501 స్థానాలకు పోలింగ్
విపక్ష కూటమిదే దూకుడు
పారిస్: ఫ్రాన్స్‌లో ముందస్తు ఎన్నికల్లో కీలక దశకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటులో దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలోని 577 స్థానాలకు గాను 501 చోట్ల ఆదివారం రెండో రౌండ్‌లో భాగంగా పోలింగ్ జరగనుంది. తొలి రౌండ్‌లో 76 స్థానాలకు జరిగిన ఓటింగ్‌లో విపక్ష నేషనల్ ర్యాలీ, దాని మిత్ర పక్షాలు స్పష్టమైన ఆధిక్యం కనబరిచాయి. పోలైన 68 శాతం ఓట్లలో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి ఏకంగా 33.14 శాతం ఓట్లతో విజయం సాధించింది.
మరో విపక్ష కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ 27.99 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ సారథ్యంలోని మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి కేవలం 20.04 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. జూన్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో మెరీన్ లీ పెన్‌కు చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ విజయం నేపథ్యంలో విపక్షాలు పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టమయ్యాయి.
దాంతో మేక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే. రెండో రౌండ్‌లో కూడా నేషనల్ ర్యాలీ కూటమి హవాయే కొనసాగవచ్చంటున్నారు. అదే జరిగి 289 పై చిలుకు స్థానాలతో అది పూర్తి మెజారిటీ సాధిస్తే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఘనత సాధించిన తొలి రైటిస్టు కూటమి అవుతుంది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. అప్పుడు కూటమి అధ్యక్షుడు జోర్డాన్ బార్డెల్లా ప్రధాని అవుతారు. ఆయనతో మాక్రాన్ అధికారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment