Andhra Pradesh Congress Committee
-
ఏపీ పీసీసీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు బుధవారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడింది. చాలాకాలంగా ఏపీసీసీ చీఫ్‌ను మార్చే యోచనలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. శైలజానాథ్ పనితీరు సరిగా లేదని అధిష్టానం భావిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఏడాది కాలంగా పలువురి పేర్లను పరిశీలించింది. ఇక శైలజనాథ్‌ను పీసీసీ చీఫ్‌గా తొలగిస్తూనే.. గిడుగు రుద్రరాజు నియామకానికి మొగ్గు చూపించింది ఏఐసీసీ. గిడుగు రుద్రరాజు.. ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా రాష్ట్ర సహాయ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు వైఎస్సార్, కెవీపీలకు సన్నిహితుడిగా మెలిగారు. చిన్ననాటి నుంచి కాంగ్రెస్‌లోనే పెరిగిన గిడుగు.. పార్టీ కోసం చురుగ్గా తిరగ గలుగుతారనే అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో హస్తం పార్టీ బలోపేతానికి పద్దెనిమిది మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, 34 మందితో కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్‌వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పీ రాకేష్, ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్‌గా పల్లంరాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్, మీడియా కమిటీ చైర్మన్‌గా తులసిరెడ్డిలను నియమిస్తున్నట్లు ప్రకటించింది ఏఐసీసీ. ఇదీ చదవండి: శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం -
‘చంద్రబాబు మొసలి కన్నీళ్లను ప్రజలు నమ్మరు’
సాక్షి, అనంతపురం : ఐదు బడ్జెట్లు పూర్తి అయ్యేవరకు కేంద్రంతో కలిసుండి ఇవాళ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. శనివారం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడానికే నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని కడిగేస్తానని చంద్రబాబు డాంబికాలు పలుకుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టిన చంద్రబాబు నేడు ప్రధాని నరేంద్ర మోదీతో నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడతానంటే ఎలా విశ్వసించాలని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుకు తానే ముందుగా ప్రధానికి ఉత్తరం రాశానని చెప్పిన చంద్రబాబు నగదు రహిత అమలు కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించి ఇప్పుడు నోట్ల రద్దు దుష్పలితాలపై నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడతానంటే ప్రజలు నమ్మరన్నారు. జీఎస్టీ అమలు చేసినప్పుడు నోరు మెదపని చంద్రబాబు ఇవాళ జీఎస్టీ వలన కలిగే దుష్పలితాలను నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడతానంటే నమ్మలేమన్నారు. నాలుగేళ్లు మోదీ ప్రభుత్వంలో కలిసుండి ఒక్కసారి కూడా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయామని అడగని చంద్రబాబు రైతులకు మద్దతు ధర పెంచాలని అడుగు తానంటే నమ్మేదెలా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా సంక్షేమ పథకాల నిధులలో కోత విధిస్తున్నా ఏనాడూ ప్రశ్నించని చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి ప్రస్తావిస్తానంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. 16 మంది ముఖ్యమంత్రులు కలిసి లక్ష కోట్ల రూపాయల అప్పులు చేస్తే చంద్రబాబు ఒక్కడే నాలుగు సంవత్సరాలలో 1 లక్షా 49 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై అధిక భారం మోపారని రఘువీరా ఆరోపించారు. -
దిగ్విజయ్ ఔట్.. ఏపీ ఇన్చార్జ్గా ఊమెన్ చాందీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌ను తొలగించింది. ఆయన స్థానంలో మరో సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఏపీ పీసీసీ పర్యవేక్షక బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ ఏఐసీసీ ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీగా ఊమెన్ చాందీని వెంటనే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియమించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్న దిగ్విజయ్‌సింగ్ ప్రశంసనీయమైన సేవలు అందించారని, ఆయన వెంటనే ఆ పదవి నుంచి దిగిపోతారని తెలిపింది. -
కాకాని విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలి: కాంగ్రెస్
సాక్షి, విజయవాడ : జై ఆంధ్ర ఉద్యమనేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అర్ధరాత్రి బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న కాకాని విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించగా కాంగ్రెస్ నేతలు, ప్రజలు అడ్డుకున్నారు. విగ్రహ కమిటీకి చెప్పకుండా ఎలా తొలగిస్తారని అధికారులను ప్రశ్నించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి నరహారశెట్టి నరసింహారావు, అధికార ప్రతినిధి కె శివాజితో పాటు ఇతర నాయకులను అరెస్ట్ చేసి.. ఉంగటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత అధికారులు కాకాని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. కాకాని విగ్రహాన్ని తొలగించిన చోటే తిరిగి ప్రతిష్టించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్లై ఓవర్ పనుల కారణంగా కాకాని విగ్రహం తొలగించడం.. తెలుగు వారిని అవమానించడమేనన్నారు. -
మోదీ ఒక పిరికిపంద: రఘువీరా
విశాఖపట్నం : ఎన్డీయే ప్రభుత్వం క్రూరమైన చర్యలను ఖండిస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షులు రఘవీరా రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ..ఇరవై పార్టీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినా, మోదీ పరుగెత్తిపోయాడని, మోదీ ఒక పిరికిపంద అంటూ తూర్పారబట్టారు. పార్లమెంటులో చర్చకు రాకుండా సమావేశాలను నిరవధిక వాయిదా వేయడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్ధిక నేరస్తులు లలిత్ మోదీ, నీరవ్ మోదీలు పోలీసులకు, దొరక్కుండా ఎలా పారిపోయారో, ఆ రకంగా చట్టానికి, పార్లమెంటుకు దొరక్కుండా పోయిన నేరస్తుడు, క్రిమినల్ మోదీ అని తీవ్రంగా విమర్శించారు. ఈ నెల 11 న కాంగ్రెస్ పెద్దలతో నాలుగేళ్ల పోరాటాలపై సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. -
‘బాబు-బీజేపీలది డ్రామా’
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ-బీజేపీలు ఇంకా డ్రామాలు ఆడుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు 5 కోట్ల ప్రజలను నమ్మించి దారుణంగా మోసం చేశాయని.. ప్రజలు ఇంకా వారిని నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విజయవాడలో ఆదివారం రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘అమిత్ షా, చంద్రబాబు ఇద్దరూ నాటకాలాడుతున్నారు. 4 ఏళ్ళు కలిసి ఉండి ఇప్పుడు ఒకరికొకరు బద్ధ శత్రువుల్లా మారినట్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో అమిత్ షా రూ. 1.40లక్షల కోట్ల లెక్కలు చెప్పినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాల్సింది. ఇప్పుడు నిలదీయటం వ్యర్థం. ప్రధాని మోదీ-అమిత్‌షాలు అబద్ధాలకోరులు.. వారికీ విశ్వసనీయత లేదు’ అని రఘువీరా పేర్కొన్నారు. కాంగ్రెస్ త్యాగం చేసింది : విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని.. చిత్తశుద్ధితో పోరాడేది.. చివరకు 2019లో హోదాను ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనేనని రఘువీరా చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే టీడీపీ-బీజేపీ కుట్ర చేశాయన్నారు. ‘విభజనతో కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోయింది. కానీ, రాష్ట్రానికి అన్నివిధాలా న్యాయం చేయడానికి ప్రయత్నించింది. ఏపీకి కాంగ్రెస్ వడ్డించిన విస్తరి ఇస్తే.. దాన్ని బీజేపీ-టీడీపీలు అవకాశవాద రాజకీయాలతో కుక్కలు చింపిన విస్తరి చేశాయి. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ దెబ్బతీస్తే.. చంద్రబాబు 5 కోట్ల ప్రజల హక్కులను కేంద్రం కాళ్ళ దగ్గర పెట్టారు’ అని చెప్పారు. ఇంక తప్పించుకోలేరు... కాంగ్రెస్ పార్టీపై ఇంకా నిందలేసి ఇక బీజేపీ, టీడీపీలు తప్పించుకోలేవని.. వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని, ప్రజలు అర్థం చేసుకుంటున్నారని రఘువీరా అన్నారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన అమలు చేయమనే ఇవాళ అందరూ అడుగుతున్నారు. హోదాతోసహా ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ అమలైతే రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రయోజనాలు ఏపీకి నెరవేరతాయి. అసత్యాల అమిత్ షా, మోసకారి మోదీ, వెన్నుపోటు చంద్రబాబు.. వీరంతా ఏపీని ముంచినోళ్లే’ అని రఘువీరా ఆక్షేపించారు. -
కాంగ్రెస్‌లోకి జనసభ అధ్యక్షుడు
సాక్షి, విజయవాడ : బడుగు, బలహీన వర్గాలతోపాటు అగ్రవర్ణ పేదలనూ టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. బీసీ జనసభ అధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ చేరిక సందర్భంగా ఆదివారం విజయవాడలో న్విహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాండ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి పల్లంరాజులు డాక్టర్ గంగాధర్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటాలు చేస్తుందని, గంగాధర్ రాకతో పార్టీకి పునర్వైభవం వచ్చిందని కేవీపీ అన్నారు. మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ ప్రధాని మోదీ తీరును ఎండగట్టారు. ‘‘పరిపాలనా దక్షత ఏమాత్రంలేని మోదీ.. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. చరిత్రలోనే లేనివిధంగా నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు మీడియా ముందుకు వచ్చారంటే దేశంలో పరిపాలన ఏవిధంగా సాగుతున్నదో అర్థంచేసుకోవచ్చు. గురువు అద్వానీకి కనీసం నమస్కారం పెట్టని మోదీ ఎంత కుసంస్కారో ప్రజలే అర్థంచేసుకోవాలి’’ అని పల్లంరాజు వ్యాఖ్యానించారు. -
2న జాతీయ రహదారుల దిగ్భందం..!
సాక్షి, చిత్తూరు : 'టీడీపీ, బీజేపీ పార్టీలు రెండు రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశాయి. వారి సొంత లాభం కోసం ప్రజల్ని నడిరోడ్డున పడేశారు. నాలుగేళ్లుగా ఒకరికొకరు పొత్తు పేరిట అధికారం కొనసాగించి, ఇప్పుడు ప్రజల్ని మోసం చేయడానికి కొత్త నాటకం ఆడుతున్నారు. ఏపీకు హోదా ఇవ్వడానికి చట్టంలో సవరణ చేయాలంటున్నారు. మరి గత నాలుగేళ్లుగా ఎందుకు సవరణ చేయలేదు. 2019లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. ఏపీకి హోదాపై తొలి సంతకం చేస్తారు..' అంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గురువారం చిత్తూరు నగరంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదుట 'ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష' పేరిట సమావేశం నిర్వహించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల విభజన అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతోనే జరిగిందని, ఎన్డీఏ, టీడీపీలు పదేళ్లపాటు హోదా ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశాయన్నారు. ఇప్పుడేమో కొత్తగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారన్నారు. జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో హోదానే ప్రజల ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందన్నారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో 17పార్టీల మద్దతు కూడగట్టి పార్లమెంటులో అవిశ్వాసం పెడతామన్నారు. టీడీపీకి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ఏప్రిల్ 5లోపు కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి హోదా తీసుకురావడంతోపాటు విభజన చట్టం ప్రకారం నిధులు సమకూర్చేలా ఎన్డీఏపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. లేనిపక్షంలో ప్రజాదోహుల పార్టీగా మిగిలిపోతుందన్నారు. హోదా ఇవ్వాలని డిమాండ్‌తో మార్చి 2న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్భందం.. 6,7,8వ తేదీల్లో పార్లమెంటు ముట్టడి చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీ చింతా మోహన్, మాజీ ఎమ్మెల్యే షాజహాన్భాషలు మాట్లాడుతూ గద్వాల్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర విభజనకు మొట్టమొదట లేఖ ఇచ్చింది తమ పార్టీనేనని చంద్రబాబు నాయుడు బహిరంగంగా అంగీకరించారని, ఎన్నికల్లో ఈ నెపం మొత్తం కాంగ్రెస్‌పై వేశారన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతారన్నారు. -
సీఎంగా మరోనేతకు ఛాన్స్ ఇవ్వాలి!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మాట మారుస్తారని, ఆయన మాటలు మారుస్తున్న తీరును గమనిస్తే సీఎం మానసిక స్థితిమీద అనుమానం కలుగుతోందని ఏపీసీసీ నేతలు మండిపడ్డారు. హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగేళ్లలో పలు సందర్భాల్లో చంద్రబాబు తడవకొక మాట మాట్లాడారని, నిన్న (మంగళవారం) టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాటలు లీకుల రూపంలో మీడియాకు ఇచ్చారని ఆరోపించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, ఎస్.రాజాలు బుధవారం ఇక్కడి ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లీకుల రూపంలో మీడియాకు లీకులిస్తూ సీఎం చంద్రబాబు ఊసరవెల్లిలా మారారని అర్థమవుతోందని, ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. సీఎం స్థానంలో టీడీపీ మరొకరికి అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం సొంతజిల్లా చిత్తూరులో చంద్రబాబుకు అబద్ధాల నాయుడిగా నిక్ నేమ్ ఉండగా, ఇప్పుడు లీకుల నాయుడిగా మరోపేరు జత చేరిందన్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ కాదని, అది ఏపీ హక్కు అని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన చట్టబద్ధమైన హామీలను సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకుని మరో నేతకు చంద్రబాబు అవకాశం ఇవ్వాలని ఏపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వాటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్లో ఎంపీ మల్లికార్జున ఖర్గే రూల్ 184 కింద నోటీసు ఇచ్చారని, టీడీపీ, వైఎస్ఆర్సీపీ నేతలు లోక్‌సభలో చర్చలో పాల్గొనాలని సూచించారు. మార్చి 6, 7, 8 తేదీల్లో ఛలో పార్లమెంట్ పేరిట అంతిమ పోరాటానికి పిలుపునిస్తూ ఏపీపీసీ ఉద్యమ కార్యాచరణ ఢిల్లీలో చేపట్టనున్నామని, ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలసి రావాల్సిందిగా కోరుతూ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి లేఖలు రాయనున్నట్లు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, ఎస్.రాజాలు వెల్లడించారు. -
మోదీ వ్యాఖ్యల పట్ల రఘువీరా ఆగ్రహం
అమరావతి : పార్లమెంటులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల పట్ల ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్‌ను, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ అవమానానికి గురిచేసిందంటూ మోదీ వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. నెహ్రూ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని, ప్రేమను కనబరుస్తూ నెహ్రూకే లేఖ రాసిన పటేల్ గురించి మీరు(మోదీ) మాట్లాడటం మీ కుటిల రాజకీయ ఎత్తుగడ తప్ప మరేమీ కాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. లేఖలో ఏం పేర్కొన్నారంటే.. ఏపీ విభజన జరిగి 4 సంవత్సరాలు గడుస్తున్నా పునర్వవస్తీకరణ చట్టంలోని అంశాలు అమలు కావడం లేదని అన్నారు. రాష్ర్ట విభజనను దేశ విభజనతో పోల్చి మోదీ మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. 1. పార్లమెంటు తలుపులు వేసి రాష్ర్ట విభజన చేసింది కాంగ్రెస్ అని విమర్శించారు. ఏదైనా బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరిగేటపుడు తలుపులు మాస్తారా లేక తెరుస్తారా? మీరు(మోదీ) సమాధానం చెప్పాలి. 2. తలుపులు మూసి కాంగ్రెస్ విభజన చేసినపుడు ఆనాటి ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఎందుకు విభజన బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ బిల్లును ఎందుకు వ్యతిరేకించలేదు? 3. తిరుపతి ఎన్నికల సభలో.. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మించి ఇస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువే ఇస్తామని మమ్మల్ని గెలిపించమని కోరారా లేదా? 4. 2014 ఎన్నికల్లో నెల్లూరులో ఏపీకి ప్రత్యేక హోదా వెంకయ్యనాయుడే సాధించారని కనుక ఆ ఘనత తమదేనని మీరు చెప్పారా లేదా? 5. 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదాను 10 ఏళ్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారా లేదా? 6. మీరు అధికారంలోకి వచ్చాక రెండు సంవత్సరాలపాటు హోదా అమలు చేస్తామన్నా అమలు చేయకపోవడంతో ప్రజా ఉద్యమం పెల్లుబికి ఏపీ అసెంబ్లీ రెండు సార్లు హోదా అమలుల చేమయని ఏకగ్రీవంగా తీర్మానం చేసి మీకు పంపిందా లేదా? మీ పార్టీ ఆ తీర్మానాన్ని రాష్ర్టంలో బలపర్చింది వాస్తవమా కాదా? 7. ఏపీ ముఖ్యమంత్రికి 16 నెలల పాటు మీరు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానానికి గురి చేయడం కిందకు వస్తుందా రాదా? ఏపీ విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా నష్టపోయింది కానీ ఏపీ ప్రజలకు అన్యాయం చేయలేదన్నారు. అందుకే ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ హోదా, లాంటి అనేక అంశాలను ఏపీకి ఇస్తూ చట్టం చేసిందని గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను, కేబినేట్ నిర్ణయాలను అమలు చేయాలని ఏపీ ప్రజల తరపున తమరికి(మోదీ) అభ్యర్థిస్తున్నట్లు లేఖ ద్వారా తెలిపారు. -
‘నాడు కిరీటం చోరీ.. నేడు క్షుద్రపూజలు..’
సాక్షి, విజయవాడ : కనకదుర్గమ్మ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు దారుణంగా ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. గతంలో బాబు సీఎంగా ఉన్నప్పుడే అమ్మవారి కిరీటం చోరీకి గురైందని, ఇప్పుడు ఏకంగా గర్భగుడిలో క్షుద్రపూజలు చేయిస్తున్నారని, దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంలోనూ ఎక్కడలేని జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. మార్చిలోగా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తిచేయకుంటే ఆందోళన చేపడతామని రఘువీరా హెచ్చరించారు. శనివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో కిరీటం చోరీ, ఇప్పుడు క్షుద్రపూజలు.. చంద్రబాబు హయాంలోనే జరిగాయి. పొద్దున లేస్తే దుర్గగుడి ఫ్లైఓవర్ నా కల అని చెప్పుకుంటారాయన. మరి పనులు చూస్తే ఎక్కడిక్కడే నిలిచాయి. నాడు హైదరాబాద్‌లో తెలుగుతల్లి ఫ్లైఓవర్ విషయంలోనూ ఎనిమిదేళ్లు కాలయాపన చేశారు. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పూర్తిచేసింది. ప్రస్తుతం టీడీపీ దృష్టంతా దోపిడీపైనే ఉందితప్ప అభివృద్ధిపై కాదు. రాజధానిలో ఎక్కడిక్కడ కబ్జాలు, దందాలు.. ఇవే సీఎం, ఆయన కుమారుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తోన్నపనులు! మార్చిలోపు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తికాకుంటే ఏప్రిల్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిరవధిక దీక్షలకు దిగుతాం’’ అని రఘువీరా రెడ్డి అన్నారు. -
గజల్ శ్రీనివాస్ కేసుపై రఘువీరా స్పందన
సాక్షి, విజయవాడ: లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న గజల్ శ్రీనివాస్ వ్యవహారంపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పందించారు. టీడీపీ ప్రభుత్వం బుద్ధే వక్రబుద్ధి అని, అందుకే అలాంటి వారిని సెలక్ట్ చేస్తోందని విమర్శించారు. గజల్ శ్రీనివాస్ తమ పార్టీలో తిరగలేదని, స్వచ్ఛంగా ఉండాల్సిన అంబాసిడరే ఇలా చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని రఘువీరా అన్నారు. రేపటి నుంచి పోలవరం యాత్రం.. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు పాదయాత్ర చేపడుతున్నామని రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారిని రఘువీరా రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేపటి నుంచి 10 తేదీవరకు ధవళెశ్వరం నుండి పోలవరం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నాం. 10న పోలవరంలో సామూహిక సత్యాగ్రహం నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం పూర్తి చేయాలి. పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి. పోలవరం ప్రాజెక్టులో కమీషన్లు ఏవిధంగా పంచుకోవాలి అన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయంగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ పాదయాత్రను విజయవంతం చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించాలని అమ్మవారిని వేడుకున్నాం’ అని రఘువీరా అన్నారు. ఇంద్రకీలాద్రి పై తాంత్రిక పూజలపై.. ‘ఆలయంలో అర్ధరాత్రి పూజలు జరిగాయని దుర్గగుడి చైర్మన్ ఒప్పుకున్నారు. అధికారులతో మాట్లాడుదామంటే భయపడిపోతున్నారు. దుర్గమ్మ సన్నీధిలో ఎవ్వరూ అబద్ధాలు ఆడలేరు. అలాగని నిజం చెప్పాలంటే నోటికి తాళాలు వేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా దుర్గగుడి లో ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉంది. గతంలో అమ్మవారి ముక్కుపుడక విషయంలో ప్రభుత్వం మూల్యం చెల్లించుకొంది. ఆలయంలో పాలక మండలి నోరు మెదపకూడదని టీడీపీ నేతలు హుకుం జారీ చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే’ అని రఘువీరా అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ వ్యవహారంలో ఎవరిపై చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం, దేవాదాయశాఖ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పూజలు జరిగాయనేది వాస్తవమని, జరగలేదని బుకాయించొద్దని సూచించారు. ఈ వ్యవహారంపై సిట్డింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి, లేకుంటే టీడీపీ సర్కారు మళ్లీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. -
పథకాలు అధికార పార్టీవారికే: రఘువీరారెడ్డి
అనంతపురం అర్బన్: రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కరాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్‌ను శనివారం కలిసి జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలను జన్మభూమి కార్యక్రమం ప్రారంభించేలోగా పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మడకశిర, కళ్యాణదుర్గం, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నామన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, పంట నష్ట పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ బిల్లులు రాక వేలాదిమంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. సీఎంఓ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, మీ కోసం, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలు లక్షల్లో తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. అయితే అవేవీ పరిష్కారం కావడం లేదని రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అమలులోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ పథకాలకు పేదరికం అర్హతగా చూడడం లేదని, అధికార పార్టీకి చెందిన వారికే అందుతున్నాయని ఆరోపించారు. ఇతర పార్టీల వారికి ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదన్నారు. జన్మభూమి ప్రారంభమయ్యేలోగా సమస్యలు పరిష్కరించకుంటే ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పోరాటాలు సాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు కోట సత్యనారాయణ, నగర అధ్యక్షుడు దాదాగాంధీ ఉన్నారు. -
'కళాకారులకు లోకేష్ క్షమాపణ చెప్పాలి'
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ఎన్నడూ లేనంతగా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. విమర్శలపై స్పందించిన మంత్రి లోకేష్ నంది అవార్డుల వివాదం మరింత ముదిరితే అవార్డులను రద్దు చేస్తామంటూ వ్యాఖ్యానించారు. నాన్ రెసిడెన్షియల్స్, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లేనివారని అవార్డులపై మాట్లాడుతున్నారన్నారు. కాగా లోకేష్ వ్యాఖ్యలను ఏపీసీసీ తప్పుబట్టింది. లోకేష్ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం డిమాండ్ చేశారు. నంది అవార్డులకు కులం ఆపాదించవద్దంటూనే.. కళాకారులకు ప్రాంతాలు ఆపాదించే పనికి లోకేష్ పూనుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం నియమించిన కమిటీలోని సభ్యులను రేషన్ కార్డు, ఆధార్ కార్డులు చూసి నియమించారా? రెసిడెన్షియల్ చూసే నటులకు అవార్డులు ఇచ్చారా? ఎక్కువ నంది అవార్డులు వచ్చిన బాలకృష్ణ రెసిడెన్స్ ఎక్కడ ఉంది? అనే ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ ప్రమేయంతో నంది అవార్డుల ఎంపిక జరిగిందనే ఆరోపణలు వచ్చినందున వెంటనే ప్రకటించిన అవార్డులను రద్దు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. -
పడవ ప్రమాదంపై పీసీసీ నిజనిర్ధారణ కమిటి
సాక్షి, విజయవాడ : కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంపై కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ నియమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పడవ ప్రమాదం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీని నియమిస్తున్నట్లు వివరించారు. ఈ కమిటీలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు సూరిబాబు, మీసాల రాజేశ్వరరావు, అధికార ప్రతినిధి, డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌లు ఉంటారన్నారు. ఈ కమిటీ ఈ నెల 14న ఉదయం 10 గంటలకు పవిత్ర సంగమం వద్దకు వెళ్లి ప్రమాదస్ధలిని పరిశీలిస్తుందని తెలిపారు. అనంతరం బాధితుల బంధువులతో మాట్లాడి నివేదిక సమర్పిస్తుందన్నారు. -
చంద్రబాబూ..నోరు విప్పండి
-
చంద్రబాబు ఒక వేస్ట్‌ఫెలో..
సాక్షి, విజయవాడ : పోలవరం ప్రాజెక్టు మొదలు అన్నిపనుల్లో ప్రజలను మోసం చేస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వేస్ట్ ఫెలో అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా విమర్శించారు. పొలవరం ప్రాజెక్టు పనులు చేసేవాళ్లంతా బాబు బినామీలేనని ఆరోపించారు. విజయవాడలో సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. 2019 కల్లా పోలవరం పూర్తి చేయకపోతే ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు ఉండబోదన్నారు. ‘‘చంద్రబాబు ఒక వేస్ట్ ఫెలో. ఆడలేక మద్దెల ఓడు సామెత చందంగా తాను అధికారంలో ఉండి మాపై(కాంగ్రెస్ పార్టీపై) విమర్శలు చేయడమేంటి? సదావర్తి భూముల విషయంలో టీడీపీ ప్రభుత్వం ఏకంగా కోర్టులనే తప్పు పట్టించాయి. ఈ విషయాన్ని గుర్తించి కోర్టు చివాట్లు పెట్టినా సీఎం తుడుచుకుని పోతున్నారు’’ అని రఘువీరా వ్యాఖ్యానించారు. ఏపీ కాంగ్రెస్ నాయకత్వం త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించి, అక్కడ జరుగుతోన్న వ్యవహారాన్ని పరిశీలించి, నిజానిజాలను ప్రజల ముందు ఉంచుతామని రఘువీరా చెప్పారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను తేవడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంలో ప్రజలను ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో సదావర్తి భుముల విషయంలో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. , , -
ఒక్క నాయకుడూ మిగిలే పరిస్థితి లేదు
నంద్యాల ఓటమిపై పీసీసీ భేటీలో చర్చ సమావేశానికి హాజరైన దిగ్విజయ్‌సింగ్ సాక్షి, అమరావతి: పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షతన మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై నిర్వహించిన సమావేశంలో నంద్యాల, కాకినాడల్లో పార్టీ ఘోర పరాజయంపై వాడివేడి చర్చ జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ కొంతమేరకైనా బలపడకపోతే ఒక్క నాయకుడూ మిగిలే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా, నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఘోర ఓటమిపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని దిగ్విజయ్ పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత విషయాలపై చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యనేతల్ని ఢిల్లీకి రావాలని ఆయన సూచించినట్టు సమాచారం. నంద్యాల, కాకినాడల్లో పార్టీ ఓటమికి నైతికి బాధ్యత తనదేనని రఘువీరారెడ్డి అన్నట్లు సమాచారం. ఇందిరమ్మ శతజయంతి ఉత్సవాల పేరిట అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 15 వరకు ప్రతి గ్రామంలోని ఇంటింటికీ తిరిగి పేదలకు ఇందిరమ్మ హయాంలో అందించిన ఫలాల గురించి వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు వీలుగా అక్టోబర్ 2 నుంచి 45 రోజులపాటు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్తామని చెప్పారు. నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికలు ఎన్నికలే కావని, అవి పూర్తిగా అనైతికంగా జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ, అనుబంధాల సంఘాల ఎన్నికల ప్రక్రియ 80 శాతం పూర్తయిందని, పీసీసీ చీఫ్‌తోపాటు మిగిలిన పదవులకు ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు కేవీపీ రామచంద్రారావు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, సి.రామచంద్రయ్య, కమలమ్మ, కాసు వెంకటకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రఘువీరా.. రాజీనామా చేయాలి: చింతా
తిరుపతి: నంద్యాల ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి పోలైన ఓట్లు చూస్తే కడుపు తరుక్కుపోతోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పార్టీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో బుదవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికలో నిరుపేద మహిళ శ్రీదేవిని అభ్యర్థిగా నిలబెడితే 10 వేల ఓట్లు పోలయ్యాయని, నంద్యాలలో మాత్రం వందల్లో ఓట్లు పడటం పార్టీకి తీరని అవమానంగా, తలవంపులుగానూ ఉందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికే సరైంది కాదన్నారు. ఎంతో అందమైన వోల్వో బస్సులాంటి కాంగ్రెస్ పార్టీకి చిన్నపాటి రిపేర్ అవసరమని, ఈ బస్సును సమర్థవంతంగా నడిపేందుకు సరైన డ్రైవర్ కావాల్సి ఉండగా కండక్టర్‌ను డ్రైవర్ సీట్లో కూర్చోబెడితే ఎలాగని వ్యాఖ్యానించారు. నంద్యాల్లో జరిగింది అసలు ఎన్నికే కాదని, కోట్లతో ఓట్లు కొనుగోలు చేసే సంబరానికి ఎన్నికల కమిషన్, దానికో నోటిఫికేషన్ దండగని విమర్శించారు. ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం పాలైందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఆలోచన తప్పిందనీ, ప్రత్యేక హోదా నినాదంతో ఎన్నికల్లో నిలబడటం తోక పట్టుకుని గోదారి ఈదటం వంటిదని వాపోయారు. -
ప్రభుత్వాల తీరును ఎండగడతాం
అనంతపురం సప్తగిరి సర్కిల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానానులు ఎండగడతామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ విధానాలను అవలంభిస్తోన్న బీజేపీ లౌకికత్వానికి తూట్లు పొడుస్తోందన్నారు. యూపీలో బీజేపీ తరఫున ఒక్క ముస్లింకు కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ర్టంలోని టీడీపీ ప్రభుత్వం కూడా ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కేటాయించకుండా ఆ వర్గాన్ని మోసం చేసిందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ విధానంతో ప్రజల ముందుకు వెళ్తున్నాయో రాజకీయ పార్టీలన్నీ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ విస్మరించారు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీలు ఆనాడు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలును పూర్తిగా విస్మరించాయని రఘువీరారెడ్డి మండిపడ్డారు. విభజించి పాలించడం కాంగ్రెస్ విధానం కాదన్నారు. అట్టడుగున ఉన్న వారికీ సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో గ్యాస్ ధరను పెంచితే మోదీ, జైట్లీ, చంద్రబాబులు నెత్తినోరు కొట్టుకున్నారనీ...ఇపుఽడు వారే ధరలు పెంచుతూ సామాన్యున్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్రభుత్వాల తీరును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అంతకుముందు జాతీయపతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పీసీసీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా, నగర అధ్యక్షుడు దాదాగాంధీ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఇన్చార్జిగా దిగ్విజయ్ తొలగింపు
- తెలంగాణ పర్యవేక్షకుడిగా కుంతియాకు బాధ్యతలు న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్‌ను మంగళవారం ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మరో సీనియర్ నేత, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అయిన రామచంద్ర కుంతియా(ఆర్.సి. కుంతియా)ను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమిస్తూ ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఒక ప్రకటనను విడుదల చేసింది. కుంతియాకు సెక్రటరీగా మరోనాయకుడు సతీశ్ నియమితులయ్యారు. తన పదవీ కాలంలో దిగ్విజయ్ సింగ్.. పని తీరుతో కంటే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఐసిస్ సానుభూతిపరుల విషయంలో, ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ కేసులోనూ డిగ్గీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో పార్టీ సైతం ఇరుకున పడేలా వ్యవహించిన ఆయను ఉన్న పళంగా తప్పించడం వెనుక కారణాలు ఏమిటనేది తెలియాల్సిఉంది. దీనిపై స్థానిక కాంగ్రెస్ నేతలు స్పందించాల్సిఉంది. -
కాంగ్రెస్ ఇన్చార్జిగా దిగ్విజయ్ తొలగింపు
-
రాహుల్‌తో ఏపీసీసీ బృందం భేటీ
విజయవాడ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రఘువీరారెడ్డి అధ్వర్యంలోని ఏపీసీసీ బృందం నేడు (బుధవారం) భేటీ కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ బృందం రాహుల్ గాంధీని కలిసి పార్లమెంట్ సమావేశాల్లో ఏపికి ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలపై పోరాడే అంశాలపై చర్చించనున్నది. అలాగే భీమవరం మండలంలో ఆక్వాఫుడ్ పార్క్ భాదితులతోనూ రాహుల్ సమావేశం కానున్నారు. -
బ్రాహ్మణులంటే బాబుకు చులకన
- ఏపీ సీఎంపై ధ్వజమెత్తిన మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ : బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పుడూ చిలకనగానే చూస్తారని, అందుకు ఒకానొక నిదర్శనం ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి అకారణంగా తొలగించడమని కాంగ్రెస్ పార్టీ విజయవాడ సిటీ అధ్యక్షుడు మల్లాది విష్ణు అన్నారు. పార్టీ నాయకులతో కలిసి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో మల్లాది విలేకరులతో మాట్లాడారు. నీతి, నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణారావును పదవి నుంచి తొలగించడం అనైతికంమని, తద్వారా రాష్ట్రంలో బ్రాహ్మణుల మనోభావాలను బాబు దెబ్బతీశారని మండిపడ్డారు. ‘ఆరునెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే కృష్ణారావు ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో కృష్ణారావు.. స్థానిక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పేంటి? చంద్రబాబు సంక్షేమ పథకాలకు రాజకీయ రంగు పూస్తున్నారనడానికి ఇది తాజా నిదర్శనం కాదా?’ అని మల్లాది ప్రశ్నించారు. విశాఖ భూకుంభకోణంపై కేంద్రానికి ఫిర్యాదు ఇదేఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, రవాణా మాఫియాలు పేట్రేగుతున్నాయన్నారు. విశాఖ భూ కుంభకోణంపై పార్టీ పెద్దలతో కల్సి ఈనెల 22న కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆందోళనకు కాంగ్రెస్ పూర్తి మద్ధతు ప్రకటించిందన్నారు. -
కోట్లు ఖర్చు పెట్టి నవనిర్మాణ దీక్ష చేశారు
-
ఎన్నిసార్లు తీర్మానం చేస్తారు..?
-
APలో మాఫియాలన్నింటికి బిగ్ బాస్ చంద్రబాబు
-
రవికిరణ్ అరెస్టు దారుణం: ఏపీసీసీ
విజయవాడ: సోషల్ మీడియాను నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వ, అరాచక ప్రయత్నాలను ఏపీసీసీ తీవ్రంగా ఖండించింది. పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్‌ను అక్రమ అరెస్టు చేసి వేధింపులకు గురిచేయడం పట్ల ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ ఖండించారు. శాసనమండలి భవనంపై అసభ్యకర ఫొటో పెట్టినట్టుగా ఫిర్యాదును సృష్టించి.. అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలు చంద్రబాబు నాయుడి అక్రమ పాలనా తీరుకు నిదర్శనమన్నారు. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా భంగం కలిగించి ఉంటే.. దానికి చట్టపరంగా అనేక పద్దతులున్నాయన్నారు. కానీ అధికారం చేతిలో ఉందికదా అని తమ ఇష్టానుసారం అక్రమ పద్దతులను వినియోగించుకుంటే ప్రజలు సహించరని మండిపడ్డారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడకుండా న్యాయస్థానాలు రవికిరణ్ అరెస్టు కేసును సుమోటో గా స్వీకరించి ప్రభుత్వాన్ని హెచ్చారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఏపీసీసీ ఛీఫ్ మౌనదీక్ష
మడకశిర: రాష్ట్రంలో ప్రస్తుతమున్నది తీవ్ర దుర్భిక్షమని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఉగాది సందర్భంగా ఆయన బుధవారం అనంతపురం జిల్లా మడకశిరలోని గాంధీజీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. ఉదయం 11.20 నుంచి 12 గంటల వరకు దీక్ష సాగింది. తొలుత స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు, దేశ వ్యాప్తంగా లౌకికవాదానికి ముప్పు, రైతు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వాల కళ్లు తెరిపించడానికి ఈ దీక్ష చేపట్టానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో మైనార్టీలకు భద్రత కరువైందన్నారు. హిందువులకు కూడా శాంతి లేదన్నారు. రాష్ట్రంలో 6.50 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఉందని ఆయన తెలిపారు. ఐదు వేల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 12 లక్షల మంది కూలీల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని ధ్వజమెత్తారు. యంత్రాలతో ఉపాధి పనులను చేపడుతుండటంతో కూలీల వలసలు పెరిగాయన్నారు. గతేడాది రాష్ట్రంలో 580 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరి కుటుంబాలకు ఇంత వరకు నష్టపరిహారం అందలేదని పేర్కొన్నారు. హేవళంబి సంవత్సరంలో రాష్ట్ర ప్రజలను పాలకులు పెద్దఎత్తున మోసం చేస్తారని పంచాంగం చెబుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ ఇన్చార్జ్ చేవూరు శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోదీ,బాబు తోడుదొంగలు.!
రొళ్ల : ప్రధాని నరేంద్రమోది, ముఖ్యమంత్రి చంద్రబాబు తోడుదొంగలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం రొళ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం ప్రజాబ్యాలెట్ ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియ చేపట్టినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఐదు ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ చాలని చంద్రబాబు తెలపడం సిగ్గు చేటన్నారు. 2012లోనే జీడీపల్లి రిజర్వాయర్‌కు నీరు తెచ్చామన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక నీరు తీసుకుచ్చామని చెప్పడం దగాకోరుతనమన్నారు. కాంగ్రెస్ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ 80 శాతం పూర్తి చేశామని గుర్తు చేశారు. రైతులు, డ్వాక్రా మహిళ సంఘాల సభ్యులు, చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు మోసగించారని మండిపడ్డారు. అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించాలన్న ఉద్ధేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో 108 సేవలు పూర్తి స్థాయిలో అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చంద్రబాబు మాయ మాటలు రాష్ట్ర ప్రజలు ఇక మీద నమ్మరని, 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం గల్లంతై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్, కాంగ్రెస్ కన్వీనర్లు డా.గౌడప్ప,నాగరాజు,సింగిల్‌విండో అధ్యక్షుడు సంతోష్,మాజీ ఎంపీపీ దేవరాజు,మైనార్టీ సెల్ కన్వీనర్ అన్వర్, నాయకులు పాల్గొన్నారు. -
జిల్లాలకు ఎపీసీసీ పరిశీలకుల నియామకం
హైదరాబాద్: స్థానిక సంస్థలకు జరిగే ఉప ఎన్నికల్లో పరిశీలకులను నియమించడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మార్చి 17న ఇందిరాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించిన విషయాలపై చర్చించారు. త్వరలో జరగనున్న మున్సిపల్/కార్పొరేషన్, వార్డుల ఉప ఎన్నికలకు పార్టీ పరిశీలకులుగా కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలు, వాటి పరిశీలకుల వివరాలను ఓ ప్రకటనలో ఏపీసీసీ వెల్లడించింది. జిల్లా పేరు పరిశీలకులు 1. విజయనగరం --- ద్రోణం రాజు శ్రీనివాస్(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే) 2. విశాఖపట్నం --- ఎస్.ఎన్.రాజా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి) 3. తూర్పు గోదావరి --- పక్కాల సూరిబాబు (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి) 4. పశ్చిమ గోదావరి --- నరహరశెట్టి నరసింహారావు(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి) 5. కృష్ణా ---- సుందరరామ శర్మ (ఎపీసీసీ లీగల్ సెల్ చైర్మన్) 6. గుంటూరు ---- కె. బాపిరాజు (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ) 7. నెల్లూరు ----- మస్తాన్‌వలీ (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే) 8. చిత్తూరు ------ డాక్టర్ సాకె శైలజానాధ్ (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి) 9. కడప ----- షాజహన్ బాషా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే) 10. కర్నూలు ----- డాక్టర్ ఎన్. తులసిరెడ్డి ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ) 11. అనంతపురం ------ అహ్మదుల్లా ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి) -
అమరజీవికి ఏపీసీసీ ఘనంగా నివాళి
హైదరాబాద్: అమరజీవి పొట్టి శ్రీరాములు పట్టువీడని మహనీయుడని, తెగింపు గలవాడని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్పూర్తి దాయకమని ఏపీసీసీ పేర్కొంది. ఆంధ్రరాష్ట్ర సాధన కోసం పోరాడి, ప్రాణత్యాగం చేసిన మహాపురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 117 జయంతి జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అని ఏపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం అన్నారు. ఇందిరా భవన్లో విలేఖరుల సమావేశంలో గంగాధరం మాట్లాడుతూ... పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న నెల్లూర్ జిల్లాలోని పెద్దమట్టపల్లి గ్రామంలో జన్మించారు. శ్రీరాములు లాంటి అకుంటిత దీక్ష వ్యక్తులు 10 మంది ఉంటే మన దేశానికి సంవత్సర కాలంలోనే స్వాతంత్ర్యం తీసుకువస్తానని ఆనాడే మహాత్మాగాంధీ చెప్పారని మరొసారి గుర్తు చేశారు. అతని దేశభక్తికి, పట్టుదలకు గాంధీజీ మాటలే నిలువెత్తు సాక్ష్యాలన్నారు. అంతేకాక శ్రీరాములు ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని గంగాధరం శ్రీరాములు దేశభక్తిని గుర్తు చేశారు. ఆనాడు మద్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1952 అక్టోబర్ 19న నిరాహార దీక్షను ప్రారంభించారన్నారు. అతని 58 రోజుల దీక్షకు మద్దతుగా ప్రజలు ధర్నాలు, సమ్మెబాట పట్టారని ఆనాటి రోజులు గుర్తు చేశారు. కానీ శ్రీరాములు 1952 డిసెంబర్ 15న మరణించారు. అతని మరణ వార్త విన్నప్రజలు ఆవేశాలతో హింసాత్మక చర్యలకు పాల్పడి చెన్నై నుంచి విశాకపట్నం వరకు ఆందోళనలు చేశారని పేర్కొన్నారు. డిసెంబర్ 19న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఆయన కృషి ఫలితంగా కర్నూల్ రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. -
ఏపీ బడ్జెట్ ప్రజావంచన బడ్జెట్
-
‘బడ్జెట్ సమావేశాలు 30 రోజులు జరపాలి’
అమరావతి: వైఎస్సార్ జిల్లా రెండు, ప్రకాశం జిల్లాలో ఒక ఇల్లు మాత్రమే నిర్మించడం దారుణమని ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సంవత్సరానికి 10 లక్షల ఇల్లు కడతామని చెప్పిన చంద్రబాబు 1846 ఇండ్లను స్లాబ్‌ల వరకు మాత్రమే నిర్మంచారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ నిధులను ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. ఎస్సీలకు రూ.1646 కోట్లకు గత బడ్జెట్ లో కేటాయించి 839 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసిందని, అలాగే ఎస్టీ లకు రూ. 573 కోట్లు కేటాయించి రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మైనార్టీలకు రూ.370 కోట్ల కేటాయించి రూ.200 కోట్లు ఖర్చు చేయలేదని తెలిపారు. ఆర్థిక మంత్రి యనమల గత బడ్జెట్ లో చెప్పిన లెక్కలకు కేటాయించిన నిధులకు పోంతనలేదనని పేర్కొన్నారు. సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్లో 50శాతం కూడా టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టడంలేదని అన్నారు. బడ్జెట్ సమావేశాలు ఖచ్చితంగా 30 రోజులు జరపాలని డిమాండ్ చేశారు. -
'కేటగిరీల వారీ కటాఫ్ మార్కులు ఉండాలి'
విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, దివ్యాంగుల ప్రాధమిక హక్కులను కాలరాస్తుందని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో అన్ని తరగతుల వారికి జనరల్ కటాఫ్ మార్కులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, దివ్యాంగుల వారికి న్యాయం చేసేందుకు కృషి చేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కేటగిరీల వారిగా కటాఫ్ మార్కులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అందరికీ ఒకే కటాఫ్ కాకుండా ఆయా తరగతుల వారీ కటాఫ్ మార్కుల విధానాన్ని పాటించాలన్నారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా తరగతుల వారీ కటాఫ్ ఉండాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాలని.. లేకుంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌లో ప్రజా ఉద్యమానికి సిద్దమని ఆయన హెచ్చరించారు. -
'చంద్రబాబు కసాయిలా వ్యవహరిస్తున్నారు'
-
'చంద్రబాబు కసాయిలా వ్యవహరిస్తున్నారు'
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాలనపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు కసాయిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అనంతపురం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలు, వలసలు రోజురోజుకు పెరిగిపోయాయని.. లక్షల సంఖ్యలో పశువులు కబేళాకు వెళ్తున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రఘువీరా విమర్శించారు. -
ఏపీసీసీ నూతన కార్యదర్శిగా షేక్ షానవాజ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా షేక్ షానవాజ్ ను, సంయుక్త కార్యదర్శిగా జి.వెంకటేష్‌ను, కార్యనిర్వాహక కార్యదర్శిగా పూల ప్రసాద్ లను నియమించారు. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షుడు డా.ఎన్.రఘువీరారెడ్డి సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నియామక ఉత్తర్వులను అనంతపురం జిల్లా ఇన్చార్జి కె.రవిచంద్రారెడ్డి చేతుల మీదగా నేతలు అందుకున్నారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్న నేతలు, అవకాశం ఇచ్చిన పార్టీ చీఫ్ రఘువీరారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
'రాహుల్ నేతృత్వంలో రెండో స్వాతంత్య్ర పోరాటం'
హైదరాబాద్ : నాడు ఆంగ్లేయులను క్విట్ ఇండియా చేసినట్లే నేడు బీజేపీని క్విట్ ఇండియా, టీడీపీని క్విట్ ఆంధ్రా చేయాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) పేర్కొంది. అందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో రెండవ స్వాతంత్య్ర పోరాటం జరుగుతోందని తెలిపింది. జాతిపిత గాంధీ 69వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఇంధిరాభవన్లో ఏపీసీసీ నాయకులు మహాత్ముని చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం, మాజీ మంత్రి శైలజానాథ్, ఉపాధ్యక్షులు ఎం సూర్యనాయక్, ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, రవిచంద్రారెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ భౌతికంగా మన మధ్యలేకున్నా ఆయన భావజాలం నిరంతరం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుందని ఏపీసీసీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 'మహాత్మా గాంధీ ప్రపంచంలోనే ఓ విలక్షణ నాయకుడు. ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్క మహాత్ముడు ఆయనే గాంధీ. 69 సంవత్సరాల క్రితం ఇదే రోజు నాధూరాం గాడ్స్ జరిపిన కాల్పుల్లో మహాత్ముడు బలి అయ్యారు. అశాంతి, అసహనం, హింసా ప్రవృత్తితో అల్లాడుతున్న నేటి ప్రపంచానికి గాంధీ మార్గమే శ్రీరామరక్ష. సత్యం, అహింసా, సత్యాగ్రహం, అనే ఆయుధాల ద్వారా ఒక సామాన్యుడు కూడా అసమాన్యుడు కాగలడని మోహన్ దాస్ కరంచంద్ గాంధీ నిరూపించారు. మహాత్ముడు 1924-25 మధ్య భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణం. నేడు దేశంలో గాంధీ వారసులకు గాడ్సే వారసులకు మధ్య రాజకీయ పోరు సాగుతోంది. అంతిమ విజయం గాంధీ వారసులదే అవుతుంది. బీజేపీ ముక్త భారత్...టీడీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ తధ్యం. ఈ పోరాటంలో కాంగ్రెస్ శ్రేణులు వీరసైనికుల్లాగా పోరాడాలి. ఇదే మహాత్మునికి తాము అర్పించే నిజమైన నివాళి' అని ఏపీసీసీ పేర్కొంది. -
జల్లికట్టు తరహా పోరాటం రావాలి
-
'చంద్రబాబుకు కమీషన్లు వస్తే చాలు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా డిమాండ్ సాధించుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల కాదని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదని,ఆ విషయం రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైందని ఆయన అన్నారు. బుధవారమిక్కడ ఇందిరాభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కావలసింది కమీషన్లని, అందుకోసమే ఆయన ప్రత్యేక హోదా అడగకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతున్నారని శైలజానాధ్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర ప్రజల హక్కు. వారి ప్రాణం. నిరుద్యోగ సమస్య పరిష్కారనికి అదొక్కటే మార్గం. ఇవేవీ పట్టించుకోకుండా కేవలం కమీషన్ల కక్కుర్తి కోసం చంద్రబాబు రాజీ పడ్డారని ఘాటుగా విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి నష్టం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వ వైఖరులకు వ్యతిరేకిస్తూ గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేబడుతున్నట్టు ఆయన చెప్పారు. అన్ని జిల్లాల కేంద్రాల్లోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన మౌన దీక్షలను చేపడుతున్నట్టు ప్రకటించారు. -
జల్లికట్టు తరహా పోరాటం రావాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత సీ రామచంద్రయ్య చెప్పారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధోరణి ఏమాత్రం సరిగా లేదని ఆయన బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమిళనాడులో ప్రజలు జల్లికట్టు కోసం పోరాడి కేంద్రం మెడలు వంచారని, అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పొద్దున చెప్పిన విషయాలను సాయంత్రానికి మరిచిపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం వేరుపడి రెండున్నరేళ్లు దాటిపోయినా ప్రత్యేక హోదాపై అతీగతీ లేదని విమర్శించారు. పార్టీలకు అతీతంగా జెండాలు పక్కన పెట్టి హోదా కోసం పోరాడాలని కోరారు. జన సేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారని, ఇప్పుడు అందరూ ఒక్క వేదికపైకి రావలసిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు ముందుండి నడిపినా తాము అందుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని రామచంద్రయ్య చెప్పారు. ప్రత్యేక హోదా సాధించుకునే విషయంలో టీడీపీ, బీజేపీలు దోబూచులాడుతున్నాయని, ఇప్పటికైనా ప్రత్యేక హోదా సాధన కోసం ఆ పార్టీలు ఇప్పటికైనా కలిసొస్తే మంచిదని, రాకపోయినా ఆ పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. -
'మోదీకి ధైర్యముంటే వాటికి సమాధానం చెప్పాలి'
విజయవాడ : పెద్ద నోట్ల రద్దు పెద్ద కుంభకోణమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. నోట్ల రద్దు అనంతరం ఎంత నల్లధనం బయటకు వచ్చిందో ప్రధాని మోదీ లెక్కచెప్పాలన్నారు. మోదీకి ధైర్యముంటే రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ, చంద్రబాబులు క్యాష్‌లెస్ విధానం కాదు.. బ్రెయిన్ లెస్ విధానం అవలంభిస్తున్నారని విమర్శించారు. కొంత మంది పెద్దలు పెద్ద నోట్ల ముసుగులో నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసని టీడీపీ నాయకులు అంతా ముందే సర్దుకున్నారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ఎస్బీఐ జోనల్ ఆఫీసు కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. నోట్ల రద్దు వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను వినతి పత్రం ద్వారా ఎస్బీఐ జోనల్ మేనేజర్‌కు కాంగ్రెస్ నాయకులు సమర్పించారు. -
దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
విజయవాడ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల మృతి చెంది ఏడాది గడిచినా ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. ఈ విషయంలో న్యాయం జరిగేవరకు తమ పార్టీ పోరాడుతుందని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లా వాసి అయిన రోహిత్ మరణంపై టీడీపీ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని చెప్పారు. రోహిత్ మృతికి కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కఠిన చట్టాలు ఉన్నా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ వైఖరి ప్రభుత్వాలకు దళితులపై ఉన్న చిత్తశుద్దికి అద్దం పడుతుందన్నారు. రోహిత్ ఎస్సీ కాదు బీసీ అని అంటూ.. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు కేసును తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. రోహిత్ వేముల చట్టం తేవాలని ఆయన డిమాండ్ చేశారు. -
రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు
అనంతపురం: దేశవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులకు కారణమైన పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద నోట్లరద్దు అనంతరం సామాన్యుల చేతిలోకి రాకముందే కొత్త నోట్లు తీవ్రవాదులకు చేరాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద నోట్ల రద్దుతో కనీసం వారు అనుకున్న లక్ష్యం కూడా నెరవేరలేదని రఘువీరారెడ్డి అన్నారు. బ్యాంకుల్లో దొంగనోట్లు కూడా డిపాజిట్ అయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, అనంతరం జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని రఘువీరా డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోదీలు మాయల ఫకీర్లు అని పేర్కొంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్రమంగా దోచుకునేందుకు మాత్రమే పోలవరం ప్రాజెక్టు ఖర్చును పెంచారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే ఐదున్నర వేలకోట్లు ఖర్చు చేశామన్నారు. భారీ దోపిడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏకంగా 11వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా రూ.40 వేల కోట్లకు పెంచారని నిప్పులు చెరిగారు. ప్రాజెక్టు వ్యయాలను ఇష్టరీతిన పెంచేహక్కు మీకు ఎవరిచ్చారు అంటూ రఘువీరారెడ్డి మండిపడ్డారు. -
'మోదీ అవినీతి రక్షకుడు'
-
'మోదీ అవినీతి రక్షకుడు'
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతిపరుడని, ఆయన అవినీతిని రక్షిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు డా. ఎన్ రఘువీరా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు సూర్యానాయక్, ప్రధాన కార్యదర్శులు జంగా గౌతమ్, రవిచంద్రారెడ్డి, లీగల్ సెల్ చైర్మన్ సుందర రామశర్మలతో కలిసి మాట్లాడిన ఆయన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం వెనుక భారీ కుంభకోణం ఉందన్నారు. దీనిపై పార్లమెంటులో చర్చ జరిగితే మోదీ నేరుగా జైలుకు వెళ్లాల్సివస్తుందని చెప్పారు. అవినీతి బయటపడుతుందనే కారణంగానే మోదీ పార్లమెంటును సజావుగా సాగనివ్వడం లేదని అన్నారు. కార్పోరేట్ శక్తులకు సర్వీసు చార్జీల పేరిట ఏడాదికి రూ.1.50లక్షల కోట్ల రూపాయలు ఆదాయాన్ని మోదీ అందిస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రధానమంత్రి కావడానికి బీజేపీ వేలాది కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేసిందని.. ఈ సొమ్ము మొత్తం కార్పొరేట్ శక్తులే వారికి అందించాయో లేదో మోదీనే సమాధానం చెప్పాలని అన్నారు. -
'ఆయన ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు'
-
'ఆయన ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు'
విజయవాడ: పెద్దనోట్ల రద్దుపై చర్చించడానికి ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటుకు ఎందుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘవీరా రెడ్డి ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుపై బీజేపీ వద్ద సమాధానం లేదన్నారు. పెద్ద నోట్ల రద్దు వెనక పెద్ద మాఫియా ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు సామాన్యులకు శాపం..బీజేపీ, టీడీపీల సంబంధించిన నాయకులకు వరం అయిందన్నారు. త్వరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో రాజకీయాలకు అతీతంగా పెద్దనోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న వివిధ రంగాలకు చెందిన వారితో ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. -
రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పోరుబాట
విజయవాడ సెంట్రల్ : రైతాంగ సమస్యలపై త్వరలోనే కాంగ్రెస్‌పార్టీ పోరుబాటకు సిద్ధం కావాలని ఏపీసీసీ అ«ధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కిసాన్‌ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్‌సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలు ఎన్నికల్లో రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేలా ఉద్యమించాలన్నారు. కర్నూలులో నిర్వహించిన రైతు సభకు మంచి స్పందన వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు పావలావడ్డీ రుణాలు, వడ్డీలేని రుణాలు అందించామన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. పార్టీ నాయకులు గిడుగు రుద్రరాజు, టీజేఆర్ సుధాకర్‌బాబు, ఎస్.ఎన్.రాజా, తులసిరెడ్డి, రవిచంద్రరెడ్డి, కనుమూరి బాపిరాజు, కిసాన్‌సెల్ నాయకులు పాల్గొన్నారు. -
జయ మృతి పట్ల ఏపీ పీసీసీ సంతాపం
అమరావతి: తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో పీసీసీ నేతలతో మంగళవారం సమావేశమైన ఆయన తొలుత జయలలిత మృతికి కొంతసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులున్నా మహిళలు అధిగమించగలరని నిరూపించిన మహిళానేత జయలలిత అన్నారు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో ఆమెను ఐసీయూకు షిఫ్ట్ చేసి వైద్యులు చికిత్స అందిస్తుండగా.. సోమవారం రాత్రి దాదాపు 11:30 గంటల సమయంలో జయలలిత కన్నుమూసిన విషయం తెలిసిందే. జయలలిత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం చెన్నై మెరీనా బీచ్‌లో ఎంజీఆర్ సమాధి పక్కనే నిర్వహిస్తున్నారు. -
‘సుజనా ఉండొచ్చు.. సామాన్యుడు చావాలా?’
అమరావతి: ‘బ్యాంకుల్లో వందల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉండొచ్చా? కష్టపడి దాచుకున్న సొంత డబ్బు తీసుకోవడానికి క్యూలో నిలబడి చనిపోవాలా? ఇదెక్కడి నీతి?’ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ప్రశ్నించారు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన నాటి నుంచి నేటి వరకు బ్యాంకులు, ఏటీఎంల వద్ద చోటుచేసుకున్న మరణాలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలని అన్నారు. నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనల్లో భాగంగా సోమవారం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ తీసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరా.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద చనిపోయినవారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు ఓ భారీ కుంభకోణమని, ఇందులో ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా భాగస్వామ్యం ఉందని రఘువీరా ఆరోపించారు. ప్రజలు కష్టాలు పడుతుంటే చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని, ప్రధాని మోదీని 21వ శతాబ్దపు తుగ్లక్‌గా ప్రజలు విమర్శిస్తున్నారని చెప్పారు. -
‘సంతకం రఘురాంది ఉండాలిగా.. ఉర్జిత్‌ది ఎలా?’
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంది ఏకపక్ష నిర్ణయం అని, అది సామాన్యులకు, రైతులు, మహిళలు, పేదలకు మరణ శాసనంగా మారిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు పేరిట భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానికి సంబంధించిన వారి నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకునేందుకే పెద్ద నోట్ల రద్దు చేశారని అన్నారు. సామాన్యులంటే మోదీకి లెక్కే లేకుండా పోయిందని, పార్లమెంటుకు గౌరవం ఇవ్వని మోదీ.. మైకు దొరికితే మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు తెగ చేస్తారని విమర్శించారు. 2000 రూపాయల నోటు మీద ఉర్జిత్ పటేల్ సంతకం ఉందని, అయితే, ఆర్థిక కార్యదర్శి మాత్రం నోట్లు ఆరు నెలల కింద నుంచే ముద్రిస్తున్నట్లు చెప్పారని, అదే నిజమైతే.. రఘురాం రాజన్ సంతకం ఉండాలిగా అని ప్రశ్నించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాల్సిందేనని రఘువీరా డిమాండ్ చేశారు. -
టీడీపీ రాక్షస పాలన సాగిస్తోంది
విజయవాడ సెంట్రల్ : రాష్ట్రంలో టీడీపీ రాక్షస పాలన సాగిస్తోందని ఏపీసీసీ కాపు రిజర్వేషన్ సాధికారిత విభాగం సభ్యులు పి.సూరిబాబు, నరహరిశెట్టి నరసింహారావు ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్లో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ముద్రగడ పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా పోలీసులు గృహ నిర్బంధం చేయడం టీడీపీ అరాచకత్వానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎవరి అనుమతితో చంద్రబాబు పాదయాత్ర సాగించారని, టీడీపీ నాయకులు చేస్తున్న జనచైతన్య యాత్రలకు లేని అనుమతి ముద్రగడ యాత్రకు ఎందుకు? అని నిలదీశారు. ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముద్రగడ అడుగుతున్నారు తప్ప గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. కాపుల్లో చీలిక తెచ్చేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, అందుకే కపట ప్రేమ నటిస్తున్నారని దుయ్యబట్టారు. కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి వెయ్యికోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన బాబు గడిచిన 28 నెలల్లో ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. ముద్రగడ దీక్షల వెనుక వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నారని టీడీపీ నేతలు విమర్శలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమనారు. అరెస్ట్‌లతో కాపు ఉద్యమాన్ని నిలువలేరని వారు స్పష్టం చేశారు. ఏపీసీసీ కాపు రిజర్వేషన్ సాధికారిత కమిటీ నాయకులు ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
'టీడీపీ, బీజేపీలతో రాజకీయాలు కలుషితం'
సాక్షి, అమరావతిః అధికార తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీలు రాజకీయాలను కలుషితం చేస్తున్నాయని, మహానేతలైన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ సర్థార్వల్లభాయ్ పటేల్‌లకు మధ్య విభేదాలున్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో సోమవారం ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో ఇందిర గాంధీ 32వ వర్థంతి, సర్ధార్ వల్లభాయ్ పటేల్ 130 జయంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్, ఇందిర గాంధీలు జాతి కోసం అహర్నిశలు పని చేశారని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని రఘువీరా కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సంకుచిత భావాలతో రాజకీయాలు చేస్తున్నారని, మహనాయకులపై ప్రజలకు లేని అనుమానాలను నూరిపోస్తున్నారని ధ్వజమెత్తారు. కుల, మత వ్యవస్థ, ప్రాంతాలకు అతీతంగా ఇందిరాగాంధీ సంస్కరణలు చేపట్టారని గుర్తుచేసిన రఘువీరా.. 'చంద్రబాబుకు జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీనే. మదనపల్లిలో ఇందిర గాంధీ కాళ్లమీద పడి ఎమ్మెల్యే సీటు సంపాదించిన బాబు ఆ విషయం ఎప్పుడో మర్చిపోయినట్లున్నారు'అని అన్నారు. కాంగ్రెస్ పుణ్యంతోనే చంద్రబాబు ఎన్టీఆర్ కు అల్లుడయ్యారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.వి.పి. రామచంద్రరావు, శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య, ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాదయాత్రతో టీడీపీ గుండెల్లో రైళ్లు
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే తమకు నూకలు చెల్లుతాయని హడలిపోతున్నారని అందుకే టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు అవాకులు, చవాకులు పేలుతున్నారని ఏపీసీసీ అధికార ప్రతినిధి డా.ఎన్.తులసిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్‌లు మండిపడ్డారు. ఇందిరాభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఏపీసీసీ అధ్యక్షుడు డా.ఎన్.రఘువీరారెడ్డి గతంలో వ్యవసాయం మంత్రిగా ఉన్నప్పుడు మేఘమథనంలో అవినీతి జరిగినట్లు టీడీపీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 2014 అక్టోబర్ 8న రఘువీరారెడ్డి మేఘమథనం, ఇతర ఆరోపణలపై న్యాయవిచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాసినట్లు ఈ సందర్భరంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేఖ విధానాలకు పాల్పడుతుండటం శోచనీయమన్నారు. ఒకవైపు అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని, ఏపీని 2022 కల్లా దేశంలో 3 అభివృద్ధి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 కల్లా దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా, 2050 కల్లా ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు రైతులకు బుట్టశనగ విత్తనాలు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉండటం దురదృష్టకరమన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.5వేల కోట్లతో మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్‌ను ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాట ధర లేనప్పుడు ఆదుకుంటామని హామీనిచ్చి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లిగడ్డ రైతులు పంట పండి కొనేనాధుడు లేక లబోదిబోమంటుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండి పోవడం రైతుల నోట్లో మట్టికొట్టడమేనన్నారు. తన కార్యాలయ సోకుకు, విదేశీయాత్రలకు, ప్రత్యేక విమానాలకు, గోదావరి, కృష్ణా పుష్కరాలకు, రాజధాని భూమి పూజకు, శంకుస్థాపనకు, తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు దుబారా చేస్తున్న ముఖ్యమంత్రి రైతుల వద్దకు వచ్చేసరికల్లా చేతులు రాకపోవడం బాధాకరమన్నారు. గత మూడేళ్లుగా రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిబీ ఇవ్వలేదని, రుణమాఫీ ఒక ప్రహసనంగా మారిపోయిందని, వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యంలో 50 శాతం కూడా దాటలేదన్నారు. కడప జిల్లాలో 2012-13 రబీకి సంబంధించి పంటల బీమా సొమ్ము ఇప్పటివరకు ఇవ్వలేదని, మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎంఎస్ స్వామినాధన్ నివేదికను అమలు చేయకుండా బుట్ట దాఖలు చేశారన్నారు. రైతుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేఖత నివురుకప్పిన నిప్పులా ఉందని, ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు రైతు సమస్యలపై పాదయాత్ర చేస్తుంటే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని ఆ స్పీడును తట్టుకోలేక వారి నోటికి ఇష్టం వచ్చినట్లు హద్దూపొద్దూ లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇదే విషయమై మరొక్క సారి సవాల్ చేస్తున్నాం... ఇప్పటికైనా విచారణ జరిపి నిగ్గు తేల్చండి లేదా నోరు మూసుకోండి అని ఏపీసీసీ హెచ్చరించింది. -
'అబద్ధాలతో జనంపై టీడీపీ దండయాత్ర'
విజయవాడ: వేల అబద్ధాలతో తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై దండయాత్ర చేస్తూ పాలన చేస్తుందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు సమర్ధవంతంగా ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు కృషి చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు డా.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. విజయవాడలో గురువారం ఏపీసీసీ అధికారులు ప్రతినిధుల అవగాహన సదస్సు ప్రారంభించిన సందర్భంగా రఘువీరా మాట్లాడారు. టీడీపీ-బీజేపీలు ఎన్నికల మేనిఫెస్టోలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త కొత్త అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని రఘువీరా మండిపడ్డారు. రాష్ట్రంలో మీడియాను కూడా నియంత్రిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధులు సమర్ధవంతంగా టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎదుర్కోవాలని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి జన్మభూమి కమిటీల వరకూ చేరి పాలన పూర్తిగా అవినీతిమయం అయిపోయిందని, వేలకోట్ల అవినీతి జరుగుతుందని.. దీన్ని కాంగ్రెస్ నేతలు సమర్ధవంతంగా తగిన సమాచారంతో ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు. ప్రత్యేక హోదా అమలు చేయకుండా బీజేపీ-టీడీపీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశాయని, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లి 11 పార్టీలను ఇందుకోసం సమీకరించిందని రఘువీరా పేర్కొన్నారు. -
13,14 తేదీల్లో ఏపీసీసీ శిక్షణ తరగతులు
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులకు శిక్షణ తరగతులను ఈ నెల 13,14 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ప్రతినిధి ఎస్.ఎన్ రాజా ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి, ప్రజాసమస్యలను క్షేత్ర స్థాయిలో కి తీసుకెళ్లేందుకు రెండు రోజుల పాటు తొమ్మిది అంశాలపై శిక్షణను నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదాపై మండల స్థాయిలో పోరాడేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నట్లు రాజా వెల్లడించారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, నగర అధ్యక్షులు మల్లాది విష్టు ఆధ్వర్యంలో తరగతులు జరుతాయన్నారు. -
సీఎంగా చంద్రబాబు ఉన్నంత వరకూ ఇంతే..
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరా రెడ్డి విమర్శించారు. కరువు మండలాలను ప్రకటించడంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కరువు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లాలో ఆదివారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు లేక పంటలు ఎండిపోతే చంద్రబాబు రెయిన్ గన్స్ పేరుతో రైతులను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు ఏపీలో కరువు ఉంటుందని రఘువీరా అన్నారు. -
చంద్రబాబు నెంబర్‌వన్ అవినీతిపరుడు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే నెంబర్ వన్ అవినీతిపరుడని ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఏపీని అవినీతి ప్రదేశ్‌గా చంద్రబాబు మారుస్తున్నారని విమర్శించారు. ఏపీ రాజధాని నిర్మాణం కాంట్రాక్టును విదేశాలకు కట్టబెట్టడం ప్రమాదకరమని రఘువీరా హెచ్చరించారు. వర్షాలు లేక రైతులు పంటలను నష్టపోయారని, ప్రభుత్వం 24 గంటల్లో కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
ఆ భయంతోనే బాబు తప్పుడు ప్రచారం!
విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ప్యాకేజీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందుకే టీడీపీ నేతలకు శిక్షణ కార్యక్రమంలో ఆయన ప్యాకేజీ జపం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యం అని పేర్కొంటూ హోదా కోసం గతంలో చంద్రబాబు మహానాడులో తీర్మానం చేశారని, కానీ హోదా సాధించుకొనే శక్తి లేక.. తన సొంత ప్రయోజనాల కోసం హోదాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. టీడీపీ నేతల శిక్షణ తరగతుల్లో ప్యాకేజీపై ప్రచారం చేయాలని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు చెప్పడం వెనుక ఆయనకున్న భయం అర్థమవుతోందని పేర్కొన్నారు. హోదా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సొంతప్రయోజనాల కోసమే ప్యాకేజీని స్వాగతిస్తున్నారని రఘువీరా విమర్శించారు. హోదా విషయంలో 'ప్రజల వద్దకే కాంగ్రెస్' పేరిట తిరుపతిలో ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని, రానున్న రోజుల్లో ప్రజలే హోదా కావాలా? వద్దా? అనేది చెపుతారని ఆయన పేర్కొన్నారు. హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. -
28న ప్రత్యేక హోదా ప్రజాబ్యాలెట్
–కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి భీమవరం టౌన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజాతీర్పు కోరుతూ ఏపీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 28న తిరుపతిలో ప్రజాబ్యాలెట్ నిర్వహించనున ్నట్టు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. భీమవరంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి తర్వాత జిల్లాల వారీగా బ్యాలెట్ కార్యక్రమం చేపడతామన్నారు. అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చాక హోదా అలంకారప్రాయమని అనడం సరికాదని ఆమె అన్నారు. విభజనకు బీజం వేసింది బీజేపీయే అని విమర్శించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముగ్గురు ఇన్చార్జిలను నియమించారని డీసీసీ అధ్యక్షుడు రఫీఉల్లాబేగ్ తెలి పారు. పనబాక లక్ష్మి, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి నర్సింహరావు, సీనియర్ నేత రవణం స్వామినాయుడును నియమించారన్నారు. కరపత్రాల ఆవిష్కరణ టీడీపీ, బీజేపీ రెండేళ్ల పాలనా వైఫల్యాలు, హామీల అమలులో వంచన, ప్రత్యేక హాదాపై చేస్తున్న ద్రోహం తదితర అంశాలతో రూపొందించిన కరపత్రం, రాష్ట్ర విభజనకు ప్రధాన పార్టీలు ఇచ్చిన లేఖలు ముద్రించిన మరో కరపత్రాన్ని భీమవరంలో కాంగ్రెస్ నేతలు ఆవిష్కరించారు. -
'అది తెలుగు దద్దమ్మల పార్టీ'
మంత్రాలయం: తెలుగుదేశం పేరుతో ప్రస్తుతం మనుగడలోఉన్న పార్టీ ఎన్టీఆర్ స్థాపించింది కాదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. ఇప్పుడు టీడీపీ అంటే తెలుగు దద్దమ్మల పార్టీ అని ఆయన విమర్శించారు. కపటనాటకాలతో తెలుగు ప్రజలను మోసం చేస్తున్నదంటూ టీడీపీపై విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ఎస్వీబీ అతిథిగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన తులసిరెడ్డి.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, 108వ సెక్షన్ అమలు వంటి కీలక అంశాలు పొందుపర్చారని, ఈ మూడు సూత్రాలకు ఎన్డీఏ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయనందునే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామన్న కేంద్ర మంత్రుల వ్యాఖ్యల్లో నిజంలేదని, ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ ప్రత్యేక హోదా ఇవ్వరాదని ఎక్కడా సూచించలేదని తులసిరెడ్డి గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగానే ఎన్డీఏ ఏపీకి ప్రత్యేక హోదాను నిరాకరిస్తోందని అన్నారు. -
10న జాతీయ రహదారుల దిగ్భంధం: ఏపీసీసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) ఈ నెల 10వ తేదీన జాతీయ రహదారుల దిగ్భంధానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా గురువారం ఇందిరాభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ ప్రధానకార్యదర్శి జంగా గౌతమ్, ఉపాధ్యక్షులు సూర్యా నాయక్, లీగల్ సెల్ చైర్మన్ సుందర రామశర్మలతో కలిసి మాట్లాడారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడులను ఉద్దేశించి రెండు ప్రశ్నలు వేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మార్చి1,2014న కేబినేట్ తయారు చేసిన బిల్లులో ఉందా లేదా?. రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై రెండుసార్లు తీర్మానం ఎవరిని మోసగించేందుకు? అని ప్రశ్నించారు. బుధవారం ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్లు పెట్టి ఏపీ ప్రజల ప్రయోజనాలను తుంగలో తొక్కారని అన్నారు. పార్లమెంటు సాక్షిగా ఓ మాజీ ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను.. ప్రస్తుతం ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్న నరేంద్ర మోదీ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. గత పరిపాలకుల నిర్ణయాలను పట్టించుకోని మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు విలువేముంటుందని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని చెప్పారు. -
'బాబు బాగోతం బయటపడుతుంది'
-
'బాబు బాగోతం బయటపడుతుంది'
విశాఖ: ఓటుకు కోట్లు కేసులో దోషులెవరో తేల్చాలని ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసును సీబీఐతో దర్యాప్తు చేయిస్తే.. చంద్రబాబు బాగోతం బయటపడుతుందని తెలిపారు. కాగా ఈ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన బాబుకు ఏ మాత్రం నైతికత ఉన్నా.. వెంటనే రాజీనామా చేయాలన్నారు. -
చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు
లక్ష కోట్ల పెట్టుబడులు ఏమయ్యాయి? విజయవాడ సెంట్రల్ : సీఎం చంద్రబాబు అబద్ధాలతో రోజులు గడుపుతున్నారని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి పి.సూరిబాబు విమర్శించారు. సోమవారం ఆంధ్రరత్నభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో 331 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు, రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని 21 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని అనుమతులు వస్తాయని బాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు.పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తమ వద్ద ఎలాంటి ఒప్పందాలు లేవని ఏపీ ఇండస్ట్రీస్ డైరెక్టర్ తెలిపారన్నారు. అంటే 331 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బాబు చెప్పినవన్నీ అబద్ధాలే అన్న విషయం స్పష్టమైందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఏ పరిశ్రమను ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ప్రజాప్రతినిధులు ఎన్ని పరిశ్రమల ద్వారా ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పాలన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నట్లు పదేపదే చెబుతున్న చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఎలా ఇరుక్కున్నారని ఎద్దేవా చేశారు. -
పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే అడ్డంకి
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అడ్డంకి అని ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. అందుకే పట్టిసీమ, పురుషోత్తంపట్నం ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు ఎన్ తులసి రెడ్డి, సూర్యా నాయక్, ప్రధాన కార్యదర్శులు జంగా గౌతమ్, గిడుగు రుద్రరాజు, రాజా, కిసాన్ సెల్ చైర్మన్ కే రవిచంద్రారెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు. పోలవరాన్ని ముందుకుతీసుకెళ్లడం చంద్రబాబుకు, కేంద్రానికి ఇష్టంలేదని రఘువీరా అన్నారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగే పరిణామాలేంటో చంద్రబాబు గ్రహించాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటే చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు టీప్రాజెక్టులపై మౌనంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును చంద్రబాబు నిలదీయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పోలవరం నిర్మాణపు పనులు, అనుమతులు, పర్యవేక్షణ, పునరావాస వసతి, 2018లోపు ప్రాజెక్టు పూర్తి చేయడం వంటి అంశాలున్నాయని రఘువీరా చెప్పారు. చట్టంలో ఉన్న ప్రతిదాన్ని కేంద్రప్రభుత్వమే అమలు చేయాలని, పోలవరంపై చంద్రబాబు పర్యవేక్షణ అవసరంలేదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 32 శాతం పనులు పూర్తయ్యాయని, చంద్రబాబు అధికారం చేపట్టి 26 నెలలు గడిచినా పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడంలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వానికి అప్పగించి 2018లోపు పూర్తయ్యే విధంగా చంద్రబాబు పోరాడాలని రఘువీరా డిమాండ్ చేశారు. -
చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారు
-
'తొలగించిన వైఎస్ఆర్ విగ్రహాన్ని తిరిగి పెట్టాలి'
-
'తొలగించిన వైఎస్ఆర్ విగ్రహాన్ని తిరిగి పెట్టాలి'
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన స్థానంలో తిరిగి పెట్టాలని ఏపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది భక్తులు వైఎస్ పథకాలను స్మరించుకుంటారనే ఆయన విగ్రహాన్ని తొలగించారని రఘువీరా విమర్శించారు. -
'ఇది టీడీపీ నీచ రాజకీయాలకు నిదర్శనం'
విజయవాడ : నగరంలోని దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం కూల్చివేత అమానుష చర్య అని ఏపీ పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు. శనివారం విజయవాడలో కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ.. ఈ చర్య టీడీపీ నీచ రాజకీయాలకు ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. ప్రజలు మెచ్చిన మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని కొలనుకొండ శివాజీ వెల్లడించారు. -
ఘనంగా కాసు బ్రహ్మనందరెడ్డి జయంతి
హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 107వ జయంతి వేడుకలను గురువారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) ఘనంగా నిర్వహించింది. ఇందిరాభవన్ లో ఏర్పాటుచేసిన బ్రహ్మానంద రెడ్డి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు ఎన్. తులసిరెడ్డి, మాదాసు గంగాధరంలు సూర్యానాయక్, కిసాన్ సెల్ చైర్మన్ కే రవిచంద్రారెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మానందరెడ్డి, వైయస్ఆర్ లు బతికుంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఉండేది కాదన్నారు. 1946లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కాసు.. 1977లో ఏఐసిసి అధ్యక్షులుగా ఎంపికయ్యారని గుర్తుచేశారు. బ్రహ్మానంద రెడ్డి వారసుడిగా కాసు వెంకట కృష్ణారెడ్డి రావాలని కోరుకుంటున్నామని గంగాధరం అన్నారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసినపుడు హైదరాబాద్ లో అనేక జాతీయ పరిశ్రమల స్థాపనకు కృషి చేసి అభివృద్ధికి కారణమయ్యారని చెప్పారు. నాగార్జునసాగర్, తుంగభద్ర, పోచెంపాడు పనులు బ్రహ్మానందరెడ్డి హయాంలోనే పూర్తి అయ్యాయని అన్నారు. -
బాబు, వెంకయ్యలకు రఘువీరా లేఖ
హైదరాబాద్ : ప్రధాని అధ్యక్షతన జరగనున్న ఎన్డీసీ సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రతిపాదించి.. ఆమోదించేందుకు సహకరించవలసిందిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం వారిద్దరికి పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖను హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో రఘువీరా విడుదల చేశారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో పాటు... బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ఈ సందర్భంగా సదరు లేఖలో వారికి రఘువీరా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇటీవల లోక్‌సభలో ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన లేఖలో పొందుపరిచారు. అంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతుంది. అయినా ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడంపై రఘువీరా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పీసీసీ చీఫ్ రఘువీరా అటు చంద్రబాబుకు .. ఇటు వెంకయ్యనాయుడుకు ప్రత్యేక హోదాకు సహకరించాలని లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పీసీసీ చేస్తున్న పోరాటాన్ని రఘువీరా సోదాహరణగా వివరించారు. బీజేపీ అగ్రనాయకుడిగా మీ పార్టీ ముఖ్యమంత్రుల మద్దతు కోసం కృషి చేయాలని వెంకయ్యను రఘువీరా కోరారు. శనివారం (16-06-2016) న్యూఢిల్లీలో నరేంద్ర మోదీ అధ్యక్షతన నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. -
కృష్ణా పుష్కర పనుల్లో భారీ అవినీతి: శివాజీ
విజయవాడ : కృష్ణా పుష్కర పనుల్లో భారీ అవినీతి జరగుతోందని పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఆరోపించారు. బుధవారం విజయవాడలో కొలనుకొండ శివాజీ విలేకర్లతో మాట్లాడుతూ... పుష్కర పనుల్లో టెండర్లు లేకుండానే రూ. 106 కోట్ల పనులు టీడీపీ నేతలకు అప్పగించారని విమర్శించారు. దీనికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేనే ఉమా బాధ్యత వహించి... అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని శివాజీ డిమాండ్ చేశారు. -
సదావర్తి అక్రమాలపై నేడు గవర్నర్‌కు ఫిర్యాదు
హైదరాబాద్: తమిళనాడులోని సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేయాలంటూ ఏపీసీసీ నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా ఆధ్వర్యంలో నేతలు బుధవారం సాయంత్రం గవర్నర్‌తో భేటీ అవుతారు. ఈ భూముల వేలంలో అధికార టీడీపీ నాయకులు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని నేతలు ఫిర్యాదు చేయనున్నారు. -
ప్రజలకు 'అచ్చేదిన్ బదులు చచ్చేదిన్'..
హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం పెంచిన వ్యాట్ లను ఉపసంహరించుకోవాలని ఏపీసీసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ మాజీ సభ్యుడు డా.ఎన్. తులసిరెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 2019 ఎన్నికల్లో కేంద్రలోని ఎన్డీఏ ప్రభుత్వం 'ముక్త భారత్', టీడీపీ ప్రభుత్వం 'ముక్త ఆంధ్రా'గా మారక తప్పదని, ప్రజలు 'అచ్చేదిన్ బదులు చచ్చేదిన్'లను చవిచూస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఇందిరాభవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు సూర్యానాయక్ తో కలిసి పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆరు వారాల్లో నాలుగు సార్లు పెంచడం దారుణమన్నారు. మన దేశ అవసరాలలో దాదాపు 75 శాతం వరకు పెట్రోలు, డీజిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2013లో అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ముడి చమురు ధర 140 డాలర్లుగా ఉన్నప్పుడు దేశంలో పెట్రోలు ధర రూ.60, డీజిల్ ధర రూ.50 ఉండేదన్నారు. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 49.29 డాలర్లు ఉంది. ఆ ప్రకారం ఇక్కడ లీటర్ పెట్రోలు ధర రూ.22, డీజిల్ ధర రూ.18 గా ఉండాలని కానీ, మోదీ, చంద్రబాబుల జోడీ పాలనలో పెట్రోలు ధర రూ.70, డీజిల్ ధర రూ.60లుగా ఉండటం విడ్డూరమన్నారు. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య దళారీలుగా వ్యవహరించడమేనని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై ఆరుసార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. చంద్రబాబు ప్రభుత్వం 2015 మార్చి 1 నుంచి నాలుగు రూపాయల వ్యాట్ అదనంగా విధించి ప్రజలపై మరింత భారం మోపిందన్నారు. దీని ద్వారా గత రెండేళ్లలో మోదీ, బాబు ప్రభుత్వాలు దాదాపు రూ.3 లక్షల కోట్లను ప్రజల నుంచి దోచుకున్నారని మండిపడ్డారు. మోదీ, బాబు ప్రభుత్వాలు అదనంగా విధించిన ఎక్సైజ్ సుంకాన్ని, వ్యాట్ లను ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. -
ఆ ప్రొఫెసర్లను తిరిగి విధుల్లోకి తీసుకోండి: ఏపీసీసీ
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ) ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం అన్యాయం, అప్రజాస్వామికమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) వ్యాఖ్యనించింది. ప్రొఫెసర్లు కేవై రత్నం, సదాగత్ సేన్ గుప్తాలపై యూనివర్సిటీ సస్పెన్షన్ వేటు వేయడాన్ని ఖండించింది. వీరిపై వెంటనే సస్పెన్షన్ ను ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం బీజేపీ నియంతృత్వ ధోరణికి మరో ఉదాహరణ అని ఏపీసీసీ అధికార ప్రతినిధి జంగా గౌతమ్ అన్నారు. ఓ వైపు అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలంటూనే మరో వైపు దళితులను అణివేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. -
మీరు తెలంగాణ పై దృష్టిపెట్టండి: మాదాసు గంగాధరం
- వీహెచ్ కు ఏపీసీసీ ఉపాధ్యక్షుడి సలహా - పవన్ కళ్యాణ్ ను కాపు ఉద్యమంతో ముడిపెట్టదన్న గంగాధరం హైదరాబాద్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కాపు ఉద్యమంలోకి లాగవద్దని తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంత రావుకు ఏపీ సీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు ఉద్యమం కేవలం ముద్రగడ కుటుంబ సమస్య కాదని అన్నారు. కాగా.. వీహనుమంత రావు సీనియర్ ఎంపీగా పనిచేశారని.. ఆయన తెలంగాణ శ్రేయస్సుపై దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. పిలవని పేరంటానికి వచ్చినట్లు ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి.. పవన్ కళ్యాణ్ ను కాపు ఉద్యమానికి ముడిపెట్టి మాట్లాడటం సరికాదని అన్నారు. విభజన చట్టంలోని హామీలు నెరవేరలేదని, ఆంధ్ర ప్రదేశ్ ఇబ్బందుల్లో ఉందన్నారు. ముద్రగడ దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.