ముంబై: కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన విమర్శలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అకోలాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో గురువారం మోదీ పాల్గొని ప్రసంగించారు. పాకిస్తాన్ అజెండాను కాంగ్రెస్ అమలు చేస్తోందని మండిపడ్డారు.
‘‘ఆర్టికల్ 370 పునరుద్దరణ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించం. ఇటీవల హర్యానా ప్రజలు మూడోసారి బీజేపీకీ పట్టం కట్టారు. మహారాష్ట్ర ప్రజలు ఎన్డీయే అభివృద్ధి అజెండాను మాత్రమే నమ్ముతారు. మహారాష్ట్రలో ఎన్డీయేకు అనుకూలంగా హవా కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు గాంధీ కుటుంబానికి ఏటీఎంలు.
#WATCH | Nanded, Maharashtra: Prime Minister Narendra Modi says "Today, there is a wave in favour of Mahayuti and BJP in the entire Maharashtra. Today, the country is moving forward with the aim of 'Viksit Bharat' and the people of the country know that BJP and its allies are… pic.twitter.com/mgzhExOHkn
— ANI (@ANI) November 9, 2024
తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ నుంచి వేల కోట్లు మహా రాష్ట్రకు తరలిస్తున్నారు. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాంగ్రెస్ రాజ కుటుంబానికి కప్పం కడుతున్నారు.తెలంగాణ, కర్ణాటకలో వసూలు చేసన డబ్బును మహారాష్ట్ర ఎన్నికల్లో పంచుతున్నారు. ప్రస్తుతం దేశం ‘విక్షిత్ భారత్’ లక్ష్యంతో ముందుకు సాగుతోందని దేశ ప్రజలకు తెలుసు. బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అదే లక్ష్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అందుకే ప్రజలు బీజేపీ, ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని పదేపదే ఎన్నుకుంటున్నారు.
...మొదట నేను.. మోదీకి సహాయం చేయమని అడుగుతున్నా. రెండోది.. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం అడుగుతున్నా. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. గత రెండు రోజులుగా నేను మహారాష్ట్రలో ఎక్కడికి వెళ్లినా మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమిని గెలిస్తారని వినిపిస్తోంది. మహారాష్ట్ర అభివృద్ధి కోసం మహాయుత ప్రభుత్వం అవసరమని ప్రజలు కోరుకుంటున్నారు ’’అని అన్నారు.
చదవండి: ప్రధాని మోదీ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు: సీఎం రేవంత్
Comments
Please login to add a commentAdd a comment