గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి రాజధాని గ్రామాల్లో ఆంధ్రపదేశ్ పీసీపీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ ఇతర నేతలు సోమవారం ఉదయం పర్యటించారు. ఇటీవల తుళ్లూరు ప్రాంతంలో మంటలు రేగిన ప్రాంతాలను వారు పరిశీలించారు.
కాగా రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న గ్రామాల్లో దుండగులు గత నెల 29న అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. వరిగడ్డి వాములు, కూరగాయల తోటల పందిళ్లు, గుడిసెలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పెనుమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడంలో పాటు మూడు గ్రామాల్లో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.