ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రవి రాజా.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేరారు. అంతకు ముందు రాజీనామా ప్రకటన చేసి 44 ఏళ్ల హస్తం పార్టీతో అనుబంధం తెంచేసుకున్నారాయన.
ఐదుసార్లు ముంబై నగర కార్పొరేటర్‌గా గెలిచిన రవి రాజా.. గురువారం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్‌తో భేటీ అయ్యారు. ఆ టైంలో ఆయన్ని బీజేపీలోకి ఆహ్వానించారంతా. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. చాలా మంది ప్రముఖ కాంగ్రెస్ నేతలు సీనియర్ నేత రవి రాజాను అనుసరించి బీజేపీలోకి వస్తారని జోష్యం చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తిరిగి మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు’ అని అన్నారు
‘‘ముంబైలోని సమస్యలపై రవి రాజా పూర్తి పట్టు ఉంది. ఆయన మా పాత స్నేహితుడు కూడా. రాజా, ఆయన మద్దతుదారులు బీజేపీలో చేరాలని తీసుకున్న నిర్ణయం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ గెలుపు అవకాశాలను బలోపేతం చేస్తుంది’’అని ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ అన్నారు.
మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment