దిగ్విజయ్‌ ఔట్‌.. ఏపీ ఇన్‌చార్జ్‌గా ఊమెన్‌ చాందీ | Oommen Chandy Appointed as AICC Incharge of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Published Sun, May 27 2018 1:47 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Oommen Chandy Appointed as AICC Incharge of Andhra Pradesh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ను తొలగించింది. ఆయన స్థానంలో మరో సీనియర్‌ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీకి ఏపీ పీసీసీ పర్యవేక్షక బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్‌ ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీగా ఊమెన్‌ చాందీని వెంటనే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియమించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ ప్రశంసనీయమైన సేవలు అందించారని, ఆయన వెంటనే ఆ పదవి నుంచి దిగిపోతారని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement