సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కారు మనుగడకు కీలకంగా మారిన భాగస్వామ్య పక్షాలు బీజేపీ ముందు పలు డిమాండ్లు పెడుతున్నాయి. అందులో భాగంగా ఎన్డీఏ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని జేడీ(యూ) డిమాండ్ చేస్తోంది. దాని కనీ్వనర్‌గా పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఉండాలని కోరుతోంది. అంతేగాక ఎన్డీఏకు కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) ఉండాలని, దాని అమలు కమిటీ సారథ్యాన్ని కూడా నితీశ్‌కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
దీనికి అదనంగా నాలుగు కేబినెట్ బెర్తులు, బిహార్‌కు ప్రత్యేక హోదా తదితరాలను నితీశ్ ఇప్పటికే బీజేపీ పెద్దల ముందుంచారు. టీడీపీ కూడా నాలుగైదు కేబినెట్, ఒక సహాయ మంత్రి, లోక్‌సభ స్పీకర్ పదవి డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. టీడీపీ, జేడీ(యూ) డిమాండ్లకు బీజేపీ అంగీకరించడం లేదని తెలుస్తోంది. టీడీపీకి ఒకకేబినెట్, ఒకట్రెండు సహాయ పదవులను ఆఫర్ చేసినట్టు చేసినట్టు సమాచారం. జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల డిమాండ్లపై వాటితో చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment