MUDA Scam
-
సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ముడా ఉచ్చు?
బెంగళూరు : కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ముడా (muda scam) స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో (cm siddaramaiah) పాటు ఇతరులకు చెందిన రూ.300 కోట్ల విలువైన 140 స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) ప్రకటించింది.మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా స్థిరాస్థుల్ని ఈడీ అటాచ్ చేసుకుంది. అటాచ్ చేసిన ఆస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లుగా పనిచేస్తున్న వివిధ వ్యక్తుల పేరిట రిజిస్టరయినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా.. ముడా భూకుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య సతీమణికి భారీ లబ్ధి కలిగిన విషయాన్ని కూడా ఈడీ స్పష్టం చేసింది. సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి నుంచి ముడా 3 ఎకరాల 16 గుంటల భూమిని మొదట రూ.3,24,700కు సేకరించిందని తెలిపింది. ఆ తర్వాత ఖరీదైన ప్రాంతంలో 14 స్థలాలను పరిహారంగా ఇచ్చిందని, వీటి విలువ రూ.56 కోట్లు ఉంటుందని వెల్లడించింది. బినామీల పేరుతో బీఎం పార్వతికి అక్రమంగా ముడా భూముల్ని కేటాయించడంలో నాటి ముడా మాజీ కమిషనర్ డిబి నటేష్ కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ వెల్లడించింది.బీఎం పార్వతితో పాటు పలువురు రియల్ ఎస్టేట్వ్యాపారులకు స్థలాల్ని కేటాయించినట్లు తేల్చింది. ఫలితంగా ఆ స్థలాల్ని భారీ మొత్తానికి అమ్మేలా ఒప్పందం జరిగినట్లుగా ఆధారాల్ని స్వాధీనం చేసుకుంది. ముడా ప్లాట్ల కేటాయింపు ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల బినామీలతో పాటు డమ్మీ వ్యక్తుల పేరు మీద జరిగినట్లు ఈడీ ఆరోపించింది.సోదాల్లో తమకు ప్లాట్లు కేటాయించినందుకు ప్రతిఫలంగా పలువురు అప్పటి ముడా చైర్మన్, ముడా కమీషనర్‌కు భారీ మొత్తంలో స్థిరాస్తుల్ని కట్టబెట్టినట్లుగా తమకు పలు ఆధారాలు లభించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.కాగా, గతంలో ముడా కమిషనర్‌గా పనిచేసిన జీటీ దినేష్‌కుమార్ బంధువుల పేరిట ఆస్తులు, లగ్జరీ వాహనాలు ఇతర కొనుగోళ్లకు సంబంధించి సహకార సంఘం ద్వారా డబ్బు మళ్లించినట్లు తేలిందని ఈడీ ఆరోపించింది.ఏమిటీ ముడా వివాదం? సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపు వివాదానిది మూడు దశాబ్దాల పై చిలుకు నేపథ్యం. మైసూరు జిల్లా కెసెరె గ్రామంలో సీఎం భార్య పార్వతికి 3 ఎకరాల 16 గంటల భూమి ఉంది. దేవనార్ 3ఫేజ్ లేఔట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. పరిహారంగా 50:50 నిష్పత్తి పథకం కింద 2021లో మైసూర్‌లోని ఖరీదైన విజయనగర ప్రాంతంలో ఏకంగా 14 ఖాళీ ప్లాట్లను కేటాయించింది.‘‘పార్వతి నుంచి తీసుకున్న భూమి కంటే వీటి విలువ ఏకంగా రూ.45 కోట్లు ఎక్కువ. 50: 50 పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను సొంతం చేసుకుంది’’ అంటూ అబ్రహాం అనే ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి బహుమతిగా ఇచ్చారని సిద్ధరామయ్య చెప్పగా ఇతరుల భూమిని అక్రమంగా లాక్కున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో పార్వతి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు సిద్ధరామయ్యే సీఎం. ఆమెకు ప్లాట్లు కేటాయించాలని 2017లో ముడా నిర్ణయించింది.ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని విపక్షాలంటున్నాయి. సిద్ధరామయ్య మాత్రం, ‘‘నేను సీఎంగా ఉన్నంతకాలం పరిహారమివ్వడం కష్టమని అధికారులు చెప్పారు. 2021లో బీజేపీ హయాంలో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ప్లాట్లు కేటాయించారు’’ అని వాదిస్తున్నారు. -
విచారణకు రావాలి.. సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కేసు కర్ణాటకలో రాజకీయంగా సంచలనం సృష్టించింది. అయితే.. తాజాగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యను లోకాయుక్త పోలీసులు విచారణకు పిలిచారు.అందులో భాగంగా ఆయనకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక..బుధవారం (నవంబర్ 6) ఉదయం సీఎం సిద్ధరామయ్య తమ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో కోరినట్లు లోకాయుక్త సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు.. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు.‘‘ముడాకు సంబంధించి మైసూర్ లోకాయుక్త పోలీసులు నోటీసు జారీ చేశారు. నవంబర్ 6న మైసూర్ లోకాయుక్తకు వెళ్లుతా’ అని అన్నారు. ఇక.. ఇదే కేసులో ఇటీవల సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి లోకాయుక్త ప్రశ్నించిన విషయం తెలిసిందే.సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో మైసూరులోని లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.Haveri: Karnataka CM Siddaramaiah says, "Yes, Mysore Lokayukta has issued a notice regarding MUDA. I will go to Mysore Lokayukta on 6th November." pic.twitter.com/cWNydSusOR— ANI (@ANI) November 4, 2024ఏమిటీ ముడా భూవివాదం?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది.ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది.కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు.‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు.అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు.అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. -
Muda Scam: సీఎం సిద్ధరామయ్యపై విచారణ.. ముడా ఛైర్మన్ రాజీనామా
బెంగళూరు: మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మరిగౌడ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా మరిగౌడ సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడంటూ పేరుంది. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో మరిగౌడ కారులో బెంగళూరుకు వెళ్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మైసూరుకు తరలించారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగానే రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ముడా స్కామ్‌లో చిక్కుకున్న సీఎంపై విచారణ కొనసాగుతున్న వేళ.. మరిగౌడ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కాగా విజయనగర్‌లోని అప్‌మార్కెట్ మైసూరు ఏరియాలో ఉన్న 14 ప్లాట్ల భూమిని తన భార్యకు అక్రమంగా కేటాయించిందన్న ఆరోపణలపై సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యసతీమణి పార్వతి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ‘ముడా’కు చెందిన 14 ప్లాట్లు తిరిగి అదే సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తాను దర్యాప్తుకు కూడా సహకరిస్తానని తెలిపారు. ఇక ఈ స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ముడా అధికారులు కూడా అంగీకరించారు.ఇదిలా ఉండగాా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది. అనంతరం ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా.. సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. -
కేఐఏడీబీకి భూమిని తిరిగిచ్చేసిన రాహుల్ ఖర్గే
బెంగళూరు/శివాజీనగర: కర్ణాటకలో ముడా స్కాం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు రాహుల్ ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్ ‘మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్’ఏర్పాటుకు బెంగళూరులో ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలనే అభ్యర్థనను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 20న కర్ణాటక పారిశ్రామిక అభివృద్ధి బోర్డు (కేఐఏడీబీ)కు రాసిన లేఖలో రాహుల్ ఖర్గే పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఎమర్జింగ్ టెక్నాలజీలో మరిన్ని ఉద్యోగావకాశాలు కలి్పంచడమే సిద్ధార్థ విహార్ ట్రస్ట్ లక్ష్యమన్నారు. కళాశాల విద్యను అభ్యసించలేని విద్యార్థులకు సహాయం చేయడానికి కూడా దీనిని రూపొందించామని పేర్కొన్నా రు. పరిశ్రమలకు దగ్గరగా ఉండటం వల్ల యువతకు అవకాశాలు పెరుగుతాయనే కేఐఏడీబీ ఇండ్రస్టియల్ ఏరియాను ఎంచుకున్నామని లేఖలో స్పష్టం చేశారు. ఆ లేఖ కాపీలను కర్ణాటక మంత్రిగా ఉన్న మల్లికార్జున ఖర్గే చిన్న కుమారుడు ప్రియాంక్ ఖర్గే తన ‘ఎక్స్’హ్యాండిల్లో పంచుకున్నారు. సిద్ధార్థ విహార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థలన్నీ లాభాపేక్ష లేని సంస్థలేనని, సీఏ స్థలం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, పొందడానికి ట్రస్టుకు పూర్తి అర్హత ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే.. దురుద్దేశంతో కూడి న, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలను నిరంతరం ఎదుర్కొంటూ ఏ విద్యాసంస్థా సమర్థవంతంగా పనిచేయదని, సామాజిక సేవే లక్ష్యంగా నడుస్తు న్న ట్రస్టును వివాదాల్లోకి నెట్టడం ఇష్టం లేకే ప్రతి పాదనను ఉపసంహరించుకుంటున్నట్లు కేఐఏడీబీకి ట్రస్టు లేఖ రాసిందని మంత్రి తెలిపారు. ఇటీవల అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన తనయుడు రాహుల్ ఖర్గేలకు చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల భూమిని మంజూరు చేసింది. కాగా, సిద్ధార్థ విహార్ ట్రస్టుకు భూమి కేటాయించడాన్ని బీజేపీ ఐటీ విభాగం ఇంచార్జ్ అమిత్ మాలవీయ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లహర్‌సింగ్ సిరోయాలు ఎక్స్‌లో వేదికగా ప్రశ్నించారు. ఇది కచ్చితంగా అధికార దురి్వనియోగం, బంధుప్రీతితో వ్యవహరించడమేనని పేర్కొన్నారు. కేఐఏడీబీ భూమి పొందడానికి ఖర్గే కుటుంబ సభ్యులు ఏరోస్పేస్ పారిశ్రామిక వేత్తలుగా ఎప్పడు మారారని ఎద్దేవా చేశారు. ముడా ప్లాట్ల కేటాయింపుల విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో 14 సైట్లను మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆమె తిరిగి ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. -
కర్ణాటకలో ‘ముడా’ ప్రకంపనలు.. ఖర్గే కీలక నిర్ణయం!
బెంగళూరు: గత కొంత కాలంగా మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.Amid the MUDA scam, Congress President @kharge's son @PriyankKharge has returned the 5 acres of KIADB land.The fear among the corrupt is clearly showing. Just wait – soon even the Gandhi-Nehru family will be added to the list! pic.twitter.com/xV19YWwge4— Tulla Veerender Goud (@TVG_BJP) October 13, 2024ఆయన కుటుంబానికి సంబంధించిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్ (కేఐఏడీబీ) కేటాయించిన ఐదు ఎకరాల భూమిని స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఖర్గే కుమారుడు రాహుల్ ఖర్గే నేతృత్వంలోని సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ప్రభుత్వం.. బగలూరులోని హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ హార్డ్‌వేర్ సెక్టార్లో ఐదు ఎకరాల భూమిని మంజూరు చేసింది. అయితే ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ నేత అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. కర్ణాటక ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని సిద్ధార్థ విహార్ ట్రస్టుకు కేటాయించగా.. మల్లికార్జున్ ఖర్గే, ఆయన అల్లుడు రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే మొదలైన వారు ట్రస్టీలుగా ఉన్నారు. ఇక.. ఈ స్థలం కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇటీవల ఓ వ్యక్తి కర్ణాటక గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే తమ ట్రస్టుకు కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకోవటం చర్చనీయాంశంగా మారింది.చదవండి: MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్ -
MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్
బెంగళూరు : కర్ణాటకలో ముడా స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కారణమైన భూములను మైసూరు నగర అభివృద్ధి సంస్థకు తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.దీనిపై స్పందించారు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య. రాజకీయ విద్వేషాలకు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ముడా కేసు వివాదంలో సోమవారం సిద్ధరామయ్యపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. లోకాయుక్త ఆధారంగా కేసు నమోదైంది. ఈ తరుణంలో సిద్ధ రామయ్య భార్య ఓ లేఖను విడుదల చేశారు. అవినీతి మరక లేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 ప్లాట్లను తిరిగి ముడాకే ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. తన భర్త గౌరవం, ఘనతను మించి ఈ ఆస్తులు పెద్దవి కావని అన్నారు పార్వతి సిద్దరామయ్య.అవసరమైతే దర్యాప్తుకు సహకరిస్తానని, రాజకీయ రంగానికి దూరంగా ఉండే తనలాంటి మహిళలను వివాదాల్లోకి లాగొద్దని లేఖలో రాసుకొచ్చారు. అయితే, సిద్ధ రామయ్య ప్రకటనపై విపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. విచారణ నుంచి బయట పడేందుకే ఈ డ్రామాలని ఆక్షేపించింది. ఏ తప్పు జరక్కపోయింటే ఎందుకు తిరిగి ఇస్తున్నారంటూ నిలదీశారు బీజేపీ నేతలు. దర్యాప్తులో వాస్తవాలు వస్తాయని ముందే ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు.అంతకుముందు ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాకిచ్చింది. ఆయన మీద మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది. ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. Karnataka CM Siddaramaiah''s wife Parvathi decides to return 14 controversial sites to MUDA— Press Trust of India (@PTI_News) September 30, 2024 -
సిద్ధూపై ఈడీ కేసు
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని లోకాయుక్త నమోదు చేసిన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ఆధారంగా ఈ చర్యకు దిగింది. సిద్ధరామయ్య, భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి తదితరులపై కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. పార్వతి నుంచి 3.16 ఎకరాలను సేకరించిన ముడా ప్రతిగా 50:50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో ఆమెకు 14 ప్లాట్లను కేటాయించింది. దీంట్లో అవినీతి, అధికార దురి్వనియోగం జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్‌చంద్ గెçహ్లాట్ అనుమతి మంజూరు చేశారు. దీన్ని సిద్ధూ హైకోర్టులో సవాల్ చేసినా చుక్కెదురైంది. అనంతరం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని ఆధారంగా సిద్ధరామయ్య తదితరులపై ఈడీ సోమవారం కేసు నమోదు చేసింది. విచారణకు రావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసే వీలుంది. అలాగే ఆస్తులను కూడా అటాచ్ చేయవచ్చు. 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తా ముడా కమిషనర్‌కు పార్వతి లేఖ మైసూరు: భూపరిహారంగా ముడా తనకు కేటాయించిన 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేందుకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి ముందుకు వచ్చారు. ఈ మేరకు ముడా కమిషనర్‌కు సోమవారం ఆమె లేఖ రాశారు. మైసూరు కేసరే గ్రామంలో తనకు చెందిన 3.16 ఎకరాల భూమిని ముడా తీసుకొని.. విజయనగర లేఔట్ ఫేజ్–3, ఫేజ్–4లో తనకు 14 ప్లాట్లను కేటాయించిందని ఆమె వివరించారు. ‘సేల్ డీడ్‌ను రద్దు చేయడం ద్వారా నేనీ 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముడా ఈ ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ దిశగా సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పార్వతి ముడా కమిషనర్‌ను కోరారు. ముడా కేటాయింపుల్లో సిద్ధరామయ్యపై దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, లోకాయుక్త పోలీసుల కేసు నమోదు, తాజాగా సోమవారం ఈడీ కేసు నమోదు నేపథ్యంలో.. ప్లాట్లను తిరిగి ఇచ్చేయాలని పార్వతి నిర్ణయం తీసుకున్నారు. -
అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా ఎందుకు?: హెచ్డీ కుమారస్వామి
బెంగళూరు: ముడా కుంభకోణంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి శనివారం విమర్శలు గుప్పించారు. గవర్నర్ విషయంలో సీఎం సిద్దరామయ్య రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. ‘గతంలో సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై ప్రాసిక్యూషన్‌కు అనుమతించినందుకు గవర్నర్‌ను ప్రశంసించారు.అదే గవర్నర్ ఇప్పుడు తనపై(సీఎం) ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తే సిద్ధరామయ్యతో సహా పార్టీ నేతలందరూ గవర్నర్‌ను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో దివంగత హన్సరాజ్ భరద్వాజ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒకలా వ్యవహరించిందని..ప్రస్తుతం థావర్‌చంద్ గెహ్లాట్‌తో భిన్న వైఖరితో ఉందని విమర్శలు గుప్పించారు.‘ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలు అత్యంత అవమానకరంగా ప్రవర్తించారు. గవర్నర్ చిత్రపటానికి చెప్పులు వేసి, దిష్టిబొమ్మలను తగులబెట్టి అవమానించారు. ఇప్పుడు ఎవరిపైకి చెప్పులు విసిరి, ఎవరి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రే తప్పు చేశారు. గతంలో సిద్ధరామయ్య స్వయంగా చెప్పినట్లుగా ప్రభుత్వం నుండి వివరణ కోరడం గవర్నర్ హక్కు. ఆయన ఇప్పుడు తన మాటలను మరచిపోయినట్లున్నారు. అప్పట్లో ఆయన చేసిన సొంత ప్రకటనలను ఆయనకు చూపించాలి’ అని కుమారస్వామి పేర్కొన్నారు.చదవండి: కశ్మీర్లో బీజేపీదే గెలుపు: ప్రధాని మోదీ -
ముడా స్కామ్.. సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు
బెంగళూరు : మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు ఎదుర్కోనున్నారు. బుధవారం ముడా స్కామ్ కేసులో లోకాయిక్త విచారణ చేయాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ చేపట్టి మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో కర్ణాటక మైసూర్ జిల్లా లోకాయిక్తా పోలీసులు విచారణ చేపట్టనున్నారు.మరోవైపు ఇదే ముడా స్కామ్ కేసులో ఇరుక్కున్న సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం ఇదే ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలంటూ కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ జారీ చేసిన ఆదేశాల్ని హైకోర్టు సమర్థించింది. గవర్నర్ గెహ్లోత్ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగ ప్రసన్న విచారణ చేపట్టారు. గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని.. సిద్దరామయ్య పిటిషన్‌ను కొట్టివేశారు.ముడా స్థల కేటాయింపుల్లో అవకతవకలు ఉన్నట్లు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సిద్ధరామయ్య భార్యకు మైసూరు పరిసరాల్లో భూములు కేటాయించడం అక్రమమని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. భూములు కేటాయింపుల కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.45 కోట్లు నష్టం వాటిల్లినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ సీఎం సిద్ధరామయ్యపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. 👉 చదవండి : సీఎంపై విచారణ.. గవర్నర్ ఆదేశాల్ని సమర్థించిన హైకోర్టునాకు భయం లేదుముడా స్కామ్ కేసులో స్పెషల్ కోర్టు లోకాయిక్త విచారణ చేపట్టాలని జారీ చేసిన ఆదేశాలపై సిద్ధరామయ్య స్పందించారు. ‘ముడా స్కామ్ కేసులో చట్టబద్ధంగా పోరాటం చేస్తాం. నేను దేనికీ భయపడను. విచారణకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. -
ముడా స్కామ్: సీఎం సిద్ధరామయ్యకు షాక్
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. ఈ కేసులో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ.. సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ముడా స్మామ్‌లో గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఇక.. గవర్నర్ ఆదేశాలను సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా హైకోర్టు తీర్పు వెల్లడించింది. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమై భద్రత ఏర్పాటు చేశారు.మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదంలో.. ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వటం కర్ణాటక రాజకీయల్లో సంచలనం సృష్టించింది. ఇదిలాఉండగా... సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.చదవండి: కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం.. కోవిడ్ వేళ వెయ్యి కోట్ల స్కాం