ముంబై: విభజన పేరుతో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తప్పడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మండిపడ్డారు. డీప్యూటీ సీఎం భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు.. మతాన్ని రక్షించే బాధ్యత ప్రజలెందుకు తీసుకోవాలని ప్రశ్నించారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన ర్యాలీని కన్హయ్య కుమార్ మాట్లాడారు. రాజకీయ నాయకులకు అహంకారం పెరిగినప్పుడు ప్రజలు సరైన విధంగా వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. పేరు ప్రస్తావించకుండా శిక్షణ పొందిన క్లాసికల్ సింగర్, బ్యాంకర్ అయిన అమృతా ఫడ్నవిస్ (దేవేంద్ర ఫడ్నవిస్ భార్య) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారని విమర్శలు చేశారు.
‘‘ఇది ధర్మయుద్ధం.. మతాన్ని రక్షించడం గురించి ప్రసంగాలు చేసే ఏ నాయకులను మీరు (ప్రజలు) ప్రశ్నించండి. మతాన్ని రక్షించే పోరాటంలో నాయకుడి స్వంత కొడుకులు, కుమార్తెలు కూడా పాల్గొంటారా? అని నిలదీయండి. అలా సాధ్యమవుతుందా? నాయకుడి పిల్లలు విదేశాల్లో చదువుతున్నప్పుడు ప్రజానీకం మతాన్ని ఎందుకు కాపాడాలి?
..ఉపముఖ్యమంత్రి భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటే.. ప్రజలెందుకు మతాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలి?. అమిత్ షా కుమారుడు జై షా మతాన్ని కాపాడటానికి భాగస్వామి అవుతారా? ఆయన బీసీసీఐలో ఐపీఎల్ జట్లను ఏర్పాటు చేస్తున్నారు. డ్రీమ్ 11లో టీమ్‌లను తయారు చేయమని మనకు చెబుతున్నారు. వాళ్లు మాత్రం క్రికెటర్లు కావాలని కలలు కంటారు. మనం జూదగాళ్లుగా మిగిలిపోవాలా?’’ అని అన్నారు.
చదవండి: యోగి ఆదిత్యనాథ్ విమర్శలపై మండిపడ్డ ప్రియాంక్ ఖర్గే
Comments
Please login to add a commentAdd a comment