ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అమరావతి నియోజకవర్గం ఎమ్మెల్యే సుల్భా ఖోడ్కేపై కాంగ్రెస్ ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ ఏడాది ప్రారంభంలో శాసన మండలి ఎన్నికల్లో.. ప్రతిపక్షాల మహా వికాస్ అఘాడి కూటమి అభ్యర్థి పీడబ్ల్యూపీ నేత జయంత్ పాటిల్ ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ చేసిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో సుల్భా ఖోడ్కే ఒకరు.
Maharashtra Pradesh Congress has expelled Amravati MLA Sulabha Khodke from the party for six years due to anti-party activities. pic.twitter.com/p3lUIbWEYk
— ANI (@ANI) October 12, 2024
అయితే ఆమె పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఒక ప్రకటనలో తెలిపారు. అందుకే పార్టీ మహారాష్ట్ర ఇంచార్జి రమేష్ చెన్నితాల ఆదేశాల మేరకే ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment