Early Elections
-
French Election Results 2024: సంకీర్ణమా... సంక్షోభమా?
పారిస్: ఫ్రాన్స్ ముందస్తు ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ సారథ్యంలోని అతివాద కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంటు దిగువ సభ నేషనల్ అసెంబ్లీకి జూన్ 30న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో గెలిచిన ఆ కూటమి ఆదివారం కీలకమైన రెండో రౌండ్ పోలింగ్‌లో చేతులెత్తేసింది. 577 స్థానాలకు గాను 143 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. సోమవారం వెలువడ్డ ఫలితాల్లో ఏ కూటమికీ మెజారిటీ రాలేదు. తొలి రౌండ్ పరాజయం నేపథ్యంలో వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)తో అవగాహనకు రావడం అధికార సెంట్రిస్ట్ కూటమికి కలిసొచి్చంది. మెజారిటీ స్థానాల్లో అవి ఒకే అభ్యరి్థని నిలపడంతో నేషనల్ ర్యాలీ కూటమి జోరుకు కళ్లెం పడింది. ముఖ్యంగా మెరీన్ లీ పెన్ సారథ్యంలోని నేషనల్ ర్యాలీ కూటమి ఫాసిస్టు ఎజెండాకు ప్రత్యామ్నాయంగా సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ తదితరాలతో ముందుకొచ్చిన ఎన్పీఎఫ్ అతి పెద్ద కూటమిగా అవతరించింది. దానికి 193 సీట్లు రాగా సెంట్రిస్ట్ కూటమి 164 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఎవరికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 289 సీట్లు రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దాంతో ఎన్పీఎఫ్తో కలిసి మాక్రాన్ కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా, లేక పరిస్థితి రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ప్రధాని పదవి కోసం ఎన్పీఎఫ్ పట్టుబడుతుండటం, ఆ కూటమిలోని అతివాద పార్టీలతో అధికారం పంచుకునేందుకు మాక్రాన్ సుముఖంగా లేకపోవడం వంటివి కారణం. దీనికి తోడు ఎన్పీఎఫ్లోనూ కీచులాటలున్నాయి. ఫ్రాన్సు లో దశాబ్దాలుగా ఏక పార్టీ పాలనే సాగుతూ వస్తోంది. నేషనల్ ర్యాలీకి ఆశించిన ఫలితాలు రాకపోయినా 2022 ఎన్నికల్లో కేవలం 89 సీట్లు సాధించిన కూటమి బలం ఈసారి గణనీయంగా పెరిగింది. ఫలితాలు తమకు ఎదురుదెబ్బ కాదని, తమ విజయం వాయిదా మాత్రమే పడిందని లీ పెన్ అన్నారు. అప్పుడే కీచులాటలు ఫలితాల నేపథ్యంలో ప్రధాని గేబ్రియెల్ అటల్ సోమవారం రాజీనామా చేశారు. దాన్ని మాక్రాన్ తిరస్కరించారు. ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు మూడు వారాలే ఉండటంతో తాత్కాలికంగా పదవిలో కొనసాగాలని కోరారు. అందుకు అటల్ సిద్ధంగా ఉన్నా ఎన్పీఎఫ్ మాత్రం అధికారం చేతులు మారాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రజాభీష్టాన్ని గౌరవించి తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, ప్రధాని పదవి తమకే చెందాలని వామపక్ష నేత జీన్ లూక్ మెలెన్‌చోన్ డిమాండ్ చేశారు. అదే జరిగితే అధ్యక్షుడు, ప్రధాని వేర్వేరు పారీ్టల నుంచి ఉండటం ఫ్రాన్స్‌లో 22 ఏళ్లలో ఇదే తొలిసారి అవుతుంది. పలు అధికారాలను కూడా ప్రధానితో మాక్రాన్ పంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని కో హాబిటేషన్గా పిలుస్తారు. దేశ చరిత్రలో ఇలాంటి సందర్భాలు ఇప్పటికి మూడుసార్లు వచ్చాయి. పలు మాక్రాన్ సంస్కరణలకు చరమగీతం పాడతామని, అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన ప్రజా వ్యయ పథకాన్ని తెస్తామని, ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరి అవలంబిస్తామని ఎన్పీఎఫ్ ఇప్పటికే స్పష్టం చేయడంతో సంకీర్ణం ఏర్పాటు, మనుగడపై సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు ఎన్పీఎఫ్ భాగస్వాముల్లో అతివాద వామపక్షమైన ఫ్రాన్స్ అన్»ౌడ్తో కలిసి పని చేయబోమని మాక్రాన్ ఇప్పటికే ప్రకటించారు. సోషలిస్టులు, గ్రీన్స్‌తో భాగస్వామ్యానికి మొగ్గుతున్నారు. కానీ కొన్ని పక్షాలను పక్కన పెట్టేందుకు ఎన్పీఎఫ్ కూటమి అంగీకరించకపోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా నూతన జాతీయ అసెంబ్లీని జూలై 18న సమావేశపరుస్తానని మాక్రాన్ ప్రకటించారు. నాటో భేటీ కోసం బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. తిరిగొచ్చాక సంకీర్ణ ఏర్పాటుపై ఎన్పీఎఫ్తో చర్చలుంటాయని భావిస్తున్నారు. హంగ్ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ పడిపోయింది. యూరో విలువ కూడా 0.2 శాతం పడిపోయింది.ప్రధానీ పవర్‌ఫుల్లే... ఫ్రాన్స్‌లో 1958 నుంచి సెమీ ప్రెసిడెన్షియల్ పాలన వ్యవస్థ అమల్లో ఉంది. దీన్ని ఫిఫ్త్ రిపబ్లిక్‌గా పిలుస్తారు. ఇందులో అధ్యక్షునితో పాటు పార్లమెంటుకూ విశేషాధికారాలు ఉంటాయి. 1962 నుంచి అధ్యక్షుడిని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా నేరుగా ఎన్నుకుంటున్నారు. ఆయనే దేశాధిపతిగా, సాయుధ దళాల కమాండర్‌గా వ్యవహరిస్తారు. విదేశాంగ విధానం, రక్షణ విషయాలపై సర్వాధికారాలు ఆయనవే. ప్రధాని సిఫార్సు మేరకు కేబినెట్‌ను నియమిస్తారు. దేశీయ నిర్ణయాలన్నీ ప్రధాని నేతృత్వంలోని పార్లమెంటు తీసుకుంటుంది. ఆయనను అధ్యక్షుడు తొలగించలేరు. రాజీనామాను అభ్యరి్థంచవచ్చు. రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘిస్తే మూడింట రెండొంతుల మెజారిటీతో అధ్యక్షున్ని పార్లమెంటు అభిశంసించవచ్చు. ఫలించని ముందస్తు... నేషనల్ అసెంబ్లీ పదవీకాలం 2027 దాకా ఉంది. కానీ జూన్ 9న యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ చేతుల్లో మాక్రాన్ కూటమి ఘోర పరాజయం చవిచూసింది. దీనికితోడు ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న నేరాలు తదితరాలతో మాక్రాన్ నాయకత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మాక్రాన్ ముందస్తుకు వెళ్లారు. ఎన్నికల తేదీలు ప్రకటించగానే, సోషలిస్టులు, ఎకాలజిస్టులు, కమ్యూనిస్టులు, ఫ్రాన్స్అన్»ౌడ్ వంటివి కలిసి కలిసి ఎన్పీఎఫ్గా ఏర్పడ్డాయి. నేషనల్ ర్యాలీ కూటమిని ఓడించడమే లక్ష్యంగా చాలాచోట్ల ఎన్పీఎఫ్, సెంట్రిస్ట్ అభ్యర్థుల్లో ఎవరో ఒకరు తప్పుకుని ఓట్ల చీలికను నివారించారు. ఫలితంగా నేషనల్ ర్యాలీని నిలువరించినా మాక్రాన్ కూటమికి ఆయన ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు.దేశవ్యాప్త హింస... ఎన్నికల్లో ఆధిక్యం నేపథ్యంలో ఎన్పీఎఫ్ మద్దతుదారులు వీధుల్లోకొచ్చి సంబరాలు చేసుకున్నారు. పారిస్‌లోని ప్లేస్ డి లా రిపబ్లిక్ వద్ద వేలాదిగా గుమిగూడారు. ఈ క్రమంలో వారికి, నేషనల్ ర్యాలీ అభిమానులకు ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హింస చెలరేగింది. మాసు్కలు ధరించిన నిరసనకారులు పారిస్ వీధుల్లో పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఆస్తులను తగలబెట్టారు. రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.ఒలింపిక్స్‌పై ప్రభావమెంత? హంగ్ ఫలితాలతో ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరత నెలకొనడంతో జూలై 26 నుంచి జరగాల్సిన పారిస్ ఒలింపిక్స్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. అవి పూర్తయేదాకా పదవిలో కొనసాగేందుకు ప్రధాని అటల్ సుముఖంగా ఉన్నా ఆలోపే కొత్త ప్రధాని రావాల్సిందేనని అత్యధిక స్థానాలు సాధించిన లెఫ్ట్ కూటమి పట్టుబడుతోంది. ఒలింపిక్స్ భద్రత వ్యవహారాలు చూసుకునే కీలకమైన అంతర్గత భద్రత శాఖ మంత్రి గెలాల్డ్ డ్రమానియన్ కొనసాగడంపైనా సందిగ్ధతే కొనసాగుతోంది. ఒలింపిక్స్‌ను ఫ్రాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడేళ్లుగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలిక స్టేడియాలు, మౌలిక సదుపాయాలు తదితరాలపై ఇప్పటికే 260 కోట్ల డాలర్లకు పైగా వెచి్చంచింది. ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయినట్టేనని, ఒలింపిక్స్ నిర్వహణకు ఇబ్బందేమీ ఉండబోదని మాక్రాన్ ప్రభుత్వం చెబుతోంది. వాటి పర్యవేక్షణకు ఇబ్బంది ఉండకూడదనే అటల్ రాజీనామాను మాక్రాన్ ఆమోదించలేదని సమాచారం. ఏం జరగవచ్చు? సంకీర్ణ ఏర్పాటు సాధ్యపడని పక్షంలో రోజువారీ వ్యవహారాలను నడిపేందుకు ఏ పారీ్టలకు చెందని నిపుణులతో కూడిన ప్రభుత్వాన్ని మాక్రాన్ ఏర్పాటు చేసే వీలుంది. అయితే దేనికైనా పార్లమెంటు అనుమతి తప్పనిసరి. అధ్యక్షునిగా మాక్రాన్ పదవీకాలం 2027 దాకా ఉంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఆలోపు తప్పుకోబోనని ఆయన ఇప్పటికే ప్రకటించారు. -
French elections 2024: ఫ్రాన్స్‌లో నేడే రెండో దశ ఎన్నికలు
పారిస్: ఫ్రాన్స్‌లో ముందస్తు ఎన్నికల్లో కీలక దశకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటులో దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలోని 577 స్థానాలకు గాను 501 చోట్ల ఆదివారం రెండో రౌండ్లో భాగంగా పోలింగ్ జరగనుంది. తొలి రౌండ్లో 76 స్థానాలకు జరిగిన ఓటింగ్‌లో విపక్ష నేషనల్ ర్యాలీ, దాని మిత్ర పక్షాలు స్పష్టమైన ఆధిక్యం కనబరిచాయి. పోలైన 68 శాతం ఓట్లలో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి ఏకంగా 33.14 శాతం ఓట్లతో విజయం సాధించింది. మరో విపక్ష కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ 27.99 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ సారథ్యంలోని మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి కేవలం 20.04 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. జూన్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో మెరీన్ లీ పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ విజయం నేపథ్యంలో విపక్షాలు పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టమయ్యాయి. దాంతో మేక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే. రెండో రౌండ్లో కూడా నేషనల్ ర్యాలీ కూటమి హవాయే కొనసాగవచ్చంటున్నారు. అదే జరిగి 289 పై చిలుకు స్థానాలతో అది పూర్తి మెజారిటీ సాధిస్తే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఘనత సాధించిన తొలి రైటిస్టు కూటమి అవుతుంది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. అప్పుడు కూటమి అధ్యక్షుడు జోర్డాన్ బార్డెల్లా ప్రధాని అవుతారు. ఆయనతో మాక్రాన్ అధికారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. -
ఫ్రాన్స్ ఎన్నికల తొలి రౌండ్లో విపక్ష కూటమి గెలుపు
పారిస్: ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. దేశాధ్యక్ష ఎన్నికల తొలి రౌండ్లో మేక్రాన్‌కు చెందిన మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి మూడో స్థానంలో సరిపెట్టుకుంది. తొలి దశలో పోలైన 68 శాతం ఓట్లలో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి ఏకంగా 33.14 శాతం ఓట్లను ఒడిసిపట్టింది. న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమికి 27.99 శాతం వచ్చాయి. మేక్రాన్ పార్టీ 20.04 శాతంతో సరిపెట్టుకుంది. జూలై 7న రెండో రౌండ్ పోలింగ్ ఉంటుంది. గత నెలలో ఈయూ ఎన్నికల్లో కూడా నేషనల్ ర్యాలీ పార్టీయే విజయం సాధించింది. -
Britain general elections: సునాక్ ఎదురీత!
బ్రిటన్‌లో పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెరపడనుందా? భారత మూలాలున్న తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ గద్దె దిగాల్సి వస్తుందా? అవుననే అంటున్నాయి ఒపీనియన్ పోల్స్. షెడ్యూల్ ప్రకారం ఏడాది చివరిదాకా ఆగితే తన ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి తారస్థాయికి చేరి ఓటమి ఖాయమనే భావనతో రిషి అనూహ్యంగా జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చని సర్వేలంటున్నాయి. విపక్ష లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నాయి. స్వయానా రిషీ కూడా ఎదురీదుతున్నారని, సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా కోల్పోవచ్చని సావంత పోల్ పేర్కొంది! అదే జరిగితే సొంత పార్లమెంటు స్థానంలో ఓడిన తొలి సిట్టింగ్ ప్రధానిగా బ్రిటన్ చరిత్రలో రిషి నిలిచిపోతారు...ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే కన్జర్వేటివ్ పార్టీ ఓటమి సగం ఖాయమైందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీది 190 ఏళ్ల చరిత్ర. ఇంత సుదీర్ఘ చరిత్రలో 1906లో వచి్చన 131 సీట్లే అత్యల్పం. ఈసారి ఆ రికార్డును అధిగమించవచ్చని సర్వేలంటున్నాయి. ‘‘సునాక్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని కన్జర్వేటివ్‌ల కంచుకోటైన తన సొంత పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోవచ్చు. ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌తో సహా పలువురు సీనియర్ మంత్రులకు ఓటమి తప్పదు’’ అని సావంత పోల్ పేర్కొంది. కన్జర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం తప్పక పోవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత సంతతికి చెందిన వారు ఈసారి కన్జర్వేటివ్ పారీ్టకి ఓటేయకపోవచ్చనేది పోల్స్టర్ల అంచనా. లేబర్ పారీ్టకి 425కు పైగా సీట్లు...! హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 సీట్లకు గాను లేబర్ పార్టీ 425కు పైగా సాధించి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 108 స్థానాలకు పరిమితమవుతుందని యూగవ్, కేవలం 53 స్థానాలకే పరిమితమవుతారని సావంత పోల్ పేర్కొన్నాయి. సావంత అయితే లేబర్ పార్టీకి దాని చరిత్రలోనే అత్యధికంగా 516 సీట్లు రావచ్చని అంచనా వేయడం విశేషం! కన్జర్వేటివ్‌లకు 72కు మించబోవని, లేబర్ పార్టీ 456 సీట్లు దాటుతుందని బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వే అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 43.6 శాతం ఓట్లతో 365 సీట్లు సాధించగా లేబర్ పార్టీకి 32.1 శాతం ఓట్లతో 202 స్థానాలు దక్కాయి. ఆకట్టుకుంటున్న కైర్ స్టార్మర్ ‘లెఫ్టీ లండన్ లాయర్’గా పేరు తెచ్చుకున్న కైర్ స్టార్మర్ లేబర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 14 ఏళ్లుగా విపక్షంలో ఉంటూ కుంగిపోయిన పారీ్టలో ఆయన జోష్ నింపుతున్నారు. ఇళ్ల సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, పన్ను పెంపుదల లేకుండా మెరుగైన ప్రజా సేవలను అందిస్తామనే మామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన దాత అయిన బిలియనీర్ జాన్ కాడ్వెల్ కూడా ఈసారి లేబర్ పారీ్టకి మద్దతిస్తున్నారు. తాను లేబర్ పారీ్టకే ఓటేస్తానని బాహాటంగా చెబుతున్నారు. అందరూ అదే చేయాలని పిలుపునిస్తున్నారు.ప్రజల్లో వ్యతిరేకతకు కారణాలెన్నో... బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ కామెరాన్ రాజీనామా అనంతరం చీటికీమాటికీ ప్రధానులు మారడం కన్జర్వేటివ్ పార్టీకి చేటు చేసింది. థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి రూపంలో ఏకంగా నలుగురు ప్రధానులు మారారు. వీరిలో 45 రోజులే కొనసాగిన ట్రస్ పారీ్టకి గట్టి నష్టాన్ని కలిగించారని, దాన్ని సునాక్ పూడ్చలేకపోయారని అంటున్నారు.→ 2022 అక్టోబర్‌లో రిషి ప్రధాని అవుతూనే ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని, రుణ భారాన్ని, నేషనల్ హెల్త్ సరీ్వస్ వెయిటింగ్ జాబితాను తగ్గిస్తానని, అక్రమ వలసలను అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఇవేవీ చేయలేకపోగా సంప్రదాయ ఓటర్లనూ మెప్పించలేకపోయారని విమర్శ ఉంది.→ ఐదేళ్లలో బ్రిటన్ వాసుల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. వారిపై పన్ను భారమైతే గత 70 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉంది. అక్రమ వలసలు పెరిగాయి. ప్రధానిగా సునాక్ నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలొచ్చాయి. → వీటికి తోడు 14 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.→ రిఫార్మ్ యూకే పార్టీ పుంజుకోవడం కూడా కన్జర్వేటివ్‌లను దెబ్బ తీయనుంది. ఈ పారీ్టకి 15 శాతం ఓట్ల వాటా ఉంది. ఈసారి చాలా స్థానాల్లో కన్జర్వేటివ్ ఓటు బ్యాంకుకు భారీగా గండి పెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు
పారిస్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటరీ ఎన్నికలు పరోక్షంగా ఫ్రాన్స్ పార్లమెంట్ ముందస్తు ఎన్నికలను మోసుకొచ్చాయి. యూరోపియన్ యూనియన్‌లో మొత్తం 720 సీట్లు ఉండగా 81 సభ్యులను ఫ్రాన్స్ ఎన్నుకోనుంది. ఇందుకోసం జరిగిన ఎన్నికల్లో ఫ్రాన్స్ విపక్ష నేషనల్ర్యాలీ పార్టీకి 32 శాతం ఓట్లు పడొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు చెందిన రనీసాన్స్ పారీ్టకి కేవలం 15 శాతం ఓట్లు పడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. నిజంగానే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మూడేళ్ల తర్వాత అంటే 2027లో జరగబోయే ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విపక్ష పార్టీ విజయం సాధించే ప్రమాదముందని దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ భావించారు. ఇందుకు బలం చేకూరుస్తూ ఆయన పార్లమెంట్‌ను రద్దుచేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీంతో వచ్చే 20 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 30న తొలి దశ, జూలై ఏడో తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. మూడేళ్ల తర్వాత నిర్వహిస్తే ఓడిపోతామని, ప్రజాదరణ తగ్గేలోపు ఇప్పుడే నిర్వహిస్తే తమ రనీసాన్స్ పారీ్టయే గెలుస్తుందన్న అంచనాతో ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని వార్తలొచ్చాయి. సరైన నిర్ణయం తీసుకున్నా: మేక్రాన్ పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని మేక్రాన్ సమరి్థంచుకున్నారు. ‘‘ దేశం కోసం సరైన నిర్ణయం తీసుకున్నా. ఈయూ ఎన్నికల ద్వారా ప్రజలు మా ప్రభుత్వానికి ఏం చెప్పదల్చుకున్నారో అర్థమైంది. ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపకుండా వదిలేయలేను’ అని చెప్పారు. -
ముందస్తు ఎన్నికలకు సునాక్
లండన్: ముందస్తు ఎన్నికలపై జోరుగా సాగిన ఊహాగానాలే నిజమయ్యాయి. పలురకాలుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాజు చార్లెస్–3కి తెలిపానని, పార్లమెంట్ రద్దుకు ఆయన అనుమతించారని వెల్లడించారు. వేసవిలో ఆరు వారాల్లో ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పారు. అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో కేబినెట్ భేటీ అనంతరం భారతీయ సంతతి బ్రిటన్ ప్రధాని సునాక్ ముందస్తు ఎన్నికల ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమైతే 2025 జనవరిలోగా బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. 10 డౌనింగ్ స్ట్రీట్ బయట ఎన్నికల ప్రకటన చేస్తూ.. తన పదవీకాలంలో సాధించిన విజయాలను సునాక్ వివరించారు. ‘మీకు వీలైనంత భద్రత ఇవ్వడానికి నా అధికార పరిధికి లోబడి చేయగలిగినంతా చేస్తాను. ఇది నా హామీ. బ్రిటన్ తన భవిష్యత్తును ఎంచుకోవాల్సిన తరుణమిది’ అని రిషి సునాక్ దేశ ప్రజలనుద్దేశించి అన్నారు. సునాక్ కన్జర్వేటివ్ పారీ్టకి ఓటమి తప్పదని, లేబర్ పార్టీకి విస్పష్ట మెజారిటీ కనిపిస్తోందని చాలా ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో వరుసబెట్టి లేబర్ పారీ్టయే గెలుస్తూ వచ్చింది. ఈ తరుణంలో రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేయడం గమనార్హం. అంతకుముందు బుధవారమే పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సునాక్ బదులిస్తూ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలుంటాయని చెప్పారు. అయితే ఆకస్మింగా కేబినెట్ భేటీని ఏర్పాటు చేయడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆకస్మిక కేబినెట్ భేటీ కోసం విదేశాల్లో ఉన్న మంత్రులు సైతం అర్ధంతరంగా తమ పర్యటనలు ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. చివరికి కేబినెట్ సమావేశం అనంతరం సునాక్ జూలై 4న ఎన్నికలుంటాయని ప్రకటించారు. -
ఎన్నికలు ఎందుకింత హాటు?
ఎండలు బాబోయ్ ఎండలు... ఏప్రిల్‌లోనే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఇక మే నెల మొదలైతే నిప్పుల కొలిమే! ఎన్నికల సిబ్బందితో పాటు దాదాపు 100 కోట్ల మంది ఓటర్లకు ఈసారి వేసవి సెగ మామూలుగా తగలడం లేదు. ఎన్నికలు ఇలా దంచికొడుతున్న ఎండల్లో జరగడానికి కారణం నూటికి నూరుపాళ్లూ రాజకీయాలే. అవును! తొలి లోక్‌సభ ఎన్నికలు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా చలికాలంలోనే జరిగాయి. 2004లో జరిగిన ముందస్తు ఎన్నికల పుణ్యమా అని 20 ఏళ్లుగా ఇదుగో, ఇలా మండే ఎండల్లో జరుగుతున్నాయి. అక్టోబర్ టు అక్టోబర్... స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా 1951–52లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఈ ప్రక్రియ సుదీర్ఘంగా నడిచింది. నెహ్రూ ప్రధానిగా తొలి లోక్‌సభ 1952 ఏప్రిల్ 17 నుంచి 1957 ఏప్రిల్ దాకా కొనసాగింది. అక్కణ్నుంచి 1980 దాకా లోక్‌సభ ఎన్నికలు జనవరి, ఫిబ్రవరి, లేదంటే మార్చిలోనే జరిగాయి. 1984లో ఇందిర హత్యానంతరం ప్రధాని అయిన రాజీవ్ గాంధీ లోక్‌సభను రద్దు చేయడంతో డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. 1989లో సెపె్టంబర్, అక్టోబర్ నెలల్లో జరిగాయి. సంకీర్ణ ప్రభుత్వాలు సరిగా నడవక చివరికి రెండేళ్లకే లోక్‌సభ రద్దయింది. దాంతో 1991 మే, జూన్ నెలల్లో ఎన్నికలు జరిగాయి. ఎండాకాలంలో జరిగిన తొలి ఎలక్షన్లు అవే. 1996లోనూ ఏప్రిల్, మే నెలల్లో ఎండల్లోనే ఎన్నికలు జరిగాయి. రెండేళ్లకే లోక్‌సభ రద్దవడంతో 1998 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. వాజ్‌పేయి సర్కారు 13 నెలలకే కుప్పకూలి 1999లో ఎన్నికలు సెపె్టంబర్, అక్టోబర్ మధ్య జరిగాయి. ఇప్పుడు మనందరినీ ఠారెత్తిస్తున్న ఎండాకాలపు ఎన్నికలకు 2004లో వాజ్‌పేయి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే కారణం. బీజేపీ ఆర్నెల్ల ముందే లోక్‌సభను రద్దు చేసి ఏప్రిల్, మే నెలల్లో మండే ఎండల్లో ఎన్నికలకు వెళ్లింది. అలా ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ మండుటెండల్లో మొదలైన సార్వత్రిక ఎన్నికల సీజన్ ఇప్పటికీ కొనసాగుతోంది. తర్వాత 2009, 2014, 2019లోనూ ఎండా కాలంలోనే ఎన్నికలు జరిగాయి. ఇలా రెండు దశాబ్దాలుగా ఏప్రిల్–జూన్ ఎన్నికల ‘వేడి’ కొనసాగుతూ వస్తోంది. మార్చడం కుదరదా? చట్టప్రకారం లోక్‌సభ గడువు తీరేలోగా ఎన్నికలు జరిగి కొత్త సభ కొలువుదీరాల్సిందే. తదనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఉదాహరణకు ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు జూన్ 16తో ముగుస్తుంది. ఆలోపు ఎన్నికల తతంగమంతా పూర్తయి కొత్త సభ్యులతో 18వ లోక్‌సభ కొలువుదీరాలన్నమాట. కనుక ఎన్నికల తేదీలను మరీ ముందుకు, వెనక్కు జరపడం కుదరదు. అంటే మళ్లీ మధ్యంతరమో, ముందస్తు ఎన్నికలో వస్తే తప్ప ఈ షెడ్యూల్ మారబోదు. అప్పటిదాకా మనమంతా ఇలా ఎండల్లో ఓటెత్తకా తప్పదు!! లోక్‌సభ ఎన్నికలు జరిగిన తీరు... ఏడాది పోలింగ్ తేదీలు 1951–52 అక్టోబర్ 25 – ఫిబ్రవరి 21 1957 ఫిబ్రవరి 24 – మార్చి 14 1962 ఫిబ్రవరి 19–25 1967 ఫిబ్రవరి 17–21 1971 మార్చి 1–10 1977 మార్చి 16–20 1980 జనవరి 3–6 1984 డిసెంబర్ 24–28 1989 నవంబర్ 22–26 1991 మే 20 – జూన్ 15 1996 ఏప్రిల్ 27 – మే 7 1998 ఫిబ్రవరి 16–28 1999 సెపె్టంబర్ 5 – అక్టోబర్ 3 2004 ఏప్రిల్ 20 – మే 10 2009 ఏప్రిల్ 16 – మే 13 2014 ఏప్రిల్ 7 – మే 12 2019 ఏప్రిల్ 11 – మే 19 2024 ఏప్రిల్ 19 – జూన్ 1 – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముందస్తు ఎన్నికలపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
ఎలాగూ మనం ఈలోపు సీట్ల సర్దుబాటు, పీఎం అభ్యర్థిని డిసైడ్ చేసుకోలేమని అనుకుంటున్నారు..!
ఎలాగూ మనం ఈలోపు సీట్ల సర్దుబాటు, పీఎం అభ్యర్థిని డిసైడ్ చేసుకోలేమని అనుకుంటున్నారు..! -
ముందస్తును కొట్టిపారేయలేం: నితీశ్
పట్నా: దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఏకమవుతుండడం అధికార బీజేపీకి కలవరం కలిగిస్తోందని చెప్పారు. విపక్ష కూటమి పూర్తిగా బలం పుంజుకోకముందే ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో అధికార పక్షం ఉండొచ్చని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఐచ్ఛికం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని గుర్తుచేశారు. -
ఈ తొమ్మిది నెలలు ఎంతో కీలకం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారనే ఉత్త ప్రచారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి కొట్టిపారేశారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులతో టైంకే ఎన్నికలకు వెళ్లనున్నట్లు స్పష్టం చేస్తూనే.. ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని.. ఈ కాలం ఎంతో కీలకమని.. మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందంటూ మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఇంకా తొమ్మిది నెలలు ఉంది. కష్టపడితే మళ్లీ మనదే విజయం. ఈ తొమ్మిది నెలల కాలం మంత్రులు మరింత చొరవతో పని చేయాలి. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ప్రభుత్వం చేస్తున్న మంచిని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. క్షేత్ర స్థాయిలో నిరంతరం ప్రజలతో మమేకం కావాలి అని ఆయన మంత్రులకు సూచించారు. చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ తొమ్మిది నెలల కాలం పని చేయండి.. మిగతాది నేను చూసుకుంటా అని ఆయన మంత్రులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చిందని, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలు.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు -
ముందస్తు మాటే లేదు!
కవితను అరెస్టు చేస్తరా.. చేయనీయండి.. బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోందని కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ‘‘తెలంగాణ ప్రగతిని బీజేపీ ఓర్వడం లేదు. ఈ అక్కసుతో కుట్రలకు పాల్పడుతోంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వేధిస్తోంది. మంత్రి గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ రవిచంద్రలతోపాటు మరికొందరిపై సీబీఐ, ఐటీ, ఈడీ తప్పుడు ఆరోపణలతో దాడులు చేశాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారు. కవితను మహా అయితే ఏం చేస్తారు? అరెస్టు చేస్తరా, జైలుకు పంపుతరా.. అంతేకదా! ఎన్ని అరెస్టులు చేసినా, ఎంత వేధించినా భయపడేది లేదు. ఏం చేస్తారో చేసుకోనివ్వండి. ప్రజలే అంతిమ నిర్ణేతలు. కేంద్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉంది. బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారు. కవితను కూడా బీజేపీలో చేరాలని అడిగారు. ఏం చేసినా కేంద్రంపై రాజకీయ పోరాటం ఆపేది లేదు. ’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం దళితబంధు, గృహలక్ష్మిలో చేతివాటాన్ని సహించబోం అణగారిన దళిత వర్గాలను ఉన్నత స్థితికి తెచ్చేందుకు పెట్టిన పథకం దళితబంధు. ఒక దళిత కుటుంబం బాగుపడటానికి రూ.10 లక్షలను ప్రభుత్వం అందజేస్తుంది. కానీ దళితబంధు లబ్ధిదారుల నుంచి కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు లంచాలు తీసుకుంటున్నట్టు నా దృష్టికి వచ్చింది. వరంగల్‌లో ఓ ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌లో మరో ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్న వ్యవహారంపై నా దగ్గర సమాచారం ఉంది. ప్రభుత్వం, పార్టీ తరఫున సాయం అందించాలే తప్ప.. లబ్ధిదారుల నుంచి లంచాలు తీసుకోవడమేంటి? దళితబంధు, గృహలక్ష్మి వంటి పథకాల్లో అక్రమాలకు పాల్పడితే సహించే ప్రసక్తి లేదు. – సీఎం కేసీఆర్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెరదించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, నేతలు నియోజకవర్గాల్లో ప్రజల మధ్యే ఉండాలని.. పనులన్నీ పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళి అర్పించిన తర్వాత సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ కక్ష సాధింపు, సిట్టింగ్‌లకు సీట్లు, దళితబంధులో చేతివాటం, సంక్షేమ పథకాల అమలు, వాటి ప్రచారం తదితర అంశాలపై ప్రసంగించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మధుసూదనాచారి, మల్లారెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ, తలసాని, హరీశ్‌రావు, మహమూద్‌అలీ, తోట చంద్రశేఖర్, శ్రీనివాస్‌గౌడ్, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తోంది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీ నియోజకవర్గాల్లో జరిగిన పనులను జనానికి చెప్పాలి. ఎమ్మెల్యేలు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలి. అందుకోసం పాదయాత్రలు చేయాలి. వేరే పార్టీలు చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని జనం ముందు పెట్టాలి. సెప్టెంబర్ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు. సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇస్తాం. ఎమ్మెల్యేలు ప్రజలతో, కార్యకర్తలతో మమేకమై పనిచేయాలి. కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం. వారితో ఆత్మీ య సమ్మేళనాలు నిర్వహించాలి. ఇందుకు ఎమ్మెల్యే లు బాధ్యత తీసుకోవాలి. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకొని ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలి. వీటికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీ, కా ర్పొరేషన్ చైర్మన్లను, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలి. ఆత్మీయ సమ్మేళనాలను 2 నెలల్లోపు పూర్తి చేయాలి. బీఆర్ఎస్వీని బలోపేతం చేయాలి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ)ను మరింత బలోపేతం చేయాలి. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి సంఘం బలోపేతానికి చ ర్యలు చేపట్టాలి. ఇంకా మిగిలిన పార్టీ జిల్లా కార్యా లయాల ప్రారంభోత్సవాలను పూర్తి చేయాలి. ఏప్రిల్‌లో ప్రతినిధుల సభ.. అక్టోబర్‌లో ఆవిర్భావ సభ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో.. ఏప్రిల్ 25న గ్రామాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించాలి. తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాప్రతినిధుల సభ నిర్వహించాలి. ఏప్రిల్ 27న ఎల్బీ స్టేడియంలో రాష్ట్రస్థాయి ప్రతినిధుల సభ నిర్వహిస్తాం. సభలో పార్టీకి సంబంధించిన అన్ని కేటగిరీల ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభను అక్టోబర్‌లో వరంగల్‌లో నిర్వహిస్తాం. తలసరి ఆదాయంలో దేశంలోనే ముందు.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోరాడి సాధించుకున్న తెలంగాణలో తలెత్తి నిలబడ్డాం. తలసరి ఆదాయంలో దేశంలోనే ముందు వరుసలో తెలంగాణ దూసుకుపోతోంది. రాష్ట్రం సాధించిన పురోగతిని చూసిన ప్రజలు తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలో మనకు అండగా నిలబడ్డారు. విద్యుత్ కోతలు లేకుండా చేసుకున్నాం. సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఇవాళ ప్రతీ ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు అందుతున్నది. సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థాయికి చేరాం. విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. మన పారిశ్రామిక విధానాలను ప్రపంచం మెచ్చుకుంటోంది. మొన్న రాష్ట్రానికి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ఫాక్స్‌కాన్ చైర్మన్ తెలంగాణ అభివృద్ధిని చూసి నేర్చుకోవాల్సినది చాలా ఉందనడం మనందరికీ గర్వకారణం..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో సీఎం చెప్పిన మరిన్ని అంశాలివీ.. ► జూన్ 2న అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి. ► ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా డబు ల్ బెడ్రూం ఇండ్ల పంపిణీని పూర్తి చేయాలి. ► 58, 59 జీవోల ప్రకారం భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు గడువు పెంచిన నేపథ్యంలో.. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యేలు చూడాలి. ► దళితబంధు రెండో విడత పంపిణీకి స్థానిక ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేయాలి. పథకం అమల్లోకి వచ్చిన ఆగస్టు 16న దళితబంధు వేడుకలను నిర్వహించాలి. ► గృహలక్ష్మి పథకం కింద సొంత జాగాలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను స్థానిక ఎమ్మెల్యేలు సిద్ధం చేసి కలెక్టర్లకు పంపించాలి. ఈ పథకంలో అవినీతికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే. ► త్వరలో ప్రారంభించే భూముల పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యేలు అర్హులందరికీ న్యాయం జరిగేలా చూసుకుంటూ జాగ్రత్తగా జరిపించాల్సిన అవసరం ఉంది. ► త్వరలో నిర్వహించే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సిద్ధమై ఉండాలి. అన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. -
ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని, ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్సే గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘డిసెంబర్లో జరిగే ఎన్నికలకు ప్లాన్ చేసుకోండి. అవసరమైన చోట యాత్రలు, పాదయాత్రలు నిర్వహించాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. చదవండి: ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారు: తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు -
ముందస్తు ఎన్నికలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
-
బెంగాల్లో మూడేళ్లలోనే ఎన్నికలు.. ‘ముందస్తు’పై బీజేపీ హింట్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టి అధినేత్రి మమతా బెనర్జీ పాపులర్ డైలాగ్ ‘ఖేలా హోబ్’(ఆట ఆడదాం)ను తిరిగి టీఎంసీపైనే ప్రయోగిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు ఆట ఆడాల్సి ఉందని పేర్కొంది. తాము అహింసను నమ్ముతామని నొక్కి చెప్పారు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సుకంతా మజుందర్. అయితే, తమను రెచ్చగొడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బర్రక్‌పోరాలో నిర్వహించిన బహిర సభలో ఈ మేరకు టీఎంసీపై విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్ర ఆస్తులను అమ్మేస్తున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని భరోసా ఇస్తున్నా. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా నేను ఆశ్చర్యపోను.’ అంటూ ముందస్తు ఎన్నికలపై హించ్ ఇచ్చారు బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మజుందర్. 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల కేసుల్లో సుమారు 300 మంది టీఎంసీ కార్యకర్తలు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. మరింత మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చిరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఏ స్థాయిలో ఉన్నా.. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నంత వరకు తప్పించుకోలేరని పేర్కొన్నారు. పోలీస్ బలగాలు తటస్థంగా ఉండేలా లోక్‌సభలో బిల్లు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: కోవిడ్ అప్డేట్.. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మందిలో రోగనిరోధక శక్తి -
తెలంగాణలో ముందస్తు మేఘాలు!
సాక్షి, హైదరాబాద్: శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండవని, నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభం, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం, వేల సంఖ్యలో కొలువులు భర్తీ చేయాలని నిర్ణయించడం..‘ముందస్తు’కు సంకేతాలేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ‘ఎమ్మెల్యేలకు ఎర’, రాష్ట్ర మంత్రులు లక్ష్యంగా ఐటీ దాడులు లాంటి పరిణామాలూ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వైపు మొగ్గుకు కారణం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెలుగు చూడటంతో బీజేపీ బాగా ఇరకాటంలో పడిందనే భావన టీఆర్ఎస్ అధిష్టానంలో ఉందని ఆ వర్గాలంటున్నాయి. రాష్ట్ర మంత్రులపై కక్షపూరితంగా జరుగుతున్న ఐటీ దాడులు ఉపకరిస్తాయన్న ఉద్దేశం కూడా ఉండొచ్చ ని చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టనుండటాన్ని ప్రస్తావిస్తున్నాయి. మరోవైపు ముందస్తు ఎన్నికల అంచనాతోనే బీజేపీ, కాంగ్రెస్ వంటి విపక్ష పారీ్టలు కార్యాచరణకు సిద్ధమవుతున్నాయనే చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాపరమైన అంశాల్లో వేగం పెంచారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల మరమ్మతు, ఆ«ధునికీకరణ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో వచ్చే ఏడాది మార్చిలోగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడం, సొంత జాగాలో ఇంటి నిర్మాణం చేసుకునేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంపైనా ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయడంతో పాటు యూనిట్ల మంజూరును కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అభివృద్ధి పనులన్నీ మార్చిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. సెక్రటేరియట్‌కు సంక్రాంతి ముహూర్తం? సచివాలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ సంక్రాంతిని ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలిసింది. సెక్రటేరియట్‌కు ఎదురుగా నిర్మాణంలో ఉన్న అమరుల స్మారకాన్ని పూర్తి చేసి అదేరోజు ప్రారంభించేలా చూడాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ఎన్టీఆర్ ఘాట్ పక్కనే వచ్చే నెల్లోనే ఆవిష్కరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు కొలువుల భర్తీకి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. తాజాగా శుక్రవారం ఏకంగా 9,168 గ్రూపు–4 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. టీఎస్పీఎస్సీతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వరుసబెట్టి కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లా కలెక్టరేట్ల భవనాలను వరుసగా ప్రారంభించేలా అధికారులు సీఎం పర్యటన షెడ్యూలు సిద్ధం చేస్తున్నారు. సీఎం జిల్లాల పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభలు కూడా జరుగుతాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్‌పై కేంద్రం విధిస్తున్న ఆంక్షలు, తదితరాలపై చర్చించనున్నారు. కేంద్రం కక్షపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై రెండు రోజులుగా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఈ కసరత్తులో కీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాలపై స్పెషల్ నజర్ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల బాట పట్టారు. ఓ వైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే సొంత నియోజకవర్గాన్ని, క్షేత్ర స్థాయిలో సంస్థాగత లోపాలను చక్కదిద్దుకోవడంపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మండలాల వారీగా పార్టీ కేడర్‌తో ఆతీ్మయ సమ్మేళనాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జిల కోసం జాబితాల రూపకల్పనపై దృష్టి కేంద్రీకరించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే..? వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎదురయ్యే అనుకూల, వ్యతిరేక పరిణామాలతో పాటు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ ఇప్పటికే సంపూర్ణంగా కసరత్తు చేశారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పేరు భారత్ రాష్ట్ర సమితిగా మారే అంశంపై డిసెంబర్ మూడో వారంలో ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: Hyderabad: జనవరిలో నూతన భవనంలోకి యూఎస్ కాన్సులేట్ -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీబీఐకి నో చెప్పిన హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్ట్ సింగిల్ జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి అధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలని ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్ టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు నానక్‌రామ్‌గూడలోని కృష్ణ ఇంటికి చేరుకున్న కేసీఆర్ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Viral Video: ప్చ్! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు ఖెర్సన్ నుంచి రష్యా బలగాలు వైదొలగడంతో ఉక్రెయిన్‌లో పండగ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నగరమంతా రష్యా బలగాలను తరిమికొట్టేశాం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఆనందంగా ప్రకటించారు. ఈ మేరకు వెనక్కు మళ్లుతున్న రష్యా సేనాలు ఎలాగో పోరాడలేకపోయం కదా పోతూపోతూ... ఖెర్సన్ ప్రాంతంలో జూలోని జంతువులను పట్టుకుపోతున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ హీరోగా వందల సినిమాలు చేసిన ఘనత ఒక్క ఆయనకే దక్కింది. హీరో, నిర్మాత, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్ అందించి చరిత్ర సృష్టించారాయన. అయితే తన జీవితంలో ఎన్నో విజయాలను, రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణ చివరికి ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం! ధోనికి కీలక బాధ్యతలు.. త్వరలోనే బీసీసీఐ ప్రకటన ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియాది నెం1 స్థానం. ద్వైపాక్షిక సిరీస్‌లలో దుమ్మురేపుతున్న భారత జట్టు.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. చివరిసారిగా 2013లో ధోని సారథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలుచుకుంది. అప్పటి నుంచి భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 150 అడుగుల లోయలో చావు బతుకుల్లో బాలుడు..‘యాపిల్ వాచ్ నా ప్రాణం కాపాడింది సార్’ ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ట్రెక్కింగ్ సమయంలో జోరున వర్షం. వర్షం ధాటికి వెనక్కి రాలేం. ముందుకు రాలేం. అలా అని అక్కడే ఉండిపోలేం. అచ్చం ఆ కుర్రాడు కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి పై నుంచి 130 నుంచి 150 అడుగుల లోయలో పడ్డాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పిక్క భాగంలో రక్తనాళాలు ఉబ్బి నీలం, ఎరుపు రంగులో కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే కాళ్ల దగ్గర ఉండే ఈ సిరలు దెబ్బతినడం, లేదా పై వైపునకు వెళ్లాల్సిన రక్తం సాఫీగా ప్రవహించకపోవడంతో కాళ్ల కింది భాగంలో, ప్రధానంగా పిక్కల వంటి చోట్ల రక్తనాళాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఇలా కనిపించడాన్ని ‘వేరికోస్ వెయిన్స్’ అంటారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో రొమాన్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ప్రేయసి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్మెంట్లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు కవితను పార్టీ మారమని అడిగారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?. ఎన్నికలు సమీపించే కొద్ది బీజేపీ రోజురోజుకు మరింతగా రెచ్చిపోతుంది. పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ హెచ్ఛరికలు జారీ చేశారు. అనవసర విషయాల జోలికి వెళ్లొద్దు. వివాదాస్పద విషయాల్లో తలదూర్చొద్దు అని హుకుం జారీ చేశారు. ఐటి, ఈడి, సిబిఐ దాడులకు భయపడాల్సిన పనిలేదన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరగుతాయని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ 10 నెలలు కష్టపడాలని చెప్పారు. మంత్రులు తమ నియోజకవర్గాలకు పరిమితం కాకుండా అంతటా తిరగాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎవరి ప్రలోభాలకు లొంగొద్దని అన్నారు. మునుగోడు ఫలితాల్లో మెజారిటీ తగ్గడంపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. మళ్లీ సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. మంత్రులు ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మూడోసారి కూడా మనదే గెలుపు అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: (ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్) -
ఇమ్రాన్ ఖాన్ సిక్సర్.. ఆకాశానికెత్తిన మీడియా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ చరిత్ర సృష్టించారు. ఆ దేశ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసి.. ఆరింటిలో ఆయన ఘన విజయం సాధించారు. దీంతో అధికారం కోల్పోయినప్పటికీ తెగ విమర్శలు గుప్పించిన ఆ దేశ మీడియా.. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ను ఆకాశానికెత్తేస్తోంది. తాజాగా జాతీయ అసెంబ్లీలో ఎనిమిది సీట్లకు, పంజాబ్ అసెంబ్లీకి మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏడు స్థానాలకు పోటీ చేశారు. ఆదివారం ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో ఆరు స్థానాల్లో ఆయన ఘన విజయం సాధించారు. దీంతో.. పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న పీటీఐ డిమాండ్‌కు బలం చేకూరినట్లయ్యింది. పాక్‌లో ఈ ఏప్రిల్‌లో ప్రధాని పీఠం నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయాక.. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఈ క్రమంలో 131 స్థానాలకు గానూ దశల వారీగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది పాక్ ఎన్నికల సంఘం. అయితే.. ఈ ఆరు నెలల పాలన తీరుపైనా ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందనేది పీటీఐ వాదన. ఈ మేరకు జాతీయ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈసీ మాత్రం అందుకు సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తోంది. ఈ క్రమంలో.. ఇప్పుడు ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి ప్రతికూలంగా రావడం గమనార్హం. Entire nation stands with Imran Khan !! pic.twitter.com/hbvdMBAz70 — PTI (@PTIofficial) October 17, 2022 ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమికి భంగపాటే ఎదురైంది. అధికార పార్టీ మిత్రపక్షం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండు స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఇక అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు గడుస్తున్నా.. ఆర్థిక సంక్షోభం, ఆ వెంటనే వరదలు పాక్‌ను అల్లకల్లోలం చేశాయి. ఈ క్రమంలో సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మంత్రులు, అధికారులు ఎక్కడ కనిపించినా.. ప్రజల నుంచి బహిరంగంగా అవమానాలే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఫలితాలు సైతం ప్రతికూలంగా రావడంతో ప్రభుత్వానికి గుబులు పట్టుకుంది. దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. పాక్ పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, విదేశీ కుట్రతో గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పిలుపు ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరు స్థానాల్లో గెలుపొందినప్పటికీ.. ఒక్కదాని మినహా మిగతా అన్నింటికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో మిగతా స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో పాక్ గడ్డపై అత్యధికంగా ఐదు స్థానాల్లో పోటీ చేసి.. ఐదింటిలోనూ విజయం సాధించారు ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టి పాక్ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను తిరగరాశారు. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి ఇల్లీగల్‌గా ఫారిన్ ఫండ్స్ దక్కించుకుందని పీటీఐ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే మాత్రం ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లాల్సి రావడమే కాదు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి పీటీఐ అర్హత కోల్పోతుంది కూడా. ఇదీ చదవండి: చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిన్నదేశం -
తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణంలో అయినా పిడుగు పడొచ్చు.. ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. గతంలో చేసిన తప్పులు పునరావృతం కావొద్దు అంటూ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలపై రకరకాల చర్చ నడుస్తోంది. పార్టీ మార్పుపై తుమ్మల నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటూ ఓవైపు.. మరోవైపు ఆయన వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికలను ఉద్దేశించి చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి పర్యటనలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడంటూ కొందరు కార్యకర్తలు ఆయన్ని ప్రశ్నించగా.. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు, సిద్ధంగా ఉండాలంటూ ఆయన కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. ఖమ్మం టీఆర్ఎస్లో చాలాకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. తుమ్మల క్రియాశీలక రాజకీయాలతో పాటు టీఆర్ఎస్ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పాలేరు నుంచే బరిలో దిగాలని భావిస్తున్నారు. అందుకే మళ్లీ క్రియాశీలకంగా మారారు. అయితే.. ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.. టీఆర్ఎస్ కార్యకర్తల చేరికతో తన వర్గ బలాన్ని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో తుమ్మల పార్టీ మారతారనే చర్చ సైతం జోరుగా నడుస్తూ వస్తోంది. అయితే టికెట్ విషయంలో టీఆర్ఎస్ ఎలా వ్యవహరించబోతుందన్నదే ఇప్పుడు కీలకంగా మారనుంది. -
కేసీఆర్ ‘ముందస్తు’ వ్యూహంపై తమిళిసై కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మారుతున్న పరిస్థితుల కారణంగా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తున్నారని అందరూ భావిస్తున్నట్లు చెప్పారు. కానీ తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోరని, వెళ్లే అవకాశం లేదని తమిళిసై తేల్చిచెప్పారు. సోమవారం ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన అనంతరం గవర్నర్ తమిళిసై తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రొటోకాల్ గురించి అడిగి లేదనిపించుకోను.. ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య ఏర్పడిన దూరం బహిరంగ రహస్యమేనని, ఆ విషయంలో కొత్తదనం ఏమీ లేదని గవర్నర్ తమిళిసై చెప్పారు. ఇటీవల రాజ్‌భవన్‌లో కేసీఆర్ తనను కలిశాక కూడా ప్రభుత్వం ప్రొటోకాల్ ఇవ్వట్లేదన్నారు. ఇటీవల వరదల సమయంలో కనీసం కలెక్టర్ కూడా తన వెంట రాలేదని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు అర్థమైనందున చాలాకాలంగా పర్యటనలకు వెళ్లేందుకు ప్రోటోకాల్, హెలికాప్టర్ సహా ఇతర సదుపాయాలను అడిగి లేదనిపించుకోవడం ఎందుకని పట్టించుకోవడం మానేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఇప్పటికీ తనకు సోదరుడేనని చెప్పారు. తనను ఎప్పుడు ఎవరు ఆహ్వానించినా వారి ఆహ్వానాన్ని గౌరవిస్తానని కేసీఆర్‌ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రభుత్వానికి ఇబ్బందేంటి? ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే స్పందించడం తన బాధ్యత అని, వరద ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు. ప్రజలతో మమేకం కావడమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. భద్రాచలం ప్రాంతంలో తాను దత్తత తీసుకున్న కొన్ని గ్రామాల గిరిజనులు వరద ప్రభావానికి గురయ్యారని తెలిసి అక్కడికి వెళ్లినట్లు వివరించారు. తన పర్యటనకు రాజకీయ ఉద్దేశమేదీ లేదన్నారు. గవర్నర్ అంటే కేవలం రాజ్‌భవన్‌లోని నాలుగు గోడలకే పరిమితం కావాలన్న ఉద్దేశం సరికాదన్నారు. క్లౌడ్ బరస్ట్ సహా అనేక అంశాలపై తాను మాటిమాటికీ బరస్ట్ కాలేనని వ్యంగ్యాస్త్రం సంధించారు. ప్రజలు ‘డబుల్’ఇళ్లు అడుగుతున్నారు.. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని గవర్నర్ తెలిపారు. ఇటీవల వరద ప్రాంతాల్లో తన పర్యటన సందర్భంగా చాలా మంది డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఆందోళన చేశారని చెప్పారు. అయితే వరద ప్రాంతాల్లో సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసినట్లు తమిళిసై వివరించారు. తెలంగాణకు నిరంతరం కేంద్ర ప్రభుత్వ మద్దతు... తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతు తెలుపుతోందని గవర్నర్ తమిళిసై చెప్పారు. విభజన హామీలపై ఇప్పటికే చాలా వరకు నెరవేరాయని, సమయానుకూలంగా అన్ని హామీలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అయితే మిగిలిన హామీల పరిష్కారం, ఇతర మద్దతు పూర్తిగా రాజకీయపరమైన అంశమని వ్యాఖ్యానించారు. వరద ప్రాంతాల్లో పర్యటించి వచ్చాక కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక పంపానని.. కేంద్రం కూడా నష్టం అంచనా కోసం రాష్ట్రానికి అధికారులను పంపించిందని గవర్నర్ వివరించారు. దేశ మహిళలందరికీ ముర్ము రోల్ మోడల్.. ‘అణగారిన వర్గాలకు చెందిన ఒక మహిళ రాష్ట్రపతి పదవిని అలంకరించడం కేవలం భారత్‌లోనే సాధ్యం. ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే ఒక వ్యక్తిని అత్యున్నత స్థానానికి ఎంపిక చేయడంతో దేశంలో గొప్ప ప్రజాస్వామ్యం ఉందని మరోసారి రుజువైంది. దేశంలోని మహిళలందరికీ ముర్ము ఒక రోల్ మోడల్. ఒక మహిళా గవర్నర్‌గా మహిళా రాష్ట్రపతి వద్ద పనిచేయడం ఒక మంచి అవకాశం. ఒక గొప్ప గౌరవం. నేను ఎప్పటికీ ప్రజల వెంటే ఉంటాను’అని అన్నారు. -
ముందస్తు ఎన్నికల ఊహాగానాలు: ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు, రాజ కీయ పక్షాల సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతుంటే.. ఈ చర్చతో సంబంధం లేకుండా పార్టీ ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయా? లేదా షెడ్యూల్ ప్రకారమే వస్తాయా..? అనే అంశంతో సంబంధం లేకుండా నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రం తేదీ ప్రకటిస్తే తాను అసెంబ్లీ రద్దు చేసేందుకు సిద్ధమంటూ మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో నేతలు, పార్టీల్లో హడావుడి పెరిగిన సంగతి విదితమే. ప్రతిపక్షాలు సైతం ముందస్తుకు తాము సిద్ధమంటూ.. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా విపక్షాలన్నీ పావులు కదుపుతూ, వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే టీఆర్ఎస్ ఈ హడావుడికి దూరంగా భిన్నమార్గంలో ప్రజాక్షేత్రంలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. వివిధ ఏజెన్సీల ద్వారా జరుగుతున్న సర్వే ఫలితాలు టీఆర్ఎస్కే సానుకూలంగా ఉన్నట్లు వస్తున్నందున నియోజకవర్గంపై ‘ఫోకస్’పెంచాలని ఎమ్మెల్యేలకు సీఎం నిర్దేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, విపక్ష పార్టీల నేతల పనితీరుపై అందుతున్న నివేదికల ఆధారంగా స్థానిక రాజకీయ పరిస్థితులను కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఈ నివేదికలు వెల్లడించే అంశాల ఆధారంగా పనితీరును మెరుగు పరుచుకోవాలని సూచించినట్లు సమాచారం. నియోజకవర్గాల్లోనే మకాం వేయండి.. ఏడాదిన్నరకు ముందే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతుండటంతో ఇప్పటికే నియోజకవర్గానికి మంజూరైన పనులను పూర్తి చేసి ఎన్నికల షెడ్యూలు వెలువడేనాటికి ప్రారంభించేలా వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎన్నికల బూత్‌వారీగా లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేసి ఒక్కో ఇంటికి ఏయే ప్రభుత్వ పథకాల కింద వ్యక్తిగతంగా లబ్ధి జరిగిందనే సమాచారాన్ని రెడీ చేసుకోవడంపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. సభలు, సమావేశాలకు పరిమితం కాకుండా లబ్ధిదారులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యేలా క్షేత్ర స్థాయిలో పర్యటనలు ఉండేలా షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మకాం వేయగా.. తర్వాత కూడా అక్కడే ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 లేదా 16వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గంతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఈ భేటీలో ఎన్నికల కోణంలో కాకుండా ప్రజలతో మమేకయ్యేందుకు అనుసరించాల్సిన తీరుపై లోతుగా దిశా నిర్దేశం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొనసాగుతున్న పీకే రెండో విడత సర్వే... ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల పరిస్థితిపై కేసీఆర్‌కు నివేదికలు అందజేసిన పీకే ‘ఐప్యాక్’బృందం రెండో విడత సర్వేకు శ్రీకారం చుట్టింది. తొలి విడత సర్వేలో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్కే చెందిన ముఖ్య నేతలను పరిగణనలోకి తీసుకుని పనితీరుపై నివేదికలు రూపొందించింది. ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో సుమారు 30 అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల ఒకటి కంటే ఎక్కువ మంది పేర్లను పరిగణనలోకి తీసుకుని సర్వే ఫలితాలను క్రోడీకరిస్తున్నట్లు సమాచారం. పీకే బృందం చేస్తున్న సర్వే నివేదికలు ఆగస్టు మొదటి వారం నాటికి కేసీఆర్‌కు చేరే అవకాశమున్నట్లు సమాచారం. -
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమా !
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో కొంతకాలంగా ముందస్తు ఎన్నికలపై చర్చ జోరుగా నడుస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందస్తు ఎన్నికల మీద చేసిన వ్యాఖ్యలు ఆయా పార్టీల్లో కొత్త చర్చకు తెరలేపాయి. మరునాడు కరీంనగర్ వేదికగా బండి సంజయ్ చేపట్టిన మౌనదీక్ష అనంతరం ముందస్తు విషయం లేవనెత్తడం.. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించడం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచింది. వాస్తవానికి కరీంనగర్ ప్రజలకు ముందస్తు ఎన్నికలు కొత్తేం కాదు. అదే విషయాన్ని ఇక్కడ వివిధ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. తమ పార్టీకి కరీంనగర్ ఉమ్మడి జిల్లా కంచుకోట అని.. అనేకసార్లు రాజీనామా చేసినా తమను ప్రజలు బ్రహ్మరథం పట్టి తిరిగి గెలిపించుకున్నారని టీఆర్ఎస్ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని, ముందస్తు ఎన్నికలు వచ్చినా, ఉపఎన్నికలు వచ్చినా.. విజయం తమదేనని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఎమ్మెస్సార్ వ్యాఖ్యలతో.. ► ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గడ్డ కరీంనగర్. ప్రస్తుత సీఎం కేసీఆర్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా, సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రెండుచోట్ల గెలిచిన అనంతరం సిద్దిపేట శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. కరీంనగర్ ఎంపీగా, అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ► 2006లో తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తున్న సమయంలో తెలంగాణ విషయంలో ఎమ్మెస్సార్ చేసిన వ్యాఖ్యలతో అప్పటి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెస్సార్ సవాలుతో స్పందించిన కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లారు. 2006లో భారీ మెజార్టీతో గెలిచారు. 2008లో రెండోసారి రాజీనామాతో మెజారిటీని బాగా తగ్గించుకున్నారు. ఈ రెండు దఫాలు అప్పటి మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సమీప ప్రత్యర్థిగా నిలబడటం గమనార్హం. బండి వర్సెస్ గంగుల..! ► ఉమ్మడి రాష్ట్రంలోనూ కరీంనగర్ జిల్లా రాజకీయాలు ప్రభావం చూపించేవి. తెలంగాణ వచ్చాక.. కరీంనగర్ మరింత కీలకమైంది. సూటిగా చెప్పాలంటే రాజకీయ కేంద్రంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. 2006లో ఎంపీ కేసీఆర్, మంత్రి సత్యనారాయణ మధ్య మాటలపోరు ఏపీలో రాజకీయ వేడిని పెంచింది. ► ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్ మధ్య మాటల యుద్ధం కూడా ఆనాటి పరిస్థితులను తలపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. ► నాడు కేసీఆర్–ఎమ్మెస్సార్లవి, నేటి మంత్రి గంగుల–ఎంపీ బండిలది కూడా ఒకే సామాజిక వర్గమని వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే అప్పటి ఎమ్మెస్సార్ పాత్రను ప్రస్తుతం బండి సంజయ్ పోషిస్తున్నాడని అభివర్ణిస్తున్నారు. ►ఓవైపు సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు అంగీకరిస్తే తాము సిద్ధమేనని.. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా గెలిచేది తామేనని బండి సంజయ్ ఘంటాపథంగా చెప్తున్నారు. మరోవైపు తీరా తాము ప్రభుత్వం రద్దు చేస్తే.. ఎన్నికల విషయంలో మాట మార్చరన్న గ్యారెంటీ ఏంటి? అని మంత్రి గంగుల ప్రశ్నిస్తున్నారు. అందుకే.. ‘మోదీని ముందు ఎన్నికల తేదీని ప్రకటించమనండీ.. మా సీఎం కూడా నిర్ణయం తీసుకుంటారు’ అని కమలాకర్ ఎదురుదాడికి దిగడంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి సవాలుకు ప్రతిసవాలు, ఆరోపణకు ప్రత్యారోపణలతో బీజేపీ– గులాబీ శ్రేణుల మధ్య తగ్గపోరు నడుస్తోంది. ఇద్దరూ దొంగలే అంటున్న కాంగ్రెస్..! ఈ విషయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముందస్తుకు వెళ్తానంటున్న టీఆర్ఎస్ పార్టీ.. బీజేపీని తేదీ కోరడమేంటని, ఎన్నికల కమిషన్ తేదీ నిర్ణయిస్తుందన్న విషయం కేసీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. పరిపాలన విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఇద్దరూ దొంగలేనని స్పష్టం చేశారు. నిజంగా రద్దు చేయాలన్న యోచన ఉంటే గుజరాత్‌తోపాటు ఎన్నికలకు వెళ్లొచ్చు కదా? అంటూ టీఆర్ఎస్ పార్టీకి హితవు పలికారు. తాము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. పోటీకి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయ్: కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు పట్టిన శని కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. ఈమేరకు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 2008లో కూడా కేసీఆర్ మతిభ్రమించి ప్రెస్మీట్లు పెట్టేవాడని గుర్తు చేశారు. హుజురాబాద్ ఫలితాల తర్వాత కూడా కేసీఆర్ వరుసగా రెండు ప్రెస్మీట్లు పెట్టారని ప్రస్తావించారు. కేసీఆర్‌ను మొన్న గెలిపించిన గజ్వేలు ప్రజలు. వచ్చే ఎన్నికల్లో ఓడించేది కూడా గజ్వేల్ ప్రజలేనని వ్యంగ్యస్త్రాలు సంధించారు. కేసీఆర్ సవాల్ చేయడం కాదని, ముందు అసెంబ్లీ రద్దు చేయాయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ‘మాట్లాడితే మోకాళ్ల హైట్ ఉన్నాడని అంటున్నాడు, నేను ఎంత ఎత్తు ఉన్నానో పక్కన పెడితే బుల్లెట్ కూడా అర ఇంచే ఉంటుంది.. కానీ అది గుండెల్లో దిగితే తెలుస్తుంది ఎలా ఉంటుందో. కేసీఆర్‌లా నేను కుసంస్కారిలా మాట్లాడను. మా అమ్మ, హుజూరాబాద్ ప్రజలు నేర్పిన సంస్కృతి, సభ్యతను మర్చిపోయి మాట్లాడను. నన్ను వ్యక్తిగతంగా దూషిస్తే. తెలంగాణ ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. చదవండి: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ సవాల్... సై! అన్న బండి, ఉత్తమ్ కేసీఆర్‌ను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన పీడ విరగడ అవుతుంది. నేను నా సవాల్‌కు కట్టుబడి ఉన్నా.. కేసీఆర్‌పై తప్పకుండా గజ్వేల్‌లో పోటీ చేస్తా. గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌ను బొంద పెట్టేందుకు కసితో సిద్దంగా ఉన్నారు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నా హుజూరాబాద్ ప్రజలే. హుజూరాబాద్‌లో విజయం నాది కాదు. నా ప్రజలదే. కేసీఆర్ దమ్ముంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలి. ఎన్నికలకు మేము సిద్దంగా ఉన్నాం. ఇప్పటికే అమిత్ షా కూడా కేసీఆర్ అసెంబ్లీ ని రద్దు చేస్తే... సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.’ అని ఈటెల రాజేందర్ వెల్లడించారు. -
సీఎం కేసీఆర్ సవాల్‌ను స్వీకరించిన కాంగ్రెస్, బీజేపీ