ముంబై: కాంగ్రెస్ పార్టీ హిందువులను విభజించాలని చూస్తోందని ప్రధానమంత్రి మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తోందని దుయ్యబట్టారు. సమాజంలో విష బీజాలు నాటుతోదని, కాంగ్రెస్ కుట్రలు హర్యానాలో విఫలమయ్యాయని అన్నారు. ప్రధాని మోదీ బుధవారం మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు.
‘‘నిన్న(మంగళవారం)నే హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. హర్యానా ఫలితాలు దేశంలో మూడ్ ఎలా ఉందో చెప్పేసింది. హర్యానాలో వరుసగా మూడోసారి ఎన్నిక కావడం చారిత్రాత్మకం. హిందువుల్లో కులాల మధ్య చిచ్చుపెట్టడమే కాంగ్రెస్ విధానం. హిందువులు ఎంతగా చీలిపోతే అంత ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది.
..రాజకీయ లబ్ధి పొందేందుకు హిందూ సమాజం విభజించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఇదే ఫార్ములాను ఉపయోగిసోస్తోంది. దళితులు, రైతులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే వారి ప్రయత్నాలు హర్యానాలో బెడిసికొట్టాయి.
..కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించే పనిలో నిమగ్నమైంది. కానీ కాంగ్రెస్ కుట్రలన్నీ ధ్వంసమయ్యాయి. దళితుల్లో అసత్యాలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించింది. కానీ దళిత సమాజం కాంగ్రెస్ ప్రమాదకరమైన ఉద్దేశాలను పసిగట్టింది. దళితులు కాంగ్రెస్ ఆలోచనలను గ్రహించారు. వారి రిజర్వేషన్‌ను లాక్కోని ఓటు బ్యాంకును విభజించాలని కాంగ్రెస్ భావిస్తోంది’ అని మోది అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment