను డిప్యూటీ స్పీకర్ క్లీన్‌బౌల్డ్ చేయగానే జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్ చేసేశారు. అందుకు అధ్యక్షుడు ఆమోదముద్ర వేయడంతో దేశంలో ముందస్తు ఎన్నికల నగారా మోగింది. ఇదంతా రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఇమ్రాన్ యార్కర్‌ను నో బాల్‌గా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే విచారణపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఇమ్రాన్‌ఖాన్‌పై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకునేందుకు ఆదివారం జరిగిన జాతీయ అసెంబ్లీ కీలక సమావేశం అనూహ్య పరిణామాలకు వేదికైంది. డజనుకు పైగా అధికార పార్టీ సభ్యులు కూడా తీర్మానానికి మద్దతివ్వడంతో ఇప్పటికే మైనారిటీలో పడిన ఇమ్రాన్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడటం లాంఛనమేనని అంతా భావించారు. స్పీకర్ అసద్ ఖైజర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవచ్చన్న అనుమానంతో సమావేశం మొదలవగానే విపక్షాలు ఆయనపై అవిశ్వాస నోటీసు కూడా ఇచ్చాయి. దాంతో సమావేశానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి, తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి విపక్షాలకు ఊహించని షాకిచ్చారు. ‘‘తీర్మానం దేశ రాజ్యాంగానికి, నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కానీ అదలా లేదని న్యాయ మంత్రి స్పష్టంగా చెప్పారు. అది విదేశీ కుట్రలో భాగంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అందుకే తీర్మానాన్ని తిరస్కరిస్తున్నా’’ అని ప్రకటించారు. ఆ వెంటనే సభను వాయిదా వేశారు. దీనిపై విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ దుయ్యబట్టాయి. నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేదాకా సభను వీడేది లేదన్నాయి. సభలో గలాభా జరుగుతండగానే ఇమ్రాన్ హుటాహుటిన అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కలిసి జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయడం, అందుకు ఆయన ఆమోదముద్ర వేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇమ్రాన్ ఇచ్చిన వరుస షాకులతో నోరెళ్లబెట్టడం విపక్షాల వంతైంది. పాక్ చరిత్రలో ఇప్పటిదాకా ఏ ప్రధానీ పూర్తికాలం పాటు పదవిలో కొనసాగలేదు. షెడ్యూల్ ప్రకారం పాక్‌లో 2023 ఆగస్టులో ఎన్ని కలు జరగాల్సి ఉంది. ఇమ్రాన్ 2018 ఆగస్టు 18న దేశ 22వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. విదేశీ కుట్ర భగ్నం: ఇమ్రాన్ జాతీయ అసెంబ్లీ రద్దు సిఫార్సు అనంతరం ఇమ్రాన్ జాతిని ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానం ముసుగులో ప్రభుత్వాన్ని మార్చేందుకు జరిగిన విదేశీ కుట్రను విజయవంతంగా అడ్డుకున్నట్టు ప్రకటించారు. దేశ భవితవ్యాన్ని అవినీతి శక్తులు నిర్ణయించలేవన్నారు. ఎన్నికలకు సిద్ధమవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానం నిజానికి విదేశీ కుట్రలో భాగమని అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ ఆరోపించారు. తీర్మానం నెగ్గి ప్రభుత్వం పడిపోగానే ఇమ్రాన్‌ను అరెస్టు చేయడానికి కుట్ర జరిగిందన్నారు. దాన్ని భగ్నం చేశామని, 90 రోజుల్లోపు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఇమ్రాన్ 15 రోజుల పాటు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారన్నారు. ఈ పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని సైన్యం అధికార ప్రతినిధి బాబర్ ఇఫ్తికర్ ప్రకటించారు. అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్‌కు సుప్రీం నోటీసులు జాతీయ అసెంబ్లీ రద్దును విపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇమ్రాన్‌ను దేశద్రోహి అంటూ విపక్ష నేతలు షాబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో జర్దారీ, మరియం ఔరంగజేబ్ తదితరులు దుమ్మెత్తిపోశారు. పిరికి నిర్ణయాల ద్వారా తన తప్పిదాలను పరోక్షంగా అంగీకరించారని దుయ్యబట్టారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ విపక్షాలు సుప్రీంకోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి. అత్యవసరంగా విచారణకు స్వీకరించి తక్షనం తీర్పు వెల్లడించాలని కోరాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. మొత్తం ఉదంతంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ అసెంబ్లీ రద్దు విషయంలో అధ్యక్షుడు, ప్రధాని తీసుకున్న నిర్ణయాలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ తదితరులకు నోటీసులు జారీ చేసి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు ఎలాంటి రాజ్యాంగవిరుద్ధ చర్యలకూ పాల్పడొద్దని ఇరు వర్గాలనూ ఆదేశించింది. రాజ్యాంగ విరుద్ధమే: నిపుణులు డిప్యూటీ స్పీకర్ చర్య, జాతీయ అసెంబ్లీ రద్దుకు ఇమ్రాన్ సిఫార్సు రెండూ రాజ్యంగ విరుద్ధమేనని పాక్ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు ఆర్టికల్ 6 ప్రకారం వారిద్దరిపై న్యాయ విచారణ జరిగే చాన్సుందని సుప్రీంకోర్టు బార్ అధ్యక్షుడు అషన్ భూన్ అన్నారు. మైనారిటీలో పడటమే గాక పార్లమెంటులో అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న ప్రధానికి సభ రద్దుకు సిఫార్సు చేసే అధికారం ఉండదని ప్రముఖ న్యాయ నిపుణుడు, కేంద్ర మాజీ మంత్రి అభిషేక్ మను సింఘ్వి కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ చౌధరి సర్వర్‌ను ఇమ్రాన్ బర్తరఫ్ చేశారు. అవిశ్వాసం నుంచి అవిశ్వాసం దాకా... 2021లో ఇమ్రాన్ తొలిసారి అవిశ్వాస పరీక్ష గట్టెక్కిన నాటి నుంచి జాతీయ అసెంబ్లీ రద్దు దాకా పాకిస్థాన్‌లో జరిగిన కీలక రాజకీయ పరిణామాలు... ► 2021 మార్చి 3: సెనేట్ ఎన్నికల్లో ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్‌పై విపక్ష నేత యూసుఫ్ రజా గిలానీ నెగ్గడంతో తొలిసారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ఇమ్రాన్ ప్రభుత్వం ► మార్చి 6: అవిశ్వాస పరీక్షను నెగ్గిన ఇమ్రాన్ ► 2022 మార్చి 8: ద్రవ్యోల్బణం అదుపులో విఫలమయ్యారంటూ ఇమ్రాన్‌పై మరోసారి విపక్షాల అవిశ్వాస తీర్మానం ► మార్చి 19: విపక్ష కూటమికి మద్దతు ప్రకటించిన పలువురు అధికార పీటీఐ ఎంపీలకు ఇమ్రాన్ షోకాజ్ నోటీసులు ► మార్చి 25: అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించకుండానే సభను వాయిదా వేసిన స్పీకర్ ► మార్చి 27: తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని ఇమ్రాన్ ఆరోపణ ► మార్చి 28: జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్ష నేత షాబాజ్ షరీఫ్ ► మార్చి 30: కీలక భాగస్వామ్య పక్షం విపక్షాలతో చేతులు కలపడంతో మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ప్రభుత్వం ► ఏప్రిల్ 1: తనకు ప్రాణహాని ఉందని ఇమ్రాన్ ఆరోపణ ► ఏప్రిల్ 3: అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్ ఖసీం సూరి. జాతీయ అసెంబ్లీ రద్దుకు ఇమ్రాన్ సిఫార్సు, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదం. వారి నిర్ణయాలు తమ విచారణకు లోబడి ఉంటాయన్న సుప్రీంకోర్టు. -
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ గురువారం సంచలన ప్రకటన చేశారు. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుంటే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తానని విపక్షాలకు ఇమ్రాన్ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఓ ముఖ్యమైన వ్యక్తి ద్వారా జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన షాబాజ్ షరీఫ్‌కు ప్రధానమంత్రి సందేశాన్ని చేరవేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇమ్రాన్ ఇచ్చిన ఆఫర్‌ను ప్రతిపక్షాలు అంగీకరిస్తే పాక్‌లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ ఆఫర్‌ను ప్రతిపక్షాలు తిరస్కరించినట్లు సమాచారం. ఏప్రిల్ 3కు వాయిదా పాకిస్తాన్ పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే డిప్యూటీ స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో పాకిస్తాన్ పార్లమెంట్ ఏప్రిల్ 3కు వాయిదా పడింది. కాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మార్చి 28న ఆ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, పీఎంఎల్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ ఫరీఫ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జాతినుద్దేశించి ప్రసంగం తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో జాతీయ భద్రతా కమిటీతో ఇమ్రాన్ ఖాన్‌కు గురువారం అత్యవసర సమావేశం కానున్నారు. ప్రధాని నివాసంలోనే ఆ మీటింగ్ జరగనుంది. ప్రధాని ఇమ్రాన్‌తో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. నెగ్గడం కష్టమే.. అవిశ్వాస తీర్మానం నుంచి ఇమ్రాన్ ఖాన్ గట్టేక్కడం కష్టతరంగా మారింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ అవిశ్వాసంలో నెగ్గాలంటే 172 సభ్యుల ఓట్లు అవసరం. ప్రస్తుతం ఇమ్రాన్‌కు మిత్రపక్షంతో కలిపి 176 మంది సభ్యుల బలముంది. అయితే ఎంక్యూఎం-పీ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించడంతో ఇమ్రాన్ ప్రభుత్వం బలం 163కి పడిపోయింది. అంతేగాక సొంతపార్టీ పీటీఐ నుంచి 12 మందికి పైగా ఎంపీలు సైతం ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించాయి. కానీ వారు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు కోర్టు నుంచి ఉత్తర్వులు పొందేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వం తీవ్ర విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంది. అవిశ్వాస తీర్మానానికి ముందే ఇమ్రాన్ ఇంటి దారి పట్టేలా కనిపిస్తోంది. అయితే ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయమన్న వార్తల నేపథ్యంలోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జాతీయ అసెంబ్లీని రద్దు చేసే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి ఎలాగైనా దింపేందకు అవసరమైన బలాన్ని విపక్షాలు కూడగడుతున్నాయి. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ దిగిపోతే ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్ షహబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు పాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. -
Kulbhushan Jadhav Case : కీలక పరిణామం
ఇస్లామాబాద్: భారతీయ నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్(51) కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ తాజా చర్యతో ఆయనకు భారీ ఊరట లభించింది. తన శిక్షపై అప్పీల్ చేసుకునే హక్కు ఆయనకు ఇప్పుడు లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తీర్పు మేరకు పాక్ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభ, ఐసీజే (రివ్యూ అండ్ రీ కన్సిడరేషన్) బిల్లు–2020ను గురువారం ఆమోదించింది. జాదవ్‌ని గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై 2017 ఏప్రిల్‌లో పాక్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. జాదవ్‌కు ఎలాంటి దౌత్యసాయం కల్పించకుండా, న్యాయవాదులు కలవడానికి వీల్లేకుండాచేసి, ఆయన వాదనలు వినకుండా ఉరికంబం ఎక్కించాలని పాక్ కుట్ర పన్నింది. భారత్ పంపిన దౌత్యాధికారులను జాదవ్‌ను కలవనివ్వకుండా పాక్ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో జాదవ్ మరణ శిక్షపై సవాల్ చేసింది. ఐసీజే చొరవతో.. వాదోపవాదాలు విన్న ఐసీజే జాదవ్ మరణశిక్షపై పాకిస్తాన్ పునఃపరిశీలన చేయాలని, ఏ మాత్రం జాప్యం లేకుండా ఆయనకు న్యాయవాదుల్ని నియమించుకునే అవకాశం ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీనికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్డినెన్స్ 2020 అని పేరు పెట్టింది. సంవత్సరం సాగదీత తర్వాత గురువారం విపక్ష పార్టీల గందరగోళం, సభ నుంచి వాకౌట్ల నడుమ పాక్ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో తనకు విధించిన మరణ శిక్షపై జాదవ్ ఏ హైకోర్టులోనైనా అప్పీలు చేసుకోవచ్చు. ఈ చర్య ద్వారా తాము ఎంత బాధ్యతాయుతంగా ఉంటామో ప్రపంచ దేశాలకు తెలిసిందని పాక్ న్యాయశాఖ మంత్రి ఫరోగ్ నసీమ్ వ్యాఖ్యానించారు. ఇక ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన లాయర్లతో జాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునే వీలు కల్పించింది. అయితే భారత్ మాత్రం ఇక్కడి లాయర్‌ను నియమించాలని ప్రయత్నిస్తోంది. కాగా, గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌ను బలూచిస్థాన్‌లో పాక్ అరెస్ట్ చేసిందని ప్రకటించుకోగా.. కాదు జాదవ్‌ను ఇరాన్‌లోని చబాహర్ పోర్టులో అరెస్ట్ చేశారని భారత్ పేర్కొంది. నిజానికి ఐసీజే ఈ ఆదేశాలిచ్చి ఏడాదికి పైనే గడుస్తున్నా.. పాక్ వక్రబుద్ధి ప్రదర్శిస్తూ ఆలస్యం చేస్తూ వచ్చింది. తన కొడుకు విషయంలో ఇది ఊరట కలిగించే విషయమని, పాక్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జాదవ్ తండ్రి సుధీర్ పేర్కొన్నాడు. ఇది మన దౌత్య విభాగం సాధించిన విజయమని జాదవ్ స్నేహితుడు అరవింద్ మీడియాకు తెలిపాడు. చదవండి: పాక్ కొత్త కుట్ర -
విశ్వాస పరీక్ష నెగ్గిన ఇమ్రాన్
ఇస్లామాబాద్: పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ శనివారం జరిగిన విశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. ప్రతిపక్షాలు ఓటింగ్ ప్రక్రియని బహిష్కరించడంతో ఆయన అత్యంత సునాయాసంగా నెగ్గారు. పాక్ ఆర్థిక మంత్రి, అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రికీ ఇన్సాఫ్ ( పీటీఐ) అభ్యర్థి అబ్దుల్ హఫీజ్ షేక్ ఈ వారంలో జరిగిన సెనేట్ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఇమ్రాన్ నేషనల్ అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. అధ్యక్షుడు అరిఫ్ అల్వి ఆదేశాల మేరకు దిగువ సభ శనివారం సమావేశమైంది. మొత్తం 342 స్థానాలున్న సభలో 172 ఓట్లు అధికార పక్షానికి రావాల్సి ఉంది. 11 పార్టీల కూటమి ప్రతిపక్ష పాకిస్తాన్ డెమొక్రాటిక్ మూమెంట్ (పీడీఎమ్) ఓటింగ్ సమయంలో సభ నుంచి వాకౌట్ చేయడంతో విశ్వాస పరీక్షలో నెగ్గడం ఇమ్రాన్ ప్రభుత్వానికి సులువైంది. ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక స్పీకర్ అసద్ ఖైజర్ ఫలితాలను ప్రకటించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీకి 176 స్థానాలు వస్తే, ఇప్పటి బలపరీక్షలో 178 మంది మద్దతుగా నిలిచారని ఆయన వెల్లడించారు. -
7లక్షలమంది భారతీయులు వెనక్కి!
-
పాక్ విలువలకు దివిటి ఆ గెలుపు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను అంతర్జాతీయ మీడియాకు ఒక్కటే చెప్పదల్చుకున్నాను. పాకిస్తాన్లో మానవత్వం, భిన్న మతాల మధ్య సామరస్యం ఉందని. నా విజయం మత తీవ్రవాద చీకటిలో మినుకుమినుకు మంటున్న వెలుగుకాదు. నా దేశ విలువలను చూపే దివిటి’ అని డాక్టర్ మహేశ్ కుమార్ మలానీ వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తొలి హిందువు. పార్లమెంట్‌కు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తొలి ముస్లింయేతరుడు. పాకిస్తాన్ పార్లమెంట్‌కు ముస్లింయేతరులు పోటీచేసేందుకు వీలుగా, అలా పోటీ చేసిన వ్యక్తికి ముస్లింయేతరులు ప్రత్యేకంగా ఓటు వేసేందుకు వీలుగా 2002 నుంచి పాకిస్తాన్ ఎన్నికల్లో సంయుక్త ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చారు. ముస్లింయేతరుల కోసం పాక్ పార్లమెంట్లో పది నామినేట్ సీట్లను కూడా కేటాయించారు. ఈ పది నామినేట్ సీట్లను రాజకీయ పార్టీలకు పార్లమెంట్లో గెలుచుకున్న సీట్ల సంఖ్యనుబట్టి కేటాయిస్తారు. మొత్తం పోలయిన ఓట్లలో కనీసం ఐదు శాతం ఓట్లు సాధించిన పార్టీలకే ఈ నామినేటెడ్ సీట్లను కేటాయిస్తారు. మహేశ్ కుమార్ మలానీ ముందుlవరకు ముస్లిం ఏతరులు నేరుగా పార్లమెంట్‌కు పోటీచేసి విజయం సాధించలేదు. ఈసారి ఎన్నికల్లో ఆయన పాకిస్తాన్ ఎంపీగా ఎన్నికై ఎంతో మంది ముస్లిం ఏతరులకు ఆదర్శంగా నిలిచారు. తనకు హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఓటువేసి గెలిపించారంటూ వారందరికి ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఆయన సింధు ప్రాంతంలోని తార్పార్కర్ 2 నియోజక వర్గం నుంచి గెలుపొందారు. -
‘నటులనే మించిన నటుడు మాజీ ప్రధాని’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్–ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చాలా బాగా నటిస్తున్నారని, ఆయన నటన ముందు ఫిల్మ్ స్టార్స్ కూడా పనికిరారని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ నెల 25వ తేదీన జరగనున్న నేషనల్ అసెంబ్లీతోపాటు, 4 ప్రొవిన్షియల్ అసెంబ్లీల ఎన్నికల ప్రచార పర్వం సోమవారం అర్ధరాత్రితో ముగిసిన విషయం తెలిసిందే. సోమవారం ఓ ర్యాలిలో మాట్లాడుతూ.. ‘నా చిన్నతనంలో ఒక్క అమెరికా డాలర్ మన 5 రూపాయలకు సమానం. ఇప్పుడు 130 పాక్ రూపాయలైంది. కానీ షరీఫ్ కుటుంబం మాత్రం దేశాన్ని దోచుకుని విదేశాలకు వెళ్లిపోయిందని’ పేర్కొన్నారు. పాకిస్తాన్లో పరిస్థితులు మెరుగు పడాలంటే పీటీఐకి ఓట్లేసి విజయాన్ని కట్టబెట్టాలని ఓటర్లను కోరారు. ఎన్నికల నేపథ్యంలో తాను అమాయకుడినని తెలియ జెప్పేందుకు నవాజ్ షరీఫ్ చాలా కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. అదియాలా జైల్లో తమను దోమలు కుడుతున్నాయని షరీఫ్, ఆయన కూతురు మర్యమ్ చెబుతున్నారని.. ఏసీల సౌకర్యం లేకపోతే వారు ఉండలేరని ఈ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. వారిద్దరూ చాలా బాగా నటిస్తున్నారని, సినిమాల్లో సైతం మనం ఇలాంటి నటనను చూడలేమన్నారు. పాకిస్తాన్‌లోని ఇతర ప్రావిన్స్‌ల కంటే కూడా కైబర్ కనుమలో విద్యావ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. కైబర్‌లో అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని, 9 వేల మంది డాక్టర్లు ఉన్నారని తెలిపారు. 50 కొత్త కాలేజీలు, 10 యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత అసిఫ్ అలీ జర్దారీపై పలు ఆరోపణలు రావడం, పీఎంఎల్–ఎన్ నేత షరీఫ్ జైల్లో ఉండటం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
పాక్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఈ నెల 25వ తేదీన జరగనున్న నేషనల్ అసెంబ్లీతోపాటు, 4 ప్రొవిన్షియల్ అసెంబ్లీల ఎన్నికల ప్రచార పర్వం సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. ఈ ఎన్నికల్లో కరుడుగట్టిన మత గురువులు సహా 12,570 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. పెద్దగా ఉత్సాహం చూపని ఓటర్లు, ఉద్రిక్త వాతావరణం మధ్య చివరి నిమిషం వరకు అభ్యర్ధులు సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నేషనల్ అసెంబ్లీ స్థానాలకు 3,675 మంది ప్రొవిన్షియల్ పదవులకు 8,895 మంది పోటీ పడుతున్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్–ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలులో ఉండటం, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత అసిఫ్ అలీ జర్దారీపై పలు ఆరోపణల నేపథ్యంలో అనిశ్చిత వాతావరణం కొనసాగుతోంది. -
సైబర్ క్రైమ్ బిల్లుకు పాక్ ఆమోదం
ఇస్లామాబాద్: వివాదాస్పదమైన సైబర్ క్రైమ్ బిల్-2015 ను పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ(ఎన్ఏ) బుధవారం ఆమోదించింది. ఈ బిల్ చట్టంగా మారాలంటే ఆ దేశ సెనెట్ దీనికి ఆమోదం తెలపాల్సి ఉంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఇన్ ఫర్మేషనల్ టెక్నాలజీ(ఐటీ) పరిశ్రమ, పౌర సమాజం వ్యతిరేకిస్తున్నాయి. మానవ హక్కులను ఈ బిల్లు హరిస్తుందని ఆరోపిస్తున్నాయి. 2015 జనవరిలో ఓటింగ్ అనంతరం ఆ దేశ ఐటీ మంత్రిత్వశాఖ ఈ బిల్లును నేషనల్ అసెంబ్లీకి సమర్పించింది. ఈ బిల్లును కనీసం స్టాండింగ్ కమిటీ సభ్యులకు చూపించకుండానే సెప్టెంబర్ లో బలవంతంగా వారిచే ఆమోదించి నేషనల్ అసెంబ్లీ ముందుకు తీసుకువెళ్లారు. రిసీవర్ అనుమతి లేకుండా సందేశాలు పంపడం తీవ్ర నేరంగా పరిగణించబడుతూ ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. భారీ మొత్తంలో జరిమానాలు, దీర్ఘకాల జైలు శిక్షలను విధిస్తూ ప్రభుత్వం తీసుకునే చర్యలను నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు.. ఈ బిల్లు వల్ల తమ బిజినెస్ కోల్పోతామని పరిశ్రమల ప్రతినిధులు వాపోతున్నారు. -
సోషలిస్టు పాలనకు తెర
వెనుజువెలాలో ప్రతిపక్షాల ప్రజాస్వామ్య ఐక్య కూటమి విజయం కారకస్: వెనుజువెలాలో 17 ఏళ్లుగా సాగుతున్న సోషలిస్టు పార్టీ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. తాజా ఎన్నికల్లో విపక్షాల కూటమి విజయం సాధించింది. మొత్తం 167 స్థానాలున్న నేషనల్ అసెంబ్లీలో విపక్షాల ఐక్య ప్రజాస్వామ్య కూటమి 99 స్థానాల్లో గెలిచింది. అధికార సోషలిస్టు పార్టీకి కేవలం 46 స్థానాలే దక్కాయి. మిగిలిన 22 సీట్లలో మరికొన్నింటిని గెలిస్తే మూడింట రెండొంతుల మెజారిటీతో పాలనాయంత్రాంగంపై అధ్యక్షుడు నికోలస్‌కు ఉన్న పట్టును దెబ్బకొట్టే అవకాశముంది. తప్పనిసరిగా ఓటు వేయాల్సిన అవసరం లేదన్న నిబంధన జారీ చేసిన తర్వాత గత 17 ఏళ్ల లో తొలిసారిగా ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 74 శాతం ఓటింగ్ నమోదైంది. హ్యూగో చావెజ్ సారథ్యంలో 17 ఏళ్ల క్రితం సోషలిస్టు విప్లవం విజయవంతమైనప్పటి నుంచి ఆయన పాలనాపగ్గాలు చేపట్టారు. 2013లో చావెజ్ మరణం తర్వాత నికోలస్ మదురో దేశాధ్యక్షుడయ్యారు. సోషలిస్టు పార్టీ ఓటమి ఖరారు కావడంతో కారకస్, ఇతర ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకన్నారు. గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనలో ప్రజల రక్తం చిందిన ప్రదేశంలో ఎర్రచొక్కాలను దహనం చేశారు. నికోలస్ ఓటమిని అంగీకరిస్తూనే అమెరికా కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ సంప్రదాయ ప్రతిఘాతుక విప్లవం ద్వారా తన పాలనను అస్థిరపర్చిందని, ఆర్థిక యుద్ధం విజయం సాధించిందన్నారు. కాగా దేశంలో మార్పు ప్రారంభమైందని విపక్షాలు అన్నాయి. దేశంలో అంతటా సరుకులు, ఇతరత్రా కొరతలు ఏర్పడ్డాయని, కరెన్సీ విలువ దిగజారిందన్నారు. వెనుజువెలా ఫలితాలు లాటిన్ అమెరికాలోని వామపక్షాలకు పెద్ద దెబ్బే. కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థ క్రమేణా అస్తవ్యస్తం కావడం, అవినీతి పెరిగిపోవడంతో ఓటర్లు విసిగిపోయారు.