విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఉదయం విజయవాడలో ప్రారంభమైంది. ఆంధ్రరత్నభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు తిరువనక్కరసు, కొప్పుల రాజు, రఘువీరా, పల్లంరాజు, కేవీపీ, పనబాక లక్ష్మీ, జేడీ శీలం తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఆరు కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విభజన చట్టంలోని హామీల అమలు, టీడీపీ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.