హోదా కోసం ఎస్ఎంఎస్ల ఉద్యమం | SMS movement in ap starts on september 23 in visakhapatnam | Sakshi
Sakshi News home page

హోదా కోసం ఎస్ఎంఎస్ల ఉద్యమం

Published Sat, Sep 19 2015 1:04 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

SMS movement in ap starts on september 23 in visakhapatnam

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కోటి ఎస్ఎంఎస్ల ఉద్యమం చేయనున్నట్లు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. ఈ ఉద్యమాన్ని సెప్టెంబర్ 23న విశాఖపట్నంలో ప్రారంభిస్తామని తెలిపారు. శనివారం ఇందిరాభవన్లో రాష్ట్రంలోని 13 జిల్లాల యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలతో రఘువీరారెడ్డి సమావేశమయ్యారు.

ప్రత్యేక హోదా కోసం ఎస్ఎంఎస్ ఉద్యమంపై ఆయన జిల్లా నేతలతో మాట్లాడారు. అనంతరం వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... ప్రధానితోపాటు కేంద్రమంత్రులుకు ఎస్ఎంఎస్ సందేశాలు ఇస్తామని రఘువీరారెడ్డి చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement