
రైతులకు ఏనాడైనా మేలు చేశావా?
చంద్రబాబుపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై రైతాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా వంచించారంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఇందిరాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఏనాడూ రైతులకు మేలు చేసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రధానికి లేఖ రాయడంపై రఘువీరారెడ్డి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.