మాజీ సీఎం కుమారుణ్ని సస్పెండ్ చేసిన కాంగ్రెస్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు.. ఏపీసీసీ జనరల్ సెక్రటరీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించారు.
పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందునే రామ్కుమార్ రెడ్డిని సస్సెండ్ చేసినట్లు ఆదివారం హైదరాబాద్లో రఘువీరా మీడియాకు చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటిచేసి ఓటమిపాలైన రామ్కుమార్.. బీజేపీలో చేరతారనే వార్తలు గత కొద్దికాలంగా బలంగా వినిపిస్తున్నాయి. ఆయన కూడా ఈ వార్తలను ఖండించకపోవడం గమనార్హం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో రామ్ కుమార్ రెడ్డి కషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలిసింది.