
పట్నా: దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఏకమవుతుండడం అధికార బీజేపీకి కలవరం కలిగిస్తోందని చెప్పారు.
విపక్ష కూటమి పూర్తిగా బలం పుంజుకోకముందే ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో అధికార పక్షం ఉండొచ్చని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఐచ్ఛికం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని గుర్తుచేశారు.