
అతడిని ఇరికించారు: దిగ్విజయ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు ఒత్తిడి తేలేకపోతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. దోపిడీ విధానాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ గా మారారని ధ్వజమెత్తారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... హామీల అమలులో టీడీపీ, బీజేపీ విఫలమయ్యాయని విమర్శించారు. యూనివర్సిటీలను ఆర్ఎస్ఎస్ భావజాలంతో నింపాలనుకుంటున్నారని ఆరోపించారు. జేఎన్ యూ వివాదంలో అసలు దోషులను వదిలేసి కన్హయ్య కుమార్ ను ఇరికించారని అన్నారు.