సాక్షి,ముంబయి : మహారాష్ట్రలో బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం(నవంబర్ 9)రేవంత్‌రెడ్డి ముంబైలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ‘ప్రధాని మోదీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీల అమలుపై అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు.
మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే..మేం నిజాలు చెబుతూనే ఉంటాం..అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చా.దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయి. నల్లచట్టాలు తెచ్చి అదానీ,అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం.
ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశాం. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చాం. ఆ తర్వాత ప్రధాని తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారు.
వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నాం. కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి మా ప్రభుత్వం అందించింది.సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టాం.ఎంతో ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకి వెళ్లకూడదు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారు.మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించండి’అని రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం
Comments
Please login to add a commentAdd a comment