ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన విమర్శలుపై కాంగ్రెస్ అధ్యక్షుడ మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే విమర్శలు గుప్పించారు. తన తండ్రి ఖర్గే చిన్ననాటి విషాదాన్ని యోగి ప్రస్తావించటంపై మండిపడ్డారు. ఆ సంఘటనను కాంగ్రెస్ చీఫ్ ఖర్గే.. రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఉపయోగించుకోలేదని అన్నారు. 1948లో తన తండ్రి ఇంటిని తగలబెట్టింది హైదరాబాద్ నిజాం రజాకార్లని, కానీ మొత్తం ముస్లిం సమాజాన్ని కాదని ‘ఎక్స్’లో స్పష్టం చేశారు.
‘‘మా ఇంటిని కూల్చిన చర్యలకు పాల్పడింది రజాకార్లు, కానీ మొత్తం ముస్లిం సమాజం కాదు. ప్రతి సంఘంలో చెడు, తప్పు చర్యలకు పాల్పడే వ్యక్తులు ఉంటారు. నా తండ్రి ఖర్గే.. తృటిలో విషాదం నుంచి తప్పించుకున్నారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగారు’ అని తెలిపారు.
Yes, @myogiadityanath ji, in 1948, the Razakars burned down Sri @kharge ji’s house, taking the lives of his mother and sister. Though he narrowly escaped, he survived and rose to become a 9 time MLA, twice Lok Sabha and Rajya Sabha MP, central minister, the Leader of the Lok…
— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) November 13, 2024
మల్లికార్జున ఖర్గే నిజాంల పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోని బీదర్ ప్రాంతంలో జన్మించారు. భారతదేశంలో విలీనానికి ముందు హైదరాబాద్‌లో చెలరేగిన రాజకీయ అశాంతి సందర్భంగా నిజాం అనుకూల రజాకార్లు ఖర్గే గ్రామాన్ని తగలబెట్టారు. ఈ విషాదంలో ఖర్గే.. తన తల్లి, సోదరి, ఇతర కుటుంబ సభ్యులను కోల్పోయారు.
ఇటీవల మహారాష్ట్రలోని అచల్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ తన ‘బాటేంగే తో కటేంగే (విభజిస్తే నశిస్తాం)’ అనే నినాదంపై మల్లికార్జున్ ఖర్గే చేసిన విమర్శలపై స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘నా మీద కోపం తెచ్చుకోకండి. కావాలంటే హైదరాబాద్ నిజాం మీద కోపం తెచ్చుకోండి. హైదరాబాద్ నిజాం రజాకార్లు మీ గ్రామాన్ని తగలబెట్టారు. హిందువులను దారుణంగా హత్యచేశారు. మీ గౌరవనీయమైన తల్లి, సోదరి, మీ కుటుంబ సభ్యులను హత్యచేశారు. ఎప్పుడైతే విడిపోతామో ఆనాటి క్రూరమైన పద్ధతిలో విడిపోవాల్సి వస్తుందనే సత్యం ప్రస్తుతం దేశం ముందు ఉంది. ముస్లిం ఓటు బ్యాంక్ దెబ్బతింటుందనే భయంతో కాంగ్రెస్ చీఫ్ ఈ సత్యాన్ని అంగీకరించడానికి సంకోచిస్తున్నారు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment