ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నారు | tdp and bjp are deceiving people on special status, says raghuveera reddy | Sakshi
Sakshi News home page

ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నారు

Published Fri, Aug 7 2015 1:20 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నారు - Sakshi

ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి చెప్పారు. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా సాధ్యం కాదనడం ప్రజలను వంచించడమేనని ఆయన అన్నారు. కేబినెట్ నిర్ణయం ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని చెప్పారు. టీడీపీ అవినీతి సొమ్ము కోసమే పోలవరం కాకుండా పట్టిసీమ ప్రాజెక్టును చేపడుతోందని ఆయన అన్నారు.

2019 సంవత్సరానికల్లా పోలవరం పూర్తికాకుండా తెలుగుదేశం పార్టీ దోషిగా మిగలడం ఖాయమని రఘువీరా స్పష్టం చేశారు. తెలుగుదేశం, బీజేపీ పెద్దలు సొంత సంపాదనపై దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వీళ్ల బాగోతాన్ని ఎండగట్టేందుకే తిరుపతిలో ప్రత్యేక హోదా అంశంపై నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement