Andhra Pradesh Congress Party
-
ఆ కమిటీల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ఆఫీస్ బేరర్స్, డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శుల పేర్లను ఖరారు చేసింది. 29 మందితో కోఆర్డినేషన్ కమిటీ, 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది. 18 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజకీయ వ్యవహారాలు, సమన్వయ కమిటీల్లో స్థానం కల్పించారు. రాజకీయ వ్యవహారాల కమిటీకి చైర్మన్‌గా పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వ్యవహరిస్తారు. సమన్వయ కమిటీకి ఊమెన్ చాందీ చైర్మన్‌గా ఉంటారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ చైర్మన్లు ఎక్స్అఫిషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డికి కూడా ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కింది. మొత్తంగా చూస్తే మహిళలకు తగిన ప్రాధాన్యం లభించలేదు. (చదవండి: వచ్చే నెలలో రాయపాటి ఆస్తుల వేలం) డిసీసీ అధ్యక్షులు వీరే 1. శ్రీకాకుళం: బొడ్డెపల్లి సత్యవతి 2. విజయనగరం: సారగడ్డ రమేశ్‌కుమార్ 3. అనకాపల్లి: శ్రీరామమూర్తి 4. కాకినాడ(రూరల్): డాక్టర్ పాండురంగారావు 5. అమలాపురం: కొట్టూరి శ్రీనివాస్ 6. రాజమండ్రి(రూరల్): ఎన్వీ శ్రీనివాస్ 7. నరసాపురం: మారినేడి శేఖర్ (బాబ్జి) 8. ఏలూరు (రూరల్): జెట్టి గురునాథం 9. మచిలీపట్నం: లామ్ తానియా కుమారి 10. విజయవాడ(రూరల్): కిరణ్ బొర్రా 11. నర్సరావుపేట: జి. అలెగ్జాండర్ సుధాకర్ 12. ఒంగోలు (రూరల్): ఈదా సుధాకరరెడ్డి 13. నంద్యాల: లక్ష్మీనరసింహరెడ్డి 14. కర్నూలు(రూరల్): అహ్మద్ అలీఖాన్ 15. అనంతపురం(రూరల్): ఎస్. ప్రతాపరెడ్డి 16. హిందూపురం: కె. సుధాకర్ (మాజీ ఎమ్మెల్యే) 17. నెల్లూరు (రూరల్): దేవకుమార్‌రెడ్డి 18. చిత్తూరు: డాక్టర్ సురేశ్‌బాబు -
9 నుంచి ఏపీలో ఉమెన్ చాందీ పర్యటన
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం కోసం కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులతో భేటి అయ్యారు. ఆదివారం ఇందిరా భవన్లో ఊమెన్ చాందీ సమావేశం నిర్వహించారు. తనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో జరిగే పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలలో పర్యటనలు చేస్తామని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా పర్యటన జరుగుతుందని అన్నారు. ఈ పర్యటనలో గ్రామస్థాయి నాయకుల నుంచి అసెంబ్లీ స్థాయి నేతల వరకు అందరితో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీలోని కార్యకర్తల మధ్య ఎటువంటి అంతరం లేకుండా సమన్వయంతో పనిచేసేలా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు క్రిస్టోఫర్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కేవీపీ రామచంద్రారావు, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పళ్ళంరాజు, జేడీ శీలం, రుద్రరాజు పద్మరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు. -
‘అక్కడ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ’
సాక్షి, విజయవాడ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఊమెన్ చాందీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్వతంత్రంగా బలపడి అధికారాన్ని చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజారంజక పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఉద్ఘాటించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యాననీ.. పార్టీ బలోపేతానికి మూడు నెలల్లో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని అన్నారు. దేశాన్ని వెలిగిపోయేలా చేస్తామని గద్దెనెక్కిన నరేంద్ర మోదీ నాలుగేళ్లుగా వెలగబెట్టిందేం లేదని విమర్శించారు. డీజిల్, పెట్రోల్ ధరలను ఇష్టారీతిన పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేంద్రం ప్రభుత్వంపై మండిపడ్డారు. పెరిగిన ఇంధన ధరలతో ఇప్పటికే సామాన్యుడి జేబుకు చిల్లులు కాదు.. బొక్కలు పడుతున్నాయనీ, దానికితోడు పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలు ఎత్తివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు తన నాలుగేళ్ల అసమర్థ పాలన నుంచి జనం దృష్టిని మరల్చేందుకే ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నారని ఆరోపించారు. -
బాబు ప్రభుత్వంపై చార్జీషీట్ విడుదల చేస్తాం..
సాక్షి, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై చార్జీషీట్ విడుదల చేస్తామని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల(జూన్) 12న సీనియర్ నేతలతో ఉమెన్ చాందీ సమావేశమవుతారని తెలిపారు. అంతేకాక జూన్ 13న జనరల్ బాడీ సమావేశం, జూన్ 8 నుంచి 15 వరకు వంచన వారం నిర్వహిస్తామని రఘువీరా పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉమెన్ చాందీని నియమించిన విషయం తెలిసిందే. ఇదోక చాలెంజింగ్ జాబ్ అని అన్నారు.. ఏపీ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్‌తోనే ఉన్నారని ఏసీసీసీ చీఫ్ చెప్పారు. పీవీ నరసింహారావు దేశానికి నాయకత్వం వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తలు కలిసి కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని రఘువీరా కోరారు. అంతేకాక దేశానికి లౌకిక ప్రజాస్వామ్య కూటమి అవసరమని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సూచించారు. -
ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఉదయం విజయవాడలో ప్రారంభమైంది. ఆంధ్రరత్నభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు తిరువనక్కరసు, కొప్పుల రాజు, రఘువీరా, పల్లంరాజు, కేవీపీ, పనబాక లక్ష్మీ, జేడీ శీలం తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఆరు కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విభజన చట్టంలోని హామీల అమలు, టీడీపీ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. -
ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతల అరెస్ట్
న్యూఢిల్లీ: తమ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నాన్చుడు వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు బుధవారం ఏపీ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు బయలు దేరిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రత్యేకహోదాపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు వేచిచూశారు. అపాయింట్ మెంట్ రాకపోవడంతో ఏపీ భవన్ వద్ద నిరసనకు దిగారు. తర్వాత ప్రధాని మోదీని కలిసేందుకు బయలుదేరగా వీరిని పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. కాగా, ప్రత్యేకహోదాకు మద్దతు ఇవ్వాలని పలు జాతీయ పార్టీల నాయకులను కాంగ్రెస్ నేతలు కలిశారు. ఏపీ ప్రత్యేకహోదాకు బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మద్దతు ప్రకటించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేలా చొరవ చూపాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవారం కాంగ్రెస్ నేతలు వినతిపత్రం సమర్పించారు. -
ఛలో ఢిల్లీ కార్యక్రమంలో అపశ్రుతి..
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వెంకయ్య గుండెపోటుతో మృతిచెందారు. లోక్‌నాయక్ ఆస్పత్రిలో ఆయన మృతదేహానికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నివాళులర్పించారు. ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో 300మంది కాంగ్రెస్ నేతలు విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర ముఖ్య నేతలను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ప్రత్యేక హోదా అమలు డిమాండ్‌తో చేపట్టిన కోటి సంతకాలను రఘువీరా నేతృత్వంలో ప్రధాని మోదీకి సమర్పించనున్నారు. -
అతడిని ఇరికించారు: దిగ్విజయ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు ఒత్తిడి తేలేకపోతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. దోపిడీ విధానాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ గా మారారని ధ్వజమెత్తారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హామీల అమలులో టీడీపీ, బీజేపీ విఫలమయ్యాయని విమర్శించారు. యూనివర్సిటీలను ఆర్ఎస్ఎస్ భావజాలంతో నింపాలనుకుంటున్నారని ఆరోపించారు. జేఎన్ యూ వివాదంలో అసలు దోషులను వదిలేసి కన్హయ్య కుమార్ ను ఇరికించారని అన్నారు. -
క్షమాపణలు చెప్పిన దిగ్విజయ్
విజయవాడ : అనంతపురం జిల్లాలో రాహుల్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి దిగ్విజయ్ సింగ్ క్షమాపణలు చెప్పారు. శుక్రవారం విజయవాడలో అధునీకరించిన నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్‌తో కోట్ల భేటీ అయ్యారు. ఈ నెల మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా అనంతలో జరిగిన అవమానాన్ని కోట్ల ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్‌కి వివరించారు. దీంతో దిగ్విజయ్ సింగ్... కోట్లకు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, పార్టీ వ్యవహారాలపై నేతలు చర్చించారు. ఈ భేటీలో ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యులు జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, మాజీ కేంద్రమంత్రులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పనబాకలక్ష్మీతోపాటు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆ రాష్ట్ర వ్యవహారాలన్నీ హైదరాబాద్‌లోని ఇందిరా భవన్ నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాలకు పార్టీ నాయకులు వెళ్లి రావడం కొంత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో విజయవాడలోనే పీసీసీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే మంచిది అన్న భావన కలగడంతో సదరు నేతలు ఆ అంశంపై దృష్టి కేంద్రీకరించారు. అందులోభాగంగా ఇప్పటి వరకు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉన్న ఆంధ్రరత్న భవన్‌ను ఇకపై ఏపీపీసీసీ కార్యాలయంగా రూపుదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో ఆంధ్రరత్న భవన్లో పలు పనులకు శ్రీకారం చుట్టి అధునీకరించారు. ఆ కార్యాలయాన్ని దిగ్విజయ్ సింగ్ నేడు ప్రారంభించారు. -
'కాపులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు'
కాకినాడ : కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు సి.రామచంద్రయ్య, వట్టి వసంత్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తునిలో జరుగుతున్న కాపు ఐక్య గర్జన సదస్సుకు సి. రామచంద్రయ్య, వట్టి వసంత్‌కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాపులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. గతంలో ఏర్పాటు చేసిన పుట్టుస్వామి కమిషన్ ఉండగా మరో కమిషన్ ఎందుకు అని చంద్రబాబును ప్రశ్నించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయవచ్చని వారు అభిప్రాయపడ్డారు. కాపులను బీసీల్లో చేర్చేంతవరకు పార్టీలకతీతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని సి. రామచంద్రయ్య, వట్టి వసంత్‌కుమార్ చెప్పారు. -
'ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఫిర్యాదు చేశారు. కరవు, వరదలు వంటి అంశాలపై ఏపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించదంటూ గురువారం బొల్లారంలో రాష్ట్రపతిని ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, కాంగ్రెస్ నేత, సినీహీరో చిరంజీవి ఇతర నేతలు కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అమలయ్యేలా కేంద్రాన్ని ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాజధాని భూములను ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి పర్యావరణ అనుమతులు.. జీవో 97ను రద్దు చేయాలని ప్రణబ్‌ను కోరినట్టు చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుతో పాటు 99 ఏళ్లు రాజధాని భూముల లీజును కూడా తిరస్కరించేలా గవర్నర్ నరసింహన్‌కు సూచించాలని ప్రణబ్‌ను కోరినట్టు ఏపీ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. -
మట్టిసత్యగ్రహం ప్రారంభించిన ఏపీ కాంగ్రెస్
-
'రాళ్ల సీమ...ఉత్తి ఆంధ్రా వద్దు'
-
రాజధాని శంకుస్థాపనకు కాంగ్రెస్ దూరం
-
రాజధాని శంకుస్థాపనకు దూరం: ఏపీ కాంగ్రెస్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు తమ పార్టీ దూరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ శైలజానాథ్, కొండ్రు మురళి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వారు మాట్లాడుతూ... రాజధాని కోసం 35 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారని టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మరో 50 వేల ఎకరాల అటవీ భూముల డీనోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కోరిందన్నారు. బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే వేల ఎకరాల భూ సేకరణ చేపట్టారని ఆరోపించారు. రాజధాని కోసం ఏర్పాటు చేసిన ప్రొ.శివరామకృష్ణ కమిటీని కూడా పట్టించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై శైలజానాథ్, కొండ్రు మురళి మండిపడ్డారు. -
ఆ ముగ్గురూ శిక్షార్హులే: రఘవీరా
-
ఆ ముగ్గురూ శిక్షార్హులే: రఘవీరా
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను ఏపీ కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌లో కలిశారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా అంశంపై గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించిన వారిలో కేవీపీ, జేడీ శీలం, కొండ్రు మురళి సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ వినతి పత్రంలో ముఖ్యాంశాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్య, సిఎం చంద్రబాబులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదాను ఇస్తామని ..ఇప్పుడు ఆ హామీని విస్మరించారు ప్రత్యేక హోదా కోసం ఐదుగురు మరణించారు. పలువురు ఆత్మహత్యలకు పాల్పడినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక లేదు ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే ఈ ముగ్గురు నేతలపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 813 పోలీసుస్టేషన్లలో కేసుల పెట్టాం, దీనిపై ఎస్పీ, కమిషనర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు ఐపీసీ 302 కింద ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబులు శిక్షార్హులు. వారికి చట్టం ప్రకారం 7 నుంచి 10 శిక్ష పడుతుంది ఐపీసీ 307, రాజద్రోహం 118, చీటింగ్ 420 తో వివిధ చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి వీటిపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్‌ను కాంగ్రెస్ నేతలు కోరారు. -
గవర్నర్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో ఏపీ కాంగ్రెస్ నేతలు శనివారం ఉదయం 11 గంటలకు భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే ఆలోచనలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబులపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టిన విషయం విదితమే. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇవ్వనున్నారు. -
24న రాహుల్ పాదయాత్ర ఉంటుంది
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనపై అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలుసని, అయితే, అన్ని పార్టీల అంగీకారంతోనే విభజన చేశామని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జీ తిరునావుక్కరసు అన్నారు. విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో 24న తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటారని ఆయన చెప్పారు. రైతు రుణమాఫీ హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. -
'ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు రాష్ట్రపతికి ఇచ్చాం'
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేసినట్లు ఏపీ మంత్రులు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల విషయంలో జోక్యం చేసుకొని ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయాలని కూడా తాము విజ్ఞప్తి చేసినట్లు తెలియజేశారు. మంగళవారం ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి కలిసి రాష్ట్రపతితో అయిన భేటీ ముగిసిన అనంతరం వాటి వివరాలు తెలిపారు. సెక్షన్ 8 అమలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్రపతితో చర్చించామని వారు తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 8ని తప్పనిసరిగా అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. 120 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లుందని, ఎంపీ గరికపాటి, సెబాస్టియన్ ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను రాష్ట్రపతికి ఇచ్చామని వారు తెలిపారు. సెక్షన్ 8పి అమలు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం అంటోందన్న విషయం కూడా రాష్ట్రపతికి చెప్పామన్నారు. ఉద్యోగ సంఘాలవారిని సీఎం కేసీఆర్ రెచ్చగొడుతున్నారని, ఇంకా ఆయన ఉద్యమ భాషను వదిలిపెట్టడంలేదని ఫిర్యాదు చేశారు. రాజధాని రెండు ప్రభుత్వాలకు ఉన్నప్పుడు ఒక ప్రభుత్వంపై మరొక ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో సెక్షన్ 8 అమలుపై తాము కీలక నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. రాష్ట్రపతితో ముగిసిన ఏపీ కాంగ్రెస్ నేతల భేటీ రాష్ట్రపతితో మంగళవారం ఏపీ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా భేటీ వివరాలు ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలుపుతూ ఓటుకు కోట్లు విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్లు రఘువీరా తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో ఏపీకి అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా కల్పించాలని ఆయనను కోరినట్లు చెప్పారు. రాజధాని నిర్మాణంలో సారవంతమైన భూములు వినియోగించకూడదని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నేతల్లో సుబ్బిరామిరెడ్డి, సి రామచంద్రయ్య కూడా ఉన్నారు. -
A1 రేవంత్ కాదు...చంద్రబాబే..
-
రేవంత్ కాదు...చంద్రబాబే A1
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏడాది పాలనలో అవినీతిపై ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాలనలో వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. బ్రీఫ్ కేసు, సూట్‌కేసు పాలన సాగిందని, బిగ్ బాస్‌కు, స్మాల్ బాబు లోకేశ్‌లకే ఈ వేల కోట్లు ముట్టాయని ఆయన ధ్వజమెత్తారు. సిమెంట్ ధరలు పెరగడం, ఇసుక మాఫియా, కరెంట్ కొనుగోలు, మద్యం ధరలు, బైరటీస్ వంటి అంశాల్లో చంద్రబాబుకు నేరుగా వేలకోట్లు ముడుపులు ముట్టాయని రఘువీరా విమర్శలు గుప్పించారు. ఏపీ డబ్బును తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని అన్నారు. నోటుకు ఓటు కేసులో దోషి ఎవరో వెంటనే తేలాలని,ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. A1 రేవంత్ కాదని, చంద్రబాబు నాయుడేనని రఘువీరా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏడాది పాలనపై 12 అంశాల్లో విచారణ జరిపించాలని రఘువీరా అన్నారు. కావాలంటే కాంగ్రెస్ పదేళ్ల పాలనపై సీబీఐ విచారణ జరుపుకోవచ్చని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 200 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని, ఎమ్మెల్యే కొనుగోలులో బాబు అడ్డంగా దొరికారని ఆయన అన్నారు. ప్రమేయం లేదని చెప్పకపోవడమే చంద్రబాబు తప్పు చేశారని అర్థం అవుతుందన్నారు. తనను రక్షించాలని చంద్రబాబు...ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నారని వ్యాఖ్యానించారు. వాస్తవాలు వెలుగు చూడాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులిరువురూ ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు కేంద్రాన్ని కోరుతూ లేఖరాయాలన్నారు. అలా కాకుంటే ఇద్దరు సీఎంలు దోషులవుతారన్నారు. -
29న మహిళా కాంగ్రెస్ రాష్ట్ర సదస్సు
విజయవాడ: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సదస్సును ఈ నెల 29న విజయవాడలో నిర్వహించనున్నట్లు కొత్తగా ఎన్నికైన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ భక్త తెలిపారు. ఆంధ్రరత్నభవన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. 29న ఉదయం 10 గంటలకు ఐవీ ప్యాలెస్‌లో జరిగే సదస్సుకు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి హాజరుకానున్నట్లు చెప్పారు. అదే రోజు తాను మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఏడాది పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. రుణమాఫీ పేరు చెప్పి ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మహిళల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. -
నేనేం చేస్తున్నది ప్రజలకు తెలుసు
తనను కలసిన ఏపీ కాంగ్రెస్ నేతలతో నరసింహన్ ఎంట్రీ ట్యాక్స్ ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు కాంగ్రెస్ నేతల వినతి సాక్షి, హైదరాబాద్: ‘‘నా గురించి బయట ఏవేవో మాట్లాడుతున్నారు.. నేనేం చేస్తున్నది ప్రజలకు బాగా తెలుసు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య ఏదైనా కావచ్చు. నా దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి నాకున్న అధికార పరిధిలో చేయాల్సింది చేస్తున్నాను.. ఏమి చేసిందీ నేను ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తెలుస్తుంది’’ అంటూ తనను కలసిన కాంగ్రెస్ నేతలతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఒకింత అసహనంతో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై రుసుం వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకొని దానిని ఉపసంహరించుకునేలా చూడాలంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం గవర్నర్ ను కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమయంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గవర్నర్‌తో మాట్లాడుతూ.. రుసుం వసూలుపై కోర్టు జోక్యం కంటే కూడా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించి ఉంటే బాగుండేదని అన్నారు. దీనిపై గవర్నర్ తీవ్రంగా స్పందిస్తూ పైవిధంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. హైకోర్టుతో పాటు ఆర్బీఐ, నాబార్డు సహా పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే ఉన్నందున వాహనాలపై ప్రవేశ రుసుం విధించడం సరైన చర్య కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చట్టం ప్రకారం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని గవర్నర్‌ను కోరారు. అదేవిధంగా ఏపీలో తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా లక్షలాది మంది పేద కూలీలు వలసలు పోతున్నారని.. దానిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 5 వేల గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని కాంగ్రెస్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాలకు సరఫరా చేసే నీటి ట్యాంకర్లలో కూడా జన్మభూమి కమిటీల జోక్యం కారణంగా టీడీపీకి మద్దతివ్వని గ్రామాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. గవర్నర్‌ను కలసిన వారిలో కె.చిరంజీవి, పల్లంరాజు, మల్లాది విష్ణు, గిడుగు రుద్రరాజు, టీజేఆర్ సుధాకర్‌బాబు తదితరులు ఉన్నారు. -
నేడు సాయంత్రం ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీవ్రతరం చేయాలని శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఈ ఎజెండాతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముగింపు పై కసరత్తు చేయాలని ఏపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస సమన్వయ కమిటీ భేటీకి సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది. -
కాంగ్రెస్‌లో భారీ నియామకాలు
జాబితాను విడుదల చేసిన ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఏపీ కాంగ్రెస్‌కు ఆ పార్టీ అధిష్టానం కొత్త నియామకాలు చేపట్టింది. ప్రధాన కార్యదర్శులుగా 26 మందికి, 12 జిల్లాలకు అధ్యక్షులనూ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా మరో 12 మంది నియమితులయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదించిన జాబితాను ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శనివారం విడుదల చేశారు. ప్రధాన కార్యదర్శులు వీరే.. కిల్లి రామ్మోహన్ రావు, యడ్ల రమణ మూర్తి, ద్రోణంరాజు శ్రీనివాసరావు, గిడుగు రుద్రరాజు, జంగా గౌతం, పంతం నానాజి(వేంకటేశ్వరరావు), ఎస్.ఎన్.రాజ, మార్టిన్ లూథర్, ఎన్.రాజీవ్ రతన్, ఎన్.నరసింహారావు, ఆకుల శ్రీనివాసకుమార్, లింగంశెట్టి ఈశ్వరరావు, టి.జె.ఆర్.సుధాకర్‌బాబు, కె.రమాదేవి, వై.వేంకటేశ్వరరెడ్డి, షేక్ అబ్దుల్ వహీద్, సూరిబాబు, కాసు మహేశ్వరరెడ్డి, మోపిదేవి శ్రీనివాసరావు, నేదురమల్లి రామ్ కుమార్‌రెడ్డి, పనబాక క్రిష్ణయ్య, నందిమండలం భాను శ్రీ, ఎ.సుజాతమ్మ, షహజాన్ బాష, వి.ఎస్.ఎస్.ఇందిర, ప్రభాకర్‌లను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.టి.సుబ్బిరామిరెడ్డిని కోశాధికారిగా నియమించారు. 12 జిల్లాలకు కొత్త డీసీసీలు కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులుగా డి.జగన్మోహన్రావు(శ్రీకాకుళం), పి.విజయకుమార్(విజయనగరం), పసుపులేటి బాలరాజు(విశాఖపట్నం), కందుల దుర్గేష్(తూర్పు గోదావరి), రఫీహుల్లా బేగ్(పశ్చిమ గోదావరి), కడియాల బుచ్చిబాబు(కృష్ణా), ఎం.మల్లికార్జునరావు(గుంటూరు), ఎం.ఉగ్రనరసింహారెడ్డి(ప్రకాశం), బి.వై.రామయ్య(కర్నూలు), నజీర్ అహ్మద్(కడప), కోటా సత్యనారాయణ(అనంతపురం), కె.వేణుగోపాల్‌రెడ్డి(చిత్తూరు)లను నియమించారు.నెల్లూరుకు ప్రస్తుత ఇన్చార్జి ధనుంజయరెడ్డిని కొనసాగించనున్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు.: సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా బెహరా భాస్కరరావు(విశాఖపట్నం), కంపర రమేష్(కాకినాడ), ఎన్.వి.శ్రీనివాస్(రాజమండ్రి), రాజనాల రామ్మోహనరావు(ఏలూరు), మల్లాది విష్ణువర్ధన్(విజయవాడ), ఎస్.కె.మస్తాన్ వలి(గుంటూరు), టి.శ్రీపతిప్రకాశ్(ఒంగోలు), ఎ.సి.సుబ్బారెడ్డి (నెల్లూరు), బండి జక్రయ్య(కడప), ఎం.సుధాకర బాబు(కర్నూలు), షాలి దాదా గాంధీ(అనంతపురం), ఎం.నరసింహులునాయుడు (చిత్తూరు)ను నియమించారు. -
'ఇందిరమ్మ మాట - కాంగ్రెస్ బాట'
-
తుపానును ఎదుర్కోవడంలో టిడిపి విఫమైంది
-
వృద్ధ పార్టీ ఉనికి ఆశలు!
స్వాతంత్ర్యం పూర్వం నుంచి ఉన్న వృద్ధ పార్టీ నూతన ఆంధ్రప్రదేశ్ లో ఉనికి కోసం పాకులాడుతోంది. తెలుగువారి ఆదరణ కరువడడం, అటు కేంద్రంలోనూ పవర్ పోవడంతో కాంగ్రెస్ పార్టీ కుదేలయింది. హస్తం పార్టీ విభజన వ్యూహాన్ని తెలుగువారు తిప్పికొట్టడంతో దిక్కులేని పరిస్థితిలో పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో అయితే అడ్రస్ లేకుండా పోయింది. విభజనతో తెలంగాణలో పాగా వేద్దామనుకున్నా పాచిక పారలేదు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది కాంగీయుల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ప్రాతనిథ్యం కరువడంతో కాంగ్రెస్ ఇప్పుడు నందిగామ ఉప పోరుపై ఆశలు పెట్టుకుంది. ఈ ఒక్క సీటులోనైనా గెలిచి ఏపీలో తాము ఉనికిలో ఉన్నామనిపించుకోవాలని తలపోస్తోంది. ఇందుకోసం నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలోకి దిగింది. బోడపాటి బాబూరావును అభ్యర్థిగా నిలిపింది. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యం కానుంది. టీడీపీ నుంచి దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ నందిగామలో పాగా వేయాలని బలంగా కోరుకుంటోంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన క్రేడిట్ తమదే కాబట్టి గంపగుత్తుగా ఓట్లు తమకే పడతాయని ఆశపడి భంగపడిన హస్తం పార్టీ ఇప్పుడు ఇప్పుడు మెదక్ ఉప ఎన్నికలోనూ పోటీకి దిగింది. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని తెలంగాణ కాంగీయులు కలలు కంటున్నారు. మరోపక్క గెలిచిన తమ నాయకులు 'కారు' ఎక్కకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్ తంటాలు పడుతోంది. ఇక మొన్న జరిగిన అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత మీదంటే మీదంటూ ఇప్పటికీ కుమ్ములాడుకుంటున్న కాంగ్రెస్ నాయకులు మెదక్ లోనైనా చేయిచేయి కలుపుతారో, లేదో చూడాలి. -
చంద్రబాబుపై మండిపడ్డ ఏపీ కాంగ్రెస్
-
విభజన, వలసలే కాంగ్రెస్‌ను ముంచాయి
ఏపీ కాంగ్రెస్ నేతల సమీక్షలో వెల్లడి సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజన, కీలక నేతల వలసలే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలయ్యాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ రాజకీయ చరిత్రలో ఘోర పరాజయాన్ని చవిచూడడం దురదృష్టకరమని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. విభజనకు వంత పాడిన దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేష్‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహా రాయపాటి, లగడపాటి, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు తదితరుల తీరుపై పలువురు మాజీ మంత్రులు ధ్వజమెత్తా రు. ఏపీ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సమీక్షా సమావేశం మంగళవారం విజయవాడలో జరిగింది. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సమావేశం సాయంత్రం 5 వరకు కొనసాగింది. 13 జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పీసీపీ సభ్యులు, ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. మొత్తం 52 మంది మాట్లాడారు. ఓటమికి గల కారణాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకోవాల్సిన అవసరముందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు. అనుభవాలు, ఇబ్బందులతో రూపొందించిన నివేదికను ఈ నెల 23న ఏఐసీసీకి పంపనున్నట్టు చెప్పారు. మాజీ మంత్రుల కొండ్రు మురళి, సాకే శైలజానాథ్, కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జేడీ శీలం, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలతో పాటు పలువురు మాజీ మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మీడియా కూడా దెబ్బతీసింది :బొత్స కాంగ్రెస్‌పై టీడీపీ కుట్ర సాగిస్తోందని మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి అంటూ ఎల్లో మీడియా ఎన్నికల ముందు నుంచీ విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. రుణాల మాఫీ పేరిట బాబు ప్రదర్శించిన విద్యలను ఆయా పత్రికలు బాగా ప్రచారం చేశాయన్నారు. బాబు అధికారంలోకి రాగానే రూ. 14 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని చెబుతున్న ఓ వర్గం మీడియా 2004లో కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టే నాటికి రూ. 21 వేల కోట్ల లోటుబడ్జెట్ ఉందన్న విషయాన్ని విస్మరిస్తున్నాయని ప్రశ్నించారు. ఈ కుట్రలను తిప్పి కొట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కిరణ్ది తీరని ద్రోహం: డొక్కా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరని ద్రోహం చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. కిరణ్ చేసిన కుట్ర ప్రపంచంలో ఎక్కడా చూడలేదని, ఎంతో నమ్మకంగా నటించాడని, సీనియర్ మంత్రుల్ని సైతం న మ్మించాడని దుయ్యబట్టారు. విభజన ప్రకటన వెలువడగానే కిరణ్ రాజీనామా చే సి ఉంటే విభజన ప్రక్రియ కొంత మేరకు ఆగి ఉండేదన్నారు. జైరాం తీరు బాగోలేదు: దేవినేని రాజశేఖర్ రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమంత్రి జైరాం రమేష్ తీరు అస్సలు బాగోలేదని మాజీ ఎమ్మెల్యే దేవినేని రాజశేఖర్(నెహ్రూ) అన్నారు. విభజనకు అనుకూలంగా ఉన్న ఆయన వ్యవహార శైలితో సీమాంధ్ర ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుందన్నారు. రాయపాటి, లగడపాటి, పురందేశ్వరి, కావూరిల తీరుతో కార్యకర్తల్లో విశ్వాసం సన్నగిల్లిందని తెలిపారు. అవమానకరం: ఆనం వివేకా రాష్ట్ర విభజన అవమానకర ఘటనని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి తెలియని దుర్మార్గులు రాష్ట్రాన్ని విడగొట్టారని దుయ్యబట్టారు. డిగ్గీలు, భగ్గీలందరూ(దిగ్విజయ్‌సింగ్) రోజుకో తీరున మాట్లాడుతుంటే సీమాంధ్ర రక్తం వేడెక్కిందన్నారు. -
మన పార్టీని వీడిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారు
-
ఉచిత విద్యుత్, టీవీలు వంద గజాల స్థలం
ఇదీ ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో సాక్షి, హైదరాబాద్: గృహాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు... పేదలకు కలర్టీవీలు... ఇంటీర్మీడియెట్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు... ఆడపిల్లలకు పుట్టిన వెంటనే వందగజాల ఇంటిస్థలం... ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంపు... శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివి. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ పీసీసీ రూపొందించిన మేనిఫెస్టోను కేంద్రమంత్రి జైరాం రమేష్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవిష్కరించారు. కేంద్రమంత్రి చిరంజీవి, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఆనం రామనారాయణరెడ్డి, ఏఐసీసీ ఎస్సీసెల్ ఛైర్మన్ కొప్పుల రాజు, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్, శైలజానాధ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను రఘువీరా వివరిస్తూ రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్‌గా మార్చడానికి దశసూత్ర ప్రణాళికలను రచించినట్లు చెప్పారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు నిరాటంకంగా విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. విత్తన వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకు సమగ్ర విత్తన చట్టం తేస్తామని పేర్కొన్నారు. -
కిరణ్‌కుమార్‌పై మంత్రి బాలరాజు ఫైర్
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై మంత్రి పసుపులేటి బాలరాజు విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వివక్షత చూపుతోందని బాలరాజు ముఖ్యమంత్రిని విమర్శించారు. తన శాఖకు సంబంధించి తనను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సొంత జిల్లా విశాఖపట్నంలో ఇటీవల జరిగిన రచ్చబండ కార్యక్రమానికి కనీసం తనను ఆహ్వానించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. అదే జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావు ముఖ్యమంత్రితో సన్నిహితంగా మెలుగుతుండగా, బాలరాజు కొంతకాలంగా సీఎంకు దూరంగా ఉంటున్నారు. -
పని ప్రారంభించునున్న ఏకే ఆంటోనీ కమిటీ