Coordination Committee meeting
-
సమన్వయ కమిటీ! నితీశ్ సారథ్యంలో సీఎంపీ: జేడీయూ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కారు మనుగడకు కీలకంగా మారిన భాగస్వామ్య పక్షాలు బీజేపీ ముందు పలు డిమాండ్లు పెడుతున్నాయి. అందులో భాగంగా ఎన్డీఏ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని జేడీ(యూ) డిమాండ్ చేస్తోంది. దాని కనీ్వనర్‌గా పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఉండాలని కోరుతోంది. అంతేగాక ఎన్డీఏకు కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) ఉండాలని, దాని అమలు కమిటీ సారథ్యాన్ని కూడా నితీశ్‌కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి అదనంగా నాలుగు కేబినెట్ బెర్తులు, బిహార్‌కు ప్రత్యేక హోదా తదితరాలను నితీశ్ ఇప్పటికే బీజేపీ పెద్దల ముందుంచారు. టీడీపీ కూడా నాలుగైదు కేబినెట్, ఒక సహాయ మంత్రి, లోక్‌సభ స్పీకర్ పదవి డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. టీడీపీ, జేడీ(యూ) డిమాండ్లకు బీజేపీ అంగీకరించడం లేదని తెలుస్తోంది. టీడీపీకి ఒకకేబినెట్, ఒకట్రెండు సహాయ పదవులను ఆఫర్ చేసినట్టు చేసినట్టు సమాచారం. జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల డిమాండ్లపై వాటితో చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. -
‘పెండింగ్’పై 23న భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి ఏర్పాటైన కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ ఈ నెల 23వ తేదీన సమావేశమై సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ (సమన్వయ) కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ ఎం.చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపారు. ఈ–సమీక్ష పోర్టల్‌లో పొందుపరిచిన ఏపీకి చెందిన అంశాలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ లోటు, హోదా.. సమన్వయ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న 34 అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద అపరిష్కృతంగా ఉన్న 15 అంశాలను సమీక్ష అజెండాలో చేర్చారు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట్ర విభజన జరిగిన ఏడాది రెవెన్యూ లోటు భర్తీతో సహా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా అజెండాలో పొందుపరిచారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు సంబంధించి పెండింగ్ అంశాలను అజెండాలో చేర్చారు. అజెండాలో ముఖ్యాంశాలు ఇవీ... ► విభజన చట్టం 13వ షెడ్యూల్లో పేర్కొన్న మేరకు ఆరు నెలల్లోగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు. ► కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ముఖ్యమైన నగరాలకు ర్యాపిడ్ రైలుతోపాటు రోడ్డు కనెక్టివిటీ కల్పించడం. ► విభజన చట్టం 13వ షెడ్యూల్ ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. ► 2014–15 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు భర్తీకి నిధులు అందించడం. ► 2016లో ప్రధాని ప్రకటన మేరకు విశాఖలో జాతీయ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ ఏర్పాటు. ► కొత్త రాజధానిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందించడం. ► పోలవరంలో ఆర్ అండ్ ఆర్తో సహా ప్రాజెక్టుకయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించడం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు చర్యలు తీసుకోవడం. ► విశాఖలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఏర్పాటు చేయడం. ► విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం. ► వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అందించడం. ► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం. ► విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి పన్ను రాయితీలు ఇవ్వడం. హైదరాబాద్‌లో ఉన్న వివిధ శిక్షణ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పడం. ► కాకినాడ పోర్టు సమీపంలో ఎలక్ట్రానిక్ (హార్డ్‌వేర్) ఉపకరణాల తయారీ కేంద్రం ఏర్పాటు. 16న పీపీఏ సర్వసభ్య సమావేశం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 16న హైదరాబాద్‌లో జరగనుంది. సమావేశంలో ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులు, సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్..ఆ మేరకు నిధుల మంజూరుపై చర్చించనున్నారు. పీపీఏ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని 4 నెలల క్రితం పీపీఏ సీఈవోకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లేఖ రాశారు. పీపీఏ నుంచి స్పందన లేకపోవడంతో ఇటీవల అదే అంశాన్ని గుర్తు చేస్తూ మరో లేఖ రాశారు. దీనిపై స్పందించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ 16న సమావేశాన్ని నిర్వహిస్తామని ఏపీకి సమాచారమిచ్చారు. కాగా, ఏడాది క్రితం పీపీఏ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. -
పార్టీ నేతలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
సాక్షి, అమరావతి: టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కొందరు నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సి, డి గ్రేడ్లల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తెలుగుదేశం పైనా చర్చ సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతున్న తీరును జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు వివరించారు. ఇప్పటికీ నలభై నియోజకవర్గాలు సీ, డీ గ్రేడుల్లోనే ఉన్నాయని లోకేష్ తెలిపారు. మున్సిపల్ శాఖకు సంబంధించే అత్యధిక ఫిర్యాదులందాయని పేర్కొన్నారు. కమిటీ భేటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం ప్రస్తావనకు వచ్చింది. పని చేసే వారికే పదవుల భర్తీలో ప్రాధాన్యమని చంద్రబాబు స్పష్టం చేవారు. ఇంటింటికీ తెలుగుదేశంలో సి, డి గ్రేడ్లల్లో ఉన్న ఎమ్మెల్యేలకు, ఇన్‌చార్జ్‌లకు బాబు క్లాస్ తీసుకున్నారు. ‘మహానుభావుల పనితీరు ఇదేనా’ అంటూ వారిపై వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్టణం పార్లమెంట్ పరిధిలోని పామర్రు, గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలు సి-గ్రేడ్ లో ఉండటంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరినీ గాడిలో పెట్టాలని ఇంచార్జి మంత్రి యనమలకు బాబు సూచన చేశారు. అలాగే గండికోట ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యంపై చంద్రబాబు అసంతృప్తి చెందారు. కాంట్రాక్టర్లు ఎవరైనా సరే పనిలో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అవసరం అయితే పోలీసుల్ని పంపుతామని వ్యాఖ్యలు చేశారు. కాగా సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. -
వాడివేడిగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
♦ తమ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపణలు ♦ పార్టీలో గ్రూపులు ఉన్నాయని గగ్గోలు ♦ తమ్ముళ్ల మధ్య పరస్పర వాగ్వాదం కడప రూరల్ : జిల్లా ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆ«ధ్వర్యంలో ఆదివారం కడప ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి ఇన్చార్జిలు, ఆ ప్రాంతాలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఆ మేరకు పులివెందుల నుంచి సతీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, రాయచోటి నుంచి రమేష్‌రెడ్డి, బద్వేలు నుంచి ఎమ్మెల్యే జయరాములు, విజయజ్యోతి, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, ప్రొద్దుటూరు నుంచి వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, రైల్వేకోడూరు నుంచి విశ్వనాథనాయుడు, బత్యాల చెంగల్రాయులు, రాజంపేట నుంచి మాజీమంత్రి బ్రహ్మయ్య, జమ్మలమడుగు నుంచి మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. కొన్ని అంశాలపై తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. సమాచారం మేరకు ఒక నియోజకవర్గానికి చెందిన నేత మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరినైనా గెలిపించాలంటే పార్టీ మొత్తం సమష్టిగా కృషి చేయాలి.. అయితే మా నియోజకవర్గంలో గ్రూపులు ఎక్కువగా ఉండడం, ఆ గ్రూపులను ప్రోత్సహించడం ఎంతవరకు సబబని నిలదీశారు. ఆ నియోజకవర్గానికి చెందిన మరో నేత మధ్యలో కల్పించుకుని గ్రూపుల్లేవని, కలిసికట్టుగానే పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను ఏదైనా చేయడానికి తనకు ఏమంత ప్రాధాన్యత గల పదవి ఇచ్చారని తన మనసులో మాటను బయటపెట్టారు. అందుకు మంత్రి సోమిరెడ్డి కల్పించుకుని నువ్వు అలా మాట్లాడడం తగదు.. నీకు ఆ పదవి ఇవ్వడమే గొప్ప అని నిర్మోహమాటంగా బదులిచ్చారు. అలాగే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగల నియోజకవర్గానికి చెందిన నాయకుడు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఏనాడో వేసిన రింగ్‌రోడ్లు, అప్పుడు వేసిన రోడ్లు, ఏర్పాటు చేసిన లైట్లు తప్పితే ఇప్పుడు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. అలాగే తనను స్థానికంగా ఎవరూ గుర్తించడం లేదని, చివరికి ఎస్ఐ కూడా పలకడం లేదని వాపోయినట్లు తెలిసింది. అందుకు మంత్రి సోమిరెడ్డి కల్పించుకుని కాసింత నవ్వుతూనే చాల్లేవయ్యా.. అంత పదవి అనుభవించావు.. ఆఖరికి ఎస్ఐ కూడా మాట వినలేదంటే ఎవరైనా వింటే నవ్విపోతారు.. చెప్పేదానికైనా ఒక అర్థం పర్థం ఉండాలంటూ బదులిచ్చారు. ఇంకొక జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రముఖ నాయకుడు మాట్లాడుతూ పార్టీలో సీనియర్ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని, మొన్న వచ్చిన వారికే పట్టం కడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. అందుకు మధ్యలోనే కల్పించుకున్న ఓ ప్రముఖ నేత మాట్లాడుతూ ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు మనకు ఓట్లు–సీట్లే ప్రధానం.. అలాంటి నాయకులకు ప్రాధాన్యత ఇస్తానని ఏనాడో చెప్పారని గుర్తు చేశారు. దీంతో ఆ నాయకుడు కిమ్మనకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్బంగా ఒక జిల్లా అధికారి తీరుపై సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దక్షిణం వైపున గల నియోజకవర్గానికి చెందిన ఇటీవల టీడీపీలో చేరిన ఒక నాయకుడు కల్పించుకుని ఆ అధికారి ఉండాల్సిందేనని బదులిచ్చారు. అందుకు ఆ నియోజకవర్గ ఇన్చార్జి ఆగ్రహించినట్లు తెలిసింది. అందుకు ఆ నాయకుడు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా చాల్లేవయ్యా.. నీవెపుడు నియోజకవర్గంలో ఉంటున్నావని.. 24 గంటలు తిరుపతిలోనే ఉండి నీ పనులు చూసుకుంటున్నావని ఎద్దేవా చేశారు. అలాగే ఉత్తర ప్రాంత నియోజకవర్గానికి చెందిన ఒక నేత తాను ప్రజాప్రతినిధిగా ఉంటునప్పటికీ ఎవరూ గుర్తించడం లేదని, తన అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఏకరువు పెట్టారు. అలాగే పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు తమ ప్రాంత అభివృద్ధిపై తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మనం ఎన్నో వాగ్దానాలు చేశాం.. వాటిల్లో చాలా వాటిని నామమాత్రంగానైనా అమలు చేయలేదు.. దీనిపై ప్రజలు నిలదీస్తున్నారు.. తాము ఏమని సమాధానం చెప్పాలని వాపోయారు. అందుకు బదులుగా మంత్రి సోమిరెడ్డి కొన్నింటికి సమయస్ఫూర్తిగా సమాధానమిచ్చారు. మరికొన్నింటిపై దాట వేశారు. ఇంకొన్నింటికి కాలమే సమాధానం చెబుతుందన్నట్లుగా మౌనం పాటించారు. మొత్తం మీద టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం వాడివేడిగా కొనసాగినట్లుగా తెలిసింది. -
ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఉదయం విజయవాడలో ప్రారంభమైంది. ఆంధ్రరత్నభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు తిరువనక్కరసు, కొప్పుల రాజు, రఘువీరా, పల్లంరాజు, కేవీపీ, పనబాక లక్ష్మీ, జేడీ శీలం తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఆరు కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విభజన చట్టంలోని హామీల అమలు, టీడీపీ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. -
కలసికట్టుగా సమస్యలకు చెక్
సమన్వయ సమావేశంలో 14 విభాగాల ఉన్నతాధికారుల తీర్మానం ఇకపై నెలనెలా సమావేశాలు సర్కిల్, జోనల్ స్థాయిల్లోనూ అమలు సమన్వయం లేకే ప్రజలకు సమస్యలని ఒప్పుకోలు నగర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. ఇందుకు సమన్వయం ఎంతో ముఖ్యమని ప్రకటించారు. ఈమేరకు జీహెచ్ఎంసీలో శుక్రవారం గ్రేటర్ పరిధిలోని 14 విభాగాల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్‌లో ప్రజల మన్ననలు పొందేందుకు కృషి చేద్దామని తీర్మానించారు. సిటీబ్యూరో: వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం గ్రేటర్ ప్రజలకు శాపంగా మారుతోంది. ఏటా రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, ఆయా ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయం లేక సదరు ప్రాజెక్టులు పూర్తికావడం లేవు. సంక్షేమ పథకాలు కుంటుతుండటంతో ప్రజలకు పూర్తి ప్రయోజనం లభించడం లేదు. పనుల్లో జాప్యంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఇవే అంశాల్ని శుక్రవారం జీహెచ్ఎంసీలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు ప్రస్తావించారు. ఇకపై ఇలాంటి వాటికి తావులేకుండా అన్ని విభాగాల వారు సమన్వయంతో కలిసిమెలసి పనిచేద్దామని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రజల ఇబ్బందులు తొలగిద్దామని నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్స్థాయిలోనే కాకుండా జోనల్, సర్కిల్ స్థాయిలోనూ ఇలాంటి సమన్వయ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. నగరవాసుల ఇబ్బందులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రతినెలా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని 14 శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈసమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. పౌరసేవలు, అభివృద్ధిపనులకు సంబంధించి వివిధశాఖల మధ్యసమన్వయ సమావేశాలు నిర్వహించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, శాఖల మధ్యసమన్వయంతో వేల కోట్ల పనులు కుంటుతున్నాయన్నారు. ము ఖ్యంగా జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, మెట్రోరైలు, టెలికాం శాఖల మధ్య సమన్వయలోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇంకా సమావేశంలో ఎవరేమన్నారంటే.. వచ్చే నెల 5న మళ్లీ భేటీ ఈ సమావేశంలో వచ్చిన సలహాల అమలుకు, సమస్యల పరిష్కారానికి తగుచర్యలు తీసుకోవాలని జనార్దన్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులకు విజ్ఞప్తి చేశారు. వచ్చేనెల 5వ తేదీన మెట్రోరైలు కార్యాలయలో సమన్వయ సమావేశం నిర్వహించాలని లాటరీ ద్వారా నిర్ణయించారు. ఖాళీ స్థలాల్లో పౌర సదుపాయాలు నగరంలో వివిధ పౌరసదుపాయాలకు కేటాయించిన అనేక స్థలాల్లో వాటిని కల్పించకపోవడంతో ఖాళీగా ఉండి కబ్జాలపాలవుతున్నాయి. అలా జరగకుండా వెంటనే తగు నిర్మాణాలు ప్రారంభించాలి. క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలోని మూడు ఎకరాల భూమి వివాదంలో ఉన్నందున దానిని ఎస్సార్డీపీ, తదితర పనులకు కేటాయించడం సాధ్యం కాదు. - రాహుల్ బొజ్జా, హైదరాబాద్ కలెక్టర్ పైప్లైన్ల పరిరక్షణకు కమిటీలు.. గోదావరి, కృష్ణాఫేజ్-3 పనులు త్వరలో పూర్తికానున్నాయి. నగరానికి నీరందించేందుకు వేసిన 168 కి.మీ.ల ప్రధాన పైప్లైన్లను ఎవరూ ధ్వంసం చేయకుండా పైప్‌లైన్ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తాం. జలమండలి చేపట్టే పనుల వివరాలను ముందస్తుగానే ఆయా విభాగాలకు తెలియజేస్తాం. జీహెచ్ఎంసీ త్వరలో ప్రారంభించనున్న 2 వేల ఆటో టిప్పర్లు, 44 లక్షల డస్ట్బిన్ల పంపిణీ ఇతరత్రా కార్యక్రమాల అమలుకు అందరి సహకారం అవసరం. - బి.జనార్దన్‌రెడ్డి (జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎం.డి) ట్రాఫిక్‌కు అనుగుణంగా రహదారులు దశాబ్దాల నాటి బస్షెల్టర్లు, బస్‌బేలు ప్రస్తుత జనాభాకు సరిపోవడంలేవు. పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దాలి. ముఖ్యంగా బల్దియా, జలమండలి, టెలికాంల మధ్య సమన్వయం అవసరం. అవి చేపట్టే పనుల వివరాలను ముందస్తుగా తెలియజేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలి. - జితేందర్, అడిషనల్ సీపీ(ట్రాఫిక్) చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యంత్రాంగం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నీటిపారుదల శాఖలకు చెందిన వందలాది చెరువులు కబ్జాకావడానికి కారణం వాటిమధ్య సమన్వయం లేకపోవడమే. సకాలంలో స్పందించకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. వివిధశాఖల పరిధిలో ఉన్న చెరువులన్నింటినీ ఒకే శాఖ కిందకు తెస్తే మేలు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో చెత్తతో నిండిన ప్రదేశాన్ని వెంటనే క్యాపింగ్ చేయాలి. - రఘనందన్‌రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బస్షెల్టర్లు వెంటనే నిర్మించాలి జీహెచ్ఎంసీలో 116 బస్షెల్టర్లు, 14 బస్‌బేలు నిర్మించేం దుకు ప్రతిపాదనలు పంపాం. వీటిని వెంటనే నిర్మించాలి. నగర ప్రజలకు సదుపాయంగా ఉండేలా బస్షెల్టర్లను డిజైన్ చేయాలి. - పురుషోత్తం, టీఎస్సార్టీసీ ఈడీ చట్టాల్లోని లొసుగులతోనే ఉల్లంఘనలు నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, అక్రమపార్కింగ్లు, భూకబ్జాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇందుకు కారణం చట్టాల్లోని లొసుగులే. వీటిపై అన్నిశాఖల అధికారులు ఉమ్మడిగా స్పందిస్తే చాలావరకు అరికట్టవచ్చు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు తీసుకుంటే చట్టాలు అతిక్రమించేందుకు భయపడతారు. - మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అన్ని శాఖల సహకారం అవసరం మెట్రోస్టేషన్లలో ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పనకు వివిధ ప్రభుత్వశాఖల సహాయ సహకారాలు ఎంతో అవసరం. ముఖ్యంగా నాగోల్, ఉప్పల్ మెట్రోస్టేషన్లలో పీపీపీ లేదా బీపీఓ పద్ధతిలో ఆయా సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ స్టేషన్లలో మీసేవ తరహాలో పౌరసేవాకేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. - ఎన్వీఎస్రెడ్డి, మెట్రోరైలు ఎండీ -
దేశంలో సమన్వయలోపం
నేడే జిల్లా అధ్యక్షుని ఎన్నిక సమన్వయ కమిటీ సమావేశం లేకుండానే ఎన్నిక ఎవరికి వారుగా ప్రయత్నాలు శివాజీ కుటుంబానికే అవకాశమంటూ ప్రచారం శ్రీకాకుళం: జిల్లా తెలుగుదేశం పార్టీలో సమన్వయం కొరవడింది. సాధారణంగా జిల్లా అధ్యక్ష ఎన్నిక సమయంలో సమన్వయ కమిటీ సమావేశమై ఓ నిర్ణయానికొచ్చేది. ఈ దఫా అటువంటి సమావేశం ఏదీ లేకుండా నేరుగా ఎన్నికల సమావేశానికి వెళ్తున్నారు. అధ్యక్ష పదవి కోసం ఎవరూ రాజీ పడకుండా ఎవరికి వారుగా ప్రయత్నాలు సాగిస్తుండడమే దీనికి కారణమని తెలుగుదేశం వర్గాలే చర్చించుకుంటున్నాయి. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న పలాస శాసనసభ్యుడు గౌతు శ్యామసుందర శివాజీకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వవచ్చునని కేడర్‌లో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. అయితే శివాజీ మాత్రం అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా ఫర్వాలేదని పాత అధ్యక్షుడిని మార్చాలని పట్టుబడుతున్నట్టు వినికిడి. కేబినెట్లోగానీ, టీటీడీ పాలకమండలిలోగానీ అవకాశం ఇవ్వలేదు గాబట్టి జిల్లా అధ్యక్ష పదవి కచ్చితంగా ఆయనకే ఇస్తుందని, కనీసం ఆయనకు కాకున్నా ఆయన తనయ శిరీషకైనా అప్పగిస్తారని తెలుగుదేశంలోని అధిక శాతం మంది భావిస్తున్నారు. శిరీష భర్తకు అధిష్టానం వద్ద పలుకుబడి ఉందని దీనిని ఉపయోగించే ఎన్నికల సమయంలో చివరి క్షణం వరకు శివాజీ పేరు ఖరారు కాకుండా చేశారని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాపు సామాజిక వర్గానికి జిల్లాలో అన్యాయం జరిగిందని దానిని పూడ్చాలంటే తనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని పంచాయతీరాజ్ చాంబర్ ప్రధాన కార్యదర్శి కలిశెట్టి అప్పలనాయుడు కోరుతున్నారు. ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చిన లోకేష్‌ను కలసి పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని తెలుపుతూ తనకు ఓ అవకాశం ఇవ్వాలని కోరినట్టు భోగట్టా. తన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నాయకుల ద్వారా, జిల్లాలోని ప్రముఖ నేతల ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు చౌదరి బాబ్జి తనకు మరో అవకాశాన్ని ఇవ్వాలని నేరుగా అధినాయకుడినే కోరినట్టు తెలియవచ్చింది. కష్టకాలంలో తాను సమర్థంగా పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించానని మరోసారి అవకాశం ఇస్తే పార్టీని మరింత బలోపేతం చేస్తానని ఆయన చెబుతూ మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధిష్టానం మాత్రం ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ఇప్పటికే సీనియర్ నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలని ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చి జిల్లా ఇన్చార్జి మంత్రి, పార్టీ పరిశీలకుల ద్వారా ఆ పేరును ప్రకటింప జేసేందుకు నిర్ణయించింది. ఆదివారం జరిగే అధ్యక్ష ఎన్నికకు జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీతతో పాటు జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ పరిశీలకులుగా బొండా ఉమామహేశ్వరరావు, తోట నర్శింహం, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌తో పాటు జిల్లా శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశం వాడీవేడీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. -
కాంగ్రెస్ నేతలపై దిగ్విజయ్ అసహనం
-
టీఆర్ఎస్పై ఔదార్యమెందుకు..?
⇒ కాంగ్రెస్ నేతలపై దిగ్విజయ్ అసహనం ⇒ సమన్వయ కమిటీ భేటీలో హితబోధ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ అంత ఉదారంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ నేతలపై అసహనం ప్రదర్శించారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ సమన్వయ సంఘం భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ పనితీరును దిగ్విజయ్ సమీక్షించారు. తర్వాత పార్టీ ముఖ్యులతోనూ బృందాలవారీగా సమావేశమయ్యారు. ఏఐసీసీ నేత కొప్పుల రాజు, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మండలి నేత డి.శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీని పటిష్టపరిచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై నేతల అభిప్రాయాలను దిగ్విజయ్ తెలుసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్, శాసనసభాపక్షం వ్యవహరిస్తున్న తీరుపై సమన్వయ భేటీలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సొంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే పార్టీ ఏం చేస్తున్నది? ఫిరాయింపులపై ఎన్నో ఆంక్షలున్నా, మన పార్టీ నుంచి గెలిచిన చట్టసభ్యులు టీఆర్ఎస్ కండువాలు కప్పుకుని అసెంబ్లీలో తిరుగుతుంటే చట్టపరంగా, ప్రజల్లోను ఎందుకు మీరు నిరసనలు తెలపడం లేదు? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు పార్టీపరంగా ఎందుకు నిరసనలు చేయలేదు? కోర్టుల్లో ఎందుకు పోరాడటం లేదు?‘’ అంటూ ఆగ్రహించారు. పలు స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతుంటే నాయకత్వం ఏం చేస్తున్నదని, వలసలను ఎందుకు నిరోధించడం లేదని నిలదీశారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మారిస్తే కూడా కాంగ్రెస్ నేతలు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదుంటూ నిలదీశారు. ‘‘టీఆర్ఎస్కు ఇచ్చిన సమయం చాలు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు పెంచుకుని, బహుముఖ పోరాటాలకు సిద్దం కండి’’ అంటూ దిశానిర్దేశం చేశారు. పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్లో చేరుతున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితరులపైనా న్యాయపోరాటం చేయాలని పీసీసీ న్యాయవిభాగం అధ్యక్షుడు దామోదర్ రెడ్డికి సూచించారు. వారి ఫిరాయింపులపై ముందుగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని, స్పందన లేకుంటే కలెక్టర్లపై కూడా కోర్టుల్లో పోరాటం చేయాలని ఆదేశించారు. ఈ అనైతిక చర్యలపై ప్రజల్లోనూ బాగా ప్రచారం చేయాలన్నారు. ఎమ్మెల్సీల ఫిరాయింపులపై తమ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు తీసుకుందనీ, ఎమ్మెల్యేల ఫిరాయింపులపైనా పిటిషన్ వేశామని నేతలు దిగ్విజయ్‌కు వివరించారు. పార్టీకో మీడియా ఉండాల్సిందే... తెలంగాణలో పార్టీలవారీగా మీడియా సంస్థలున్నా కాంగ్రెస్‌కు అలాంటిదేమీ లేదని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీకి కనీసం సాయంకాల పత్రికనైనా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయడానికి కాళోజీ పేరిట సెంటర్ ఫర్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ను ఏర్పాటు చేయాలని నేతలు ప్రతిపాదించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, జీవోలు, పాలనాపరమైన లోపాలపై ఏ రోజుకారోజు అధ్యయనం చేయడానికి ప్రత్యేక అధ్యయన కేంద్రాన్ని పీసీసీకి అనుబంధంగా తేవాలని పార్టీ ముఖ్య అధికారప్రతినిధి శ్రవణ్ ప్రతిపాదించారు. దీనికి నేతలంతా సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ విధానాల అధ్యయనానికి షాడో కేబినెట్‌ను ఏర్పాటుచేయాలని కొందరు నేతలు సూచించారు. సామాజిక మీడియాపై నజర్.... ఫేస్బుక్, ట్వీటర్ వంటి సామాజిక సైట్లలోనూ రాష్ట్ర పార్టీ చురుగ్గా ఉండాలని నేతలకు దిగ్విజయ్ సూచించారు. ఇందుకోసం కాంగ్రెస్‌కు సానుభూతిపరులైన ఐటీ నిపుణులతో బుధవారం భేటీ కావాలని ఆదేశించారు. ఉద్యమాల్లో పనిచేస్తున్న సంఘాలు, మేధావులు, నిపుణులతోనూ ఈ నెల 23న ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ.. ఫిరాయింపుల వల్ల డీసీసీలతోపాటు మండల స్థాయిలో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని దిగ్విజయ్ ఆదేశించారు. అన్ని స్థాయిల్లో పార్టీని బలోపేతం చేసేలా పునర్వ్యవస్థీకరణ జరగాలన్నారు. జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల నేతలతో సమావేశమై డివిజన్లవారీగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని జీహెచ్ఎంసీ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్‌కు సూచించారు. కేసీఆర్‌ది కుటుంబ పాలన: దిగ్విజయ్ తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన నడుస్తున్నదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. మంగళవారం సమన్వయ భేటీ అనంతరం పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చట్టాన్ని గౌరవించి కాపాడాల్సిన ముఖ్యమంత్రే స్వయంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. సీఎం స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏమిటి? ప్రజా సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్లోకి చేర్చుకుంటున్నారు. సీఎం చట్టాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారు.’’ అంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌పై, ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన నేతలు తప్పు చేస్తున్నట్టేనని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను కేసీఆర్ మోసగిస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ చేయకపోవడం వల్ల విద్యార్థులు, ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు లేకపోవడం వల్ల యువకులు కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. వీటిపై పోరాటానికి పార్టీ ముఖ్యనేతల నుంచి సలహాలను, అభిప్రాయాలను తీసుకుంటున్నామన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రధాని మెదీ కూడా పాలనలో విఫలమయ్యారని దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక ఆర్డినెన్సులు తేవడం తప్ప వారికి ఉపయోగపడే చర్యలేవీ తీసుకోవడం లేదన్నారు. కేంద్రం ఆర్డినెన్సులకు కేసీఆర్ ఎలా మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీకి సరైన అభ్యర్థులు లేకే కిరణ్‌బేడీ.. ఢిల్లీలో బీజేపీకి సరైన అభ్యర్థులు లేరని, అందుకే కిరణ్‌బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించిందని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. కిరణ్‌బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించినంత మాత్రాన బీజేపీకి ఒనగూరే ప్రయోజనమేమీ లేదన్నారు. -
ప్చ్.. బాగోలేదు
మంత్రుల పని తీరుపై దిగ్విజయ్ పెదవి విరుపు - సోమరితనం వీడండి.. లేకుంటే ఇంటికే - ఆంజనేయ, మహదేవప్ప వైఖరి మార్చుకోండి - అధికారుల బదిలీల్లో ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఇవ్వండి - మంత్రులు రాష్ర్టమంతటా పర్యటించాలి - సీనియర్ల సలహా మేరకే కీలక నిర్ణయాలు - కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం - రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో కొందరు మంత్రుల పని తీరుపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తీవ్ర అసృతప్తి వ్యక్తం చేశారు. సోమరితనంతో వ్యవహరిస్తున్న మంత్రుల్లో చురుకు పుట్టించాలని, దారికి రాని మంత్రులకు ఇంటి దారి చూపాలని ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు. కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయనతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మంత్రులు డీకే. శివ కుమార్, కేజే. జార్జ్, ఏఐసీసీ కార్యదర్శి చెల్ల కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రుల పని తీరును సమీక్షించారు. విధాన సౌధలో తన గదిలో గోడను కొట్టి వేయించిన మంత్రి హెచ్. ఆంజనేయ, తన బంగళా అలంకారానికి సుమారు రూ.2 కోట్లు వరకు ఖర్చు చేసిన మంత్రి హెచ్‌సీ. మహదేవప్పల వైఖరిని దిగ్విజయ్ తప్పుబట్టారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు దొర్లకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. అలాగే అధికారుల బదిలీల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని సూచించారు. మంత్రులు తమ జిల్లాలకే పరిమితం కాకుండా రాష్ట్రమంతటా పర్యటించాలన్నారు. ప్రభుత్వం ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ముందు సీనియర్లను సంప్రదించాలని సలహా ఇచ్చారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వదిలి వేయాలని సూచించారు. కాగా కరువును సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని అనేక మంది నాయకులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇన్‌ఛార్జి మంత్రులు తమ జిల్లాల్లో మకాం వేసి కరువు సహాయక పనులు చక్కగా అమలయ్యేలా చూడాలని, ప్రజా సమస్యలపై స్పందించాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకాలను చేపట్టాలని సలహా ఇచ్చారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలుపు సాధించవచ్చనే విషయమై ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. అలాగే సిద్ధరామయ్య ఏడాది పాలనపై సింహావలోకనం చేపట్టారు. తదుపరి సమావేశంలో దీనిపై మరింతగా చర్చించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తినకుండా కార్యక్రమాలను చేపట్టాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఉత్తమ పాలన రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలన భేషుగ్గా ఉందని దిగ్విజయ్ సింగ్ కొనియాడారు. సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. సిద్ధరామయ్య సర్కారు డిస్టింక్షన్ సాధించిందని కితాబునిచ్చారు. మంత్రి వర్గ విస్తరణ, శాఖల మార్పు, శాసన మండలికి అభ్యర్థుల ఎంపిక లాంటి విషయాలు ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించినవని పేర్కొన్నారు.