'ఏపీలో 8 జిల్లాలు ఎడారిగా మారతాయి' | Raghuveera reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

'ఏపీలో 8 జిల్లాలు ఎడారిగా మారతాయి'

Published Wed, Apr 6 2016 5:40 PM | Last Updated on Sat, Aug 18 2018 9:13 PM

కృష్ణానదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు.

విజయవాడ : కృష్ణానదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. బుధవారం విజయవాడలో పాలమూరు - రంగారెడ్డి, కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో రఘువీరారెడ్డి సమావేశమై... చర్చించారు.

ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరిపితే ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది జిల్లాలు ఎడారిగా మారతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాస్పద ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రంతో చర్చించేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని ఈ సందర్భంగా చంద్రబాబును రఘువీరా డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement