సైబర్ క్రైమ్ బిల్లుకు పాక్ ఆమోదం | Pakistan approves controversial Cyber Crime Bill | Sakshi
Sakshi News home page

సైబర్ క్రైమ్ బిల్లుకు పాక్ ఆమోదం

Published Thu, Apr 14 2016 8:10 PM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

Pakistan approves controversial Cyber Crime Bill

ఇస్లామాబాద్: వివాదాస్పదమైన సైబర్ క్రైమ్ బిల్-2015 ను పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ(ఎన్ఏ)  బుధవారం  ఆమోదించింది. ఈ బిల్ చట్టంగా మారాలంటే ఆ దేశ సెనెట్ దీనికి ఆమోదం తెలపాల్సి ఉంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఇన్ ఫర్మేషనల్ టెక్నాలజీ(ఐటీ) పరిశ్రమ, పౌర సమాజం వ్యతిరేకిస్తున్నాయి. మానవ హక్కులను ఈ బిల్లు హరిస్తుందని ఆరోపిస్తున్నాయి. 2015 జనవరిలో ఓటింగ్ అనంతరం ఆ దేశ ఐటీ మంత్రిత్వశాఖ ఈ బిల్లును నేషనల్ అసెంబ్లీకి సమర్పించింది.

ఈ బిల్లును కనీసం స్టాండింగ్ కమిటీ సభ్యులకు చూపించకుండానే సెప్టెంబర్ లో బలవంతంగా వారిచే ఆమోదించి నేషనల్ అసెంబ్లీ ముందుకు తీసుకువెళ్లారు. రిసీవర్ అనుమతి లేకుండా సందేశాలు పంపడం తీవ్ర నేరంగా పరిగణించబడుతూ ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. భారీ మొత్తంలో జరిమానాలు, దీర్ఘకాల జైలు శిక్షలను విధిస్తూ ప్రభుత్వం తీసుకునే చర్యలను నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు.. ఈ బిల్లు వల్ల తమ బిజినెస్ కోల్పోతామని పరిశ్రమల ప్రతినిధులు వాపోతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement