బెంగళూరు: గత కొంత కాలంగా మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.
Amid the MUDA scam, Congress President @kharge's son @PriyankKharge has returned the 5 acres of KIADB land.
The fear among the corrupt is clearly showing. Just wait – soon even the Gandhi-Nehru family will be added to the list! pic.twitter.com/xV19YWwge4— Tulla Veerender Goud (@TVG_BJP) October 13, 2024
ఆయన కుటుంబానికి సంబంధించిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (కేఐఏడీబీ) కేటాయించిన ఐదు ఎకరాల భూమిని స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఖర్గే కుమారుడు రాహుల్ ఖర్గే నేతృత్వంలోని సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ప్రభుత్వం.. బగలూరులోని హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ హార్డ్‌వేర్ సెక్టార్‌లో ఐదు ఎకరాల భూమిని మంజూరు చేసింది.
అయితే ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ నేత అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. కర్ణాటక ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని సిద్ధార్థ విహార్ ట్రస్టుకు కేటాయించగా.. మల్లికార్జున్ ఖర్గే, ఆయన అల్లుడు రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే మొదలైన వారు ట్రస్టీలుగా ఉన్నారు.
ఇక.. ఈ స్థలం కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇటీవల ఓ వ్యక్తి కర్ణాటక గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే తమ ట్రస్టుకు కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకోవటం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment